Saturday, March 15, 2014

182 hindutva

182 hindutva
Agenda, ఎజెండా, कार्यसूची: హిందూత్వ, hindutva, హిందూమతం, లౌకికవాదం, భారతీయేతరమతాలుభారత్ లో జాతీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మైనారిటీ మతశక్తులనో, మెజారిటీ మత శక్తులనో ప్రోత్సహిస్తున్న విషయం విజ్ఞులకు తెలుసు.

భారతీయేతర మతాలు వ్యవస్థీకృతమై ఉన్నాయి. అవి విదేశీయుల నుండి విరాళాలు పొందుతూ, తరచుగా వారి చేత దర్శకత్వం వహించ బడుతూ ఉన్నాయి. విదేశీ మతాల వారు ఈ అలవాటుని మార్చుకోటం సర్వదా జాతికి శ్రేయోదాయకం.

హిందూ అనే పదం మనకు పురాణాలలో, ఇతిహాసాలలో కనిపించదు. హిందూ అనే పదాన్ని విదేశీయులు ముఖ్యంగా పశ్చిమ దేశాలవారు సింధూనదికి తూర్పుగా ఉన్న దేశం అంటే భారత దేశానికి పేరుగా వాడారు. మతం అంటే ఒక జీవన విధానం, ఒక అభిప్రాయం. ఏ దేవుడిని పూజిస్తారు అనేది కొన్ని వందల అంశాలలో ఒక అంశమే తప్ప అదే మెయిన్ అంశం కాదు. ఏమి తింటారు. ఏ బట్టలు కట్టుకుంటారు, ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారు, స్త్రీ బాల వృధ్ధులని ఎలా గౌరవిస్తారు, పెళ్ళి, నామకరణం, పుష్ఫవతి కావటం, గర్భవతి కావటం (సీమంతం), మరణాలు, సంస్మరణాలు, ఇవన్నీ మతంలో ఒక భాగమే. సంస్కృతి అనే పదం, మతం అనే పదం సమానార్ధకాలు. నానాటికీ మతం అనే పదం, దురదృష్ట వశాత్తూ నారో గేజి లోకి వెళ్ళి పోయింది. రాగ ద్వేషాలకు, మారణ కాండలకు, దారి తీసింది. విశాలమైన బహుళత్వం స్థానంలో ఇరుకు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. చక్కని రాజమార్గం స్థానంలో సందులు గొందులు పుట్టుకొచ్చాయి.

భారతీయేతర (విదేశీ) మతాలు అవ్యవస్థీకృతం కావటం

భారతీయులు ఏకం కావటానికి ఇది చక్కటి పరిష్కారం. అంటే మతాధిపతులు పెట్టే పంజరాల లో నుండి వారు బయట పడాలి. ప్రార్ధనా మందిరాలలో ప్రార్ధనలు చేసుకోటం, ఆధ్యాత్మికంగా (ఆధ్యాత్మికం అనేది నిజంగా ఉంటే) వారు తమను తాము మెరుగు పరుచుకుంటూ , ప్రార్ధనామందిరాలను దర్శించేవారికి చేదోడు వాదోడుగా ఉండాలి. ప్రజలు మద్యం, గంజాయి, అతి మాంసాహార విహారాలు, అతి స్త్రీలోలత్వం వంటి వాటికి బానిసలై పోతే వారి నెత్తినెక్కకుండా, వారిని బయట పడేసేందుకు ప్రయత్నించాలి. నేడు అలా జరగటం లేదు. మతాధిపతులు, ఆజ్ఞలను జారీ చేస్తూ వాటిని ప్రజలపై రుద్దుతున్నారు. విదేశీ మతాలలో ప్రబలి ఉన్న, ప్రబలుతున్న ఒక అలవాటేమిటంటే, ప్రతి వారిని తమ మతంలోకి మార్చటానికి ప్రయత్నించటం. తాము పూజించే దేవుడే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఇతర దేవతలను పూజించే వారు అనాగరికులు, ప్యాగన్లు, కాఫిర్లు, వాళ్లతో యుధ్ధాలు చేసో, లేక వారిని మభ్యపెట్టో, ఆశలు కల్పించో దేవుళ్ళను మార్చుకునే లాగా చేయాలి అనే ప్రయత్నాలు ఎక్కువ కావటం వల్ల జనాభా నిష్పత్తిలో మార్పులు రావటం మొ|| ఎన్నో సమస్యలు చోటు చేసుకుంటున్నాయి.

హిందూమతం

హిందూ మతం అనే మతం నిజానికి లేదు. భారతీయులందరు హిందువులే. ఘోరీ మహమ్మద్ దండెత్తి వచ్చి కొన్ని ప్రాంతాలను ఆక్రమించి బలవంతంగా తమ మతాన్ని రుద్దటం మొదలెట్టినప్పటినుండే హిందువులు వేరు, హిందూ మతం వేరు అనే తర్కం మొదలయింది.

సనాతన ధర్మం అనే దానికి కూడ విశాలమైన అర్ధం ఉంది. సనాతనం అంటే ఎన్నో వేల ఏళ్ళనుండి వస్తున్నది. ధర్మం అంటే జీవన విధానం. దీనికి మతానికి ఉండే ఆధునికి సంకుచితార్ధాన్ని మనం ఆపాదించ లేం.

అయితే ప్రజలు, భారత ప్రభుత్వం హిందూ మతాన్ని వ్యవస్థీకృతం చేసుకోదలుచుకుంటే చేసుకోటానికి ప్రణాలికా బధ్ధంగా ముందుకెళ్ళవచ్చు. ఇది భారతీయ సమాజాన్ని విడతీసే ప్రమాదం ఉంది. దీనికన్నా భారతీయేతర మతాలనే అవ్యవస్థీకృతం చేయటమే మేలుగా కనిపిస్తుంది.

హిందూ మతాన్ని వ్యవస్థీకృతం చేయటం ఎలా (ఒక పధ్ధతి)

దీనిని వైబీరావు గాడిద సమర్ధిస్తున్నట్లుగా విజ్ఞులు భావించరాదు.

ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది సరియైన సమాచారాన్ని కలిగి ఉండటం లేదు. ప్రభుత్వం ఆధార్ కార్డు డేటా లోనే జన్మ మతం, మతాలను మారినపుడు మార్పిడి చరిత్ర రికార్డు చేయాలి. దీని కొరకు ఇంటింటకీ తిరిగి వోటర్ల లిస్టు తరహాలోనే సమాచారాన్ని సేకరించాలి.

ప్రభుత్వం ఒక ప్రత్యేక మత ఎన్నికల కమీషన్ ను నియమించి వారి చేత అన్ని మతాలకు ఎన్నికలను నిర్వహించాలి. హిందూ మతానికి సంబంధించినంత వరకు, ఆధార్ లో హిందువుగా నమోదు అయిన వోటర్లు అందరూ హిందూ వ్యవస్థ __ హిందూ సంస్థాన్ అనచ్చేమో, ఈ హిందూ సంస్థాన్ ప్రతినిథి సభను, పాలక వర్గాన్ని రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోవచ్చు. దానికో అధ్యక్షుడు, కార్యదర్శులు, రిజిష్టర్డ్ కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు మొ|| ఉండాల్సి వస్తుంది.

హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు, చట్టాలలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటో ఈ ప్రతినిధి సభ చర్చించి, కార్యనిర్వాహకవర్గం ద్వారా తమ సూచనలను ప్రజలకు పంపచ్చు. అవసరమనుకున్నప్పుడు ప్రజలలో రహస్యబ్యాలెట్ ద్వాలా రిఫరెండంలను నిర్వహించుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, టాబ్ లెట్లు వచ్చాక ఇవి తేలికే. సాధారణంగా సూచనలను ప్రజలపై రుద్దచ్చా అంటే రుద్దలేమనే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే రిఫరెండం లో 80% శాతం వోటర్లు ఆమోదించిన దానిని ప్రోత్సాహకాలు వంటి ద్వారా అమలు చేయవచ్చేమో. అందరూ కలసి ఆలోచించాల్సిన విషయం.

ఈ మధ్య పూరీ శంకరాచార్యుల వారు ఎక్కడ కుంభ మేళా జరపాలి , ఏనదులలో మునగాలి అనేది నిర్ణయించటం తమ అధికారం, మీరెలా జోక్యం చేసుకుంటారు అని ఛత్తీస్ గఢ్ గవర్నరు మంత్రులపై విరుచుకుపడ్డారు. పూరీ శంకరాచార్యుడు ఎన్నికైన మతాధికారి అయితే ఈవిరుచుకు పడటం కొంతమేరకు న్యాయం అవచ్చు.


(ఇంకా జోడించ వలసింది ఉంది. ఈలోగా మీ మనో భావాలు గాయపడితే కామెంట్లు వ్రాయచ్చు).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.