Saturday, March 8, 2014

172 Occupational_Constituencies

172 భౌగోళిక నియోజక వర్గాల స్థానంలో వృత్తి నియోజక వర్గాలు Occupational Constituencies in the place of geographical constituencies. చర్చనీయాంశాలు

భౌగోళిక నియోజక వర్గాల స్థానంలో వృత్తి నియోజక వర్గాలు

భౌగోళిక లోక్ సభ నియోజక వర్గాలు నేడున్నాయి. అభ్యర్ధులు వోటర్ల దగ్గరకి వెళ్ళినపుడు మాఊరికి నీవేమి చేశావు అని అడుగుతుంటారు. ఇది లోక్ సభ సభ్యుడు ఆనియోజక వర్గంలోని ఊళ్ళకు, ప్రాంతాలకు ప్రతినిథి అనేది తప్పుడు భావన. ప్రతి లోక్ సభ సభ్యుడు అవిభాజ్యమైన 128 కోట్లు / 543 = 8951048 పౌరులకి ప్రతినిథి. అతడి విధుల లక్ష్యం 128 కోట్ల సంక్షేమం చూడటమే తప్ప తనకు వోటేసిన నియోజక వర్గ సంక్షేమం చూడటం కాదు. మమతా బెనర్జీ, లాలూ యాదవ్, నితీష్ కుమార్ మొ|| రైల్వే మంత్రిత్వ శాఖను స్వాధీనం చేసుకొని రైలు ప్రాజెక్టుల నన్నిటినీ బీహార్, బెంగాల్ లకు తరలించటం ఈ లక్ష్యానికి విరుధ్ధమైనది. సోనియా గాంధి గారు రాయ బెరేలీ కి రైలు కోచీల ఫ్యాక్టరీని తరలించుకు వెళ్ళటం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని రాయ్ బెరేలీ లో పెట్టించటం, కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు 6000 కోట్లనీటి సరఫరా పథకాన్ని తరలించు కెళ్ళటం ఇవన్నీ ప్రాంతీయ ఈర్ష్యాసూయలకి దారి తీసేవే.

మీరు ప్రతిపాదిస్తున్న వృత్తి నియోజక వర్గాలు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం లోక్ సభలోకి రాజ్యసభ లోకి ప్రవేశిస్తున్న వారిని చూస్తుంటే, దేశానికి క్రికెటర్లు, సినీనటులు, రాజకుటుంబాల వాళ్ళు, పారిశ్రామిక వేత్తలు, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎం ఎల్ ఏ పెళ్లాలు (ఉంపుడుగత్తెలను తమ బదులుగా లోక్ సభకు, రాజ్యసభలకు ప్రతిపాదించే తెగువ ఎంత మందికి ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి వ్రాయలేక పోతున్నాను.), ఇలాగా.


అసలు ఉండాల్సిన వర్గాలు, వోట్లు వేసే వర్గాలు అయిన బక్క రైతులు, వ్యవసాయ కూలీలు, కుంభకారులు (కుండలు చేసే వారు), వస్త్రకారులు (చేనేత పనివారు), వస్త్రధవళకారులు (రజకులు), చర్మకారులు (పాదరక్షలు కుట్టేవారు), లోహశిల్పులు (కమ్మరి పనివారు, వెల్డర్లు), దారుశిల్పులు (వడ్రంగి పని వారు), ట్రైడ్రైవర్లు (రిక్షాలు, ఆటోలు నడిపేవారు), టెట్రా చోదకులు (చిన్నకార్ల డ్రైవర్లు), బహుచక్రరధచోదకులు (లారీలు, బస్సులు నడిపేవారు), మొ|| వేయి రకాల వృత్తులకు ప్రాతినిథ్యమే దొరకటం లేదు. వాళ్ళు జీవిత కాలం వోటు దాతలుగాను, వోటు విక్రేతలు గానూ మిగిలిపోతున్నారు తప్ప, వోటు గ్రహీతలుగాను, వోటు క్రేతలుగానూ రూపొందలేక పోతున్నారు.

వీరందరికి జనాభాలో ఉన్న సంఖ్యని బట్టి, దామాషాగా లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ సీట్లను కేటాయించాలి. వీరిని కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై చీల్చటానికి ప్రయత్నించకూడదు.

ఏపని చేయని వృధ్ధుల సంగతి ఏమిటి?

వృధ్ధులు పుట్టిన దగ్గరనుండి ఏపనీ చేయకుండా ఉండటం కుదరదు కదా. వారి జీవితకాలంలో ఎక్కువ సంవత్సరాలను ఏవృత్తిలో గడిపారో ఆవృత్తి సంఘంలో వారు సభ్యులుగా ఉంటారు. వృత్తి సంఘాలే నియోజక వర్గాలు.

నరేంద్ర మోడీ గారు వారి తండ్రి రైల్వే | గుజరాత్ ఆర్ టీ సీ క్యాంటీన్ నడిపినపుడు తండ్రి గారికి చాయ్ సర్వ్ చేయటంలో సహాయ పడ్డారంటారు. కానీ పెద్దయ్యాక ఏమి చేశారో సరియైన సమాచారం లేదు. శ్రీవారి అంకుల్ ఒకరికి ఆర్ టీ సీ క్యాంటిన్ నడుపటంలో సహాయం చేస్తూ తరువాత ఆ బస్ స్టాండ్ సమీపంలో చాయ్ బండి నడిపారంటారు కానీ ఎన్నాళ్ళు నడిపారో తెలియదు.
శ్రీవారికి ఖరీదైన బట్టలపై ఉన్న సరదాను, ఇస్త్రీ మడతలను గమనిస్తే, వారు ఒక నెల కన్నా చాయ్ బండి నడిపి ఉంటారనటానికి నా మనసొప్పటం లేదు. ఒక నెల అవగానే వారు ఆర్ ఎస్ ఎస్ సేవలోకి వెళ్ళి ఉంటారని నాకు అనుమానం కలుగుతుంది. ఇలా అనవసరమైన అనుమానం వ్యక్తం చేసినందుకు శ్రీ నరేంద్ర మోడీగారు ప్రధాని అయిన తరువాత నన్ను జైల్లో వేయించినా ఫరవా లేదు. ఇపుడు బయట ఉండి నేను చేస్తున్న ఘనకార్యాలు ఏమీ లేవు. జైలుకి వెళ్ళినందు వల్ల ఆగిపోయే ఘనకార్యాలు కూడ ఏమీ లేవు.

ఇపుడు నేను వ్రాస్తున్న వృత్తి నియోజక వర్గాల ప్రతిపాదనలో చాయ్ వాలాలకు, బండ్లపై ఇడ్లీలు చేసే వాళ్ళకి, కొన్ని సీట్లను (జనాభా ఆధారంగా) కేటాయించ వచ్చు.

రాహుల్ గాంధీ గారి వృత్తి అనుభవం

ముందుగా సరదాకి ఈలింకులో ఉన్న హాస్య జాబ్ ఇంటర్వ్యూ చదవండి.
http://www.fakingnews.firstpost.com/2014/01/when-rahul-gandhi-gave-an-interview-for-a-job-at-albela-private-limited/

ఇందులో రాహుల్ గాంధీ ఉద్యోగానికి అభ్యర్ధి. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు (ఉహా కల్పితం) కడుపుబ్బ నవ్విస్తాయి.

రాహుల్ జీ హార్వర్డ్ ను తండ్రి మరణం వల్ల మూడు నెలలోనే వదిలేశాక, రోలిన్స్ కాలేజీ, ఫ్లారిడాలో బి.ఎ. చదివారు. ఆతరువాత ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి లో ''అంతర్జాతీయ సంబంధాలలో '' ఆరు నెలల ఎం ఫిల్ చేశారు.

నౌకరీ

మానిటర్ (Monitor) అనే (ఉన్న ప్రదేశం: కేంబ్రిడ్జి, మెసాచుసెట్స్ రాష్ట్రం, యు.ఎస్.ఎ. ) లో కన్ సల్ టెంట్ గా పని చేశారుట. ఎంత కాలమో తెలియదు. రాహుల్ జీ చదివిన హార్వర్డ్ విశ్వ విద్యాలయం కూడ ఈ కేంబ్రిడ్జిలోనే ఉన్నది. (నోట్: అమెరికాలోని కేంబ్రిడ్జి వేరు. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ కేంబ్రిడ్జి వేరు. మనం కన్ ఫ్యూజ్ కాకుండా జాగ్రత్త పడాలి.)

మరి ఈ మానిటర్ సంస్థలో శ్రీ రాహుల్ జీ కి ఎవరు ఉద్యోగం ఇప్పించారో తెలియదు. లేదా, వారే ఆహ్వానించి ఉంటే, ఆహ్వానించి ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. ఈ వైబీరావు గాడిదను కన్ సల్ టెంటుగా ఉండమని ఎవరూ ఆహ్వానించరేమి? దీనిని మనం అర్ధం చేసుకోవాలంటే కన్సల్టెంటు ఫర్మ్స్ ఏం చేస్తాయో, కన్సల్టెంట్లు ఏమి చేస్తారో మనకి తెలియాలి.

వీకీపీడియా లో ఈ మానిటర్ సంస్థ గురించిన సమాచారం

ముందుగా వీకీపీడియాలో మీరు చదవటానికి లింకు: http://en.wikipedia.org/wiki/Monitor_Group

ఈ సంస్థ వారు తమ ఖాతాదారుల పేర్లని అతి రహస్యంగా ఉంచుతాయిట. వీకీపీడియా ప్రకారం, ఒకటి రెండు సార్లు మాత్రమే ఈ మానిటర్ గ్రూపు వారి ఖాతాదారుల పేర్లు బయటికి వచ్చాయి.

1. గడ్డాఫీ గారు లిబియా అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ చేసే సేవలు. దీని కొరకు హార్వర్డ్ కేంబ్రిడ్జి నిపుణులు లిబియాకు ఎగిరి వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూలు చేసి వీడియోలు తయారు చేశారుటి.

2. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారితో కలిసి ఏదో పరిశోథన.

ఈ సంస్థలో పనిచేసిన ప్రొఫెషనల్స్ నందరినీ కన్సల్టెంట్స్ అనే అంటారుట.

* Chris Argyris - Professor Emeritus at Harvard Business School, known for his work on "Learning Organizations"
* Stewart Brand - Futurist; co-founder of Global Business Network
* Richard Dearlove - Head of the British Secret Intelligence Service (1999 - 2004)
* Henry J. Eyring - (born 1963), American university administrator[43]
* Rahul Gandhi - Son of Rajiv Gandhi and Sonia Gandhi; General Secretary of the Indian National Congress.
* Jeremy Gutsche - Founder of TrendHunter.com
* Andrew Heyward - Senior Advisor to Marketspace LLC; former President of CBS News
* Matthew Le Merle - Managing Partner of Fifth Era, leading angel investor and Chairman of the Advisory Board of Shanshan Group
* Roger Martin - Dean, Rotman School of Management and Director, The Skoll Foundation, Research in Motion, and Thomson Reuters
* John Moore, Baron Moore of Lower Marsh - Former Member of Parliament and UK Cabinet Member and Chairman, Rolls Royce plc
* Michael Porter - Academic, Harvard Business School; leading authority on competitive strategy and international competitiveness
* Jeffrey Rayport - Founder and chairman of Monitor's digital strategy practice, Marketspace LLC; former Harvard Business School Professor and Author; Director, Monster Worldwide
* Taggart Romney - son of Mitt Romney, Governor of Massachusetts and 2012 US Republican presidential candidate[43]
* Peter Schwartz - Futurist; Co-founder and Chairman of Global Business Network
* Ian Smith - Former Chief Executive Officer, Reed Elsevier
దివాలా ఎత్తిన మానిటర్ సంస్థను డెలాయట్టె అనే సంస్థ టేక్ ఓవర్ చేసింది. ఇపుడు దాని పేరు మానిటర్ డెలాయిట్టె. ఈసంస్థను దీర్ఘకాలం నడిపిన దాని స్థాపకుడు మైకేల్ పోర్టర్ అనే హార్వర్డ్ మాజీ ప్రొఫెసర్ గారి దగ్గర రాహుల్ జీ మూడేళ్ళు పనిచేశారుట.

ప్రస్తుతం మనం మానిటర్.కాం అని టైప్ చేస్తే డెలాయిట్టె.కామ్ వారి సైట్ లోకి వెళ్తాం. ఈ వెబ్ సైట్ కి మనం వెళ్ళి ప్రయోజనం లేదు.

Backops Services Private Ltd బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

ఈ బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముంబాయిలో ఉందిట. 2002 నాటికి వీకీపీడియా ప్రకారం రాహుల్ జీ ఈసంస్థ డైరక్టర్లలో ఒకరుట. తరువాత రాజీనామా చేశారుట. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి గారు చేసినట్లుగా చెప్పబడుతున్న ఆరోపణ ప్రకారం ఈకంపెనీ సమావేశాలు శ్రీమతి ప్రియాంకా వధేరా గారి ప్రభుత్వ కేటాయింపు గృహం 35 లోఢీ ఎస్టేట్ , ఢిల్లీ లో జరిగేవిట.

http://corporatedir.com/company/backops-services-private-limited
పై వెబ్ సైట్ ప్రకారం బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కార్యాలయం 212 Deen Dayal Upadhyamarg, New Delhi - 110002, Delhi, India లో ఉన్నది.

Active Directors
____________________
Director Name
Manoj Muttu
Priyanka Gandhi Vadra
_____________________
Inactive Directors
Directors Name : Not Found
Company Status: Strike off


స్ట్రైక్ ఆఫ్ అంటే కంపెనీల రిజిష్టర్ నుండి కంపెనీ పేరును కొట్టేయటం. అంటే ఇప్పుడా కంపెనీ పనిచేయటం లేదు. సెక్షన్ 560 కంపెనీల చట్టం ప్రకారం రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గారు ఆపని చేయవచ్చు.

పైన వ్రాయబడిన శ్రీ మనోజ్ ముత్తు గారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. శ్రీరాహుల్ గాంధీకి సన్నిహితుడే. అమేథి, రాయ్ బరేలీ నియోజక వర్గాలలో శ్రీవారికి ఎన్నికల కాంపెయిన్లు చేసేవారట. వీరు శ్రీ రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీట.

ఈ కంపెనీ పెట్టుబడి రూ. 25 లక్షలు. రూ. 100 చొ|| 25000 వేలు షేర్లు. శ్రీరాహుల్ 2500 షేర్లతో శ్రీ రాహుల్ అతి పెద్ద షేర్ హోల్డర్. డైరక్టర్ శ్రీ మనోజ్ ముత్తు గారికి 250 షేర్లు ఉన్నాయి.

2002లో కాంగ్రెస్ అధికారంలో లేదు. ఈకంపెనీ రిజిష్టర్డ్ కార్యస్థానం ఢిల్లీ, వ్యాపార కార్యస్థానం ముంబాయి అయినప్పటికి పికప్ అయినట్లు లేదు.

బ్యాక్ టు వృత్తి నియోజక వర్గాలు

ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి రకరకాల వృత్తులుంటాయి. ప్రజలకోణంలోంచి చూసినపుడు ఇంటర్నేషనల్ సంబంధాలు ఒక విద్యా కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక వృత్తీ కాదు. ప్రజల వృత్తులు ఒక వేయి దాకా ఎంతో గౌరవార్హమైనవి అయిఉండి కూడ, గౌరవానికి నోచుకోనివి ఉన్నాయి. వాటికి మనం నియోజకవర్గ స్టేటస్ ఇచ్చి, ఆవృత్తుల ప్రతినిథులను మనం లోక్ సభకు, రాజ్యసభకు తీసుకువెళ్ళి, వారిని మంత్రులుగా, ప్రధాన మంత్రిగా చేయగలిగితే, మనం ఒక తరహా మార్క్సిజాన్ని స్థాపించ గలిగిన వాళ్ళం అవుతాం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.