Wednesday, March 12, 2014

177 pushkaras

177 Irrationality and Injustice in selecting rivers for pushkaras పుష్కరాలకు నదుల ఎంపికలో నిర్హేతుకత, అన్యాయం
topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: ఛత్తీస్ గఢ్, శంకరాచార్య, పుష్కరాలు, కుంభ్, హిందూత్వ, మహానది
భారతీయేతర మతాల వలె హిందూ మతం ఒక వ్యవస్థీకృత మతం కాదు. కేథలిక్కులకు రోమ్ పోప్ వలె, ఆంగ్లికన్ లకు ఆర్చ్ బిషప్ ఆఫ్ కేంటర్ బరీ వలె, దీనికి పరిపాలకులు ఎవరూ ఉండరు. భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, శంకరాచార్యులు కానీ, ఇతర మఠాల వారు కానీ, దీనికి పాలకులు కాదు. ఇది ఒక తరహా అరాజకం anarchy లాగ కనిపించినా, సత్యం.

చాతుర్ వర్ణ్య వ్యవస్థ

చాతుర్ వర్ణ్య వ్యవస్థ తమ తెల్ల రంగు పోతుందన్న భయంతో ఆర్యులు మనపై రుద్దిందే తప్ప భారతీయమైనది కాదు. నేడు ఆర్యులు భారతీయులలో కలిసి పోయారు కాబట్టి, వారు వ్యాపింప చేసిన నాలుగు కులాల పధ్ధతి శాఖోప శాఖలుగా చీలి లక్ష కులాల వ్యవస్థగా మారి పోయింది. కుల నిర్మూలనం భారతీయుల తక్షణ కర్తవ్యమే అయినా, పెట్టుబడి దారీ విధానం, భూస్వామ్యాలు, ప్రైవేటు ప్రాపర్టీలు, వంశ పారంపర్య సంపద హక్కు, నిర్మూలనం జరిగే వరకు కులవ్యవస్థ పోదు. ఆర్ధిక సమానత్వానికీ, సామాజిక న్యాయానికి సంబంధం ఉంది. దీనికి రిజర్వేషన్ల వంటి అమృతాంజనాలూ, జండూ బాములూ సరిపోవు.

శంకరాచార్యుల మని చెప్పుకునే వారి అహంకారాలు

దక్కన్ క్రానికల్ పత్రిక వారు వ్రాసిన వార్త ఆధారంగా వ్రాస్తున్నాను. తేదీ: 10.03.2014. Monday. పేజీ: 11వ ఓపెడ్ పేజీ.
సందర్భం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం. గరియాబంధ్ జిల్లా. స్థలం: రాజీం అనే నదీతీర పట్టణం. ఇక్కడ విష్ణువు, వామనుడు, నృసింహుడు దేవాలయాలు ఉన్నాయి.

కులేశ్వర మహాదేవ్ మందిరం కూడ ఉన్నది. రాజీమ్ లో రైల్వే స్టేషన్ కూడ ఉంది. చిత్రాలు వీకీపీడియా వారి దయ.

ఇక్కడ మహానదీ, సింధూర్ నది, పైరీ నది కలుస్తాయి. ఒక రకంగా త్రివేణీ సంగమమే.

2007లో ఇక్కడ రాజీమ్ కుంభ్ జరిగింది.

ఈపవిత్ర నదీ సంగమం వద్ద, ఛత్తీస్ గఢ్ బిజెపి ప్రభుత్వం వారు, మహాశివరాత్రి నుండి 10 రోజుల పాటు ఒక విజయవంతంగా ఉత్సవాన్ని జరిపారు. వారు ఈ ఉత్సవానికి ఎంతో ఉత్సాహంగా కుంభ్ అని పేరు పెట్టుకున్నారు.

వైబీరావు గాడిద వ్యాఖ్య

ఇది ఘోర నేరమేమి కాదు. నేను పైన వ్రాశాను, హిందూజీవనం (దీనిని మతం అనటం న్యాయం కాదు) పూర్తి స్వేఛ్చా స్వాతంత్ర్యాలతో నిండినది. ఇక్కడ ఫత్వాలు చెల్లవు. మతాధికారులే లేనపుడు వారి ఆర్డర్లు చెల్లవు. సన్యాసులైన వారిని ప్రజలు ఉత్తములనుకుంటే, వారిని గౌరవిస్తూ వారి సూచనలను పాటించ వచ్చు. అంతే తప్ప అది సుగ్రీవాజ్ఞ కాదు. సన్యాసులు గిరి గీసుకొని కూర్చోవాలనుకుంటే హాయిగా కూర్చోవచ్చు. కానీ ప్రజలపై రుద్దలేరు.

బ్యాక్ టూ ఛత్తీస్ గఢ్, రాజీం, 10రోజుల ఉత్సవం

2007లో కుంభ్ ఉత్సవాన్ని జరుపుకున్నారు కాబట్టి, రాజీమ్ వారు 2014 ఏడేళ్ళ తరువాత మరల ఈ ఉత్సవాన్ని జరుపుకోటం ముదావహం.

ఇది ఎందుకో మన గురువుగారు పూరీ పీఠాధిపతి శ్రీ నిశ్చలానంద సరస్వతి గారికి కంటగింపు అయ్యింది. తమ అధికారానికి భంగం కలిగినట్లు తలచినట్లున్నారు. తాను ''నిశ్చలానందుడ'' (an unperturbable blissful person) ననే మర్చి పోయినట్లున్నాడు. ముగింపు సభలో ఉన్న ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ శేఖర్ దత్, దేవాదాయ మంత్రి బ్రిజమోహన్ అగర్వాల్, సంస్కృతి మంత్రి అజయ్ చంద్రార్కర్ పై విరుచుకు పడ్డారు. శ్రీ చలానందుల వారి మాటలలోనే.
“Who gave you the right to declare the festival a Kumbh? You are not authorised to tamper with religious matters. You should not think that you can encroach upon the privileges of religious and spiritual gurus only because you are in power,”

తెలుగు సారం: ఇక్కడ జరిగే తిరునాళ్ళ కి కుంభ్ గా ప్రకటించే అధికారం మీ కెవరిచ్చారు? మత విషయాలతో టింకరింగ్ చేసేందుకు మీకధికారం లేదు. మత మరియు ఆధ్యాత్మిక గురువుల ప్రత్యేక హక్కులను विशेषाधिकार లను, మీరు రాజ్యమేలుతున్నారు కదా అని, ఆక్రమించ వచ్చని మీరు అనుకోకూడదు.

“Main aapse puchta hun rajyapalji, kya aap kisi dal vishesh ke prabhav mein nirnaya lete hain? Sarkar ne ye Kumbh bana kaise liya? Dharmacharyon ki karyon ka nirnaya aap kaise le loge? (I am asking you, Mr Governor, if you are taking decisions under the influence of any particular political party? How could the government give the festival the status of Kumbh? How could you take a decision on matters that should have been left to religious gurus?”

తెలుగు సారం: గవర్నర్ గారూ, నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏ రాజకీయ పార్టీ ప్రభావం వల్లనైనా నిర్ణయాలను తీసుకుంటున్నారా? ఈ పండుగకు ప్రభుత్వం కుంభ్ హోదాను ఎలా ఇవ్వగలదు? మత గురువులకు వదల వలసిన విషయాలపై మీరెలా నిర్ణయం తీసుకున్నారు?

(శ్రీ పూరీ శంకరాచార్యుల అభిప్రాయం ప్రకారం కేవలం నాలుగు తీర్ధాలలోనే కుంభ్ జరగాలి. అవి: హరిద్వార్, ప్రయాగ, ఉజ్జెయినీ, నాసిక్.)

“Dips in the confluences of all rivers in the country cannot be accorded the status of Kumbh,”

తెలుగుసారం: దేశంలోని అన్ని నదుల సంగమాలలో మునగటానికి కుంభ్ స్థాయి ఇవ్వటం కుదరదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

అసలు కుంభ మేళాల చుట్టూ అల్లిన కథే అన్యాయమైనది. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభ రాశి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గురు గ్రహం సూర్యకుటుంబం లోనే , మనకు సమీపంలోనే ఉన్నది. గురు గ్రహం కుంభంలోకి వెళ్ళటం అనేది అసంభవం. అది కంటికి కనిపించే ఒక సుందరమైన భ్రమ. గురువు కుంభ రాశిలోకి వెళ్ళినపుడు ఎన్నిక చేసిన కొన్ని నదులలోనే పుష్కరుడు గారు, ఆయన వెంట మనుషులు పాపాల క్షాళన చేసే కుంకుండుకాయలు|శీకాయ ఆనదికి వెళ్తాయనుకోటం ఒక భ్రమ.

అసలు పుష్కరుడు గారు భారత దేశం లోని కొన్ని నదుల్లోనే ఎందుకు ప్రవేశిస్తున్నాడు అనటానికి వివరణ లేదు. ప్రపంచంలో అమెజాన్, మిసిసిపీ మిసోరీ, నైల్, వంటి కొన్ని వేల నదులు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఏవో కొన్ని భారతీయ నదులలోకి మాత్రమే ప్రవేశించ నిర్ హేతుకం. ఉదాహరణకి: తుంగభద్రా పుష్కరాలు. తుంగభద్ర కృష్ణానదికి ఉపనది. దీనికి పుష్కరాలు ఉన్నాయి. మహానదికి, బ్రహ్మపుత్రానదికి, తపతి నదికి ఎందుకు లేవు?

గంగా,
రేవా (నర్మద)
సరస్వతీ
యమునా
గోదావరి
కృష్ణా
కావేరీ
భీమా
పుష్కరవాహిని/రాధ్యసాగ నది
తుంగభద్ర
సింధు
ప్రాణహిత

ఈ పట్టిక చూసినప్పుడు ఏ హేతుబధ్దమైన ప్రాతిపదిక లేక పోటం వల్లనే మహానది, తపతీ నదం, బ్రహ్మపుత్రానదికి, గోమతి, సరయు, దామోదర్, మొ|| నదులకు, అన్యాయాలు జరిగినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నదులకు పెద్దకోటా లభించినట్లు కనిపిస్తుంది.

సాధారణ పౌరులకి వలెనే, పీఠాధిపతులకు కూడ, చిన్నప్పుడే సన్యాసం తీసుకున్నప్పటికి, అసంపూర్ణ జ్ఞానమే. పీఠం అంటే పీట (ఆసనం). దేవతను ఒక పీటపై కూర్చోపెట్టి అక్కడ ఆరాధించటం వరకే పీఠాధిపతులు పరిమితం కావాల్సి ఉండగా, తమకు తామే జగద్గురువులుగా ప్రకటించుకోటం, ధర్మాధిపతులుగా అనకోటం, కొందరు రాజుల కాలంలో జరిగి ఉండవచ్చు. ఆరాజులకి కూడ నేటి నాయకులలాగానే గురువులతో ఏదో పనిబడి వారు చెప్పిన ప్రతిదానికి తల ఊపి ఉండవచ్చు.

నదుల్లో మునిగినపుడు కొంత మేరకు దేహం శుభ్రం అవుతుంది. తాత్కాలికంగా కొంత వరకు మనసులోని కాలుష్యం కూడ క్లీన్ అవచ్చు. పుష్కరాల్లో గానీ, విడిగా గానీ, నదులలో (అన్ని నదులూ పవిత్రమైనవే, కొన్ని పవిత్రం, కొన్ని అపవిత్రం అని విభజనలు ఉండవు) కానీ స్నానాలుచేసే పధ్ధతి మంచిదే. అంత మాత్రానే పాపాలు కడగ పడతాయనుకోటం, కడగ పడతాయి అని ప్రచారం చేయటం అమాయకులను తప్పుదారి పట్టించటానికి ఉపయోగిస్తుందేమో తప్ప వారి ఆధ్యాత్మిక ప్రగతికి గానీ, సత్యాన్వేషణకు గానీ ఉపయోగించక పోవచ్చు.

అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం
కృత కర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి.

చేసిన కర్మ మంచిదైనా, చెడ్డదైనా దాని ఫలం తప్పక అనుభవించి తీరాలి. చేసిన కర్మ వందకోట్ల కల్పాల కైనా అనుభవించనిదే నశించదు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ఈ లోకోక్తి చాల విలువైనది. అయితే ఇది కూడ 100 శాతం చెల్లదు. దీనికి బోలెడు పరిమితులు ఉన్నాయి. ఈవ్యాసం సుదీర్ఘం అవుతున్నందు వల్ల ఇంకొక పోస్టు లో వ్రాస్తాను. ఈవిషయంపై 1000 పేజీల పుస్తకం, చదివే వాళ్ళు ఉంటే, వ్రాయవచ్చు.

ప్రస్తుతానికి సారాంశం: నదులలో కుంభ్ లు జరుపుకునే స్వేఛ్ఛ భారతీయులకు ఉంది. దానికి పీఠాధిపతుల అనుమతి అవసరం లేదు. పీఠాధిపతులు, మతగురువులు కూడ ఫలానా కుంభ్ మేళా జరుపుకోమని సలహా ఇవ్వవచ్చు. అలా నిర్ణయించే గుత్తాధికారం తమకు మాత్రమే ఉందని భావించరాదు. నదులలో, మేళా సమయాలలో మునగగానే పాపాలు పోవు. అసలు అన్ని పాపాలకు శిక్షలుంటాయని (కొన్నిటికే ఉండచ్చు), అందరికీ శిక్షలుంటాయని (కొందరికే ఉండచ్చు) ఋజువులు లేవు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.