Thursday, February 20, 2014

148 chanda kochhar

148 Who should learn from whom? Chanda Kochhar or Narendra Modi? ఎవరు ఎవరి వద్ద నేర్చుకోవాలి?
చర్చనీయాంశాలు: Chanda Kochhar, Financial Services, Icici Bank, Narendra Modi, నరేంద్రమోడీ, చందా కొచ్చర్, గాంధీజీ

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


ఈ బ్లాగర్ వైబీరావు గాడిదకు, Ms. చందా కోచ్చర్ గారి పైన గానీ, శ్రీ ఐసిఐసిఐ బ్యాంక్ వారి పైన గానీ రాగద్వేషాలు లేవు. సత్యాన్వేషణ దృష్టితో మాత్రమే ఇక్కడ వ్రాయబడుతున్నది. యదార్ధవాదీ లోకవిరోధీ అని గదా సామెత. ఇక్కడ వ్రాసిన వాటిలో అసత్యాలు ఉంటే సదరు చందా కొచ్చర్ గానీ, శ్రీ ఐసిఐసిఐ బ్యాంక్ వారు గానీ ఈక్రింద వ్యాఖ్యను సరిదిద్దవచ్చు. పాఠక విజ్ఞులు కూడ సరిదిద్ద వచ్చు. వ్యాఖ్యలకు స్వాగతం.

This blogger ybrao a donkey has no likes or dislikes towards Ms. Chanda Kochhar or the ICICI Bank. Writings here have only one aim, exploring truth. The Sanskrit proverb 'yadArtha vAdI lOka virOdhi' says that a person who speaks truth is an enemy of the world. Ms. Chanda Kochhar, ICICI Bank, knowledgeable readers can always correct me. Welcome to comments.

శ్రీచందా కొచ్చర్ అంటే పరిచయము లేని వారికొరకు. For those readers not knowing who Ms. Chanda Kochhar is, a little introductionవీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఎమ్.డీ. మరియు సీ.యీ.వో. She is the M.D. and C.E.O. of I.C.I.C.I Bank.

ఐసీఐసీఐ బ్యాంక్ దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంక్. ICICI Bank, is India's largest Private Sector Bank.
ICICI Bank's managing director, Kochhar took Rs 5.12 crore as her take home salary in FY13. She has topped the list of the bankers getting high pays. Second in the list comes Aditya Puri with Rs 5 crore annual salary followed by Shikha Sharma, chief executive officer, Axis Bank who draws Rs 3.45 crore salary. Uday Kotak, managing director Kotak Mahindra Bank has Rs 2.19 crore as salary and Rana Kapoor, managing director, YES Bank who draws Rs 2 crore salary.

తెలుగు సారం
ఐసిఐసిఐ బ్యాంక్ ఎమ్.డి. కొచ్చర్ గారు రూ. 5.12 కోట్లు, 2013 సంవత్సరానికి ఇంటికి తీసుకువెళ్ళు జీతముగా పుచ్చుకున్నారు. బ్యాంకర్లయొక్క జీతాల పట్టికలో ప్రధమ స్థానంలో నిలబడ్డారు. ఆదిత్యపూరి (హెచడీఎఫ్ సీ బ్యాంకు) గారిది రూ. 5 కోట్లతో రెండవ స్థానం. శిఖా శర్మ యాక్సిస్ బ్యాంకు వారు మూడవ స్థానము. ఉదయ్ కోటక్ శ్రీకోటక్ మహీంద్రా బ్యాంకు గారిది రూ. 2.19 కోట్లతో నాలుగవ స్థానం. రాణా కపూర్ యస్ బ్యాంకు వారు రూ. 2 కోట్లు పుచ్చుకుంటున్నారు.
పూర్తి వివరాలు కావలసిన వారు http://www.moneycontrol.com/news/cnbc-tv18-comments/pvt-banks-see-modest-pay-hikes-chanda-still-highest-paid_882152.html?utm_source=ref_article కి వెళ్ళటానికి క్లిక్ చేయండి.

సందర్భంఇది ఊహా చిత్రమేలేండి. అయితే రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా మోడీలూ అంబానీలు తలుచుకుంటే, బిల్డింగులకూ, సిటీలకూ, కొదువనా. వెయ్యెకరాలు జనం దగ్గర గుంజుకుంటే సరిపోతుంది. ఓ 7౦౦౦౦ వేల కోట్లు ఎవరు పారేస్తారో కానీ, మొత్తానికి ఈ ప్రాజెక్టు లో పారేస్తారు. 85 మిలియన్ చదరపు అడుగుల సిమెంటు నిర్మాణాలను చేస్తారుట. (మన విశ్రాంత రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు తరచు చెప్తు ఉంటారు కదా. థింకా బిగ్ అని. ఈ 85 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంకెను వింటే ఆయన కూడ ఆవులించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రేమికుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి కూడ ముచ్చెమటలు పోయాలి. సమీపంలో ఉన్న సబర్మతీ ఆశ్రమంలో పొరపాటుగా ఇంకా
గాంధీ గారి ఆత్మ సంచరిస్తూ ఉంటే ఆయన కేమి చేయాలో తెలియక తన రాట్నాన్ని అతివేగంగా గిర్రుమని తిప్పెయ్యాలి.

పాపం పసివాడు జవహర్ లాల్ నెహ్రూ గారు
భాక్రా నంగల్ వంటి ఎత్తైన డాములగురించి, బియాస్ సట్లెజ్ నదీజలాలను బంధించ వచ్చని కలలు కన్నారే తప్ప, 85 మిలియన్ ల అడుగుల స్థాయిలో థింక్ బిగ్ చేసి లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను నిర్బంధించ వచ్చని ఊహించలేదు. ). ప్రస్తుతానికి ౩౦ అంతస్తులున్న రెండు వాణిజ్యహర్మ్యాలు పూర్తి అయినాయిట.

ముంబాయి, గుర్ గావ్ (ఢిల్లీ), బెంగుళూరు లలో ఉన్న ఆర్ధిక సంస్థలవారందరూ అక్కడ దుకాణాలను నెత్తిమీదేసుకుని అహమ్మదాబాదు రావటానికిట. శుభం భూయాత్.


అయ్యో పాపం!!! గుజరాత్ లో అలాంగ్ అనే రేవు అరేబియా సముద్రతీరంలో పాత తుక్కు నౌకలను ముక్కలు ముక్కలుగా చేసే షిప్ బ్రేకింగు కంపెనీలు ఉన్నాయి. అక్కడ శ్రీకాకుళంనుండి వెళ్ళిన వలసకూలీలు కూడ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కు ఓడలను చితక్కొడుతున్నారు. మన గిఫ్ట్ సిటీలో చందాకొచ్చర్ గారి ఉద్ బోధతో, నరేంద్రమోడీగారి కలల సాఫల్యంగా ఫైనాన్సియల్ సర్వీసెస్ గగనానికంటాయనుకోండి, అలాంగ్ లో మనవాళ్ళంతా అక్కడ నౌకలను పగలగొట్టటం మానేసి గిఫ్ట్ సిటీలో సెక్యూరిటీ గార్డులుగా చేరి అద్దాల తలుపులు తీస్తూ, లిఫ్టులు ఆపరేట్ చేస్తూ, యజమానులు వస్తున్నప్పుడు సలాములు చేస్తూ లేనప్పుడు మీసాలు క్రాపులు దువ్వుకుంటూ కూర్చోవచ్చు. ఈకామెంటు యొక్క ఉద్దేశ్యం అలాంగ్ కార్మీకులను అవమానించటం కాదు. వారిప్పటికే అన్ని అవమానాను దిగమింగటం నేర్చుకొని యున్నారు. ఒకరంగంలోంచి ఇంకో రంగంలోకి శ్రామికుల వలసను ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను.

చందా కొచ్చర్ గారి ప్రసంగం
Ms. చందా కొచ్చర్ గారు 18.2.2014 నాడు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ GIFT సిటీ. ఇది అహమ్మదాబాదు గాంధీనగర్ లో ఉన్నది) వారు ఏర్పాటు చేసిన Financial Services-a key driver for economic growth ఆర్ధిక సేవలు - ఆర్ధికాభివృధ్ధికి ఒక కీలక చోదక్ (డ్రైవరు) అనే ఒక సభలో ప్రసంగించారు. ఈసభకు శ్రీ నరేంద్రమోడీ ఒక ప్రేక్షకుడిగా హాజరు అయ్యారు. ఆసాంతం శ్రధ్ధగా విన్నారుట. సంతోషం.

ఇపుడు కొచ్చర్ గారి ఉద్ బోధల నుండి కొన్ని మచ్చు తునకలు.


"The large macro thing that we need to do for India is to become a financial service hub. (For that) first bring back growth and vibrancy in the domestic economy, which would include stable levels of fiscal deficit and current account deficit; and bringing inflation under control," Kochhar said.
"When people come and invest in India they invest on a certain premise, and the fact that the very premise can change worries them a lot. This becomes an inhibiting factor for them (in) starting to invest in India,
"Finally, there is need to create an environment that goes beyond work space. This will help attract global talents and even retain the talents available in India. As we move in that direction, there is room to increase the scope of financial services in India.

...There are lots of India-related business which is nourished overseas. I mean India related business that is done off-shore. There are lot of funds that are invested in India and run by Indians but are being operated from outside, mainly because of the taxation laws ,,,

వైబీరావు గాడిద వ్యాఖ్యలు
పై ఉద్ బోధల తెలుగు సారం తరువాత ఇస్తాను.

చాయ్ పర్ చర్చా అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి అఖిలభారత స్థాయిలో భారీగా పెట్టుబడులు పెట్టి తన పార్టీ అభిమానుల చేత ప్రశ్నలు అడిగించుకొని సమాధానాలు ఇస్తున్న బిజేపి భవిష్యత్ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ మహనీయుడిని నేను ఈ ఇంటర్ నెట్ ముఖంగా చర్చకు ఆహ్వానిస్తున్నాను. ఆయన గాని, ఆయన అనుచరులు గానీ, ఇక్కడ ఏ కామెంట్ వ్రాసినా నేను తొలగించను అని హామీ ఇస్తున్నాను.

*Ms. చందా కొచ్చర్ తో సహా పైన ఉదహరించిన ఐదుగురు తీసుకుంటున్న జీతాలు భారత రాష్ట్రపతి తీసుకునే జీత భత్యాలకన్నా ఎక్కువ. వారి ఒక్కనెల జీతమే రాష్ట్రపతి ఏడాది జీతం కన్నా ఎక్కువ. ఒరిజినల్ (రబ్బర్ స్టాంపు కాని) రాష్ట్రపతి బరువు బాధ్యతలు, ఆపదవికి కావలసిన నైపుణ్యాలు, ప్రైవేటు బ్యాంక్ ఛైర్ పర్సన్ల నైపుణ్యాలు, బాధ్యతలకన్నా తక్కువ శ్రేణులకు చెందినవా?

ఒరిజినల్ (రబ్బర్ స్టాంపు కాని) ప్రధాని బరువు బాధ్యతలు ఆపదవికి కావలసిన నైపుణ్యాలు, ప్రైవేటు బ్యాంక్ ఛైర్ పర్సన్ల నైపుణ్యాలు, బాధ్యతలకన్నా తక్కువ శ్రేణులకు చెందినవా?

దేశంలో ఐదవ పెద్దరాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయం తీసుకోటానికి అరగంట కన్నా ఎక్కువ సమయం తీసుకోలేదు. వారు ఎక్కువ గొప్ప డెసిషన్ మేకర్లా? చందా కొచ్చర్ గారు ఎక్కువ గొప్ప డెసిషన్ మేకరా? మరి వీరి జీత భత్యాలు చందా కొచ్చర్ గారి కన్నా తక్కువగా ఉన్నాయేమిటి?

దేశంలో ఐదవ పెద్దరాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయం తీసుకోటానికి లోక్ సభ సభ్యులు 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకోలేదు. వారు ఎక్కువ గొప్ప డెసిషన్ మేకర్లా? చందా కొచ్చర్ గారు ఎక్కువ గొప్ప డెసిషన్ మేకరా? మరి వీరి జీత భత్యాలు చందా కొచ్చర్ గారి కన్నా తక్కువగా ఉన్నాయేమిటి?

ఈక్రింది వారంతా చందా కొచ్చర్ గారి కన్నా తక్కువ నైపుణ్యాలు కలవారా? తక్కువ బరువు బాధ్యతలు మోసేవారా?
౧. ఉపరాష్ట్రపతి
౨. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
౩. లోక్ సభ స్పీకర్.
౪. త్రివిధ దళాధిపతులు.
౫. ఇస్రో , డీఆర్ డీవో, భారత అణుశక్తి సంస్థ మొ|| అధిపతులు, శాస్త్రవేత్తలు
౬. రిజర్వు బ్యాంక్ గవర్నర్
౭. స్టేట్ బ్యాంక్ ఛెయిర్ పర్సన్ తో సహా షుమారు ౩౦ దాకా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల సీఎండీలు
౮. భారత ప్రభుత్వ కార్యదర్శులు
౯. సీబిఐ అధిపతి తో సహా డీజీపీలు మొ|| పోలీసు అధికారులు
౧౦. విదేశాల్లో భారత రాయబారులు, హైకమీషనర్లు. (ఇంకా జోడించ వలసినది, తిరగవ్రాయవలసినది ఉన్నది.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.