Sunday, March 30, 2014

191 Nagma నగ్మా नगमा نگمآ

191 Nagma నగ్మా नगमा نگمآ
Topics for discussion, చర్చాంశాలు, चर्चांश, ایجنڈا: Nagma, Congress, Lok Sabha, groping, మీరట్, मेरठ, میرٹھ, ఉత్తరప్రదేశ్, Freedom Movementఇది మీరట్ లో అమరవీరుడు మంగల్ పాండే విగ్రహం. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి ఇతడే.


టెల్లీవుడ్, బాలీవుడ్ లో గతంలో మెరిసిన తార నగ్మా నేడు, జయప్రద వలెనే, ఈమె కూడ ఉత్తరప్రదేశ్ నుండే పోటీ చేస్తుంది. మీరట్ నియోజక వర్గం. రాజధాని ఢిల్లీకి 70 కిలోమీటర్లు ఈశాన్యం. ఆటవస్తువులు, సంగీత వాయిద్యాలు తయారు అవుతాయి.రామాయణంలో మీరట్రావణాసురుడి మామ గారు మాయాసురుడు, మండోదరి తండ్రి. మాయారాష్ట్ర కాస్తా మేరఠ్, మీరట్ అయిందట. నేను రామాయణవైబి.బ్లాగ్ స్పాట్.కామ్ నా బ్లాగ్ లో, మండోదరి స్థలం రాజస్థాన్ లోని మందసార్ అని వ్రాశాను. రావణుడి అత్తగారి ఊరు రాజస్థాన్ లోనో, ఉత్తర ప్రదేశ్ లోనో ఉంటే, ఆయన లంక ఎక్కడో 2000 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న శ్రీలంకలో ఉండటం అసాధ్యం. రావణుడి లంక రాజస్థాన్ నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మధ్యభారత్ లోనే ఉండి ఉండాలి. భారత పురాతత్వ శాఖ వారు పూనుకుంటే తప్ప అసలు రావణ లంక మధ్య భారత్ లో బయట పడదు. రావణుడి లంకను, సంబంధించిన ప్రదేశాలను టూరిస్టు స్పాట్ లు గా మార్చి శ్రీలంక డబ్బు చేసుకుంటున్నది. రావణ లంకను అధికం గా దర్శించే టూరిస్టులు ఎక్కువగా భారతీయులే.

మీరట్ చరిత్ర

ఇక్కడ సింధూ నాగరికత శిథిలాలు కూడ బయట పడ్డాయి. ఇక్కడ అశోకుడు నాటించిన స్థంభ శాసనం యొక్క ముక్క లండన్ మూజియంలో ఉంది. మీరట్ నగరం ఘజ్నీ, ఘోరీ, తైమూరు అందరి చేత కూడా దాడి చేయబడి , తైమూర్ చేతిలో లక్షమంది రాజపుత్రులు తమ తలలను భారత మాతకు సమర్పించిన దివ్య వీర స్థలం. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమయిన పుణ్యభూమి మీరట్. ఆవుకొవ్వు, పందికొవ్వుతో చేసిన తూటాలను నోటితో కొరికటానికి నిరాకరించినందుకు 85 మంది సిపాయిలు 10 ఏళ్ళ కఠిన కారాగారానికి గురియైన ధీర స్థానం. శ్రావణకుమారుడిని దశరధుడు శబ్దభేది విద్యతో పొరపాటున జంతువుగా భ్రమించి బాణమేసి చంపిన ప్రదేశంట.

మీరట్ అభివృధ్ధిమీరట్ నుండి ఢిల్లీకి రోజుకి 27 జతల రైళ్ళు నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సికిందరాబాదుకి గానీ, విజయవాడకి గానీ, విశాఖకి గానీ, ఇలాంటి 27 జతల రైళ్ళు ఉన్నాయా?

మీరట్ జనాభా 14 లక్షలు వేగం గా పెరుగుతున్నది కాని, ఉపాధి కల్పనలో భారత్ లో కిందినుండి పదో స్థానంట. మాల్స్, ఫ్లైవోవర్స్ , అపార్టుమెంటులు వీటినే అభివృధ్ధిగా భావించే వక్ర మేథస్సు కల దేశం కదా ఇది. వీటికి మీరట్ లో కొదువ లేదు. మీరట్ కత్తులకు, కత్తెరలకు ప్రసిధ్ధి. ఈపరిశ్రమ ఇపుడు వెనుకడుగు వేసి ఉండాలి.

మీరట్ లో నేటి సంస్కృతి

అది అలా ఉండగా, గజరాజ్ సింగ్ అనే కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ. గారు నగ్మా గారి ముఖాన్ని దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడుట. ఎం.ఎల్.ఎ. గారికి ఎక్కడ కోపం వస్తుందో, తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాడేమోనని కాంగ్రెస్ భయపడిందో ఏమిటో ఆ గజేంద్రుడిపై చర్య తీసుకోలేదు. గజేంద్రుడిని విమర్శించటానికి సాహసించిన ప్రమోద్ కాత్యాన్ అనే కాంగ్రెస్ నాయకుడిని పార్టీనుండి బహష్కరించారట.

ఒక సభలో ఆమెను తడమటానికి (గ్రోపింగు) ప్రయత్నించిన ఒక ఆగంతకుడిని ఆమె చెంప పగుల కొట్టిందిట. మరల ఇలా జరిగితే నేను మీరట్ కు రాను అన్నదిట. తన భద్రతకోసం ప్రత్యేక బౌన్సర్లను నియమించుకున్నదట.

విచిత్రమేమిటంటే, ఇవన్నీ అబధ్ధాలే. ఇది ఒక రాజకీయకుట్ర అని ఆమె అంటున్నది.
I do not know why I am being targeted like this. How can I get groped or molested every single day? Of course, I am campaigning and the rallies have their ups and downs, but this is ridiculous. I was not groped or molested --- I really do feel that this could be a political conspiracy.

తెలుగు సారం: నన్ను ఎందుకు టార్జెట్ చేస్తున్నారో నాకు తెలియదు. ప్రతిరోజూ నేను తడమ బడటం, మొలెస్ట్ చేయబడటం ఎలా కుదురుతుంది? నేను ప్రచారం చేస్తున్నాను, రాలీలు అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇది విచిత్రం, హాస్యాస్పదం. నేను గ్రోప్ చేయబడలేదు. మొలెస్ట్ చేయబడలేదు. --- ఇది ఒక రాజకీయ కుట్ర అయి ఉండచ్చని నేను అనుకుంటున్నాను.

వైబీరావు గాడిద వ్యాఖ్యఇలాంటి ప్రదేశం నుండి నగ్మా గారు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి లోక్ సభలో ఏమి చేస్తారు? మంగళ్ పాండే పుట్టిన దేశానికి ఏమిటీ ఈదుర్గతి?

ఈ నాటి పాట. చిత్రం మిస్సమ్మ.


ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి||
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే....అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె అలిగి ||
చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలె చొరవ||
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి||

విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే విసిగి || తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి|| ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి ||

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.