Saturday, February 22, 2014

152 Residual Andhra Pradesh Capital

152 Temporary arrangements for Residual Andhra Pradesh State Capital శేషాంధ్ర రాజధానికి తాత్కాలిక ఏర్పాట్లు
చర్చనీయాంశాలు: bifurcation, Capital of Andhra Pradesh, రాజధాని, తెలంగాణ, సీమాంధ్ర

''There is no purpose of staying back in Telangana State after division. It is in the best interests of Seemandhra people that the administration of the new State should be carried out from Andhra Pradesh and not Telangana. ... We cannot live here facing abuse and humiliation."
కొమ్మినేని.ఇన్ఫో అనే వెబ్ సైట్ వారు వ్రాసినది: కాంగ్రెస్ సీనియర్ నేత,శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే హైదరాబాద్ నుంచి వెళ్లిపోదామని అంటున్నారు. విభజన తీరుతో సీమాంధ్ర ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, ఈ సమయంలో పాలనా కార్యక్రమాల పేరిట హైదరాబాద్‌లోనే ఉండడం కరెక్టు కాదని ఆయన వాదిస్తున్నారు.హైదరాబాద్‌లోని భవనాలు, రోడ్లు చూసి ఇక్కడ ఉండేకన్నా గుడిసెల్లో ఉండైనా మన పాలన మనం చేసుకుందామని వివరించారు. ఇక్కడ ఉండడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు. వీర సమైక్యవాది అయిన పాలడుగు వెంకటరావు ఇప్పుడు మరీ ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నారు. పది ,పదిహేను రోజులలో మొత్తం ఖాళీ చేసి వెళ్లి పోవడం ఎలా సాధ్యమో వెంకట్రావు చెప్పాలి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


నేను గతంలో చేసిన పరిశోథనలను బట్టి, పెట్టుబడిదారి రాజకీయాలలో ఉండి కూడ అర్ధవంతంగా మాట్లాడే అతి కొద్దిమంది రాజకీయవేత్తలలో శ్రీ పాలడుగు వెంకట రావు ఒకరని తేలింది. పైనా వ్రాసిన కొమ్మినేని.ఇన్ఫో వారు వ్రాసిన వార్త ఈవిషయాన్నే ధృవీకరిస్తున్నది. నేను వ్రాద్దామనుకున్నదే శ్రీవెంకట రావు చెప్పటం వల్ల నాపని తేలికయింది. పది, పదిహేను రోజులలో కాకపోయిన వీలైనంత త్వరగా వచ్చేయటం మంచిది. ఈసందర్భంగా నేను కొన్ని సూచనలు చేయ దలుచుకున్నాను.

దీర్ఘకాలిక లక్ష్యాలు


మూడు రాష్ట్రాలు: ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ. ఈలక్ష్యంకొరకు సమష్టిగా కేంద్రం లో ఏపార్టీలు అధికారంలో ఉన్నా వారి మీద వత్తిడి తెచ్చుకోవచ్చు. విశాఖ, వి-గుం-తె, కర్నూల్ లను ప్రాంతీయ రాజధానులు గా అభివృధ్ధి చేసుకోటం. అంటే, ఏప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఫైళ్ళను, కాగితం దస్త్రాలను వీలైనంత వరకు ఆప్రాంతాలలోని స్టోర్ చేసుకోటం. అథికార వికేంద్రీకరణ చేసుకొని ప్రాంతీయ రాజధానులలోనే ఎక్కువ నిర్ణయాలను తీసుకోటం.

స్వల్పకాలిక తాత్కాలిక ఏర్పాట్లు


రాజధాని కొరకు మనకుమ్ములాటలను ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ తన్నుకొని చులకన అయ్యే కన్నా, మనం ఈక్రింది తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు.

శేషాంధ్ర రాజధాని


౧. ప్రతి రెండేళ్ళకు కర్నూలు, విశాఖ, వి-గుం-తె, కర్నూలు మధ్య రాజధానిని రొటేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కాశ్మీరులో ఎండకాలం రాజధాని శ్రీనగర్ లోను, చలికాలం రాజధాని జమ్ములోను పెట్టుకుంటు ప్రతి ఆరునెలలకు ఒకసారి దస్త్రాలను తరలించుకు పోతున్నారు. మంచుకొండలలోనే వారు ప్రతి ఆరు నెలలకొకసారి వారా పని చేయగలుగుతున్నపుడు మనం రెండేళ్ళకొకసారి తరలించుకు వెళ్ళలేమా. గవర్నర్ కు తాను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండే స్వేఛ్ఛనివ్వ వచ్చు. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వ బంట్రోతు కాబట్టి ఆయన రాజభవన్ ఎక్కడుండాలో కేంద్రప్రభుత్వం, ఆయన నిర్ణయించుకుంటారు. హైకోర్టు విషయంలో ఒక మెయిన్ హైకోర్టు, రెండు బెంచీలు సంపాదించుకో గలిగితే బాగుంటుంది. మెయిన్ హైకోర్టు ఎక్కడుండాలా అనే విషయాన్ని సుప్రీంకోర్టుకు వదలి వేయవచ్చు.

శేషాంధ్ర ముఖ్యమంత్రి పదవి


ఏపార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి పదవిని రెండేళ్ళ కొకసారి క్యాలెండర్ సంవత్సరం ప్రాతిపదికన రొటేట్ చేసుకోవచ్చు.
ఉదాహరణ:
2014, 2015 క్యాలండర్ సంవత్సరాలు అంటే 2014 జనవరి నుండి 2015 డిసెంబర్ వరకు: ఉత్తరాంధ్రకు చెందిన వారు ముఖ్యమంత్రి. టీడీపీ గెలిచినా కూడ ఉత్తరాంధ్రకు చెందిన వారినే ముఖ్యమంత్రి కానివ్వాలి. కాకపోతే టీడీపి ఉత్తరాంధ్ర నేత ముఖ్యమంత్రి అవుతాడు.

2016, 2017 క్యాలండర్ సంవత్సరాలు: అంటే 2016 జనవరి నుండి 2017 డిసెంబర్ వరకు: దక్షిణాంధ్రకు చెందిన వారు ముఖ్యమంత్రి. టీడీపీ గెలిస్తే టీడీపి దక్షిణాంధ్రవాడు మొ||

2018, 2019 క్యాలండర్ సంవత్సరాలు: 2018 జనవరి నుండి 2019 డిసెంబర్ వరకు: రాయలసీమ నేత ముఖ్యమంత్రి. ఏపార్టీ గెలిచినా ఏరియా రిజర్వేషన్ ను మరచి పోరాదు.

ఈ ఏరియా రిజర్వేషన్ లలోనే బీసీ, ఎస్ సీ, ఎస్ టీ లకు కూడ కొంత రిజర్వేషను చేసుకోవచ్చు.

మంత్రి పదవుల పంపిణీ


రాష్ట్రానికి గరిష్ఠంగా ౩0 మంది మంత్రులు ఉండవచ్చు అనుకుంటే ప్రతి ప్రాంతానికీ పది చొప్పున. ప్రతి ప్రాంతంలో బీసీ, ఎస్ సీ, ఏస్ టీ రిజర్వేషన్ లను మరువరాదు.

శాఖల కేటాయింపులుశాఖలను ప్రాధాన్యతలు బట్టి A,B,C లుగా వర్గీకరించుకోవాలి. ఉదా: మొత్తం ౩0 శాఖలలో 9 A కేటగిరి శాఖలు, 9 B కేటగిరి శాఖలు, 12 సీ కేటగిరి శాఖలు ఉన్నాయనుకుందాం.
రాయలసీమ: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను గులాబి అందాం.
ఉత్తరాంధ్ర: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను సంపంగి అందాం.
దక్షిణాంధ్ర: ౩A, 3B, 4C శాఖలు పొందుతుంది. ఈ శాఖల సెట్ ను మల్లె అందాం.

ఈగులాబీలను, సంపంగులను, మల్లెలను, మూడు ప్రాంతాల వారూ రొటేట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకవసరం అంటే ఒకే ప్రాంతంవారు గులాబీలను స్వంతం చేసుకొని మిగిలిన వారిని అన్యాయం చేయకుండా. గతంలో రైల్వే శాఖను బెంగాల్, బీహార్ వారు స్వంతం చేసుకొని రైల్ ప్రాజెక్టులను కొట్టేసిన సంగతి మరువరాదు,

ఇవన్నీ చెప్పటానికి తేలికే, కాని ఆచరణలో కష్టం


అనే వారికి జవాబు: మనం తన్నుకొని ఢిల్లీ వెళ్తే అక్కడ ఎవరు అధికారంలో ఉంటారనేదాన్నిబట్టి దిగ్విజయ్ సింగ్ చేతో, కమల్ నాథ్ చేతో, సుష్మా స్వరాజ్ చేతో, మోడీ గారి చేతో మెడ బెట్టి గెంటించు కోవలసి వస్తుంది. అది నయమా, లేక మన సమస్యలను మనమే పరిష్కరించుకొని, మన 25 మంది ఎంపీల బలంతో గర్వంగా ఢిల్లీ వీధుల్లో తిరగటం నయమా.

మరి బిల్డింగులు


విశాఖలో మొదటి రొటేషన్ రాజధానిని నడుపు కోటానికి ఆంధ్రాయూనివర్సిటీ వారి నుండి కొన్ని భవనాలను తీసుకోవచ్చు. మూతబడిన ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలను, మూసివేసిన సినిమా హాళ్ళను, కొన్ని కల్యాణ మంటపాలను, అద్దెకి తీసుకోవచ్చు. రెండేళ్ళంటే ఎవరైనా ఇస్తారు.

మొదటి రొటేషన్ విశాఖలో రాజధాని ఉన్న కాలంలో కర్నూలులో, వి-గుం-తె లలో కొన్ని భవనాలను నిర్మించుకోవచ్చు. నైట్ లాండింగ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మూసివేసిన సినిమా హాళ్ళను, ఇంజనీరింగు కాలేజీలను అద్దెకి తీసుకోవచ్చు. కర్నూలు తుంగభద్రా తీరంలో కొన్ని రేకుల షెడ్లు వేసుకోవచ్చు. కొన్ని భవనాలను అద్దెకి తీసుకోవచ్చు. వి-గుం-తె లో నాగార్జున యూనివర్సిటీ వారిని కొన్ని భవనాలను అడుక్కోవచ్చు. దాని ఎదురుగా నిర్మించబడుతున్న డూప్లెక్స్ ఇళ్ళను, సింగపూర్ ఎపార్టుమెంట్లను అద్దెకి తీసుకోవచ్చు. రెండేళ్ళేగా.

కోరిక ఉంటే మార్గం ఉంటుంది. సింహం నోటిలోకి ఆహారం అదంతట అదే వచ్చి పడదు. అది తిరిగి వెతుక్కోవాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.