Thursday, May 1, 2014

220 Relationships need sociological studies

220 Relationships need sociological studies
220 స్త్రీ పురుష సంబంధాలపై సామాజిక శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు జరగాలి

చర్చనీయాంశాలు: స్త్రీపురుష సంబంధాలు, వివాహేతర సంబంధాలు, వివాహాలకు దారితీసే సంబంధాలు, సహజీవన సంబంధాలు, భిన్నలింగ సంపర్కాలు, జననార్తులు
190 నంబర్ పోస్టు రతిరాజు క్యూపిడ్ ఈరోస్ ఎమోర్ అనే పోస్టును చూడండి. క్లిక్ టుగోటు 190 దాని కొనసాగింపుఇది.

చరిత్ర:

తనకు వివాహం అయిన విషయాన్ని శ్రీనరేంద్రమోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించకుండా, దాటవేసుకుంటూ కుంటూ వచ్చి, చివరికి 2013 నాటి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, నామినేషన్ అఫిడవిట్ లో ప్రకటించటం తప్పనిసరి అయి చివరికి ప్రకటించటాన్ని, కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ భూతపూర్వ ముఖ్యమంత్రి శ్రీ దిగ్విజయసింగ్ తప్పు పట్టటాన్ని గుర్తుకు తెచ్చుకొండి.

ఇపుడు 67 ఏళ్ళ శ్రీదిగ్విజయసింగ్ గారు తనకు అమృతారాయ్ అనే 43 ఏళ్ళ మహిళామణితో సంబంధం ఉందని ట్విట్టర్ లో ప్రకటించి, తాను ఆమెను వివాహం చేసుకోబోతున్నానని చెప్పారు.

ఆమె కూడ ఈవిషయాన్ని ట్వీట్ చేసి, తాను తన భర్తతో పరస్పర ఆమోదిత విడాకులకై దరఖాస్తు చేశామని, అవి లభించగానే, తాను శ్రీ దిగ్విజయ్ సింగు గారిని వివాహం చేసుకుంటానని తెలిపింది.

ఆమె భర్తకూడ ఈవిషయంపై ట్వీట్ చేసి ఆమెకు తన శుభాకాంక్షలను తెలిపాడు.

అందరూ కూడ ఇది మా ప్రైవేటు వ్యవహారం కాబట్టి మా ప్రైవెసీలోకి చొరబడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని అన్నారు.

ఇవన్నీ కొంత వరకు న్యాయంగానే ఉన్నాయి. ఈసందర్భంగా వచ్చిన ట్వీట్ ల , వార్తల తెలుగు సారాన్ని పరిశీలిద్దాము.

ఇది ఇంటర్ నెట్ లో సర్క్యులేషన్ లో ఉన్న ఒక ఫొటో. ఈఫొటో ఇక్కడ ప్రచురించటం నాకు ఇష్టంలేదు. కారణం ఏమిటంటే, వాళ్ళు మా ప్రైవెసీకి భంగం కలిగించ వద్దో దేముడా అని మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తం అయిపోయిన తరువాత ఒక తెలుగు సామెత గుర్తుకు వచ్చింది. ''అతి రహస్యం బట్ట బయలు అన్నట్లు ''. నా ఈమెయిల్ అకౌంటు, కంప్యూటర్ హ్యాకింగ్ అయినాయి, అందులోని కంటెంట్స్ టాంపరింగు అయ్యాయి, అని పాపం ఆమె మొత్తుకుంది.వైబీరావు గాడిద వ్యాఖ్య

దీని బట్టి ఒక నీతి ఏమిటంటే, కంప్యూటర్లలో, ఈమెయిల్ ఖాతాల్లో రహస్యంగా ఉండాల్సిన ఫొటోలను పెట్టుకోటం ప్రమాదం అని. రక్షణ శాఖల కంప్యూటర్లే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగు అవుతున్నాయి కాబట్టి, వ్యక్తిగత ఖాతాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంటుంది.

శ్రీ దిగ్విజయ్ సింగ్

“I have no hesitation in accepting my relationship with Amrita Rai. She and her husband have already filed a mutual consent divorce case.”

తెలుగుసారం: నాకు అమృతారాయ్ తో ఉన్న సంబంధాన్ని అంగీరించటంలో ఎలాటి సందేహమూ లేదు. ఆమె , ఆమె భర్త పరస్పర ఆమోద విడాకుల కేసును ఇప్పటికే ఫైల్ చేసుకున్నారు.

“Once that is decided we would formalise it. But I do condemn encroachment in our private life.”

తెలుగుసారం: అది ఒకసారి నిర్ణయించబడింది అంటే మేము దానిని (మా సంబంధాన్ని) అధికారికం చేస్తాము. కానీ , మాప్రైవేటు జీవితంలో కి (బయటవాళ్ళు) చొరబడటాన్ని నేను ఖండిస్తున్నాను.

Not coward like Narendra Modi:

తెలుగు సారం: నరేంద్రమోడీ వలె నేను పిరికివాడిని కాదు.

“I don’t hide my relationship, which Mr. Modi does. I am not a coward. My relationship is a private matter that I have made public,”

తెలుగు సారం: నేను నా సంబంధాన్ని దాచను, కానీ శ్రీ మోడీ దాస్తాడు. నేను పిరికివాడిని కాదు. నా సంబంధం ప్రైవేటు విషయం. దానిని నేను బహిర్గతం చేశాను.

“Modi is a coward as he has hidden his wife for years, but I have the courage and conviction to face the consequences for what I have said and done,”

తెలుగుసారం: ఎన్నో సంవత్సరాలు మోడీ తన భార్యను దాచాడు కాబట్టి మోడీ పిరికివాడు. కానీ నాకు నేను చెప్పిన వాటికీ, చేసిన వాటికీ వచ్చే పరిణామాలను ఎదుర్కునే ధైర్యం, ధృఢ నమ్మకం, శక్తి నాకు ఉన్నాయి.

శ్రీమతి అమృతా రాయ్“I have separated from my husband and we have filed a mutual consent divorce papers. After which I have decided to marry with Digvijaya Singh.”

తెలుగుసారం: నేను నా భర్తనుండి విడిపోయాను. మేము పరస్పర ఆమోదంతో విడాకులకు కాగితాలను ఫైల్ చేసుకున్నాము. అది నిర్ణయించ బడిన తరువాత నేను శ్రీ దిగ్విజయ్ సింగ్ ను వివాహం చేసుకోటానికి నిర్ణయంచుకున్నాను.

శ్రీమతి అమృతారాయ్ భర్త"We have been separated for some time now and applied for the mutual consent divorce. Relationship between us has ended long back and Amrita is free to take any decision regarding her life and I will respect it,"

తెలుగుసారం: మేము కొంత కాలంగా విడిగా ఉంటున్నాము, ఉభయులకి ఆమోదమైన విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నాము. మా మధ్య సంబంధం చాల కాలం క్రితమే ముగిసింది. తన జీవితం గురించి ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేఛ్ఛ ఆమెకు ఉంది. దానిని నేను గౌరవిస్తాను.

మా ప్రైవెసీని గౌరవించండి. మాకు ఇబ్బందికరమైన స్థితులను కలుగచేయకండి.

"Since it is a legal procedure, it takes its own time but our relationship has ended long time back. I wish her well for her future. I know that my friends, well wishers and students are sad due to this but I also know that they are standing by me."

అది (డైవోర్స్) చట్టపరమైన కార్యక్రమం కాబట్టి, దాని సమయం అది తీసుకుంటుంది. కాని మా సంబంధం చాల కాలం క్రితమే ముగిసింది. ఆమెకు నా శుభాకాంక్షలు. నాకు తెలుసు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్ధులు దీని వల్ల ఖిన్ను లయ్యారని. కానీ వారు నాకు అండగా నిలుస్తారని నాకు తెలుసు.

బిజెపి ప్రతినిథి శ్రీమతి లేఖి గారి అభిప్రాయాలు"Secret marriage is not possible because there is no divorce. All I can say is that the lesson of morality gives a perverted definition and I think Congress leadership should take into cognisance because I cannot react more than this as I am not Mr Digvijay Singh."

తెలుగు సారం: రహస్య వివాహం సాధ్యం కాదు, ఎందుకంటే డైవోర్సు లేదు కాబట్టి. నేను చెప్పగలిగేదేమిటంటే నీతి యొక్క పాఠం ఒక వక్రముఖం గల నిర్వచనాన్ని ఇస్తుంది. మరియు కాంగ్రెస్ నాయకత్వం దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంత కన్నా ఎక్కువ ప్రతిస్పందించటానికి నేను దిగ్విజయ్ సింగుని కాదు కాబట్టి.

"By law, it is also an offence. There can be punishment as per law, as there is no divorce yet. It is for the husband to act. There is a criminal activity involved and the husband has to act."

తెలుగు సారం: చట్ట ప్రకారం అది నేరం కూడాను. ఇంతవరకు డైవోర్సు లేదు కాబట్టి, చట్టప్రకారం శిక్ష ఉండ వచ్చు. చర్య తీసుకోవాల్సింది ఆ భర్త. నేరపూరితమైన చర్య ఉంది కాబట్టి భర్త చర్య తీసుకోవాలి.

"A new definition of morality has been given by the actions of senior Congress leader Digvijay Singh Sahab. Those who preach lessons of morality should first look within themselves to see if they are practising what they are preaching to others. As far as the legal aspect of the matter of adultery is concerned, it is up to the husband of the lady to pursue the matter."

తెలుగు సారం: శ్రీదిగ్విజయసింగ్ సాహెబ్ గారి చర్యల ద్వారా నీతికి ఒక క్రొత్త నిర్వచనం ఇవ్వబడింది. నీతి పాఠాలను బోధించే వారు ముందుగా , ఇతరులకి బోధిస్తున్నది తాము ఎంతవరకు ఆచరిస్తున్నామా అనేదానిని తమలోకి తామే చూసుకోవాలి. అడల్టరీ (వివాహేతర అనధికార సంబంధం, కల్తీ అడల్టరేషన్ వంటి పదం) యొక్క చట్ట పరమైన విషయానికి సంబంధించినంత వరకు, ఈవిషయాన్ని ఎంతవరకు ముందుకు తీసుకు వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాల్సింది, సంబంధిత స్త్రీ యొక్క భర్త.


AAP leader Somnath Bharti ఆప్ లీడర్ సోమనాథ భారతి"Its disgusting n dangerous @digvijaya_28 in affair with 43 yr old married woman and TV anchor @amrritarai, how mny such politicians r there?

"Friends who are siding with @digvijaya_28 ji, plz understand that he has violated law as well of adultery and don't know when this affair started."

"There was one Pamella Bordes in UK who had got many politicians there trapped and country's many secret info was compromised. Plz think.''

''A politician when in power gets 2 much of authority in hand, lacs of crores worth of contracts get decided by him, secret info he possesses. As an ordinary citizen one hs more freedom than someone who gets into politics, recall what Bill Clinton had to go through for monica issue.''

తెలుగు సారం: ఒక రాజకీయనేత అధికారంలోకి వచ్చినపుడు, మితిమీరిన అథారిటి చేతిలో కలిగి ఉన్నప్పుడు, లక్షలకోట్ల విలువగల ఒప్పందాలు అతడిచేత నిర్ణయించబడతాయి. అతడు రహస్య సమాచారాన్ని కలిగి ఉంటాడు. రాజకీయాలలో ప్రవేశించే వ్యక్తి కన్నా సాధారణపౌరుడికి ఎక్కువ స్వాతంత్ర్యం ఉంటుంది. మోనిక ఇష్యూలో బిల్ క్లింటన్ దేని గుండా వెళ్ళాల్సివచ్చిందో (ఎలాంటి విచారణలను ఎదుర్కోవలసి వచ్చిందో) గుర్తుకు తెచ్చుకోండి.

"A characterless politician is the most dangerous weapon in the hands of enemies to the nation. @arunjaitley ji had earlier stated that."
తెలుగు సారం: శీలం లేని రాజకీయవేత్త, జాతి శత్రువుల చేతులలో అతిప్రమాదకరమైన ఆయుధం. ఆసంగతి అరుణ్ జైట్లీగారు గతంలో చెప్పారు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ఆప్ నేత శ్రీభారతి గారి వ్యాఖ్యలు కొంత తీవ్రంగా ఉన్నాయి. ఈవిషయాలన్నిటినీ చర్చించటానికి వేయి బ్లాగపోస్టులు, వ్రాయాలంటే వేయి దస్తాల కాగితాలు కావాలి.

ప్రైవేటు విషయాలు, పబ్లిక్ ఇంటరెస్ట్ విషయాలు ఈరెండిటి మధ్య విభజన రేఖను స్పష్టంగా నిర్వచించే ప్రయత్నం చేస్తే గానీ మనం ముందుకు వెళ్ళలేం.

ప్రస్తుతం ఒక్క విషయాన్ని మాత్రమే మనం వ్రాసుకోవచ్చేమో. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల, మంత్రుల వివాహేతర సంబంధాల గురించి గతంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రస్తావనకు రావటం, నాటి స్పీకర్ శ్రీ సురేష్ రెడ్డి గారు ఒక సభా సంఘాన్ని నియమించటం, ఆసభా సంఘం నివేదికను ఇవ్వకుండానే నశించటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, శాసనసభ్యులలో మంత్రులలో సగం మంది దాకా ఏదో ఒకరకం వివాహేతర సంబంధాలను కలిగి ఉన్నారు. ఇదే అనాలజీని మనం పార్లమెంటుకి వర్తింపచేసి, వివాహేతర సంబంధాలను కలిగి ఉన్న రాజకీయవేత్తలను ఏరి వేస్తే చివరికి మనకి ఎవరూ మిగలరేమో.

సామాజిక కోణం లోంచి చూసినపుడు మొదటి భార్యను (లేక మొదటి భర్తకు అన్యాయం జరుగుతున్నదా) అనేదే ముఖ్యమైన ప్రశ్న. వారు సర్దుకు పోతూ నా భర్త ప్రధానమంత్రి కావాలని నేను వ్రతం చేస్తాను, లేకపోతే నా భూతపూర్వభార్య కి నా శుభాకాంక్షలు అంటున్నారంటే, వారు స్వేఛ్ఛగా, ఎటువంటి భయాలకు వత్తిడులకు, ప్రలోభాలకూ, లోనుకాకుండ ఔదార్యం చూపించినంత కాలం , వివాహేతర సంబంధాలను ప్రైవేటు విషయాలుగానే పరిగణించాల్సి వస్తుంది.

సాధారణ భార్యా భర్తల విషయంలో మనకి ఇటువంటి ఔదార్యం కనిపించటం లేదు. సెలబ్రిటీ ల భార్యలు, భర్తల విషయంలోనే ఈఔదార్యం కనిపిస్తుంది. ఎందరో సినీ హీరోల భార్యలు, తమ భర్తలు రెండో వివాహానికి ఒడి గట్టినపుడు సర్దుకుపోటం కనిపిస్తుంది. రాజకీయనేతల విషయంలోనూ ఇదే ఔదార్యం. ఔదార్యం వల్ల కలిగే ఆర్ధిక, సాంఘిక లాభాలు,-=-= తగాదాల వల్ల, రచ్చల వల్ల రావేమోనని వారు సర్దుకు పోతున్నారేమోనని అనుమానించాల్సి వస్తుంది.

ఇప్పటికే ఈవ్యాసం, సుదీర్ఘం అయినందు వల్ల ఇంకో సారి కొనసాగిద్దాము. ఈలోగా ప్రైవేటు విషయాలలో మనమేమైనా తలదూరుస్తున్నట్లయితే, శ్రీ నరేంద్రమోడీ, శ్రీమతి జశోదాబెన్, శ్రీదిగ్విజయ్ సింగు, శ్రీమతి అమృతారాయ్, ఆమె భర్తకు మన క్షమాపణలు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.