Tuesday, April 1, 2014

193 Modi Eenadu Interview

193 Modi Eenadu Interview

Topics for Discussion, చర్చ విషయాలు, चर्चांश: Narendra Modi, నరేంద్రమోడీ, ఈనాడు, స్వామి వివేకానంద, పోర్ బందర్, అద్వానీ, జశోదాబెన్ఈనాడు దినపత్రిక 1.4.2014 మంగళవారం, మొదటి పేజీ పతాక శీర్షికలో ''ఆరు పదుల దురాగతాలపై... విముక్తగీతమై ... వస్తున్నా ! '' అని బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ గారితో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది.
తెలుగు భాషలో అత్యధిక సర్కులేషన్ గల అగ్రశ్రేణి దిన పత్రిక ప్రచురించ తగ్గ ఇంటర్వ్యూ యేనా అనే సందేహం విజ్ఞులైన పాఠకులకు కలగక మానదు. ఈఇంటర్వ్యూకి పెయిడ్ ఇంటర్వ్యూలకి ఉండవలసిన కొన్ని లక్షణాలైనా ఉన్నాయని చెప్పక తప్పదు.

సాధారణంగా శ్రీ నరేంద్రమోడీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వరని, ఇచ్చినా మధ్యలోనే లేచిపోతూ ఉంటారని, మీడియా వారిని చీపురు పుల్లల్లాగా చూస్తారని ప్రతీతి. మరి ఈనాడు పేపర్ వారిపై శ్రీవారికి ఎందుకు అమిత దయ ఎందుకు కలిగిందో ఏమో.

పెయిడ్ ఇంటర్వ్యూల ప్రధాన లక్షణం ఏమిటంటే, అసౌకర్యకరమైన ప్రశ్నలు అడగక పోవటం. పేషెంటు కోరిన మందులనే వైద్యుడు ప్రిస్క్రైబ్ చేసినట్లుగా, ఇంటర్వ్యూ ఇచ్చేవారు జవాబు ఇవ్వదలుచుకున్న ప్రశ్నలనే మీడియా వారు అడుగుతూ ఉంటారు.

సరే భారత ప్రజలకి మోడీ గారు చెప్పిందే భాగ్యం అన్నట్లుగా, ఆ పత్రిక వారు అడిగిన ప్రశ్నలలో కొన్నిటిని, వాటికి శ్రీ మోడీజీ ఇచ్చిన జవాబులను పరిశీలిద్దాము. అదే సమయంలో అడగాల్సిన విషయాలను వదిలి వేయటం గురించి కూడ ఆలోచిద్దాము.

''వారసత్వ బలం లేదు.. ఆక్సఫర్డ్, హార్వర్డ్ చదువుల్లేవు. హార్డ్ వర్క్ ను నమ్ముకొని .. పట్టుదలను పెంచుకొని .. ప్రజల్ని చదివి .. చాయ్ కొట్టు నుంచి ఎదిగి .. అనుభవమే అంతస్సూత్రంగా .. సంకల్పమే ఆయుధంగా .. ప్రధానమంత్రి పదవికి ప్రయత్నిస్తున్న సాహసి. .. కురువృధ్ధ కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న ధీశాలి. యువతరంతో కలసి నవభారత నిర్మాణానికి కలలు కంటున్న కార్యశీలి. సామాన్యుడు కూడా సై అనటానికి చోటుందని మన ప్రజాస్వామ్య బలాన్ని చాటుతున్న బాటసారి. నరేంద్ర మోడీ!''


వైబీరావు గాడిద వ్యాఖ్యలు:-=

అగ్రశ్రేణి పత్రికలు భట్రాజుల్లాగా మారక పోతే వాటికి ప్రకటనలు ఎక్కడనుండి వస్తాయి. మీడియా తో పాటు ఇతర వ్యాపారాలను కూడ చేస్తున్నప్పుడు సహజంగా ఎక్కడో అక్కడ ఏదో ఒక పొరపాటు చేయటం, లేక ఏదో ఒక మారుమూల చట్టంలోని ఏదో ఒక మారుమూల సెక్షన్ లను తెలిసి గానీ, తెలియక గా ని అతిక్రమించటం జరగవచ్చు. ఎందుకైనా మంచిదని , అధికారంలోకి రావటానికి అవకాశం ఉన్నవారిని మంచి చేసుకోటం మేలు కదా. ఈవిషయంలో ఈ ఇంటర్వ్యూని ప్రచురించిన అగ్రశ్రేణి పత్రికను నిందించటం న్యాయం కాదు. పెట్టుబడి దారీ విధానంలో మీడియా ఎలా ప్రవర్తించాలో, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ మీడియా ఎలా ప్రవర్తిస్తుందో అలాగే భారతీయ మీడియా కూడ ప్రవర్తిస్తుంది. లేకపోతే మనుగడ కష్టం. దీనినే సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనచ్చు.
అడగని మొదటి ప్రశ్న: గుజరాత్ లో సీనియర్ బిజేపీ నేతలను మీరెందుకు పొమ్మనకుండా పొగ పెట్టారు. గుజరాత్ లో శ్రీ కేషూభాయి పటేల్, శంకర్ సింగ్ వాఘేలాలు పార్టీని వదలి ఎందుకు వెళ్ళారు?
అడగని రెండవ ప్రశ్న: మీరింకా అఖిలభారత స్థాయి నేతగా స్థిర పడలేదు. జాతీయ స్థాయిలో మీకన్నా ఎంతో సీనియర్ నేతలైన మురళీ మనోహర్ జోషీ, లాల్జీ టాండన్ లను వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారి నియోజక వర్గాలనుండి ఎందుకు బయటకు పంపేశారు?


అడగని మూడవ ప్రశ్న: బిజెపి భీష్ముడు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారిని భోపాల్ నియోజక వర్గంనుండి పోటీ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు?


అడగని నాలుగవ ప్రశ్న: ఆయారాం గయారాం రాజకీయాలను బిజెపి ప్రోత్సహిస్తున్నది అనటానికి సూచన రాజస్థాన్ లోని బర్మర్ నియోజక వర్గంనుండి లోక్ సభకు పోటీచేయటానికి కాంగ్రెస్ నుండి దూకిన సోనారాం చౌధరికి టికెట్ ఇవ్వటం, మీ కన్నా ఎన్నో రెట్లు సీనియర్, దేశ ఆర్ధిక మంత్రిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవశాలి శ్రీ జస్వంత సింగును గెంటి వేయటం ఎంతవరకు సమంజసం?

అడగని ఐదవ ప్రశ్న: మీరింత వరకు లోక్ సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎన్నికయ్యి ఆసభలు ఎలా పనిచేస్తాయో చూడలేదు. కేంద్రంలో కనీసం ఒక్క సంవత్సరమైనా మంత్రిగా పనిచేసి కేంద్ర క్యాబినెట్ ఏవిధంగా పనిచేస్తుందో ఆకళింపు చేసుకోలేదు. యకాయకి స్వర్గానికి నిచ్చెనలు వేయాలనే, బొందితో స్వర్గానికెళ్ళాలనే కోరిక త్రిశంకుకు, కాశీ మజిలీ కథల్లో ఒక వేశ్యకు కలిగినట్లుగా డైరక్టుగా ప్రధాని కావాలనే కోరిక ఎంత వరకు సమంజసం?
(ఇటువంటి కోరిక రాహుల్ గాంధీ, అరవింద్ కెజ్రీవాల్ , జయలలితలకు కూడ ఉండకూడదు).
శ్రీఅద్వానీ గారినో, మురళీ మనోహర్ జోషీ గారినో ప్రధానమంత్రిని కానిచ్చి, మీరు ఏదైనా కీలక శాఖకు కేంద్రమంత్రి గా వ్యవహరిస్తూ ప్రణాలికా బధ్ధంగా సమన్వయంతో, సఖ్యతతో, ముందుకు వెళ్ళచ్చు. సీనియర్ నేతల నెత్తులపై నుండి తొక్కుకుంటూ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ మీరేమి సాధిస్తారు అని శ్రీ మోడీని అడిగి ఉండాల్సింది.


ఈయన యేనా చాయ్ వాలా?

అడగని ఆరవ ప్రశ్న: చాయ్ కొట్టునుండి ఎదిగిన మీరు మీ చాయ్ వాలా జీవితాన్ని ఎందుకు మర్చిపోయారు? చాయ్ వాలాలు అహమ్మదాబాద్ లోనే అత్యంత ఖరీదైన డిజైనర్ కుర్తాలను వేసుకుంటారా? క్షణానికో రకం బూట్లు మార్చుకుంటారా? మీవార్డ్ రోబ్ లో ఎన్ని రకాల కుర్తాలు ఎన్నేసి ఉన్నాయి? ఎన్నిరకాల బూట్లు ఎన్నేసి ఉన్నాయి?
ఇదిగోనండి మన చాయ్ వాలా గారు

ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలకు బూట్లు అవసరమా? మీకు మేకప్ మెన్లు ఎంతమంది ఉన్నారు? మీవెంట మేకప్ వ్యాన్ కూడ వస్తుందా? సాధారణంగా సినీ హీరోలకు, హీరోయిన్లకు మేకప్ మెన్ లు ఉంటారు, మేకప్ వ్యాన్ లు ఉంటాయి. చాయ్ వాలా లీడర్ కు కూడ ఉంటాయా?


అడగని ఏడవ ప్రశ్న: స్వామి వివేకానందా గారు మీ రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు. ఆయన పుస్తకాలతో ప్రభావితమైనట్లుగా చెప్పుకుంటున్నారు. స్వామి వివేకానంద గారి సంపూర్ణ రచనలను మీరు చదివారా? చదివితే ఆయన భారత్ ను కుళ్ళిన శవంతో, జల్లి ఫిష్ తో పోల్చిన విషయాన్ని ఎలా మర్చి పోయారు? స్వామీజీ క్రిస్టినా గ్రీన్ స్టైడల్ అనే యువతికి లేఖ వ్రాస్తూ నా నరాలన్నీ వేడెక్కాయని ఎందుకు వ్రాశారో మీరు చెప్పగలరా? స్వామీజి షాడ్ ఫిష్ అనే చేపలను తినటానికి భారత్ రమ్మని విదేశీ స్త్రీలను రమ్మని ఎందుకు లేఖ వ్రాశారో చెప్పగలరా?

అడగని ఎనిమిదవ ప్రశ్న: ప్రతి పేదవాడికి ఇల్లు, వృధ్ధులకు మందులు , పిల్లలకు విద్య లభించే దాకా మీకు మధుర క్షణాలు రావన్నారు. ఇళ్ళు తరువాత ఇప్పించవచ్చు. మీరు ధరించే ఖరీదైన తలపాగాలిప్పించకపోయినా, కనీసం తుండు గుడ్డలు ఇప్పించవచ్చునే. కచ్ ఎడారిలో మండు టెడారిలో గొర్రెలను కాచుకుంటూ, తిరిగేటపుడు , కనీసం నెత్తిమీద కప్పుకోటానికి పనికి వచ్చేవి. మీరు గుజరాత్ లో పేదలకు మీ అంత ఖరీదైనవి, స్టైలిష్ వి కాకపోయినా, కనీసం సాధారణ జనతా కుర్తాలు, మీ అంత ఖరీదైన షూస్ కాకపోయినా, హవాయి రబ్బర్ పాదరక్షలు ఇప్పించారా? ఇంత పేదదేశంలో గుజరాత్ ముఖ్యమంత్రికి బులెట్ ప్రూఫ్ ఆఫీస్ రూ. 150 కోట్ల ఖర్చుతో అవసరమా?


అడగని తొమ్మిదవ ప్రశ్న: మహిళా సాధికారికత గురించి మీరింత తాపత్రయ పడటం ఎంతో సమ్మోదకరం. మరి శ్రీమతి జశోదా బెన్ అనే అభాగ్యురాలు గత మూడు దశాబ్దాలుగా నిరాదరణకు గురియై కనీసం పదవ తరగతి పరీక్ష ఫీజుకు నోచుకోకుండా మగ్గుతున్నది. ఆమెకు మీ ధర్మపత్నిగా మీరు చేసే పుణ్యకార్యాలలో పాల్గొనే భాగ్యాన్ని కలిగిస్తారా?

అడగని తొమ్మిదవ ప్రశ్న: కాంగ్రెస్ , మరియు ఇతర పార్టీల అభ్యర్ధులలో నేరచరిత్రులు ఉన్నమాట నిజమే. మరి బిజేపీ లోక్ సభ అభ్యర్ధులలో కూడ నేరచరిత్రులు దీటైన సంఖ్యలోనే ఉన్నారు. నేరచరిత్రుల సంఖ్య తగ్గించటానికి మీరు చేసిన కృషి ఏమిటి? పోర్ బందర్ లో Vitthalbhai Hansrajbhai Radadiya విఠల్ భాయి హంసరాజ్ భాయ్ రదదీయ అనే 16 క్రిమినల్ కేసులున్న కాంగ్రెస్ నేర చరిత్ర ఎంపీని మీరు బిజెపి లోకి ఎలా చేర్చుకోగలిగారు? బిజెపికి నేరచరిత్రులను చేర్చుకోకూడదనే సిధ్ధాంతం లేదా? లోక్ సభలో ఈయన హాజర్ 25% కూడ లేదు. లోక్ సభ స్పీకర్ కు ఆస్తులు అప్పుల పట్టిక సమర్పించని ఇద్దరు ఎంపీలలో ఈయన ఒకరు. ఈయనకు మీరు 2014 లో టికెట్ ఇస్తారా , ఇవ్వరా?

అడగని పదవ ప్రశ్న: ఒక లోక్ సభ నియోజక వర్గంనుండి పోటీ చేయకుండా రెండు నియోజక వర్గాలనుండి పోటీ చేయటం అంటే మీరు అభద్రతా భావంతో బాధ పడుతున్నట్లే లెక్క. మీకు వారణాసి ప్రియమైనది, అనుకుంటే వడోదారా నుండి పోటీ చేయవలసిన అవసరం లేదు. లేదు, ఉత్తర ప్రదేశ్ లో పార్టీని పటిష్ఠపరచటం మీలక్ష్యం అనుకుంటే, మీరు రాయ్ బరేలీ నుండి గానీ అమేథీ నుండి గానీ పోటీచేయాల్సింది. షహ్ జాదా ను ఆయన ఇంటిలో నే ఓడించటం నిజంగా గొప్ప ఛాలెంజి.

అడగని పదకొండవ ప్రశ్న: 2002 లో గుజరాత్ లో మారణ కాండ జరుగుతున్నపుడు, అదనపు బలగాలను పంపమని మీరు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారితో గానీ, శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారితో గానీ ఫోన్ లో మాట్లాడారా? వారేమి చెప్పారు? దీని కేదైనా రికార్డు మీ కార్యాలయంలో కానీ, ప్రధాని కార్యాలయంలో కానీ, ఉపప్రధాని కమ్ హోం మంత్రి గారి కార్యాలయంలో కానీ ఉన్నదా?

ఇంకా వ్రాయాల్సింది ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.