Sunday, March 30, 2014

190 Part 1 of ratirAju Cupid Eros Amor भाग १ रतिराज मन्मथ భాగం ౧ , రతిరాజు మన్మథుడు
TOPICS FOR DISCUSSION: Self-control, sex, instincts, homosexuality, lgbt, స్వలింగ సంపర్కం

Artha, the Open Source Thesaurus defines ''instinct'' as an inborn pattern of behavior often responsive to specific stimuli.
తెలుగు సారం: ఇన్ స్టింక్ట్ = బాహ్య ప్రేరణలకు, వ్యక్తులు అంతః జనితంగా , ప్రతిస్పందించే ప్రవర్తనా సరళి.

ఆకలి, నిద్ర, మైధునం, విశ్రాంతిని కోరటం, మరణానికి భయపడటం, ఇవన్నీ ఇన్ స్టింక్ట్ తరగతిలోకే వస్తాయి.

కొద్ది రోజుల క్రితం మ్యారేజెస్ (సేమ్ కపుల్స్ యాక్ట్) 2013 ప్రకారం, ఇంగ్లండు స్వలింగ వివాహాలను (గే వివాహాలను లేక లెస్బియన్ వివాహాలను) అనుమతించింది. 29.03.2014 నాడు ఇంగ్లండులో మొదటి సేమ్ సెక్స్ మ్యారేజ్ రికార్డు అయ్యింది. ఉత్తర ఐర్లండు (రాజధాని బెల్ ఫాస్ట్ యునైటెడ్ కింగ్ డమ్ లో భాగమే) లో మాత్రం ఇది ఇంకా చట్టం కాలేదు. అయితే వారు ఇంగ్లండు, వేల్స్ మొ|| ప్రాంతాలలో జరిగిన వాటిని మాత్రం పౌర భాగస్వామ్యాలుగా గుర్తించుతారట.


స్వలింగ సంపర్కాన్ని, ముఖ్యంగా భారత్ లో స్వలింగ సంపర్కాన్ని, సమర్ధించటం గానీ, వ్యతిరేకించటం గానీ ఈ వ్యాస లక్ష్యం కాదు. సమర్ధించుకోటానికి స్వలింగ సంపర్కీయులకు సంఘాలున్నాయి. వ్యతిరేకించుకునే వారు కూడ కొంత మేరకు సంఘటితులయ్యే ఉన్నారు.

ఇన్ స్టింక్ట్ అనే పదాన్ని మనం జననార్తి అని అనువదించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. స్వలింగ సంపర్కాన్ని, మనం జననార్తి అనవచ్చా అనేది కూడ చర్చనీయమే. భిన్న లింగ సంపర్కం ఏవిధంగా అయితే జననార్తి అయ్యిందో స్వలింగ సంపర్కం కూడ జననార్తి అవ్వాలి అనే అభిప్రాయం ఉంది.

నిర్వచనం కోణం లోంచి చూసినపుడు జననార్తులు మనకి పుట్టుకతో రావాలి. ఇవి అంటించుకునే వస్తువులు కాకపోవచ్చు. అలా అనకుంటే, కాఫీ తాగటం , మద్యం తాగటం, సిగరెట్లు తాగటం, పొగాకు నమలటం జననార్తులా? అంటించుకునేవా? ఆకలయితే అన్నం తినటం, దాహమయితే మంచినీళ్ళు కానీ, లేక ఎదురుగా ప్రత్యక్ష మరణ కారకం కాని ఏద్రవం కనిపించినా త్రాగటం కూడ జననార్తే అవుతుంది. మినరల్ వాటర్ ని కోరటం, పిజ్జాలను హ్యాంబర్గర్లను , జీడిపప్పు పకోడీలను కోరటం జననార్తి అనచ్చా?

నిధులు బాగా ఉన్న ప్రభుత్వ సంస్థలలోనూ, కార్పొరేట్ సంస్థల్లోనూ వివిధ స్థాయిల్లో అధికారులు మీటింగులు జరుగుతూ ఉంటాయి. వీటిని మీటింగులతో పాటు ఈటింగులు అని కూడ అనచ్చు. ముఖ్యాధికారి (కారుల) జిహ్వా చాపల్యాన్ని బట్టి జీడి పప్పు పకోడీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు పెట్టచ్చు. లేదా, ఉప్పు బిస్కెట్లతో సరిపెట్టచ్చు.

మటన్ బిరియానీ తినాలనే కోరిక వలెనే స్వలింగ సంపర్కాన్ని కూడ చాపల్యం అనచ్చా.

చాపల్యానికీ, జననార్తికీ మధ్యలో మనం మరో రెండు పదాలను కూడ జోడించు కోవచ్చు. 1. డీవియేషన్ = విచలనం, నామ్ (లేక నార్మ్) లేక స్టాండర్డు నుండి దూరంగా జరిగి పోటం. 2. వ్యాధి. కొన్ని సార్లు మానసికం కావచ్చు, కొన్ని సార్లు శారీరికం కావచ్చు, లేదా రెండూ కూడ కావచ్చు.

స్వలింగ సంపర్కాన్ని జననార్తి అనాలా, చాపల్యం అనాలా, విచలనం అనాలా, వ్యాధి అనాలా?


భారత్ లో స్వలింగ సంపర్కం ఐపీసీ (భారతీయ శిక్షా స్మృతి) 377 సెక్షన్ ప్రకారం నేరం. సురేష్ కుమార్ కౌశల్ vs. నాజ్ ఫౌండేషన్ కేసు CIVIL APPEAL NO.10972 OF 2013 లో సుప్రీం కోర్టు డిసెంబర్ 2013 లో సెక్షన్ 377 చెల్లుతుందని ధృవీకరించింది.

జనవరి 2014 లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, నాజ్ ఫౌండేషన్ వారు ఫైల్ చేసిన స్పెషల్ రివ్యూ పిటీషన్ ను కూడ తిరస్కరించారు. ఈ సందర్భంగా , సుప్రీంకోర్టు బెంచి వారు చెప్పిన విషయం గమనార్హం.
While reading down Section 377, the High Court overlooked that a miniscule fraction of the country’s population constitutes lesbians, gays, bisexuals or transgenders, and in the more than 150 years past, less than 200 persons have been prosecuted for committing offence under Section 377, and this cannot be made a sound basis for declaring that Section ultra vires Articles 14, 15 and 21."

తెలుగు సారం: సెక్షన్ 377 ను చదివే సందర్భంలో , హై కోర్టు దేశంలో అతికొద్ది ప్రజలు లెస్బియన్ లు (స్త్రీ స్వలింగ సంపర్కులు), గే స్ (పురుష స్వలింగ సంపర్కులు), ద్విలింగులు, లింగమార్పితులు అన్న విషయాన్ని చూడలేదు. గత 150 ఏళ్ళలో , సెక్షన్ 377 క్రింద విచారింపబడిన వారి సంఖ్య 200 కన్నా తక్కువే. కనుక రాజ్యాంగం 14, 15 మరియు 21 ప్రకారం ఈ సెక్షన్ చెల్లదు అని ప్రకటించటానికి ఇది బలమైన ఆధారం కాలేదు.


శిక్ష పడిన వారి సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, పరస్పరామోదంతో స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నవారి సంఖ్య ఎంతో మనకి తెలియదు. గ్రామాల సంగతి చెప్పలేము కాని, పట్టణాలలో, నగరాలలో తగిన సంఖ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. డిసెంబరు 2013 శ్రీ సింఘ్వీ , ముఖోపాధ్యాయ గార్ల తీర్పు ముందు, హైకోర్టు తీర్పు ఆధారంగా స్వలింగీయులు కొంత మేరకు బయటకు వచ్చారు. ఇప్పుడు అది నేరం గా ప్రకటించబడింది కాబట్టి, సమాజంలో ఈ అలవాటు తిరిగి రహస్యంగా జరిగే అవకాశం ఉంది.

సమాజానికి పారదర్శకత అనేది ముఖ్యం అని నా నమ్మకం. స్వలింగ సంపర్కం ఒక ఫ్యాషన్ గా మారాలని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. ప్రకృతి విరుధ్ధ డీవియేషన్ (విచలనమే )కా వచ్చు, వ్యాధే కావచ్చు, లేదా చాపల్యమే కావచ్చు, జననార్తే కావచ్చు, ఏదైనా రహస్యం ఎంత కాలం?

నా పరిచయస్థులలో కూడ స్వలింగ సంపర్కులు ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజం చెప్పటాన్ని ప్రోత్సహించటం సమాజానికి ఎంతో అవసరం. బయటకు రావటం లేదు కాబట్టి భారత్ లో ఫలానా అలవాటు లేదు అని ప్రకటించుకోటం సత్యానికి న్యాయం చేయదు.

నేను గతంలో ఒకసారి నాబ్లాగ్ పోస్టులో వ్రాశాను. ఈ ప్రాబ్లెమ్స్ ఆఫ్ తెలుగు బ్లాగును నాలుగేళ్ళలో సుమారు 4000 మంది చూడగా (చదివారు అని చెప్పలేం), హైదరాబాదు నుండి అచ్చతెలుగులో వ్రాయబడిన గే హోమోసెక్సుయల్ బ్లాగును రోజుకి 6000 మంది చదువుతున్నారు. వేల సంవత్సరాల చరిత్ర గలిగిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి రోజుకి సరాసరి భక్తుల సంఖ్య 50000 నుండి 1,00,000 ఉంటుంది. కొద్ది సంవత్సరాలు కూడ అవని ఈ గే బ్లాగ్ కి రోజుకి 6000 మంది అంటే మాటలా. రోజుకి 6,00,000 మంది విజిట్ చేసే భారతీయ సెక్సు సైట్లు కూడ ఉన్నాయి.

ఒక జననార్తి, అలవాటు, చాపల్యం, వ్యాధి, స్వశరీర జనితమైనదైనా, అంటించుకున్నదైనా, వాంఛనీయమైనా, అవాంఛనీయమైనా, ప్రజలు నిర్భయంగా చెప్పటాన్ని ప్రోత్సహించక పోతే రాజుగారి దేవతావస్త్రాలు, మోసపూరిత నేతగాడి కథ లాగా అయిపోతుంది.

ఇంకా వ్రాయవలసినది చాలా ఉన్నది. ఇంకో సారి. కవర్ కాని వాటిని కవర్ చేద్దాం. వీటికి స్వసంపర్కం (హస్త స్ఖలనం, స్త్రీ హస్త స్ఖలనం), వాయరిజం (ఇతరులు సెక్స్ చేసుకుంటే చూడాలనుకోటం) జోడించి పరిశీలించటం మెరుగుగా ఉంటుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.