Saturday, March 29, 2014

189 Discomfort with chat shows

189 Discomfort with chat shows
Topics for discussion: హిందీ సినిమాలు, చాట్ షోలు, హిందీ నటీమణులు,నరేంద్రమోడీఒక హిందీ నటీ మణి నటించిన 46 ఎం.బీ.ల బ్లూ వీడియో కొన్నేళ్ళుగా ఇంటర్నెట్ లో చలామణీ లో ఉన్నది. అది నెట్ లో ఆ నటీమణి అనుమతితో పెట్టబడిందో లేదో తెలియదు కానీ బహు భయంకరంగా ఉన్నది.

ఆ డాన్సింగ్ దీవా (తెలుగు లో నృత్య దేవత లేక నాట్య దివ్వె అనచ్చేమో), హిందీ చిత్రాలలో ఐటమ్ నంబర్లుకూడ చేసేదిట. ఐటం నంబర్లు చేయటంలో ఆసక్తి తగ్గిందిట. కానీ జనాదరణ మాత్రం పదిలంగా ఉందిట. అహో, ఏమి జనం.


ఈ మదిరాక్షికి (మదిర= మద్యం నిండిన కన్నులు కలది, ఒక అర్ధం.) పెద్దవాళ్ళ చేత టీవీ ఛానెళ్ళ లో ఇంటర్వ్యూ చేయబడటం ఇష్టం ఉండదుట. 10 సంవత్సరాల పిల్లకాయలు ఇంటర్వ్యూ చేస్తేనే సంతోషిస్తుందిట. ఎందుకు? పెద్దవాళ్ళయితే ఎక్కువగా వ్యక్తిగత విషయాలు గుచ్చి గుచ్చి అడుగుతారుట. పిల్లలకి ఏమి అడగాలో తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ లను ఈజీగా మేనేజ్ చేస్తుందన్న మాట. అసలు కిడ్స్ కోసం చేసే ప్రసారాలలో ఐటం గాల్స్ ఎందుకో ఆ ఛానెల్స్ వారికే తెలియాలి.


ఎన్నికల సభలు, నరేంద్రమోడీ గారి చాయ్ పర్ చర్చా కూడ ఈతరహావే అనచ్చు. సాధారణంగా నరేంద్రమోడీ గారు జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇవ్వక, ఇవ్వక ఇచ్చినా ఆసౌకర్యకరమైన ప్రశ్న అడగగానే లేచిపోయే అవకాశం ఉందిట. పార్టీ కార్యకర్తల చేత ఎంపిక చేయ బడ్డ అమాయక యువతీయువకులు అడిగే ముందుగా తయారు చేయించి ఇవ్వబడ్డ ప్రశ్నలకు జవాబు ఇవ్వటం, దీనిని చాయ్ పర్ చర్చా అని ఎలా అనగలం. శ్రీ మోడి గారి చాయ్ పర్ చర్చా కార్యక్రమం నిజాయితీగా జరగాలంటే ప్రశ్నలు ఎవరు అడిగినా జవాబు అడగటానికి సిధ్ధ పడాలి. అసౌకర్య కరమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఉన్న వాస్తవాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే ఆ తరువాత అదే ప్రశ్నను మరల మరల అడగటం జరగదు. చచ్చిన పామును ఎవరు చంపుతారు. తన వాదనలో నిజం ఉందనుకున్నప్పుడు వాదించినా తప్పులేదు. ఆజవాబును ప్రశ్న అడిగేవాడు ఒప్పుకోకున్నా నష్టమేమీ ఉండదు. ఒప్పుకోకున్నా నష్టమేమీ ఉండదు. మన టీవీల ప్రేక్షకులకు బాలురకు తేడా ఏమీ ఉండదు. జనం తమవిచక్షణా ఘన శక్తిని గానీ, విచక్షణా రాహిత్యాన్ని గానీ బయట పెట్టకోరు.

ప్రాధమికంగా నటీమణుల ప్రవర్తనకు రాజకీయ నాయకుల ప్రవర్తన కూ భేదమేమీ ఉండదు. అందుకే నటీమణులు సినిమాల్లో అవకాశాలు తగ్గగానే, ఎంపీలుగా, ఎంఎల్ఎ లు గా అవతారమెత్తుతున్నారు.

విశ్రాంత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మార్కండేయ కట్జూ గారు ఒక సారి భారతీయులలో 90% మంది మూర్ఖులని అన్నారు. తరువాత విమర్శలకు తలఒగ్గి తన వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు. పార్టీ అగ్రనేతల ముఖం చూసి నటీనటులకు, క్రికెటర్లకు, వోట్లు వేస్తున్నారని అనుకోవాలా లేక హీరో హీరోయిన్ల ముఖం చూసి పార్టీలకు వోట్లు వేస్తున్నారా అన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.

ఒకసారి ఒక హాలీవుడ్ నటీమణి ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ షా గారిని అడిగిందిట. మనమిద్దరమూ పెళ్ళి చేసుకుంటే, మనకు పుట్టే పిల్లలకి మీ మేధస్సు, నా అందం వస్తుంది , అవునా అని. దానికి షా నవ్వి ఇలా అన్నారుట. అమ్మా తారామణీ, అలా కాకుండా, వాళ్ళకి నీ బుధ్ధీ, నా అందం వచ్చిందనుకో. సత్యానాశ్ అయిపోతుంది.

ఇతర అర్హతలు చూడకుండా సినీ నటులని గెలిపించే వారు ఒక కోణం లోంచి చూస్తే మూర్ఖులే. ఎందుకంటే, కార్యకర్త స్థాయి నుండి పైకి వచ్చిన నేత ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా తన నియోజక వర్గ ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే, వారికి మరల తన ముఖం చూపాలి కాబట్టి. సినీ నటులు తాము ఆల్ ఇండియా నేతలము లేక ఆల్ తెలుగూస్ నేతలము అనుకుంటారు కాబట్టి వారికి ఒక నియోజక వర్గం అంటూ ఉండదు. హీరో హీరోయిన్లుగా కోట్లు జనాన్ని వెర్రివాళ్ళను చేసి దోచుకున్నదే కాకుండా, జనం తమకు ఏదో బాకీ పడ్డారని హీరో హీరోయన్లు అనుకుంటారు.

ఒకాయన తిరుపతి నుండి, స్వస్థలమైన పగోజి నుండి పోటీ చేశాడు. తిరుపతిలో గెలిచి స్వస్థలం లో నే ఓడి పోయాడు. తరువాత ఆ తిరుపతి జనాలను ముంచేసి తన పార్టీని ఏట్లో కలిపి కాంగ్రెస్ లో చేరిపోయి రాజ్యసభలోకి దూరిపోయాడు. తిరుపతి జనం ఉపఎన్నికలలో ఆనటుడిని వదిలించుకున్నారు.

తెనాలి రామకృష్ణ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలు వికటకవిని తనకు ముఖం చూపించద్దన్నాడు కాబట్టి నెత్తి మీద ఒక కుండ బోర్లించుకొని సభకు వెళ్ళాడు. మన నాయకులకు ఆ ఎగ్గు లేదు కదా.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.