Thursday, March 13, 2014

178

177 Sri KaLahastISvara Satakam, Verses 10 to 12.
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: श्रीकाळहस्तीश्वर शतक, Kalahastisvara, శ్రీ కాళహస్తీశ్వర శతకం, ధూర్జటి, అష్టదిగ్గజాలు

|మత్తేభము|

ఒక పూఁటించుక కూడు తక్కువగునే నోర్వంగఁలేఁ, డెండ కో
పక నీడ న్వెదకున్, చలిం జడిసి కుంపట్లెత్తికోఁజూచు, వా
నకు నిండ్లిండ్లును దూఱు నీ తనువు, దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్త్యులకటా ! శ్రీ కాళహస్తీశ్వరా! 10.


==తాత్పర్యం==

శ్రీ కాళహస్తీశ్వరా, ధూర్జటి మహాకవి మానవ జీవితం యొక్క రోతను అసహ్యించుకుంటున్నాడు. ఒక పూట కొద్దిగా ఆహారం తక్కువైతే ఓర్చుకోలేరు. ఎండకు ఓర్వలేక, నీడ కోసం వెతుకుతారు. చలి కాచుకోటానికి కుంపట్లు కావాలంటాడు. వాన వస్తే , తడవకుండా, దేహాన్ని రక్షించుకోటానికి, ఇళ్ళల్లోకి దూరతారు. ఈ శరీరాన్ని, దీనితో వచ్చే సౌఖ్యాన్ని రోసి మృత్యువుని, మోక్షాన్ని మనుష్యులు ఎందుకు కోరుకోరు.
==శార్దూలము వృత్తము==

కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్
రాయన్ రాపడె రొమ్ము, మన్మథ విహార క్లేశ విభ్రాంతిచేఁ
బ్రాయంబాయెను, బట్ట కట్టెఁ దల, చెప్పన్ రోఁత సంసార మేఁ
జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! 8

తాత్పర్యం

శరీరం వధువుల గోళ్ళ చేత కాయలు కాచి పోయింది. స్త్రీలు తమ స్థనాలను రాయటం వల్ల రొమ్ము రాపిడి పడిపోయింది. మన్మధ బాధతో కలిగిన భ్రమతో వయసు ముదిరి పోయింది. బట్ట తల కాయ వచ్చింది. చెప్పుకోటానికే రోతగా ఉంది. నాకు విరక్తి కలిగించవయ్యా, ఓ కాళహస్తీశ్వరా, అని ధూర్జటి మొత్తుకుంటున్నాడు.

==|శార్దూలము, వృత్తము|


కాలద్వార కవాట బంధనము, దుష్కాల ప్రయాణ క్రియా
లీలా జాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళ విరోధి, మృత్యు ముఖ దంష్ట్రాహార్య వజ్రంబు, ది
క్చేలాలంకృత నీదు నామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! 9
==తాత్పర్యం==

కాలుడంటే యముడు. కాలద్వారం అంటే యముడి నరక ద్వారం. ఆద్వారాన్ని మూసివేసేది శ్రీ కాళహస్తీశ్వరుడి నామము.
దుష్కాల ప్రమాణ క్రియా లీలాజాలకచిత్రగుప్త అంటే జీవులకు పోయే కాలాన్ని నిర్ణయించే పనిని ఒక ఆట లాగా, గారడీ లాగా చేసే, చిత్రగుప్తుడి.
చిత్రగుప్త ముఖ వల్మీకం అంటే చిత్రగుప్తుడి ముఖం ఒక పాము పుట్ట వంటిది.
చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళం అంటే చిత్రగుప్తుడి నోరు అనే పుట్టలో ఉండే అద్భుతమైన పాము అతడి నాలుక.
ఆపాము కి అంటే వ్యాళ విరోధి శత్రువు గరుత్మంతుడు. శ్రీకాళహస్తీశ్వరుడి నామం ఎలాంటి దంటే చిత్రగుప్తుడి నాలుక అనే పాముకి గరుత్మంతుడు లాంటిది. గరుత్మంతుడిని చూస్తే పాములు ఎలా భయపడతాయో శ్రీకాళహస్తీశ్వరుడి నామానికి చిత్ర గుప్తుడు అలా భయపడతాడు.
మృత్యు ముఖ దంష్ట్రాహార్య వజ్రంబు అంటే మరణం యొక్క కోరలను ఖండించే వజ్రాయుధం, శ్రీకాళహస్తీశ్వరుడి నామం. వ్యాఖ్యానం: మృత్యువు అసలు ఉండదని కాదు, జనన మరణ చక్రంలో మానవుడు ఇరుక్కోడు. మృత్యువు వల్ల కలిగే బాధ ఉండదు.
దిక్ చేలాలంకృత ప్రయోగం చాల అద్భుతమైనది. చేలాలు అంటే వస్త్రాలు. దిక్కులే వస్త్రాలుగా ధరించి దిక్కుల చేత అలంకరించబడిన వాడు, అంటే దిగంబరుడు శ్రీకాళహస్తీశ్వరుడు.

VERSES 10 TO 12 IN ENGLISH SCRIPT

10. Oka pUTincuka kUDu takkuvagunEn Orvanga lEDu, EnDa kO
paka nIDan vedakun, calim jaDisi kumpaTlettikO cUcu, vA
nakun inDlinDlunu dUrun, I tanuvu, dInan vaccu sauKhyambu rO
sika DAsimparu gAka martyul akaTA!! SrI kALahastIsvarA!!

English gist of verse No. 10.

Oh kALahastISvarA!! The poet dhUrjaTi is mocking at human frailties. Humans cannot endure, if there is a little shortfall in their daily food. They search for shade, unable to bear sunlight. They warm themselves up beside charcoal burners, unable to bear cold weather. They break into nearby houses, whenever it rains. They never think that their bodies are abominable. They never think that the perceived comforts they get from their bodies are detestable. They never think of liberation from the pangs of birth and death.
Verse 11 in English Script


11. kAyal gAce vadhU nakhAgramulacE kAyambu, vakshOjamul
rAyan rApaDe rommu, manmatha vihAra klESa vibhrAnticE
prAyambAyenu, baTTa kaTTe tala, ceppan rOta samsAra mEn
cEyan jAla viraktu cEya kadavE SrI kALahastISvarA.

ENGLISH GIST and purport

The poet was regreting about his wasted life. His body got swollen with lumps, as damsels pierced him with their nails. His chest got bruised owing to abrasions made on it, by breasts of ladies. Youth elapsed in the pursuit of satiation of carnal desires. Head balded. It is despicable to describe this body. The poet is urging SrI kALahastISvara: Why don't you make me non-chalant and unresponsive to these worldly pleasures?

Verse 12 in English Script


12. kAla dvAra kavATa bandhanamu, dushkAla prayANa kriyA
lIlA jAlaka citragupta mukha valmIkOgra jihvAdbhuta
vyALa vyALa virOdhi, mrityu mukha damshTrAharya vajrambu, di
k cElAlankrita nIdu nAma marayan SrI kALahastISvarA.

Gist and possible purportThe poet was praising the glory of the omnipotent name of Lord Sri kALahastISvara. It seals the entry door to hell (kAla dvAra kavATa bandhanamu). Chitragupta was Hell's accountant who fixes the d'day for creatures. The poet was comparing Chitragupta's tongue to a serpant, which will be chased by the kite of the name of God kALahastISvara (dushkAla lIlA jAlaka citragupta mukha valmIkOgra vyALa vyALA virOdhi). God's name kALahastIsvara like diamond (vajra is regarded as a very powerful weapon) destroys the fangs of the devil Death.

VERSES NOS. 10, 11 and 12 in Hindi script.

१०. ऒक पूटिंचुक कूडु तक्कुववगुनेन ओर्वंग लेडु, ऎंड को---
पक नीडन् नॆदकुन्, चलिं जडिसि कुंपटलॆट्टिको चूचु, वा
नकुन् इंड्लिंड्लुनु दूरुन्, ई तनुवु, दीनन् वच्चु सौख्यंबु रो---
सिक डासिंपडु गाक मर्त्युल् अकटा, श्री काळ ह्स्तीश्वरा.
तात्पर्य, भाव, मतलब
महा कवि धूर्जटीजी मानव कमजोरियों पर मजाक कर रहे हैं. वे कहते हैँ: अपने दैनिक भोजन में एक छोटी सी कमी है, तो मनुष्य, सहन नहीं कर सकते हैं. वे सूरज की रोशनी को सहन करने में असमर्थ, ईसीलिए वे छाया के लिए खोज करते हैं. वे ठंड के मौसम को सहन करने में असमर्थ हैं. कोयला जला कर, खुद को गर्म रख्ते हैँ. थोडा बारिस होते ही, वे नजदीक घरों मे घुसते हैँ. वे अपने शरीर को घृणित कभी नहीँ सोचते. वे अपने शरीर से मिलनेवाले सुख को कभी घृणित् नहींँ मानते. वे जन्म और मृत्यु के नुकीले, और कष्ट से मुक्ति की तलाश कभी नहीं करते.
Verse 11 in Hindi script and translation

११. कायल गाचॆ वधू नखाग्रमुलचे कायंबु, वक्षोजमुल्
रायन् रापाडॆ रॊम्मु, मन्मथ विहार क्लेश विभ्रांतिचे
प्रायंबायॆनु, बट्ट कट्टॆ तल, चॆप्पन् रोत संसार मेन्
चेयन् जाल विरक्तु चेय कदवे श्री काळहस्तीश्वरा.
तात्पर्य, भाव, मतलब
महाकवी धूर्जटी अपने व्यर्ध जीवन के बारे में पश्चाततप्त हो रहे हैं. औरतें अपने नाखून से उसे छेद किया. कविराज का शरीर, गांठ के साथ सूज गया. महाकवी का छाती से महिलाए अपनी स्तन से महाकवी के छाती को रगड और घर्षण करने से उनका छाती पर चोट और् लुंज उठा. मन्मथ बाधा, क्लेश, और विभ्रम से महाकवी को बुढाई पहुँचा. शिर गंजा हो गया. वे श्री काळहस्तीश्वर महादेव को प्रार्धन कर रहे हैं. यह बताने के लिए भी कीचड् है. मैं इस परिवार चलाने नहीं कर सकता. कृपया मुझे एक विरागी बनाइए.
verse No. 12 in Hindi script बारहवा पद्य हिन्दी लिपी मे.

१२. काल द्वार कवाट बंधनमु, दुष्काल प्रयाण क्रिया
लीला जालक चित्रगुप्त मुख वल्मीकोग्र जिह्वाद्भुत
व्याळ व्याळ विरोधि , मृत्यु मुख दंष्ट्राहार्य वज्रंबु, दि---
क् चेलालंकृत नीदु नामम अरयन् श्री काळ ह्स्तीश्वरा.
तात्पर्य, भाव, मतलब
महाकवी धूर्जटी भगवान् श्री काळहस्तीश्वरजी के नाम वैभव को वर्णन् कर रहा है. वह नरक प्रविष्टि दरवाजा बंद कर देता है. नरक का लेखाकार चित्रगुप्तजी जीवराशियों का पाप गिनती करते हैं. चित्रगुप्तजी की जीभ को, महाकवी एक सापँ समझते है. सापँ का दुष्मन गरुड. चित्रगुप्त्जी की जीभ को नियंत्रण में रखने गरुड् श्री काळहस्तीश्वर नाम है. श्री काळहस्तीश्वर का नाम, देवॆंद्रं आयुध वज्र से भी महानू है. श्री काळहस्तीश्वरजी के नाम मृत्यु के नूकेले को काटने वाले वज्र है.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.