Saturday, February 22, 2014

155 Aam Admi Party (AAP) Trajectory


155 Govt and Police Officials joining AAP will make no difference ప్రభుత్వ మరియు పోలీసు అధికారులు ఆప్ లో చేరితే వచ్చే తేడా పెద్దగా ఉండదు
చర్చనీయాంశాలు: భారత్, ఆమ్ ఆద్మీ, లక్ష్మీనారాయణ


సత్యం కంప్యూటర్స్ స్కాం, మరియు జగన్ కేసులను పరిశోథించిన సీబీఐ అధికారి శ్రీ వివి లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి రాష్ట్రంలో (బహుశా శేషాంధ్రలోనేమో, తెలంగాణ కాకూడదనేమీ లేదు) ఆ పార్టీకి సారథ్యం వహిస్తారని వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా కొన్ని వైబీరావు గాడిద వ్యాఖ్యలు


ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు ఉద్యోగాలు మానేసి రాజకీయాలలోకి దూకటం ఇది మొదటిసారీ కాదు, చివరిసారీ కాదు. కాగ్ లు, త్రివిధళాల అధికారులు, కూడ రాజకీయాలలో చేరి ఉన్నత పదవులను అలంకరించిన సంఘటనలు చాలా జరిగాయి.

ప్రభుత్వఉన్నతాధికారులు, ఘరానా పారిశ్రామికవేత్తలు, ఘరానా వ్యాపారులు, సినీనట నటీమణులు, క్రికెటర్లు మొ|| నానా జనం కూడ బూర్జువాల కిందే లెక్క. వీళ్లు సాధారణ కార్యకర్తలుగా చేరి మెట్లు మెట్లుగా ఎదిగి పార్టీలలో లోక్ సభ, రాజ్యసభ, మంత్రులు, గవర్నర్లు మొ|| ఉన్నత పదవులనలంకరించితే అభ్యంతరం పెట్టేవారుండరు. పెద్ద పెద్దవాళ్ళు వచ్చి పెద్ద్ పెద్ద పదవులను ఎగరేసుకు పోటం, తమకు ఆజ్ఞలు ఇవ్వటం, ఉద్బోధలు చేస్తుంటే అప్పటికే పార్టీలలో ఉన్న కార్యకర్తలకి, ద్వితీయశ్రేణి నేతలకు కడుపులో మండుతూ ఉంటుంది. కొన్ని సార్లు వెంటనే తమ బాధను బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అగ్ని పర్వతంలా కుములుతూ ఉంటారు. సమయం చూసుకొని బ్రద్దలు అవుతూ ఉంటారు.

బయటనుండి వచ్చే వారికి ఉన్నత పదవులను ఇచ్చే విషయంలో పార్టీలలో నియమావళులు ఉండాలి. ఇందులో నాలుగు రకాల విభాగాలను మనం చేసుకోవచ్చు.
౧. పార్టీ ఆహ్వానంపై వచ్చి, పార్టీల బలవంతం మీద పార్టీలలో చేరే వారు.
౨. తమంత తాముగా వచ్చి, పార్టీ అగ్రనేతలను బ్రతిమిలాడి , టాప్ స్థానాలను పొందే వారు.
౩. పార్టీ మరీ శైశవ దశలోనో, శిథిల దశలోనో వచ్చి పార్టీలలో చేరి పార్టీల పునరుథ్థానానికి తోడ్పడే వారు.
౪. పార్టీ విజయ పథంలో పయనిస్తున్నపుడు ఆలాభంలో షేర్ కొరకు వచ్చి చేరేవారు.

ఇంకా ఎన్నో విభాగాలను చేయవచ్చు. ఎన్ని విభాగాలను చేసుకున్నా, తమ నియమావళిలో స్పష్టంగా ప్రకటించి వెబ్ సైట్లలో పెట్టాలి. సాధారణంగా ప్రతిపార్టీ తమ అగ్రనేతలకు అపరిమితమైన అధికారాలను కట్టుబెడుతూ ఉంటుంది. వర్కింగ్ కమీటీలు, ఎగ్జిక్యూటివ్ కమీటీలు కూడ తమ వద్ద అపరిమితమైన అధికారాలను ఉంచుకుంటాయి. నియంతృత్వాలు ఉద్భవించటానికి అనుకూలమైన నిబంధనలన్నీ బైలాలలో పొందు పరుస్తూ ఉంటారు. దీని వల్ల పార్టీలలో అంతరంగ ప్రజాస్వామ్యం ఉండదు. ఉదాహరణకి, పార్టీ అగ్రనేత వర్కింగ్ కమిటీలో సభ్యులను భారీగా నామినేట్ చేయటం, వారు కూడ వోటు హక్కును కలిగి ఉండటం. పేరుకు వర్కింగ్ కమీటీలు, ఎగ్జిక్యూటివ్ కమీటీలే కానీ అవి అగ్రనేతలయొక్క బంట్లతో నిండిఉంటాయి.

ఆం ఆద్మీ పార్టీ కూడ దీనికి భిన్నంగా ఉన్నట్లు కనిపించటంలేదు. ఫలితంగా ఆం ఆద్మీ పార్టీలో కూడ నియంతృత్వ లక్షణాలు బయట పడుతున్నాయి.

ప్రభుత్వ, పోలీసు అధికారులు తమ పదవులలో , అప్పటికే అధికారాలను, అవినీతిని, డబ్బును జుర్రుకొని ఉంటారు కాబట్టి మరల వారికే అవకాశాలా అని ద్వితీయ శ్రేణి నేతలు వితర్కించుకుంటూ ఉంటారు.

If Mr. Lakshmi Narayana, an Additional DGP in Indian Police Service, really has an ambition to join politics, he will probably join Bharatiya Janata Party (BJP), and not AAP.

1. He loves Swami Vivekananda greatly. He wants to produce thousands of Swami Vivekanandas in 21st Century India. (దీనిలో వ్రాయాల్సింది చాలా ఉంది. త్వరలో.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.