Sunday, February 23, 2014

156 Chidambaram Economics

156 Need to recognise degradation of Indian Economic affairs సంస్కరణల వల్ల భారతీయ ఆర్ధిక వ్యవస్ తీవ్రంగా దిగజారిన విషయాన్ని గుర్తించ వలసిన అవసరం
చర్చనీయాంశాలు: భారత్, ఆర్ధికరంగం, Indian Economics, Finance Minister, RBI


సీమాంధ్ర ప్రజలను మాయాజూదంతో వనవాసానికి పంపటంలో ప్రముఖపాత్ర వహించిన కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీచిదంబరం గారు, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ గారిని వెంటేసుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో జరిగిన జీ20 దేశాల ఆర్ధిక మంత్రుల మరియు సెంట్రల్ బ్యాంకుల సమావేశానికి హాజరై వచ్చారు.

ఈసందర్భంగా కొన్ని శ్రీవారి సువార్తలను చూద్దాం.
The communique has been drawn by the deputies sitting together and our concerns have been fully reflected in the communique.

ఆ సందేశపత్రం డెప్యూటీలందరు కూర్చొని తయారు చేశారు. దానిలో మన కన్ సరన్స్ (మనల్ని అభద్రతకు గురి చేస్తున్న, బాధిస్తున్న అంశాలు) అన్నీ కూడ ప్రతిబింబించాయి.

కమ్యూనిక్ (ప్రకటన)తో మీరు తృప్తి పడ్డారా అంటే అవును అన్నారు.

”...when countries withdraw from quantitative easing they should keep in mind the spillovers on the developing countries,”
''...దేశాలు క్వాంటిటేటివ్ ఈజింగ్ నుండి ఉపసంహరించుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ ఉపసంహరణ యొక్క చిమ్ముళ్ళు, వొలుకుళ్ళు (spillovers ప్రభావం) అభివృధ్ధి చెందుతున్న దేశాలమీద పడతాయని గుర్తుంచుకోవాలి...''

''...Emerging economies followed the advice of the IMF when the major economies went through a period of downturn after the 2008 global financial crisis...''
''..2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం వచ్చి అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు పతనోన్ముఖం అయినపుడు అభివృధ్ధి చెందుతున్న దేశాల ఆర్ధిక వ్యవస్థలు అంతర్జాతీయ ద్రవ్యనిథి (ఐఎమ్ఎఫ్) సలహాలను పాటించాయి... ''

''...So when they (developed world) sought our cooperation during the economic downturn it is only fair that they cooperate with developing countries during the economic recovery...''
''..కనుక వాళ్ళు(అభివృధ్ధిచెందిన అమెరికా మొ||) మన సహకారం అడిగినపుడు మనం (అభివృధ్ధిచెందుతున్న దేశాలు) ఇచ్చాం. కాబట్టి వాళ్ళు మన ఆర్ధిక వ్యవస్థలు కోలుకోటానికి సహకరించాలి. .. ''

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


అభివృధ్ధి చెందిన దేశాలతో వ్యవహరించటం అంటే మాయాజూదంతో సీమాంధ్ర ప్రజలను కట్టుబట్టలతో అడవులపాలు చేసినంత తేలిక కాదు.

ఈసందర్భంగా జర్మనీ ఆర్ధిక మంత్రి శ్రీ Wolfgang Schaeuble వోల్ఫ్ గాంగ్ షావూబుల్ గారి వ్యాఖ్యల్లో కొంత చేదునిజాన్ని మనం గుర్తించాలి. ఆయన ఏమన్నాడంటే భారత్ ఆర్ధిక సమస్యలకు అభివృధ్ధి చెందిన దేశాలు మాత్రమే కారణం కాదు, అంతర్గత కారణాలు కూడ ఉన్నాయి.

క్వాంటిటేటివ్ ఈజింగ్ యొక్క చిమ్ముళ్ళు ఒలుకుళ్ళు అంటే ఏమిటి What is the meaning of the spill overs of quantitative easing?
ఈసందర్భంగా మనం కొన్ని వాస్తవాలను పరిశీలిద్దాం:-- ౧. భారత్ ఆర్ధిక సంస్కరణలకు ముందు చమురు, యంత్ర పరికరాల దిగుమతులకు విదేశీ అప్పులపై ఆధారపడి ఉండేది. 1991 చంద్రశేఖర్ గారు ప్రధాని అయిన కాలంలో విదేశ మారకం కరువై కొంత బంగారాన్ని లండన్ లో తాకట్టు పెట్టవలసి వచ్చింది. దీనికి సరియైన పరిష్కారం ఎగుమతులను పెంచుకోటం.

౨. తరువాత ఆర్ధిక మంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కష్టపడి ఎగుమతులను పెంచుకోటం ఇష్టం లేక సంస్కరణలు అంటూ ఊదరకొట్టి విదేశీ పెట్టుబడులకు గేట్లు ఎత్తేశారు. విదేశీ పెట్టుబడులకోసం అడుక్కుంటూ దేశాలు తిరగటం మొదలు పట్టారు.

౩. ఆదే సమయంలో అమెరికా, యూరప్ లలో ఆర్ధికవ్యవస్థలో ఆదేశాల కేంద్ర బ్యాంకులు తమ దేశ ఆర్ధిక సంస్థలకు లూజుగా డబ్బులు అప్పులిచ్చే అలవాటు ఉండేది. యూరో అమెరికన్ ఆర్ధిక సంస్థల వద్ధ తేరగా వచ్చిన ఫెడరల్ రిజర్వు డబ్బులు ఉండటంతో వారు చైనా, భారత్ మొ|| దేశాల్లోకి డాలర్లను యూరోలను కుమ్మరించారు. అంబానీ మొ|| భారతీయ ఘరానా పెట్టుబడిదారులు తమషేర్ల ధరలను విపరీతంగా పెంచేసి ప్రపంచ బిలియనీర్లలో చేరి పోయారు.

ఇప్పుడు అమెరికా, యూరప్ లలో క్లిష్ట పరిస్థితి వచ్చింది. అదేపనిగా వారి ఆర్ధిక సంస్థలకు అప్పులు, పెట్టుబడులు సమకూర్చటం కుదరదు, వాటిని ఉపసంహరించాలని గుర్తించారు. ఇందులో తప్పేముంది?

అమెరికా, యూరప్ సెంట్రల్ బ్యాంకులు నిధుల విడుదల తగ్గించటమో, తమ వడ్డీరేట్లను పెంచటమో చేసినపుడల్లా ముంబాయిలో షేర్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉంటాయి. రూపాయి మీద వత్తిడి పెరిగి రూపాయి బాహ్యవిలువ డౌన్ అవుతు ఉంటుంది.

చిదంబరం గారు అనే అభినవ గిరీశం గారు అడిగేదేమిటంటే, మీరు మీ ఆర్ధిక సంస్థలకు ఉద్దీపనాలు తగ్గించకండి. మీ ఆర్ధిక సంస్థల దగ్గరి డాలర్లను, యూరోలను మీరు లాక్కుంటే, వారు భారత్ లోని డాలర్లను, యూరోలను వెనక్కి తీసుకుంటారు. మా రూపాయి, మా షేర్ మార్కెట్లు దెబ్బతింటాయి. మా వృధ్ధి రేటు డౌన్ అవుతుంది.

హనుమంతుడి ముందరా కుప్పిగంతులు?

సీమాంధ్ర ఎంపీల, కేంద్రమంత్రుల, ఆంధ్రప్రదేశ్ శాసనసభ విజ్ఞప్తులను కేంద్రం ఎంత పట్టించుకుంది? భారత్ విజ్ఞప్తులను అమెరికా యూరప్ లు ఎందుకు పట్టించు కుంటాయి.

గుడిలో లింగాన్ని మాత్రమే మింగేవాడొకడుంటే, గుడినే మింగేశే వాళ్ళుంటారు, చిదంబరం గారూ.
(తిరగ వ్రాయ వలసినది, జోడించ వలసినది, ఇంకా ఉంది.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.