Thursday, February 13, 2014

135 Narendra Modi's Education

135 Narendra Modi, Rahul Gandhi education comparison. నరేంద్రమోడీ రాహుల్ గాంధీ విద్యార్హతల తులనాత్మక అధ్యయనం.

చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, భారతీయ విద్య, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, భారతీయ రాజకీయాలు

ముందుగా స్పష్టీకరణలు, వివరణలు


నాకు నరేంద్రమోడీ యందు గానీ, రాహుల్ గాంధీ యందు గానీ రాగద్వేషాలు లేవు. సత్యశోథన, సత్వసాధన దృష్టితో మాత్రమే ఈ పరిశీలన వ్రాస్తున్నాను. నిష్పాక్షికంగా రచన చేయటం అనేది ఒక కత్తిమీద సాము. మనకు తెలిసో, తెలియకో, మన రచనల్లోకి మనలో మనకి తెలియకుండానే అంతర్లీనంగా ఉన్న బయాస్ లు బయటకి తొంగి చూస్తూ ఉంటాయి.

కొంత వైబీరావు గాడిద స్వంతడబ్బా కూడ అనివార్యమయ్యింది. అప్పుడప్పుడు ఈస్వంత విషయాలను ఎందుకు వ్రాయవలసి వస్తుందంటే, నేను వ్రాసిన స్వామి వివేకానంద బ్లాగ్ లో పాఠకవర్యులు, ''స్వామీ వివేకానంద జీవితంలో చాల ఘనకార్యాలు చేశారు. నీవు నీ జీవితంలో ఏమి చేశావో వ్రాయి'' అని నన్ను నిలదీయటం జరిగింది. నిజానికి స్వంతవిషయాలను వ్రాయటం కొన్ని సార్లు ఆత్మస్తుతికి, మరికొన్నిసార్లు ఆత్మనిందకు దారితీస్తుంది. ఒకసామెత కూడ ఉంది, ''నిన్ను నీవు పొగుడుకోకు, జనం నమ్మరు. నిన్నునీవు తిట్టుకోకు, జనం నమ్ముతారు.'' అని.

నరేంద్రమోడీ విద్యార్హతలు


గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎం.ఏ. పాలిటిక్స్ (రాజకీయ శాస్త్రం). దూరవిద్య - డిస్టాన్స్ ఎడ్యుకేషన్ పధ్ధతిలో (కరస్పాండెన్స్ కోర్స్).
నరేంద్ర మోడీ తన బి.ఏ. ఏకాలేజీలో చదివారో వివరాలు దొరకటం లేదు. బహుశా అది కూడ దూరవిద్య డిస్టెన్స్ మోడ్ లోనే కావచ్చు. గుజరాత్ యూనివర్సిటీ వారిని, శ్రీ నరేంద్రమోడీ విద్యవివరాలను తమ వెబ్ సైట్ లో పెట్టమని ఈ-మెయిల్ ద్వారా కోరాను. ఇంతవరకు వారా పని చేయలేదు.

(క్రింద, రాహుల్ గాంధీ బి.ఏ. చదివిన రోలిన్స్ కాలేజీ ఫ్లారిడా వారిని చూడండి. వారి వెబ్ సైట్ లో దీనిని గొప్ప విషయంగా వ్రాసుకున్నారు. ట్రినిటీ కాలేజీ కేంబ్రిడ్జి వారు, రాజీవ్ గాంధీ, భారత ప్రధాని అని ఢంకా బజాయిస్తున్నారు. ఈ ట్రినిటీ కాలేజీ రాహుల్ జీ ప్రధాని అయింతరువాత (అవుతారో లేదో), ఆయన కూడ తమ ఆలమ్నీ (పూర్వవిద్యార్ధి) అని డప్పు కొట్టుకుంటుంది. గుజరాత్ యూనివర్సిటీ వారు ఎందుకు వెనుకబడి ఉన్నారో.

సాయం కళాశాలల విద్య, దూరవిద్య అంటే మన ఐ ఎ ఎస్, ఐ పీ ఎస్ అధికారులకి, ప్రైవేటు రంగ ఉద్యోగ దాతలకి ఒక విధమైన చులకన భావం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా దూరవిద్యలో చదివిన వారికి ప్రైవేటు వారు ఉద్యోగాలు ఇవ్వటానికి వెనుకాడటం గమనార్హం.

వైబీరావు గాడిద స్వంత డబ్బా


నరేంద్ర మోడీ దూర విద్య ఎం.ఏ పాలిటిక్స్ పై నాకేమీ చులకన భావం లేదు. దీనిలో కొంత సెల్ఫ్-పిటీ (తనపై తనకే జాలి) ఉంది. అదేంటంటే నాకు (ఈబ్లాగర్) గల నాలుగు డిగ్రీలు నాలుగు డిప్లోమాలలో మూడు సాయంకళాశాలలు, ఐదు దూరవిద్యద్వారా సాధించినవి. 19ఏళ్ళకే ఉద్యోగ ప్రవేశం చేయటంతో సాయం కళాశాలలను, దూరవిద్యను ఆశ్రయింపక తప్పలేదు. ఒకసారి నాకు చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని అయింది. నేను న్యాయశాస్త్ర ఎల్.ఎల్.బీ.ని సాయం కళాశాలలో పూర్తిచేసిన వెంటనే న్యాయశాస్త్రం లో సాయం కళాశాలలను ఎత్తి వేశారు. ఇప్పుడు లాయర్ అవ్వాలనుకునేవారికి భారత్ లో , డే కాలేజీ కంపల్సరీ అయ్యింది.

రాహుల్ గాంధీ విద్యార్హతలు
వీకీపీడియా ప్రకారం: Rahul Gandhi attended St. Columba's School, Delhi before entering The Doon School in Dehradun (Uttarakhand) from 1981-83. Meanwhile, his father had joined politics and became the Prime Minister on 31 October 1984 when Indira Gandhi was assassinated. Due to the security threats faced by Indira Gandhi's family from Sikh extremists, Rahul Gandhi and his sister, Priyanka were home-schooled thereafter. Rahul Gandhi joined St. Stephen's College, Delhi in 1989 for his undergraduate education but moved to Harvard University after he completed the first year examinations. In 1991, after Rajiv Gandhi was assassinated by LTTE during an election rally, he shifted to Rollins College due to security concerns and completed his B.A. in 1994. During this period, he assumed the pseudonym Raul Vinci and his identity was known only to the university officials and security agencies. He further went on to obtain an M.Phil from Trinity College, Cambridge in 1995.

తెలుగు సారం


శ్రీరాహుల్ గాంధీ సెయింట్ కొలంబియా స్కూల్ లో చదివారు. 1981-83లో డూన్ స్కూల్. ఈసమయంలో తండ్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి ప్రవేశించటం, తల్లి ఇందిరాగాంధీ హత్యకి గురికావటంతో, రాజీవ్ దేశ ప్రధాని కావటం జరిగింది. అప్పటినుండి భద్రతా కారణాలవల్ల రాహుల్ కి, సోదరి ప్రియాంకకి ఇంటి విద్య ఏర్పాటు చేశారు. 1989లో అండర్ గ్రాడ్యుయేట్ విద్య కొరకు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రవేశించారు. కానీ మొదటి సంవత్సరం పూర్తికాగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళిపోయారు. తండ్రి శ్రీరాజీవ్ హత్యానంతరం, 1991లో సెక్యూరిటి కారణాల వల్ల రోలిన్స్ కాలేజీ లో చేరారు. అక్కడ 1994లో బి.ఏ. పూర్తిచేశారు. ఈకాలంలో భద్రతా కారణాల వల్ల శ్రీరాహుల్ ''రావుల్ విన్సీ'' అనే కల్పిత నామాన్ని ధరించారు. ట్రినిటీ కాలేజీలో చేరి 1995లో ఎం. ఫిల్ పూర్తి చేశారు.

అగ్ర నేతల విద్య గురించి వైబీరావు గాడిద వ్యాఖ్యలు


నాయనమ్మ ఇందిరా గాంధీ విద్యార్హతల విషయంలోనే భారతీయులకు పలు సందేహాలు ఉండేవి. అయితే ''విజయం'' అన్ని అవలక్షణాలను తుడిచేస్తుంది. ప్రధానిగా శ్రీమతి ఇందిర స్థిర పడ్డాక, చుట్టూ కోటరీ (చుట్టూచేరిన భక్తబృందం) ఏర్పడ్డాక ఇటువంటి ప్రశ్నలు తగ్గాయి.

తరువాత తల్లి సోనియా గాంధీ విద్యార్హతల విషయంలోనూ భారతీయులకు పలు సందేహాలు ఉండేవి. అయితే ''విజయం'' అన్ని అవలక్షణాలను తుడిచేస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, డీ ఫ్యాక్టో భారత ప్రధానిగా (డీ జ్యూరీ ప్రధాని మన్మోహన్ సింగ్) శ్రీమతి సోనియా గాంధి స్థిర పడ్డాక, చుట్టూ కోటరీ (చుట్టూచేరిన భక్తబృందం) ఏర్పడ్డాక ఇటువంటి ప్రశ్నలు తగ్గాయి.

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి, పదవిలో తిష్ఠవేసుకునేదాకా అనుమానాలు తప్పవు. నరేంద్రమోడీకైనా అంతే.

గమనించ వలసినది


భద్రతా కారణాలు అనే మేఘాల వెనుక శ్రీరాహుల్ విద్యాభ్యాసం ఎలా నడిచిందో అనే విషయాన్ని భారతీయులకి తెలియకుండా దాచి పెట్టారు.

హార్వర్డ్ లో శ్రీరాహుల్ గాంధీ మూడు నెలల ముచ్చటభారతీయ ప్రైవేటు కాలేజీలు, విశ్వవిద్యాలయాల వలెనే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడ డొనేషన్లకు అతీతం కాదు. అక్కడ డోనర్లకోటా ఉంది.

అంతర్జాలంలో లభ్యం అవుతున్న సమాచారాన్ని బట్టి, శ్రీ రాహుల్ గాంధీ తన మెరిట్ ద్వారా కాక డోనర్లకోటా లో ఆయూనివర్సిటీలోకి ప్రవేశం సంపాదించారు. శ్రీరాహుల్ గాంధీ హార్వర్డ్ లోకి ప్రవేశించిన సంవత్సరమే, హిందుజా అనే సంస్థవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారికి 11మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారుట. రాహుల్ ఎడ్మిషన్ కి, హిందూజా విరాళానికి మధ్య క్విద్ ప్రో కో సంబంధం లేదని నిరూపించాలంటే, శ్రీరాహుల్ గాంధీ తాను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి తన డొనేషన్ ను ఏరూపంలో ఎంత చెల్లించారో చెప్పవలసి ఉంటుంది. లేదా హార్వర్డ్ లో తన ప్రవేశానికి తన మెరిట్ స్కోర్స్ మాత్రమే కారణమని నిరూపించాల్సి ఉంటుంది. లేదా దేశాధినేతల పిల్లలకు, మాజీదేశాధినేతల పిల్లలకు, ప్రభుత్వాధినేతల పిల్లలకు, మాజీ ప్రభుత్వాధినేతల పిల్లలకు ఏవైనా రిజర్వేషన్ లు ఉన్నాయా అనేది వివరించాల్సి ఉంటుంది.

అంతర్జాల సమాచారం ప్రకారం చేరిన 3 నెలలలోనే శ్రీవారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంనుండి పంపి వేయబడ్డారు. వీకీపీడియా ప్రకారం, తండ్రి రాజీవ్ హత్యకు గురి కావటం వల్ల శ్రీరాహుల్ స్వఛ్ఛందంగా హార్వర్డ్ నుండి బయటకి వచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అభ్యంతరం చెప్పే వరకు తన రెజ్యూమ్ లో రాహుల్ జీ హార్వర్డ్ లో ఇకనామిక్స్ లో మాస్టర్స్ చేసినట్లు చెప్పుకునేవారు.

శ్రీ రాహుల్ గాంధీ రోలిన్స్ కాలేజి Rollins College బి.ఎ.


ఇది అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో ఉన్నది. ఈ రోలిన్స్ కాలేజీ వారి వెబ్ సైట్ కి లింకు: http://www.rollins.edu/రోలిన్స్ కాలేజి వెబ్ సైట్ కి వెళ్ళటానికి క్లిక్.
ఈ రోలిన్స్ కాలేజి వారు మటుకు శ్రీరాహుల్ గాంధీగారు తమ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాలలో డిగ్రీ చేశారని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. స్క్రీన్ షాట్ చూడండి.

ఈకాలేజీ వారి వెబ్ సైట్ లో 'గివింగ్' అనే టాబ్ ను గమనించి ఉంటారు. శ్రీరాహుల్ జీ ఎన్ని వేల డాలర్లను వీరికి ఇచ్చారో, రాహుల్ జీ తరఫున వేరెవరన్నా ఇచ్చారో మనకి తెలియదు.

ఈకాలేజీ ఎంత సీరియస్ కాలేజీయో, ఎంత ఈజీ గోయింగ్ కాలేజీయో చెప్పటం కష్టం. ఫీల్డ్ స్టడీస్ పేరుతో ఛార్జీలు వసూలు చేసి విదేశాల్లో తిప్పటం మటుకు ఉంది. అసలు అమెరికన్ యూనివర్సిటీల్లో చాలా భాగం ఈతరహావి లాగానే కనిపిస్తున్నాయి.

యూనివర్సిటీలంటే భవనాలేననే వెర్రి భారత్ కి అమెరికానుండి వ్యాపించిందనచ్చు. ఏవి బహిరంగంగా డిగ్రీలు అమ్మే కాలేజీలు, ఏవి బహిరంగంగా ప్రకటించకుండా షో నడిపించి డిగ్రీలు అమ్మే కాలేజీలు గుర్తించటం కష్టం.

భారత దేశంలో బి.ఎ. అంటే ఒకవిధమైన చులకన భావం ఉంది.

రాహుల్ జీ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి ఎం.ఫిల్


ఈహిందూస్థాన్ టైమ్స్ వారి న్యూస్ చూడండి. http://www.hindustantimes.com/india-news/rahulgandhitakingthelead/rahul-was-awarded-cambridge-mphil-degree-in-1995/article1-1177339.aspx కి వెళ్ళటానికి క్లిక్. వార్త తేదీ Prasun Sonwalkar, Hindustan Times London, January 27, 2014

ఇందులోంచి కోట్:
In a letter to Gandhi in 2009, the former vice-chancellor, Prof Alison Richard, had regretted the controversy in India over his qualifications, and had clarified that he was a student at Trinity College from October 1994 to July 1995.
He was awarded the MPhil in Development Studies degree in 1995, she had stated in the letter.
తెలుగు సారం: అక్టోబర్ 1994 నుండి జులై 1995 వరకు, రాహుల్ గాంధీ అక్కడ విద్యార్ధిగా ఉన్నారు. 1995లో రాహుల్ జీ కి అభివృధ్ధి అధ్యయనంలో ఎం.ఫిల్ పట్టా ఇవ్వబడింది.

ట్రినిటి కాలేజీ విద్యపై వైబీరావు గాడిద వ్యాఖ్య


రాహుల్ గాంధీ ఎం.ఫిల్ ట్రినిటీ కాలేజినుండి పూర్తిచేయటం ప్రాథమికంగా నిజం లాగానే కనిపిస్తున్నది. ఈసందర్భంగా వచ్చిన ఆరోపణలలో ఒకటి, ట్రినిటీ కాలేజీకి చెల్లించవలసిన ఫీజు ఒకనంబరు ఖాతా నుండి వచ్చింది అనేది. ఈట్రినిటీ కాలేజీ వాళ్ళ ఎం.ఫిల్ ఫీజు స్ట్రక్చ్రర్ నెట్ లో ఎంత గాలించినా దొరకలేదు. విదేశీ విద్యార్ధులకు, ముఖ్యంగా వి.వి.ఐ.పీ. విద్యార్ధులకు ఎంత ఛార్జి చేస్తారో తెలియదు. మెరిట్ ఫీజు నిబంధనలు, డొనేషన్ ఫీజు నిబంధనలు విడివిడిగా ఉండి ఉండాలి. (ఆంధ్రప్రదేశ్ లో కౌన్సిలర్ కోటా, మేనేజిమెంటు కోటాలాగ).

ట్రినిటి ఎం.ఫిల్. మరియు భారతీయ యూనివర్సిటీల ఎం.ఫిల్. కు ఒక తేడాయూజీసీ గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్. చేయాలంటే స్నాతకోత్తర పీజీ డిగ్రీ ఉండాలి. ట్రినిటీలో బి.ఎ. డిగ్రీకే ఎం.ఫిల్. లో ప్రవేశం.

కేంబ్రిడ్జి, ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు మార్కెట్ ఎకనామిక్స్ ను వంటబట్టించుకున్నట్లే కనిపిస్తుంది. దివాలా ఎత్తిన బ్రిటీష్ ప్రభుత్వం నుండి గ్రాంట్లు తగ్గిపోతున్న కొద్దీ ఈరెండు ఘరానా విశ్వవిద్యాలయాలు ఫీజులు, డొనేషన్లపై దృష్టి సారించి, విదేశీ ధనిక విద్యార్ధుల సంఖ్యను భారీగా పెంచుకోటం కోసం, వారు అమెరికాకు వెళ్ళకుండా చూడటం కోసం, అర్హతలనే తగ్గించటానికి పూనుకున్నాయి. అందుకే బి.ఏ. చదివిన వారికి డైరక్టు ఎం.ఫిల్ లో ప్రవేశం. ఆరునెలలో మొక్కుబడి డిజర్టేషన్ ను తీసుకుని ఎం.ఫిల్. డిగ్రీని వండి వార్చటం గమనార్హం.

అభివృధ్ధి అధ్యయనం DEVELOPMENT STUDIES అనేది సాంకేతిక విద్య కాదు. ఈమాత్రం దానికి వేల పౌండ్లు చెల్లించి ట్రినిటీ కాలేజీ దాకా వెళ్ళాలా? ఢిల్లీ యూనివర్సిటీ లోనే ఈకోర్స్ ను పూర్తి చేయవచ్చు. లేదా ఝార్ ఖండ్ రాంచీ లేక ఒడిషా బరంపురం యూనివర్సిటీ లోనే ఈ ఎం.ఫిల్. ని పూర్తి చేసుకోటానికి తన డిజర్టేషన్ ను తయారు చేసుకొని ఉంటే, కలహాండీ జిల్లాలో ఆకలి చావులని అర్థం చేసుకోటానికి వీలయ్యేది. లేదా ఛత్తీస్ గఢ్ | ఝార్ ఖండ్ లలో మావోయిస్టు ఉద్యమాలను అధ్యయనం చేయటానికి వీలయ్యేది. ఎందుకీ విదేశీ గోల?

ఇపుడు అధ్యయనం జరగవలసినది ఏమిటంటే ట్రినిటీ కాలేజీ ఫీజును ఎవరు చెల్లించారు? ఎలా చెల్లించారు? ఏదైనా క్విద్ ప్రో కో ఏమైనా జరిగిందా. శ్రీ నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక ఈవిషయాన్ని కావాలనుకుంటే పరిశోధించు కోవచ్చు.

ట్రినిటీ కాలేజీ వారు శ్రీరాహుల్ గాంధీ గారిని ఏవిధంగా పరీక్షించారు? శ్రీరాహుల్ గాంధీ సమర్పించిన డిజర్టేషన్ అసలు ఆయన వ్రాసినదేనా? వేరెవరైనా వ్రాశారా? కట్ కాపీ పేస్ట్ వంటివి ఏమైనా జరిగాయా? దీ సరోగేట్ వుమన్ అని Im Kwon-taek ఇమ్ క్వాన్ టేక్ గారి 1987 సినిమా ఒకటి వచ్చింది. సరోగేట్ ఎగ్జామ్, సరోగేట్ డిజర్టేషన్ వంటివి ఏమన్నా జరిగాయా? ఇవన్నీ ఇతిహాసపు చీకటి కోణాలు. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ఈకథలు మనకిప్పుడు ఎంతవరకు పనికి వస్తాయి అనేది ప్రశ్నార్ధకం.

సెలబ్రిటీల పిల్లకాయలు ఫ్యాషన్ డిజైనింగు, జ్యూయలరీ డిజైనింగ్, జెమాలజీ, అంతర్జాతీయ సంబంధాలు, అభివృధ్ధి అధ్యయనం వంటి కోర్సులను కూడ సీరియస్ గా చేస్తారని అనుకోటం కష్టం. తీరికేది? ఓపికేది? కోరికేది? పబ్లిసిటీ కోసం తప్ప?

EXPERIENCE అనుభవం


శ్రీనరేంద్ర మోడీ: బాల్యంలో తండ్రి వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో నడిపిన టీస్టాల్ లో తండ్రికి సహాయం చేసేవారు. తరువాత ''కారవాన్'' అనే ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం రెండేళ్ళు ఎవరికి కనపడకుండా పోయారు. వెనక్కి వచ్చాక తన అంకుల్ అహమ్మదాబాద్ సిటీబస్ స్టాండ్ లో నడిపిన క్యాంటీన్లో సహాయం చేశారు. తరువాత గీతా మందిర్ సమీపంలో సైకిల్ పై తన టీకార్ట్ ను నడిపారు. ఈసమయంలో శ్రీమోడీ తన టీకార్ట్ ను మానేసి ఆర్ ఎస్ ఎస్ లో సహాయకుడిగా చేరారు.

రాహుల్ గాంధీ అనుభవం, వికీపీడియా ప్రకారం: After graduation, Rahul Gandhi worked at the Monitor Group, a management consulting firm, in London. In 2002 he was one of the directors of Mumbai-based technology outsourcing firm Backops Services Private Ltd. తెలుగుసారం: గ్రాడ్యుయేషన్ తరువాత , రాహుల్ గాంధీ లండన్ లోని మానిటర్ గ్రూప్, ఒక మేనేజిమెంట్ కన్సల్టింగ్ ఫరమ్ లో పనిచేశారు. 2002లో ఆయన ముంబాయిలో ప్రధానకార్యాలయం కలిగిని టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ ఫరమ్ బ్యాక్ అప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

అనుభవం గురించి వైబీరావు గాడిద వ్యాఖ్యలు


దీనిని గురించి సవివరంగా ఇంకో బ్లాగ్ లో వ్రాస్తాను.

వెరోనిక్ కార్టెల్లి, కొలంబియా జాతీయురాలు


అంతర్ జాలం లో లభిస్తున్న సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 2001లో శ్రీ రాహుల్ గాంధీని బోస్టన్ విమానాశ్రయంలో 9 గంటల పాటు అమెరికన్ అధికారులు నిర్బంధించారు. కారణం: తన దగ్గర ఉన్న 1,60,౦౦౦ డాలర్లకు ఆయన సరియైన వివరణ ఇచ్చుకోలేక పోయారు. ప్రక్కనే వెరోనిక్ కార్టెల్లీ అనే కొలంబియా భామ ఉన్నది. ఆమె ఒక కొలంబియా డ్రగ్ మాఫియా పుత్రికట. నాటి భారత ప్రధాని వాజ్ పేయీ గారు చొరవ తీసుకుని శ్రీ రాహుల్ ని విడిపించారుట. అమెరికన్ అధికారులు ఎఫ్.ఐ.ఆర్. వంటి దానినేదో రికార్డు చేసుకొని వదిలేశారుట. (ఇటీవల దేవయాని ఖొబ్రగాడే అనే భారతీయ కాన్సలేట్ అధికారిని అమెరికన్లు నిర్బంధించటం, ఒక రభస కావటాన్ని గుర్తుకు తెచ్చుకోండి).

ఈవార్త సత్యమా అసత్యమా అనే దాన్ని శ్రీరాహుల్ గాంధీ నిర్దిష్టంగా ప్రకటించాల్సిఉంటుంది.

మొత్తానికి శ్రీమోడీ, శ్రీరాహుల్ భారతీయులకి తమ వంశాంకురాలను ప్రసాదించలేదు.

ఈనాటి తెలుగు పాట


చిత్రం పెళ్ళిచేసిచూడు. రచన: పింగళి నాగేంద్రారావు. పాడింది:ఘంటసాల.

ఓ... భావి భారత భాగ్య విధాతలార, యువతీ యువకులార
స్వానుభవమున చాటు నా సందేశమిదే... వరెవహ్

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలంగడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా
తాదీనా తకదీనా ...తంగిటిత తకిటతకిటతోం...
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్..
తరంపం.. పరంపం
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్ పెళ్ళి ||

నవ భావముల నవ రాగముల ఆ..ఆ..నవ జీవనమే నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. పెళ్ళి||

ఈనాటి ఫొటో, ట్రినిటీ కాలేజీ వారి దయతో

ఈబ్లాగ్ పోస్టును తిరగవ్రాయవలసి ఉన్నది. ఇంకా అదనం వ్యాఖ్యలు వ్రాయవలసినది కూడ ఉన్నది. ముఖ్యంగా డిగ్రీలకు, ఉద్యోగాలకు, వృత్తులకు మధ్య సంబంధం అవసరమా? అనే విషయం గురించి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.