Saturday, March 15, 2014

183 modi-joshi

183 modi-joshi

agenda, ఎజెండా, कार्यसूची: నరేంద్రమోడీ, బిజెపి, వారణాసి, కాన్పూర్, లక్నో, రాజనాథ్ సింగ్తాడి నెక్కువాని తలదన్నువాడుండును, గుడిలో లింగాన్ని మింగేవాడుంటే, గుడినే మింగేవాడుంటాడు. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న్. ఎవరు ఊహించండి.

ఇంకెవరు, మన నరేంద్ర మోడీ గారే. శివాగ్రహంతో వారణాసినుండి అగస్త్యుడు బయటకి పంపి వేయబడ్డట్లుగా , మోడీ అనుగ్రహంతో, అక్కడి బిజేపీ పెద్దాయన మురళీ మనోహర్ జోషీ గారు కాన్ పూర్ కి నెట్టివేయ పడ్డాడు.
బిజెపీ అధ్యక్షశ్రీ శ్రీరాజనాథ్ సింగ్ గారు లక్నో నుండి పోటీ చేస్తున్నారు. పాపం ఇక్కడి సిటింగ్ ఎంపీ లాల్ జీ టాండన్ గారు గతంలో శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారు లక్నో నుండి పోటీ చేసినపుడు గౌరవంతో తన సీటును ఖాళీ చేసి ఇస్తుండే వాడు, ఈసారి బలవంతంగా గెంటి వేయబడ్డారు. రాజ్యసభలో సర్దుబాటు చేస్తామంటారు గానీ ఇంక బ్రతుకు బిచ్చగాడి కన్నా హీనమే. రాజ్ నాథ్ సింగ్ గారి స్వంత నియోజక వర్గం ఘజియాబాద్. అక్కడ పోటీ చేయటానికి వణుకు పుడుతుంది కాబోలు, లక్నోనుండి సీనియర్ నేత లాల్జీ టాండన్ గారి ముడ్డికిందికి నీళ్ళు తెచ్చారు.


అరుణ్ జైట్లీ రాజ్యసభలో బిజేపీ నేత. పంజాబ్ లోని అమృత్ సర్ నియోజక వర్గం నుండి క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిధ్ధూని నెట్టేసి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.బిజెపి లో పరిస్థితులు చూస్తుంటే, ఇంకా మోడీ గారు ప్రధాని కాకుండానే, సీనియర్ నేతలందరికి పొగ పెట్టేస్తున్నాడు.

సీనియర్ నేతలకు ఆ శాస్తి జరగవలసినదే అని ఒక్కోసారి అనిపిస్తుంది. మురళీ మనోహర్ జోషీగారిని తీసుకోండి. ఆయన కేంద్రంలో విద్యా మంత్రి (మానవవనరుల అభివృధ్ధి మంత్రి) గా ఉన్నప్పడే చరిత్రను మార్చి తిరగరాయించాలని ప్రయత్నించారు. అరేబియా సముద్రగర్భంలో ఎక్కడ ఏ శిథిలం కనిపించినా ముందు వెనుకా ఆలోచించకుండా దానిని ద్వారకానగరం, అని ప్రకటించమని పురావస్తుశాఖ వారిపై వత్తిడి తెచ్చేవాడు. గల్ఫ్ ఆఫ్ కాంబేలోని మెరైన్ ఆర్కియాలజిస్టులకు ఈయన తన మూఢ విశ్వాసాలతో చెమటలు పట్టించాడు. I.C.H.R. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారిక్ రీసర్చ్, N.C.E.R.T. ఎన్.సీ.ఈ.ఆర్.సీ.టీ. ప్రతీ దానిని మత పిచ్చి వాళ్ళతో నింపేశాడు.

ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, అంటారు. ఎంతటి వాడికి ఎంతటి గతి పట్టింది? భౌతిక శాస్త్రాచార్యుడు అయిన ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషీ గారు 1991-93 అంటే ౨౩ ఏళ్ళ క్రితం భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు. అపుడు మోడీ బిజెపి లో ఒక బచ్చా. ఈయన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించినపుడు, మోడీ ఆయన బృందంలో చిల్లర పనులు చేసేవాడు.

స్వర్గీయ ఇందిరాగాంధీ భింద్రన్ వాలే అనే పంజాబీ తీవ్రవాదిని ప్రోత్సహించి చివరికి దెబ్బతిన్నది. ఇపుడు బిజెపి కేంద్ర నేతలు నరేంద్రమోడీని ప్రోత్సహించి నానా గడ్డి తింటున్నారు. ఇపుడు అద్వానీ గారు మురళీ మనోహర్ జోషీ గారు కలిసి ఒకళ్ళ చెవులు ఒకళ్ళు పట్టుకొని గుంజిళ్ళు తీసుకోవాల్సిందే. నాగుల చవితినాడు భారతీయ గృహిణులు పుట్టలలో పాలు పోసినట్లు, అద్వానీ, జోషీ, చెరో పాల క్యారేజీ తీసుకొని వినాయకుడి గుళ్ళచుట్టూ తిరిగి వినాయకుడి విగ్రహాల చేత, పాలు తాగించి రావాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.