Monday, March 10, 2014

173 PM Candidate

173 PM Candidate

173 PMs should set high ethical standards. ప్రధాన మంత్రులు అత్యున్నత నైతికం ప్రమాణాలు నెలకొల్పాలి, పాటించాలి.

చర్చనీయాంశాలు: ప్రధాన మంత్రి, 2014 ఎన్నికలు, నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, బిజెపి, కాంగ్రెస్

స్పష్టీకరణప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించబడక పోయినప్పటికి శ్రీరాహుల్ గాంధీని అభ్యర్ధిగా ప్రజలు భావిస్తున్నారు. వివాహం విషయంలో శ్రీ మోడీ గారు, శ్రీరాహుల్ గారు ఇరువురు ప్రకృతి విరుధ్ధంగానే ప్రవర్తిస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్ధులు ఎన్నికల ముగిసేనాటికి, కొన్ని వందల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ప్రబోధాలు చేస్తూ ఉంటారు. వాగ్దానాలు ఉంటాయి. ప్రధానమంత్రి పదవి వచ్చాక ఊకదంపుడు ఉపన్యాసాలు రెట్టింపవుతాయి.


సమాజం స్థూలం (మాక్రో) అయితే వ్యక్తి సూక్ష్మం (మైక్రో). సాధారణ వ్యక్తులకి వ్యక్తిగత బాధ్యతలు ఎక్కువగా ఉండి సామాజిక బాధ్యతలు తక్కువగా ఉంటాయి. నేతలకి సామాజిక బాధ్యతలు ఎక్కువగా ఉండి వ్యక్తిగత బాధ్యతలు తక్కువ ఉండచ్చు. దీనర్ధం వ్యక్తిగత బాధ్యతలు అసలుండవని కాదు. వ్యక్తిగత బాధ్యతలను మహా ఘనంగా నిర్వర్తించలేక పోయినా, కనీస స్థాయిలో నైనా నిర్వహించాలి కదా.

మనకి ముగ్గురు బయట పడ్డ ప్రధాన మంత్రి అభ్యర్ధులు ఉన్నారు (మోడీ, రాహుల్, కేజ్రీవాల్). బయటపడని వాళ్ళు 120 కోట్లమంది ఉన్నారు. వీరిలో మమతా బెనర్జీ, మూలాయం, మాయావతి, జయలలిత మొ||.

నరేంద్ర మోడీ గారి భార్య విషయం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ గారు లేవనెత్తారు. ఆయన అడిగిన ప్రశ్నలు సమంజసమైనవే. మిగిలిన విషయంలో చాటర్ బాక్స్ లాగా దంచుతూ, తన భార్య విషయంలో తాను చేసిన నాతి చరామి వాగ్దానాన్ని ఎవరు లేవనెత్తకూడదని మోడీగారు గానీ, ఆయన అనుచర నాయక గణం అనుకోటం అర్ధం లేదు. ఆమేమో నేను ధర్మపత్నిని, నేను ధర్మ పత్నిని అని మొత్తుకుంటున్నది. అవుననో కాదనో చెప్పాల్సిన బాధ్యత శ్రీ మోడీ గారిపై ఉంటుంది కదా. అంతే కాదు ఆమెను ఎందుకు ''ఛోడ్ దియా'' అనే ప్రశ్నకు కూడ జవాబు చెప్పాలి. ఆమె ధర్మపత్ని స్థానానికి అర్హురాలు కాదని వివాహానంతరం బయట పడితే, ఆవిషయం కోర్టుకి చెప్పి హాయిగా విడాకులు తీసుకోవచ్చు.

ఓపెన్ దీ మాగజైన్.కామ్ అనే వెబ్ సైట్ కి చెందిన హైమా దేశ్ పాండే అనే యువతి జశోదా బెన్ గారు టీచర్ గా పనిచేస్తున్న బనస్కాంతా జిల్లా రాజాసోని అనే గ్రామానికి వెళ్ళి శ్రీమతి జశోదా గారిని ఇంటర్వ్యూ చేయటానికి ప్రయత్నించినపుడు ఆమెపై నిఘా ఉన్న విషయం వెల్లడయింది. అలనాడు శ్రీరామచంద్రుడు కైకేయి, భరతుడు, సీత లపై గూఢచారి నిఘా పెట్టించాడు. మన అభినవ శ్రీరామచంద్రుడు మోడీ గారు శ్రీమతి జశోదా బెన్ గారిపై నిఘా పెట్టించినట్లయింది. స్వంత భార్య పైనే నిఘా పెట్టించటానికి వెనకాడని వాడు, ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఒక యువతిపై ఇతర రాష్ట్రంలో నిఘా పెట్టించటంలో వింత ఏమి ఉన్నది? ఆ టెలీఫోన్ నిఘాపై దర్యాప్తు చేయటానికి రిటైర్డ్ జడ్జీలు ముందుకు రాకపోటం గమనార్హం.

రాహుల్ గాంధీ


2002లో శ్రీరాహుల్ గాంధీగారు, ప్రక్కనే ఒక కొలంబియా డ్రగ్ పెడ్లర్ కుమార్తెతో అమెరికాలోని బోస్టన్ విమానాశ్రయంలో $260000 తో అక్కడి అధికారులకు పట్టుబడటం, ఆయనను ఆనాటి ప్రధాని వాజ్ పేయీ గారు, సలహాదారు బ్రజేశ్ మిశ్రాగారు విడిపించారని వార్తలు ఉన్నాయి. ఇవి నిజమా కాదా అన్న విషయాన్ని తేల్చి చెప్పవలసిన బాధ్యత శ్రీ అటల్ బీహారీ వాజ్ పేయీ గారిపై ఉంటుంది. భీష్మాచార్య వృధ్ధాప్యంలో ఉన్నప్పుడైనా సత్యానికి ప్రాధన్యత ఇవ్వటం న్యాయం. ఈవిషయం పై వివరణ ఇవ్వవలసిన బాధ్యత శ్రీ దిగ్విజయ్ సింగ్ గారిపై ఉంటుంది. అద్దాల గదులలో ఉండే వాళ్లు ఇతరులపై రాళ్ళు వేయకూడదు కదా.

అంతర్జాతీయ మహిళకూ జై, అపనీ మహిళకూ నై.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీగారు అఖిల భారత స్థాయిలో చాయ్ పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి ఉపన్యాసాలు దంచేశారు.
మహిళల సమస్యల కన్నింటికీ వివక్షే మూలం --- ఒక పాట.

వైబీరావు గాడిద వ్యాఖ్య

శ్రీమతి జశోదా బెన్ గారి (నరేంద్రమోడి గారు ధృవీకరించని ఆయన సతీమణి) సమస్యకు మూలం ఏమిటి? ఆమె సమస్యను నరేంద్ర మోడీ గారు ఎందుకు పరిష్కరించలేక పోతున్నారు?
మోడీజీ: ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆఉద్దేశ్యం మనకు ఉండటమే ముఖ్యం.

వైబీరావు గాడిద వ్యాఖ్య

జశోదా బెన్ గారి సమస్యకు పరిష్కారం ఏమిటి? పరిష్కరించే ఉద్దేశ్యం మోడీగారికి ఉందా లేదా?
మోడీజీ: ప్రతి అంశంపై చట్టం ఉంది. అది చాలదు. మహిళలపై నేరం చేసేవారికి భయం కలిగేలాగా త్వరగా న్యాయం జరిగేటట్లు చూడాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్య

మోడీ గారికి భయం కలగాలంటే, జశోదా బెన్ కి త్వరగా న్యాయం జరగాలంటే ఏమి చేయాలి?
మోడీజీ: నాకొచ్చే బహుమతులన్నీ వేలం వేసి బాలికా విద్యకోసం వినియోగిస్తున్నాం.

వైబీరావు గాడిద వ్యాఖ్య

బాగానే ఉంది. జశోదా బెన్ గారి పదవ తరగతి పరీక్షకు, టీచర్ ట్రెయినింగుకు ఫీజు ఎందుకు కట్టలేదు?

శ్రీవిద్యాసాగర్ రావు గారి సమర్ధనలు

శ్రీనరేంద్రమోడీ గారి సంసార సమస్యను బిజెపి నేత శ్రీ విద్యాసాగర రావు గారు కేవలం వ్యక్తిగత విషయంగా కొట్టి పారేయటంలో న్యాయం లేదు. యధారాజా తధా ప్రజాః అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ప్రధానమంత్రి ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు.

నరేంద్ర మోడీ ఒక్కడేనా దోషి?

ఇది చాలా ముఖ్య విషయం. మన ప్రజా ప్రతినిధులలో కనీసం 75% మందికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి. సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్న రోజులలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల, మంత్రుల వివాహేతర సంబంధాలపై చర్చ జరుగగా ఆయన, విచారణకు ఒక సభా సంఘాన్ని నియమించారు. ఆవిచారణ సంఘం ఎటుపోయిందో?

స్త్రీలు ఫిర్యాదు చేయక పోతే ప్రజాప్రతినిధులు అక్రమ సంబంధాలకు తెగబడటం లేదనా?

స్త్రీలు ఫిర్యాదు చేయకపోటానికి రకరకాల కారణాలుంటాయి.
పెనిమిటికి కోపం వస్తే, వదిలేస్తే ఫరవాలేదు. ఉద్యోగం పీకించి జైల్లో వేస్తే?
శ్రీకృష్ణ పరమాత్ముడు ఎనిమిది మంది భార్యలను (పదహారు వేలా?) చక్కగా చూసుకున్నప్పుడు, మన నేతగారు ఇద్దరు, ముగ్గురిని సరిగా చూసుకోలేడా అనుకుని అదనపు భార్యలు మౌనంగా ఉండచ్చు.
తగిన సమయంలో బయట పడదాములే అనుకుంటూ ఉండవచ్చు.
పరువు పోతుందని వెనుకాడుతూ ఉండ వచ్చు. ధైర్యంగా బయటకు వస్తే పరువు పోవటం కాదు, పరువు పెరుగుతుంది. భారీగా డబ్బులు వస్తాయి, రక్షణ కల్పిస్తాము అని ఎవరైనా హామీ ఇస్తే బాధితులు కోర్టుల ముందర క్యూలు కట్టరా.

మనిషి మనిషికీ రక్షణ కల్పించాలా అని ప్రభుత్వం అంటుంది. కోర్టుల నిర్ణయాలు న్యాయ మూర్తుల సబ్జెక్టివ్ ఇన్స్టిన్క్ట్, ఒపీనియన్స్ పై ఆధార పడి ఉంటాయి. ఒకే కేసు విభిన్న న్యాయ మూర్తుల దగ్గరకు వెళ్ళినపుడు విభిన్న తీర్పులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

శక్తి సామర్ధ్యాలా? నైతిక స్థైర్యమా?

శక్తి సామర్ధ్యాలు ఉంటే చాలు, నీతీ నిజాయితీలతో పని ఏమి, అని బిజెపి నేత శ్రీ విద్యాసాగర్ రావు భావిస్తు ఉండవచ్చు. కానీ ఇది కనీస పరీక్షకు నిలబడదు. నీతి నిజాయితీలు ఉన్నవాడు, శక్తి సామర్ధ్యాలు తక్కువైతే ఇతరుల సహాయం తీసుకోవచ్చు. నీతి నిజాయితీలు లేనివాడికి, శక్తి సామర్ధ్యాలు తోడైతే వాడు రావణాసురుడి లాగా తయారు అవుతాడు. (రావణాసురుడు మారీచుడిని బంగారు జింక వేషంలో వెళ్ళి రాముడిని ఆశ్రమానికి దూరంగా తీసుకెళ్ళమని ఫరమాయిస్తాడు, విననంటే చంపుతానంటాడు. ఈదుర్మార్గుడి చేతిలో చావటం కన్నా ఆరాముడి చేతిలో చావటమే మేలని మారీచుడు బంగారు జింక వేషం వేసుకుని చచ్చాడు. మారీచుడు రావణుడి చేతిలో చస్తేనే నీతీ నిజాయితీలకు మేలు జరిగేది.


శ్రీ విద్యాసాగర్ రావు వంటి సీనియర్ రాజకీయ వేత్త నుండి మనం ఎక్కువ ఆత్మ విశ్వాసం, నైతిక దృష్టిని, తక్కువ భజన ప్రవృత్తిని ఆశిస్తాము.

ఆయన కరీం నగర్ నుండి లోక్ సభకు పోటీ చేసినపుడు సౌందర్య అనే నటిని బెంగుళూరునుండి హెలీ కాప్టరలో తెప్పిస్తున్నప్పుడు ఆ చాపర్ కూలి ఆ అభాగ్యురాలు ప్రాణం కోల్పోయింది. ప్రజలతో మమేకం అయ్యి పని చేసేవాడికి సినీ నటి ప్రచారం ఎందుకు? హెలీకాప్టర్ అద్దె ఎంతవుతుంది? సినీనటి ఒకరోజు షూటింగ్ మాని ప్రచారానికి రావటానికి ఎంత ఛార్జి చేస్తుంది? లోక్ సభ ప్రచారానికి ఎలక్షన్ కమీషన్ అనుమతించిన గరిష్ఠ పరిమితిలో చాలా భాగం దీనికే పోవాలే?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.