Tuesday, February 11, 2014

134 Mother-wife

134 Mother or wife? Mother & wife? Both? None? Country? తల్లా పెళ్ళామా? ఇద్దరూనా? ఎవరూ కాదా? దేశమా?
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, భారతీయ వివాహ వ్యవస్థ, రామాయణం, తిక్కన, గుంటూరు జిల్లా

ముందుగా స్పష్టీకరణలు, విజ్ఞప్తులు


ఒక ప్రపంచ, భారతీయ, తెలంగాణ, శేషాంధ్రప్రదేశ్ సమస్య ఏమిటంటే నాయకుల వ్యక్తిగత జీవితాలలో జరిగే విషయాలు ప్రజలకి అవసరమా, అనవసరమా? అనేది. ఇటీవల ఫ్రాన్స్ దేశంలో ఆదేశాధ్యక్షులు శ్రీ హోలెండే గారు తన మొదటి భార్యను, రెండవ భార్యను గాలికి వదిలేసి ఒకసినీనటి ఇంటి చుట్టూ రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటే మీడియా నిలేసింది. తదధ్యక్షుడు గారు ప్రైవేటు విషయాలపై రక్షణ కావాలని వాపోయారు. రెండవ భార్యగారు పత్రికా విలేఖరి, రచయిత్రి. ఆమె, ఈవ్యవహారంపై ఒక పుస్తకం వ్రాస్తానని అని, వ్రాయటానికి సిధ్ధం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మహాకవి శ్రీశ్రీ
అన్నారు


ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్‌ లోకి వస్తే ఏమైనా అంటాం…
గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ అనే వెబ్ సైట్ వారు వ్రాసిన వ్యాఖ్య సముచితంగా ఉంది. ఇది వారు నటుడు పవన్ కల్యాణ్ విషయంలో వ్రాశారు కానీ సెలబ్రిటీలకు, ముఖ్యంగా ప్రబోధాలు, ఉద్బోధనలు చేసే నేతలకు చక్కగా వర్తిస్తుంది.
గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ వారి, పైవ్యాఖ్యకు వెళ్ళటానికి లింక్:- http://greatandhrapaper.com/this-is-pawanism/కు వెళ్ళటానికి క్లిక్.

పైలింకును ఇవ్వటం, గ్రేట్ ఆంధ్రపేపర్.కామ్ వారి వ్యాఖ్యను కోట్ చేయటాన్ని, పవన్ కల్యాణ్, మరియు రజనీకాంత్ లపై నేను చేస్తున్న వ్యాఖ్యలుగా భావించరాదు. ప్రస్తుతం మన ప్రాధాన్యత భారత జాతి వర్తమాన, భవిష్యత్ లను గురించి ఆలోచించటం. పవన్ కల్యాణ్ గురించి చదువదలుచుకున్నవారు పై లింక్ కు వెళ్ళి తమ అభిప్రాయాలను అక్కడ స్వేఛ్చగా వ్రాయవచ్చు.
... దేశంలో సెలబ్రిటీలు, వారి వార్తల కోసం అర్రులు సాచే మీడియా, పైకి చిరాకు పడుతూనే, ఈ తరహా అటెన్షన్‌ కోసం ఆత్రుత పడే జనాలు పెరగని కాలంలో అన్నాడు శ్రీశ్రీ ఈ మాటలు. ఇప్పుడు ఈ మాటలు అక్షర సత్యాలై కూర్చున్నాయి. తమ తమ జీవితాల్లోకి తొంగి చూడవద్దని, అనే వీలు సెలబ్రిటీలకు లేదు. ఎందుకంటే వారికి ఆ స్టాటస్‌ వచ్చింది జనాల అభిమానం కారణంగా. జనాలు అభిమానించకుంటే సెలబ్రిటీలు వుండరు. వారికి ఈ తరహా ఆదాయమూ వుండదు. కొన్ని కావాలంటే కొన్ని వదులు కోవాలని, పబ్లిక్‌ ఇమేజ్‌ కావాలనుకుంటే ప్రయివసీ కాస్త వదులుకోక తప్పదు.

అయితే ఇక్కడ ఓ మధ్యే మార్గం కూడా వుంది. కాస్త జాగ్రత్తగా, వీలయినంత వివాదరహితంగా వుండడం. రజనీకాంత్‌ను మించిన సెలబ్రిటీ దక్షిణాది సినిమా రంగంలో మరెవరు వున్నారు. కానీ ఆయన ఈ స్టేటస్‌ వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. పైగా ఆయన హిమాలయాల పర్యటన తదితర వ్యవహారాలు బయటకు వచ్చినపుడల్లా, ఆయనపై అభిమానులకు గౌరవం రెట్టింపయ్యింది తప్ప తగ్గలేదు. సెలబ్రిటీ స్టాటస్‌ అనుభవించేవారు, తమ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వీలయినంత ఆదర్శప్రాయంగా వుంచుకోవడం అవసరం. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్‌ ఒకసారి వచ్చిన తరువాత నిలిచి వుండాలంటే ఇది చాలా అవసరం.


సెలబ్రిటీల విషయంలో, పబ్లిక్, ప్రైవేటు మధ్య విభజన రేఖ చెరిగి పోతున్నదా? ఇది న్యాయమా? ఈవిషయంపై ఇంకా ఎంతో బహిరంగ చర్చ జరగాలి.సెలబ్రిటీలు కొంత మేరకు పబ్లిసిటీ దురద తగ్గించుకొని తాము ఆచరించని విషయాలను, ఇతరులను ఆచరించమని ప్రబోధించటం మానేస్తే, సాధారణంగా వ్యక్తిగతవిషయాలను స్పృశించ వలసిన అవసరం మీడియాకి రాకూడదు. సెలబ్రిటీలు ఈ నియమాన్ని పాటించగలిగితే మాబోటి చిన్నకారు రచయితలకు భారాన్ని తగ్గించిన వారు అవుతారు.


పై బొమ్మలు మనకేమి చెప్తాయంటే నేతలు పబ్లిసిటీ లేనిదే బ్రతుకలేరని.

ఇపుడు శ్రీ నరేంద్రమోడీ గారి మాతృప్రేమ పబ్లిసిటీ కాంక్షను ఈక్రింది చిత్రంలో చూడండి.

ఇపుడు బుధ్ధిహీన వైబీరావు గాడిద వ్యాఖ్య


మన కాబోయే ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ గారు తమ 2012 ఎన్నికల నామినేషన్ లో భార్య పేరు, ఆస్తి అప్పుల విషయాలు నింపకుండా ఖాళీగా వదలి వేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. జశోదా బెన్ అనే గుజరాత్ రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ గారు మై మోడీజీ కీ ధర్మపత్నీహూ అని ఘోషిస్తున్నది. మోడీజీ అవుననరు, కాదనరు.

మోడీ గారికి ఆమెపై ఎందుకింత నిర్దయ? దేశభక్తి ఎక్కువయి కావచ్చు. ఇంటగెలిచి రచ్చ గెలువమన్నారు.

జననీ జన్మభూమిశ్చ స్వర్గాద్ అపి గరీయసి. ఈశ్లోకం ఏమి చెప్తుందంటే, తల్లి, జన్మభూమి స్వర్గంకన్నా గొప్పవి. శ్రీమోడీ వారు జనని సేవ, జన్మభూమి సేవ బాగానే చేస్తున్నారు. ఆమాతృదేవత మోడీజీకి సలహా ఇచ్చి ఉంటుంది. నీభార్యని అన్యాయం చేయకురా అని. ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకే కాక, ఆసంబంధాన్ని ఖాయంచేసుకున్న మోడీ సోదరులకు కూడ ఉంటుంది. మరి వారెందుకు మిన్నకున్నారో?

120కోట్ల జనాభా గల ఈభారతదేశంలో దేశసేవని పంచుకోటానికి బోల్డుమంది సిధ్ధంగా ఉంటారు. ఒక్కడే పెళ్ళాం బిడ్డలను వదలి, మిగిలిన వాళ్ళకు ఆఅవకాశం లేకుండా చేస్తే, మిగిలిన వాళ్ళు దేశసేవ చేసే భాగ్యం దొరక్క గగ్గోలు పెట్తారు.

మొదటినుండీ బ్రహ్మచర్యాన్ని చేపట్టి ఏకోన్ముఖ మార్గంలో పయనించటం వేరే విషయం. ఇక్కడ అలా జరగలేదు. మూడేళ్ళలో మూడు నెలలో ఎంతో సంసారం చదరంగం అనుబంధం ఒక రణరంగం కొంత జరిగి పోయింది. మొదటి జంటకూ మూడు రాత్రులూ ఒక పోరాటం ఎంతో కొంత జరిగి పోయి ఉంటుంది. శ్రీ విశ్వనాధన్ ఆనంద్, వంటి వారు 40 బోర్డుల మీద చదరంగం ఆడేటపుడు కూడ కొన్నిటిని డ్రాచేసుకున్నా. శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా ఆడటం మానరు. మధ్యలో స్టెప్పులు వేయటం వదిలేయరు. బోర్డుని అవతలివాళ్ళ ముఖాన కొట్టి పారిపోరు. కబీర్ గారు మగ్గం నేస్తూనే సత్యాన్వేషణ చేశారు. భక్త తుకారాంగారు కూడ పంటచేను మంచె మీద కూర్చొని కూడ తన తాన్పూరాను సవరించుకొని అభంగాలను పాడటం వదలలేదు.

మరి పెళ్ళినాటి ప్రమాణాల మాట, మంత్రాల మాట ఏమిటి? అవి భారతీయ సంస్కృతిలో భాగం కావా?
Kanyam Kanaka Sampannam kanakabharanairyutham,
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్ యుతాం, Dashtami Vishnave Thubhyam Brahmaloka Jigeeshiya.
దష్టామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషయా. Vishwambhara Sarvabhuta, Sakshinya Sarvadevata,
విశ్వంభర సర్వభూత, సాక్షిణ్య సర్వదేవతా, Kanyamimam vradasyami, Pithrunam Dharanayavai.
కన్యాం ఇమాం వ్రదస్యామి, పిత్రూణం ధారణాయవై. Kanyam Sarvalankritham Sadhvim Suseelaya Sudheemathe
కన్యాం సర్వాలంకృతాం సాధ్వీం సుశీలయా సుధీమతే Vrayatho ham prayachchami Dharmakamardha Siddhaye.
వ్రయతోహం ప్రయఛ్ఛామి ధర్మకామార్ధ సిధ్ధయే. Dharmardha Kameshu Tvayesha, Nathi Charatavya, ---- Nathi Charami
ధర్మార్ధ కామేషు త్వయేష, నాతి చరతవ్య -- నాతి చరామి.

దష్టామి విష్ణవే తుభ్యం అనటంలో వరుడిని, వధువు తండ్రి విష్ణువులాగా చూసుకుంటు కాళ్ళు కడిగి కన్యని ఇస్తాడు.

ఆఖరు లైను చూడండి. ధర్మార్ధ కామేషు లో ధర్మం, అర్ధం, కామం, మూడు పురుషార్ధాలలోనూ నీతోనే సంచరిస్తాను అనే ప్రమాణాలు ఉంటాయి.

మన విష్ణువు గారు ఏమి చేశారు


తనతో నాతి చరామి కొరకు వచ్చిన జశోదా బెన్ గారిని బాగా చదువుకోమని చెప్పి పుట్టింటిలో వదలి వేశారు. తరువాత అత్తింటి ముఖం చూడలేదు, అని అభిప్రాయం కలుగుతుంది. జశోదా బెన్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి.
...My in-laws treated me well, but would never speak about the marriage. My father paid the fees for my studies and I also got some financial assistance from my brothers to continue my education. I had lost my mother when I was two years old and I lost my father two years after I started studying again and was in class 10. ...
తెలుగు సారం
మా అత్తవారు నన్ను బాగానే చూశారు, కానీ పెళ్ళి విషయం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మా చదువుకు ఫీజు నాతండ్రిగారు చెల్లించారు. నా విద్యను కొనసాగించటానికి నా సోదరులు నాకు ఆర్ధిక సహాయం చేశారు. నేను రెండేళ్ళ వయసులో ఉండగా నాతల్లి గతించింది. నేను చదువుకోటం మొదలు పెట్టాక రెండేళ్ళకు మానాన్న గారు కన్ను మూశారు. అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను.
... When he told me he would be moving around the country as he wished, I told him I would like to join him. However, on many occasions when I went to my in-laws' place, he would not be present and he stopped coming there. ...
...ఆయన నాకు నేను దేశమంతా తిరుగుతానని చెప్పినపుడు, నేను కూడ మీతో కలుస్తానని చెప్పాను. అయితే, నేను మా అత్తగారింటికి వెళ్ళిన సందర్భాలలో, ఆయన ఉండేవాడు కాదు మరియు ఆయన అక్కడికి రావటం మానేశాడు. ...

వైబీరావు గాడిద వ్యాఖ్య


దేశమంతా తిరగటం బాగానే ఉంది. ప్రతిచోటకీ వెంట తీసుకు వెళ్ళక పోటము కూడ బాగానే ఉంది. అప్పుడప్పుడు జశోదా బెన్ గారిని రమ్మని పిలువనంప వచ్చును. ఆమె అత్తింటికి వచ్చినపుడు, ఆమె వచ్చిన విషయాన్ని తనకు ఫోన్ చేయమని తల్లికో సోదరులకో చెప్పి తాను ఆ ఒక్కరోజుకు ఆమెతో ప్రేమతో సంభాషించ వచ్చును. ముఖం తప్పించినట్లుగా కనిపిస్తుంది.

దేశసేవ చేస్తూ కూడ సంసారాలు చేసే వారు మనకి పలువురు ఉన్నారు. సీపీఎమ్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్ లు ఉన్నారు. ధర్మేంద్ర హేమమాలిని దంపతులు బిజేపీ ఎంపీలు. నక్సల్స్|మావోయిస్టులలో దంపతులు ఇరువురు ఉద్యమాల్లో పాల్గొనటం సర్వసాధారణం. దేశసేవ చేసే వారు భార్యకి దూరంగా ఉండాలని హిందూ సంస్థల్లో ఎక్కడైనా నిబంధనలు ఉన్నాయేమో తెలియదు.

జశోదా బెన్ గారు ఏదైనా తప్పుచేస్తే ఆవిషయాన్ని ఆమెకే సూటిగా చెప్పవచ్చుకదా. బాగా చదువుకో అని చెప్పి పుట్టింటిలో వదిలివేసి కనీసం ముఖంచూడకుండా, ఫీజు కట్టకుండా ఉండటం న్యాయమా.

ఏమి చేస్తున్నారో చెప్పకుండా అడవుల్లో దించేయటం, శ్రీరామచంద్రమూర్తి పధ్ధతి. సీత ఎప్పుడో ఒకసారి శ్రీరామచంద్రమూర్తితో నాకు ఒకసారి వనవిహారం చేయాలని ముచ్చట పడింది. ఆముచ్చట తీర్చే వంకతో, శ్రీరామచంద్రమూర్తి గారి ఆజ్ఞతో, కనీసం చెలికత్తెలను కూడ తోడు ఇవ్వకుండా, జనకుడికి మాట మాత్రం చెప్పకుండా లక్ష్మణుడికి ఒక నియంతృత్వ ఆజ్ఞను పారేసి అడవిలో దించి పారేశారు.
నరేంద్రమోడీ, ఆయన సోదరులు, జశోదాబెన్ కు ఇంకా చదువుకోమని చెప్పారు. రామ లక్ష్మణులు సీతకు ఎందుకో చెప్పలేదు. వాల్మీకి ఆశ్రమంలో సీతకు ఆమె పిల్లలు లవకుశులు ఆశా దీపంలా నిలిచారు. మన జశోదాబెన్ గారికి ఆభాగ్యం దక్కలేదు.

ఈనాటి తెలుగు పద్యం


తిక్కన నిర్వచనోత్తర రామాయణం. 9వ ఆశ్వాసం. రెండవ, మూడవ పద్యాలు.

కందం.
జన నాధుఁ డుడుగరలు భూ,
తనయ మనంబలర గట్టి తగన్ ఒప్పించెన్
మునివరుల పత్నులకు ని,
మ్మని మణి మయ భూషణాంబరాదులు ప్రీతిన్.

తేటగీతి.
ఇవ్విధంబునఁ తన తలపించుకంత
యైన జానకి ఎరుగని యట్లు గాగ
పాలతోడ విషంబిడు పగిది ననిచి
పుచ్చి రాఘవుఁడుల్లంబు నొచ్చి మరలె.

సారం, వ్యాఖ్య: నిన్ను అడవిలో ఒంటరిగా వదలివేయ బోతున్నాము అని రాముడు సీతకు చెప్పలేదు. ఉడుగర అంటే బహుమతి అని ముఖ్యార్ధం. వధువుకి ఇచ్చే బహుమతి అని అదనపు అర్ధం. మన శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మకి ఉడుగరలు బాగా కట్టించాడు అంటే పట్టుబట్టలు దండిగా కట్టించు, బహుమతులు బాగా ఇచ్చాడనాలి. వాల్మీకి ఆశ్రమంలోని ముని పత్నులకి ఇవ్వమని మణులు, ఆభరణాలు, బట్టలు ఇచ్చాడు.

ఇక్కడ తిక్కన మంచి ఉపమానాన్ని వాడాడు. పాలతోడ విషంబిడు విధంబున అన్నాడు. స్పష్టమే కదా, కుట్ర.

ఈనాటి శ్లోకం


వాల్మీకి రామాయణం. ఉత్తరాకాండ. 46వ సర్గ (ఆధ్యాయం). 10, 11శ్లోకాలు.
वासांसि च महार्हाणि रत्नानि विविधानि च ।
गृहीत्वा तानि वैदेही गमनायोपचक्रमे ॥ 7.46.10 ॥
వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ
గృహీత్వా తాని వైదేహీ గమనాయోపచక్రమే.

इमानि मुनिपत्नीनां दास्याम्याभरणान्हम् ।
ఇమాని మునిపత్నీనాం దాస్యాంయాభరణాన్హమ్
वस्त्राणि च महार्हाणि धनानि विविधानि च ॥ 7.46.11 ॥
వస్త్రాణి చ మహార్హాణి ధనాని వివిధాని చ.

పాపం సీత అనుకుంటున్నదీ, తాను ముని ఆశ్రమాలను తాత్కాలిక సందర్శనకు వెళ్తున్నాననుకున్నది. అయోధ్యనుండి తాను శాశ్వతంగా పంపి వేయబడుతున్నానని తెలుసుకోలేక పోతున్నది. అసలు విషయం అపుడు ఆమెకు చెప్తేకదా ఆమెకు తెలియటానికి. లక్ష్మణుడికి చివరికి చెప్పక తప్పలేదనుకోండి.


లవకుశ సినిమాలో ఈ బట్టలు, నగలు తీసుకు వెళ్తున్న విషయాన్ని చూపించకుండా, అంజలీదేవిని కట్టుబట్టలతో అడవిలో విడిచినట్లుగా చూపించారు. సినిమా అప్పటికే 22రీళ్ళకు చేరింది. ఇవన్ని చూపటం కూడ కష్టం.

లవకుశ సినిమాలో ఎన్ టీ ఆర్ శ్రీరాముడు. తల్లి కౌసల్యగా కన్నాంబ నటించింది. సీతను వదలిన శ్రీరాముడిని ఆమె మందలించిన తీరు నభూతో న భవిష్యతి.

ఈనాటి పాట, లవకుశలోదే


స్వర్గీయ సదాశివ బ్రహ్మం వ్రాశారు. తెరపై జీవించింది రేలంగి, గిరిజ. మిగిలిన నటులు కూడ అజరామర కీర్తికాయులు. పేర్లు తెలియక వ్రాయలేక పోతున్నాను.

భర్త: ఒల్లనోరి మామా నీ పిల్లనీ
అబ్బా నీ పిల్లా దీని మాటలెల్ల కల్ల
సంసారమంత గుల్ల "ఒల్ల"

భార్య: ఒల్లనంట వెందుకు మామయ్య
నా వల్ల నేరమేమిర అయ్యయ్యో
దెయ్యాన్ని కొడుదునా దేవతనీ కొడుదునా
నూతులో పడుదునా గోతుల్లో పడుదునా

మొగుడు: చెయ్! చెమటకారి నాయాలా వూరుకో
సూరిగాడి ఇంటికాడ సూడలేదటే నిన్ను
మారుమాట లాడుతావా మాయదారి గుంట
నిను సూస్తె వళ్ళు మంట "నేనొల్ల"

మామగారు: అయిందాని కల్లరెందు కల్లుడా
ఓరల్లుడా మేనల్లుడ మా అప్పగొరి పిల్లడా
మీ అప్ప మొగం చూడరా మా యమ్మిని కాపాడరా "నేనొల్ల"

అత్తగారు: తప్పేమి చేసింది తమ్ముడా ఇప్పుడు
ముప్పేమి వచ్చింది తమ్ముడా
తప్ప తాగి వున్నావు చెప్పుడు మాటిన్నావు
అప్పడగ బోయింది అదీ ఒక తప్పా

మొగుడు: అప్పా ఓ లప్పా నీ మాటలు నేనొప్పా
యిక చాలును మీ గొప్పా
నా ఆలి గుణము ఎరుగన నే

నేలుకోను తీసుకుపో "నేనొల్ల"

పెళ్ళాము: నీ తాగుబోతు మాటలింక మానరా
నే సత్తెమైన యిల్లాలిని చూడరా
నే నగ్గి ముట్టుకుంటా అరిచేత పట్టుకుంటా
తలమీద పెట్టుకుంటా

మొగుడు: చెయ్! ఎర్రి రాముడంటి వోణ్ణి కాదొలే
గొప్ప శౌర్యమైన యింటబుట్టి నానులె
అగ్గిలోన బడ్డా నువు బుగ్గిలోన బడ్డా
పరాయింట వున్న దాన్ని పంచ జేరనిస్తానా
ఒల్ల నోలె పిల్లా యింకెల్లిపో

ఈనాటి చిత్రం


ఈచిత్రం గుంటూరుజిల్లా దుర్గి శిల్పకళా పాఠశాలకు చెందినది. దుర్గి గ్రామం మాచర్ల సమీపంలో ఉన్నది.
http://guntur.nic.in/images/banner/durgistone.jpg ఈచిత్రం ఉన్న వెబ్ సైట్ కు లింకు:- http://guntur.nic.in/durgi_stonecraft.html గుంటూరుజిల్లా ప్రభుత్వ వెబ్ సైట్ కు చేరుకోటానికి క్లిక్.

ఈగాడిద ఇంకా వ్రాయాల్సింది ఇంకా కొంత ఉన్నది. ఇంకో రోజు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.