Tuesday, March 11, 2014

175 Narendra Modi

175 Narendra Modi --- Hans India Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चा के विषय: Narendra Modi,Digvijay Singh, Hans India, నరేంద్రమోడీ,దిగ్విజయసింగ్,జశోదా మోడీ

స్పష్టీకరణలు, వివరణలు


ప్రధాన మంత్రి పదవికి ప్రధాన అభ్యర్ధుల విద్య మరియు వివాహం విషయంలో నాకు ఇదే ఆఖరి వ్యాసం కావాలని ఆశిస్తున్నాను. నేను సర్వజ్ఞుడనని అనుకోటం లేదు. సర్వజ్ఞుడను కాదు కూడ.

నాకు శ్రీ నరేంద్ర మోడీపై కానీ, శ్రీ రాహుల్ గాంధీపై కానీ ప్రేమలు, తాపాలు లేవు. ఏది వ్రాసినా దేశ సంక్షేమం దృష్టిలో ఉంచుకునే వ్రాస్తున్నాను. నేను తప్పు వ్రాస్తే ఎత్తి చూపి దిద్దే హక్కు పాఠకులకు ఉంటుంది. నా అభిప్రాయాలను వారిపై రుద్దను, వారు కూడ వారి అభిప్రాయాలను నాపై రుద్దరనే ఆశిస్తున్నాను. ఇది కేవలం సమాచార మార్పిడి మాత్రమే. నేను ఎక్కడైనా అసత్య సమాచారం ఇస్తే, పాఠకులు ఎత్తి చూపితే దానిని తీసి వేయటానికి సిధ్ధంగా ఉన్నాను.


దిగ్విజయ్ విమర్శపై హాన్స్ ఇండియా ఆంగ్ల దిన పత్రిక సంపాదకీయం.

తేదీ: 10.03.2014. చదవాలనుకునే వారికి లింక్. http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/03/10/ArticleHtmls/Stooping-to-conquer-10032014006019.shtml?Mode=1

ఈ సంపాదకీయం యొక్క శీర్షిక ''స్టూపింగ్ టూ కాంకర్ ''. శీర్షిక తెలుగు సారం, గెలవటానికి దిగజారటం. ప్రధాన విషయం , ఎన్నికలను గెలవటం కోసం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ దిగజారి శ్రీ నరేంద్ర మోడీపై వ్యక్తిగత ఆరోపణలకి దిగటం. ఈ సంపాదకీయం పూర్తిగా ఏక పక్షంగా ఉన్నట్లుగా ఈ వైబీరావు గాడిదకు కనిపిస్తుంది.

ఈ సంపాదకీయం కొంత దారి తప్పినట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతగా దిగ్విజయ్ సింగ్ శ్రీనరేంద్రమోడీ వ్యక్తిగత వివాహ విషయాలను లేవనెత్తటంలో వోట్ బ్యాంకు రాజకీయ అవసరాలు ఉంటే ఉండ వచ్చు.

తటస్థుల, సత్యార్ధుల ఆసక్తితటస్థులు, సత్యశోథన జరగాలని కోరే వోటర్లైన పౌరులకు, అగ్రనేతల వ్యక్తిగత విషయాలపై ఆసక్తి ఉండటం తప్పు కాదేమో, ఈవిషయాన్ని న్యాయస్థానాలు తేల్చాలి.

కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న నౌకరీలో చేరాలంటే సవాలక్ష వ్రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉంటాయి. అన్నిటి కన్నా ముఖ్యమైనది పోలీస్ ఇంక్వైరీ, క్లియరెన్సులు ఉంటాయి. అవి సక్రమంగా జరుగుతాయా లేవా అనేది వేరే విషయం. అభ్యర్ధిపై ఇతర అంశాలకు సంబంధించిన కేసులు ఉన్నా నౌకరీ ఇవ్వరు. చేసే ఉద్యోగానికీ, ఆకేసుకీ సంబంధం ఏమిటి అని అడిగే హక్కు, నిబంధనల ప్రకారం లేదు.

ప్రధానమంత్రి, మంత్రుల పదవులు, శాసన సభ్యత్వాలు, లోక్ సభ సభ్యత్వాలు, కేంద్ర ప్రభుత్వ సాధారణ నౌకరీ కన్నా భిన్నమైనవా? భిన్నమైనవి అనాలంటే, వాటిలో బాధ్యతల పాలు నిచ్చెన మెట్లెక్కిన కొలదీ పెరుగుతూ ఉంటుంది. Moral turpitude నైతిక దుర్మార్గం नैतिक अधमता లేకుండా ఉండాల్సిన ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రధాని అభ్యర్ధినుండీ, చప్రాసీ అభ్యర్ధినుండీ ఒకే స్థాయికి చెందిన నైతిక ప్రవర్తనను ఆశించలేం.

ఉదాహరణకి, ఒక కేంద్ర ప్రభుత్వ చప్రాసీ తాగి వచ్చి ఇంటి వద్ద పెళ్ళాన్ని కొట్తూ ఉంటాడు. ఒక ప్రధాన మంత్రి తాగి వెళ్ళి ఇంటి వద్ద పెళ్ళాన్ని కొట్తూ ఉంటాడు. ఇద్దరూ సమానమా? స్థూల, చట్ట దృష్టితో చూస్తే రెండూ సమానమే నేమో. కానీ సూక్ష్మ దృష్టితో చూస్తే రెండూ సమానం కాదు. సాధారణంగా చప్రాసీలు ప్రభుత్వ పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. (కెసీఆర్ గారు ఒక సారి ప్రధాని మన్మోహన్ సింగు గారిని చప్రాసీతో పోల్చారు. అది వేరే విషయం. చప్రాసీలు వేరు. చప్రాసీ తుల్యులు వేరు.). మనం చప్రాసీలను, జూనియర్ అసిస్టెంట్లను నియమించే ముందు ఎన్నో రకాల రీజనింగ్ టెస్టులు, జీకె టెస్టులు, పెట్తూ, కాండక్ట్ పై రిఫరెన్స్ లు, పోలీసు విచారణలు చేయిస్తున్నామంటే, ప్రధానమంత్రి విషయంలో ఎవరూ ఏవిషయాన్నీ పట్టించు కోకూడదంటే ఎలా కుదురుతుంది?

పాలనపై లైంగికాంశాల ప్రభావంఒకసారి నేను ఒక అమెరికన్ శాస్త్రీయ అధ్యయనం యొక్క రిపోర్టు చదివాను. దాని లింకు ఇప్పుడు ఇద్దామంటే దొరకటం లేదు. దాని తెలుగు సారం: ప్రపంచ నేతలకు sexual frustration సెక్స్యుయల్ ఫ్రస్ట్రేషన్ లైంగిక నిరాశా, భంగం (లేక లైంగిక ఆశా భంగం), लैंगिक, यौन, कामी, मैथुनिक कुंठा, निराशा ఎక్కువైనపుడు వారు దేశాలతో యుధ్ధాలకు దిగే అవకాశం ఉంది. ప్రపంచ యుధ్ధాలు ఇలానే సంభవించాయి. ఈరిపోర్టులో శాస్త్రీయత, సత్యం ఎంత ఉన్నా మంచి ఆసక్తి కరమైన ఫైండింగ్. భారతీయ అగ్రనేతలు ప్రపంచ అగ్రనేతల కన్నా భిన్నంగా ఉంటారా?

Influence of sexual impulses and frustrations on subconscious. మనుష్యుల అంతశ్ చేతనపై లైంగిక ఆవేగాలు మరియు నిరాశల ప్రభావం. मानव अवचेतन पर् यौन आवॆगों ऒर कुंठाऒं का प्रभावఅనుబంధ ప్రశ్న: లైంగిక కోరికలను అదుపులో పెట్టుకున్నప్పుడు దాని ప్రభావం sub-conscious ఉపచేతన (మనలో అణగి ఉండే మనసు యొక్క లోపలి పొర), अवचेतन పై ఏవిధంగా ఉంటుంది? ఆప్రభావం వల్ల అగ్రనేత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు? nuclear suit case అణు సూట్ కేసు (అణు బాంబు ప్రయోగించాలంటే ఆర్డర్లు ఇవ్వటానికి ఇవ్వవలసిన కమాండ్లు దీనిలో ఉంటాయిట) వంటి కీలకమైన వస్తువులు అగ్రనేతల తల దగ్గరో కాళ్ళ దగ్గరో పడి ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలపై వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్ ల ప్రభావం ఏమేరకు ఉంటుంది? వీటిని మానసిక శాస్త్రవేత్తలు, న్యాయకోవిదులు, మెదడు వ్యాధి నిపుణులు పరీశీలించాల్సిందే.

ఇతర గుణ దోషాలు ఎలా ఉన్నా శ్రీమన్మోహన్ సింగు గారి భాషణ, ప్రవర్తనల్లో ఒక గొప్పతనం ఉంది. ఆయన తన గురువు శ్రీ పీవీ నరసింహారావు వలె మౌని ముచ్చు. మాట జారటం తక్కువ. కొంత నంగిగా ఉన్నా అంతర్ జాతీయ సంబంధాల విషయంలో ఈపధ్ధతి చక్కగా పనిచేస్తుంది. ఎంత రెచ్చగొట్టే వాతావరణాన్ని చైనా, పాకిస్థాన్, శ్రీలంకలు మనకి సృష్టిస్తున్నా ఆయన మాటల్లో క్రమశిక్షణను పాటించి ఆప్షన్ లను ఓపెన్ గా ఉంచుకున్నాడు. శీ మోడీ గారి ప్రకటనలు, కొన్ని చైనా, పాకిస్థాన్ లను యుధ్ధాలకు (లేక రహస్య వెన్నుపోటు దాడులకు) రెచ్చగొట్టేవి కనిపించాయి. అగ్రనేతలకు కావలసినది వాక్శూరత్వం కాదు. కార్యశూరత్వం కావాలి. ముందుగా భారీ సైన్యాన్ని సమకూర్చుకోవాలి. ఆధునిక ఆయుధాలు తయారు చేసుకోవాలి, కొనాలి. వాటిని వాడటంలో శిక్షణ ఇచ్చుకోవాలి. ఒక దేశంతో యుధ్ధం జరగచ్చు అనుకుంటున్నప్పుడు మిగిలిన దేశాలు మనకి వ్యతిరేకంగా ఆశత్రు దేశంతో కుమ్మక్కు కాకుండా, మిగిలిన దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలి. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.

సహసా విదధీతి నక్రియాం
అవివేకః పరమ ఆపదం పదం
వృణతేహి విమృశ్య కారిణం
గుణ లుబ్ధా స్వయమేవ సంపదః. అర్ధం ఏపనినైనా తొందరపాటుతో చేయకూడదు. తొందర క్షణికావేశాన్ని కలిగిస్తుంది. క్షణికావేశం వల్ల వ్యక్తి అవివేకి అవుతాడు. అవివేకం అనేక ఆపదలకు నిలయం. బాగా ఆలోచించి పనిచేసే వాడిని సంపదలు, సుఖాలు వరిస్తాయి.

శ్రీ రాహుల్ లూజ్ టాక్

శ్రీరాహుల్ గాంధీకి కూడ ఈతరహా లూజ్ నెస్ ఉంది. కాగితాలను చించెయ్యటం, నాన్ సెన్స్ అనటం వంటి వాటిని గుర్తుకు తెచ్చుకోండి. శ్రీ రాహుల్ జీ కి రిహార్సళ్ళు, గైడ్లు, స్పీచ్ రైటర్లు ఎక్కువగా ఉండటం వల్ల శ్రీవారి వాక్శూరత్వం పూర్తి స్థాయిలో బయట పడటం లేదు. శ్రీమోడీజీకి కొంత స్వేఛ్ఛ, నియంతృత్వాధికారాలు ఉండటం వల్ల ఆయన లూజ్ టాక్ బయట పడుతున్నది.

మనకి ఇపుడు ఉన్న ముగ్గురు ప్రధాన మంత్రి అభ్యర్ధులు (రాహుల్, మోడీ, కెజ్రీవాల్) ఈ వాక్ అపక్వత తో బాధ పడుతున్నవారు. వారు కేంద్ర మంత్రులు గా, ముఖ్యంగా విదేశాంగ మంత్రిగా పనిచేయకపోటం వల్ల, ఉపన్యాసాలకు కావలసిన INTONATION, MODULATION, INTERVALS, BALANCE OF IDEAS రావటం లేదు. ఈవిషయంలో మూలాయం, మమతా, లాలు, నితీష్ అనుభవం వల్ల ఒక వెంట్రుక వాసి మెరుగుగా కనిపిస్తున్నారు.

జశోదా విలాపం అనే అంబా శోకం

స్వర్గీయ బి.ఎ. సుబ్బారావు గారి ఎన్ టీ ఆర్ భీష్మ సినిమా చూసి ఉంటారు. ఈ సినిమా లో అంజలీదేవి అంబ (తరువాత జన్మలో శిఖండి) గా నటించింది.
ఈ చిత్ర ముఖ్యాంశం భీష్ముడు తనకు రాజ్యం అవసరం లేదని, తాను జీవితాంతం వివాహం చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేయటం. ఈ ప్రతిజ్ఞ వల్ల లోకోపకారమే కాని నష్టమేమీ జరగలేదు.

భీష్ముడు ఒక దరిద్రపు పని చేశాడు అని అనలేం కాని, ఆయన వ్యక్తిత్వానికి తగని పని చేశాడు. అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురు రాజకుమార్తె లను తన తమ్ముళ్ళ కోసం చెర పట్టి తీసుకొచ్చాడు. తమ్ముళ్ళ కోసం వధువును వెతకటంలో తప్పు లేదు. వెతకటం అనే కర్తవ్యం, చెరపట్టి ఎత్తుకు రావటం abduct, kidnap దాకా పొడిగించటం కుదరదు.

అంబ అప్పటికి సాల్వుడు అనే రాజును మోహించి ఉన్నది. ఆమె ఆ విషయం భీష్ముడికి చెప్పటంతో ఆమెను సాల్వుడి దగ్గరకు పంపాడు. సాల్వుడు ఒక సాధారణ భారతీయుడు. ordinary average Indian with default settings. ఠాఠ్ ఇంకొకడి కొరకు ఎత్తుకెళ్ళిన మగువను నేను ఆమోదించటమా? అంబను తిరగ కొట్టాడు. ఆమె భీష్ముడి వద్దకు వచ్చి ఆయన తమ్ముళ్ళను పెళ్ళాడటానికి సిధ్ధపడింది. వీళ్ళు కూడా ordinary average Indian default settings గాళ్ళే. ఠాఠ్ ఇంకోళ్ళు నో అన్న దాన్ని మేము స్వీకరించటమా అన్నారు. అంబ భీష్ముడినే పెళ్ళాడమని అడుగుతుంది. ఆయన డిఫాల్ట్ సెటింగ్ వాడు కానప్పటికీ తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండటం వల్ల ఠాఠ్ అన్నాడు. అంబ వెళ్ళి భీష్ముడి గురువు పరశురాముడిని శరణు వేడగా, ఆయన భీష్ముడిని అంబను పెళ్ళి చేసుకోమని ఆజ్ఞాపించాడు. భీష్ముడు ఠాఠ్ అనటంతో వాళ్ళిద్దరు యుధ్ధం చేసుకోటం, పరశురాముడు ఓడిపోటం, అంబ జీవితం బుగ్గి పాలు కావటం జరిగింది.

నరేంద్ర మోడీ గారి
భీష్మ ప్రతిజ్ఞ

ప్రస్తుతాంశం: శ్రీ రాహుల్ గాంధీ ఏమైనా భీష్మ ప్రతిజ్ఞ చేశారో ఏమో మనకి తెలియదు. ప్రధాని మంత్రి పదవిలోకి వచ్చాక ఏమైనా భాండాలు బ్రద్దలౌతాయో ఏమో మనకి తెలియదు. శ్రీ నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకు ఆయన వివాహానికి ముందే భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉంటే మనకి నేడు అభినవ భీష్మ దర్శనం అయ్యేది.

వివాహానంతరం, అర్ ఎస్ ఎస్ ఋషుల మెప్పు కోసమో, లేక మరే ఇతర కారణాల వల్లనో, భీష్మ ప్రతిజ్ఞ చేయటం వల్ల ''రాజే అన్యాయానికి పాల్పడెనా '' అనే ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.

అవతలి వ్యక్తి ఫిర్యాదు చేయటం లేదు కదా, నా ధర్మపత్ని వనవాసం గురించి మీకెందుకు అనే ప్రశ్న ఉత్పత్తి కాదు. అవతలి వ్యక్తి సర్వ స్వతంత్రురాలై ఉండి, ఏ బెదిరింపులకు లోను కాకుండా, శంకరుడి కోసం పార్వతి తపస్సు చేసినట్లు తపస్సు చేస్తానంటే, 128 కోట్లమంది భారతీయులకూ సంబంధం ఉండదన్న అభిప్రాయం ఎంత వరకు నిలుస్తుంది? ఇది నా ఇల్లు నేను తగల పెట్టుకుంటున్నాను , మీకెందుకు అన్నట్లుగా ఉంటుంది.

వివాహం అంటే కేవలం ఇరువురి మధ్య బాధ్యతనా, కుటుంబ బాధ్యతనా, కుల బాధ్యతనా, మత బాధ్యతనా, సమాజ బాధ్యతనా, దేశ బాధ్యతనా, అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాన మంత్రి అభ్యర్ధులకే కాక, అన్ని కులాల వారికీ, మతాల వారికీ, పౌరులకీ ఈస్పష్టత రావలసిన అవసరం ఉంది.

ఉదాహరణకి ఒక మతంలో భర్త అనేవాడు, నిర్దేశించ బడిన పధ్ధతిలో మూడు సార్లు తలాక్, తలాక్, తలాక్ అంటే చాలు విడాకులు వచ్చేస్తాయి. ఆయన అలా వాడుకొని వదిలేసిన భార్యని ధర్మ సంస్థలు (బహుశా గ్రాంట్లు ఇచ్చి పరోక్షంగా ప్రభుత్వం), సమాజం, పోషించాల్సిందే.

ఇంకో మతంలో కోర్టు డైవోర్స్ డిక్రీ ఇచ్చేదాకా మొదటి వివాహానికి బంధితుడై ఉండాల్సిందే. తన భార్యను జీవితాంతం పోషిస్తూ ఉండాల్సిందే.

నీవు చదువుకోమ్మా అని చెప్పి పుట్టింట్లో వదిలేసి, ఆమెకు ఫీజు కూడ కట్టకుండా, ఆమెతో మాట్లాడకుండా, ముఖం తప్పించే భర్తకు, ఆమె తన స్వంత కష్టంతో ఉద్యోగం సంపాదించుకున్న భార్యను పోషించే బాధ్యతలు ఉండవా? ఉంటాయా? ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే బాధ్యతలు ఉంటాయి, లేనప్పడు ఉండవు అనే బ్రాంచి కూడ ఒక ప్రశ్న అవుతుంది.

మావోయిస్టు జంటలు

ఇద్దరూ ఒకే అడవిలో ఉండటం, ప్రక్క ప్రక్కన తుపాకులు పట్టుకొని నడవ వలసిన అవసరం, వానల్లో తడవటం, ఎండలకు ఎండటం, చలికి వణకటం, జ్వరాలు రావటం వంటి సందర్భాల వల్ల మావోయిస్టు జంటలు కొందరు ఒకరి నొకరిని ప్రేమించుకొని భార్యా భర్తల అవతారాలు దాల్చ వచ్చు. నాతి చరామి ఇక్కడ బాగానే పనిచేస్తుంది. ఒక్కో సారి ఇద్దరిలో ఒకరు వేరొకరి వెంట పడటం అక్రమ సంబంధాలకి దిగటం PHILANDERING खिलवाड़ చేయటం వంటివి జరిగి ఇద్దరిలో ఒకరు సరెండర్ కావటం వంటివి జరుగుతూ ఉంటాయి.

విదేశాల్లో ఇంకా విచిత్రమైన పరిస్థితులు తల ఎత్తుతున్నాయి. అక్కడ ముందు పిల్లలను కంటున్నారు. తరువాత వాళ్ళ సమక్షంలోనే వివాహబంధాలను సృష్టించుకుంటున్నారు. మరల తెంచుకుంటున్నారు. మనం ఇంకా ఆ స్థితికి రాలేదు.

స్వర్గీయ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ దిండు క్రింద పోక చెక్క అని ఒక నవల వ్రాసినట్లు నాకు గుర్తు. అందులో ఒక తెగ వారి ఆచారం. భార్య వెళ్ళిపోదలుచుకుంటే, భర్త దిండు క్రింద ఒక పోకచెక్కను పెట్టి వెళ్ళి పోతుందట. అదే విడాకులకి సంకేతం.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఒక కేంద్ర సహాయ మంత్రి భార్య

ఈ ఉదంతం పాఠకులకు గుర్తు ఉండే ఉంటుంది. ఈ భార్య విషయంలో నరేంద్ర మోడీ గారు ఒక కామెంట్ చేశారు.

ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను చదవటానికి లింకు. http://timesofindia.indiatimes.com/india/Narendra-Modi-calls-Shashi-Tharoors-wife-50-crore-rupee-girlfriend/articleshow/17008278.cms
... "Wah kya girlfriend hai. Apne kabhi dekha hai 50 crore ka girlfriend?" (What a girlfriend. Have you ever seen a 50-crore-girl friend) ...

ఆమె ఎటువంటి గాళ్ ఫ్రెండ్? మీరెప్పుడైనా 50 కోట్ల గాళ్ ఫ్రెండుని చూశారా? "... Everyone has heard about the minister, taken back on board and rewarded for his conduct. He claimed in the Parliament that he is in no way connected to the Rs 50 crore and that these are in his friend's name. Who has heard of a crorepati girlfriend? And then girlfriend becomes wife, we learn some time later. ... "

తెలుగు సారం: ప్రతి ఒక్కరూ ఈ మంత్రి గురించి వినే ఉంటారు. మంత్రివర్గంలోకి తిరిగి తీసుకోబడి, తన ప్రవర్తనకు బహుమతిని పొందారు. ఆయన పార్లమెంటులో క్లెయిమ్ చేశారు. '' నాకూ ఆ 50 కోట్లకు సంబంధం లేదు. ఇవి నాస్నేహితురాలి పేరులో ఉన్నాయి. కోటీశ్వరి అయిన స్నేహితురాలి గురించి ఎవరైనా విన్నారా? మరియు తరువాత గాళ్ ఫ్రెండ్ భార్య అవుతుంది. మనకి కొంత సమయం తరువాత ఇంకా తెలుస్తుంది. ... ''


ఈవ్యాసం ఒక అంతులేని కథగా మారుతున్నట్లు నాకనిపిస్తున్నది.

ఉపసంహారంపైన ప్రస్తావించిన హాన్స్ ఇండియా సంపాదకీయం తిరిగి ఒకసారి చదవండి. ఆకళింపు చేసుకోండి.

సమాజం వ్యక్తి గత విషయాలను పూర్తిగా వదిలేయాలి అంటే అసలు మీడియా ఇంక బ్రతకదు. ఇదే మీడియాకు కొన్ని విషయాలలో విపరీతమైన ఆసక్తి. ఏనటి, ఏనటుడు రహస్యంగా కలుసుకుంటున్నారు? వారిద్దరి మధ్య ఎంగేజిమెంట్ జరిగితే మమ్మల్ని పిలవకుండా ఎలా చేసుకుంటారు? మేము ఏ ఆహ్వానం లేకుండా వారింటి కెళ్తే, గేట్లకు తాళాలు వేసి గూర్ఖాల చేతా, స్వంత మనుషుల చేతా వెంట పడి తన్నించారు. అయినా మేము గోడ దూకి వెళ్ళి వార్తను సాధించు కొచ్చాం. ఇది మా ఎక్స్క్లూజివ్, అంటూ చూపిన క్లిప్పింగు నే రోజుకి పదిసార్లు చూపిస్తారు?

హృత్రిక్ రోషన్, ఆయన భార్య విడిపోటం మీది విపరీతమైన ఆసక్తి చూపిన మీడియా శ్రీమతి జశోదా బెన్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది?

శ్రీ నరేంద్ర మోడీ నుండి, ఖరాఖండి ప్రకటనను, వివరణను, ఎందుకు రాబట్టలేక పోతున్నారు?
1. అసలు మోడీ, జశోదా బెన్ లకు వివాహం జరిగిందా? శ్రీ మోడీ గారి మౌనానికి అర్ధం ఏమిటి?
2. శ్రీమోడీ గారు భార్య చదువుకు ఎందుకు ఫీజు కట్టలేక పోయారు? ఇష్టం లేకనా, డబ్బులు లేకనా.
౩. తరువాత అప్పుడప్పుడైనా ఆమెకు తన ముఖం ఎందుకు చూపించలేక పోతున్నారు. ఆమె వచ్చినపుడు ఎందుకు ముఖం తప్పిస్తున్నారు.
4. మోడీ గారి తల్లిగారు తన కుమారుడికి లవకుశలో కౌసల్యా కన్నాంబ గారు శ్రీరాముడు ఎన్ టీ ఆర్ కు బోధించినట్లుగా హితబోధ చేశారా, లేదా? చేస్తే దానిని పెడచెవిని పెట్టారా? ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా?


5. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీ మోడీగారి సోదరుల పాత్ర ఏమిటి?

మొదటి ప్రశ్నకు నో చెప్తే 2,3, 4, 5 ప్రశ్నలు , ఈగాలి దుమారం అంతా సమసి పోతుంది.
పూర్తి చేయాలి. To complete. सशेष्.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.