Saturday, February 8, 2014

130 Narendra Modi's chaiwala posture should not mesmerise Indians

130 నరేంద్రమోడీ చాయ్ వాలా భంగిమ భారతీయులను మభ్యపెట్టరాదు
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, 2014 elections, Narendra Modi, బిజెపి

స్పష్టీకరణలు - మనవి


నరేంద్రమోడీ గారిని విమర్శించటం అంటే చాయ్ వాలాలను అవమానించటంగా భావించవలదు. అదే విధంగా హిందూ మతాన్నీ, బిజేపిని దులిపేయటంగా తలచవలదు. నరేంద్రమోడీ కుర్తాల రేట్లను చర్చించటం అంటే గాంధీగారి ఖాదీని తూర్పారపట్టటంగా మనం యోచించటం న్యాయం కాదు. చాయ్ వాలాల డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం గౌరవించాలి. ఖాదీని కూడ మనం గౌరవించ వలసినదే.

అసమర్ధత
రెండు తప్పులు ఒక రైట్ అవవు. కాంగ్రెస్ లో , నెహ్రూకుటుంబ పాలనలో లోపాలున్నాయి కాబట్టి మోడీయే దిక్కు అనేవాదన నిలువదు. మనకి ఇంకో విషయం అనుభవంలో ఋజువయ్యింది. ఢిల్లీలో 1984 ఇందిరాగాంధీ మరణానంతర సిక్కుల ఊచకోతను కాంగ్రెస్ అడ్డుకోలేని విధంగానే 2002లో గుజరాత్ మారణకాండను మోడీ అడ్డుకోలేకపోయాడు. కాంగ్రెస్ అసమర్ధత విషయంలో ప్రత్యేకంగా వ్రాయటానికిప్పుడు ఏమీలేదు. మోడీ విషయంలోనే ఉంది. ఎందుకంటే మనం వెతుకుతున్నది కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయాన్ని. రోకలి పోట్లకి భయపడి మొసలి నోట్లో తల పెట్టలేము కదా. ఒకరాష్ట్రంలో మతకలహాలు సంభవించినప్పుడు అడ్డుకోలేనివాడు, అఖిలభారత స్థాయిలో మతకలహాలు వస్తే ఎలా అడ్డుకుంటాడు, అనేవిషయానికి మనం జవాబు వెతకాలి. ఎందుకంటే 2002లో గుజరాత్ మారణకాండ జరిగినపుడు ఢిల్లీలో బిజెపి అధికారంలో ఉంది. వాజ్ పేయీ గారు ప్రధాని. అద్వానీగారు హోం మంత్రి. ఒకఫోన్ చేస్తే సైన్యాన్ని విమానాలలో దించటం సాధ్యమయ్యేది. మోడీ గారు ఇఛ్ఛాపూర్వకంగా మారణకాండను ప్రోత్సహించలేదు అనుకున్నా (సాక్ష్యాలు సరిగా లేవు కాబట్టి), అతివేగంగా తగినంత సైన్యాన్ని, సీఆర్ పి ఎఫ్ ను ప్రవేశపెట్టటంలో ఆలస్యాన్ని అసమర్ధత అనక తప్పదు.

పోస్ట్ నంబర్ 126లో చాయ్ వాలా మైండ్ సెట్ అంశాన్ని మొదటిసారిగా స్పృశించాము. కొనసాగిద్దాము.our tea-boy మన చాయ్ వాలా हमारा चाय वाला

చాయ్ వాలాల్లో పలు రకాల వారున్నారు. యజమాని మీడియం చాయ్ వాలాలు. (శ్రీనరేంద్ర మోడీ కుటుంబం నడిపిన ఆర్ టీ సీ క్యాంటీన్ టైప్). వీటిల్లో సాధారణంగా కుర్రాళ్ళను చాయ్ వాలాలుగా నియమించుకుంటారు. తామే స్వయంగా రైళ్ళచుట్టూ, బస్సులచుట్టూ తిరిగి చాయ్ అమ్మటం అనేది చాలా అరుదు. కూలీ చాయ్ వాలాలు రానిరోజున కొద్ది గంటలపాటు వారు సర్వ్ చేస్తే చేయవచ్చు.

కూలీ చాయ్ వాలాల్లో కూడ పలురకాల వారుంటారు. నేను 1968-1969 కాలంలో హైదరాబాదు చార్ మినార్ ప్రాంతంలో ఒక చిల్లర నౌకరీ చేసినపుడు, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చాయ్ కి ఇరానీ హోటల్ కి వెళ్ళేవాడిని. ఆ మక్కామసీదు మూలమీది ఇరానీ హోటల్ లో దక్కన్ క్రానికల్ , ఆంధ్రభూమి పత్రికలు ప్రజల పఠనానికి బల్లలపై పడేసే వారు. స్వర్గీయ గోరాశాస్త్రి గారి సంపాదకీయాలను చదువుకుంటూ, అక్కడి చాయ్ వాలాలను అధ్యయనం చేసేవాడిని.

నాటి కొన్ని ఇరానీ హోటళ్ళ చాయ్ వాలాల చంకకి ఒక నగదు బ్యాగ్ వేలాడుతూ ఉండేది. చాయ్, బిస్కెట్లు, ఇతర తినుబండారాలను సప్లయి చేయటం, వాటికి డబ్బులు వసూలు చేయటం కూడ వాళ్ళ విధే. నేను పొరపాటుగా అర్ధం చేసుకుంటే, పాఠకులు నన్ను సరిదిద్ద వచ్చు. చాయ్ వాలా పొద్దున్నే డ్యూటీకి ఎక్కినప్పుడు అతడికి యజమాని కొన్ని ప్లాస్టిక్ టోకెన్లు ఇస్తాడు. ఆటోకెన్లను క్యాష్ కౌంటర్లో ఇచ్చి అతడు చాయ్ లు, బిస్కెట్లు, బిరియానీలు కొని ఖాతాదారులకు సప్లయి చేస్తూ ఉంటాడు. కస్టమర్ల దగ్గర వసూలు చేసుకున్న బిల్లు డబ్బులు అతడి దగ్గరే ఉంటాయి. టోకెన్లు అయిపోయినపుడు ఆనగదు వాడి మరల టోకెన్లు కొంటూ ఉంటాడు. రోజంతా ప్లాస్టిక్ టోకెన్లు, క్యాష్ రోటేట్ అవుతూ ఉంటుంది. రాత్రి ఇంటికి వెళ్ళే టప్పుడు మిగిలిన టోకెన్లు, క్యాష్ కౌంటర్లో లెక్క చెప్పి ఇంటికి వెళ్ళాలి. ఇది ఒకరకం ఏర్పాటు. ఇందులో యజమానికి బిల్లు వసూళ్ళ గురించిన పరేశానీ ఉండదు. అదంతా చాయ్ వాలాలదే. ఈచాయ్ వాలాల్లో కుర్రాళ్ళే కాక మధ్యవయస్కులు కూడ ఉండే వాళ్ళు. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, బిల్లులు చెల్లించకుండా జారుకుంటూ ఉంటారు కాబట్టి కస్టమర్లతో బాతాఖానీ కొట్టే తీరికలు ఉండవు. బిజెపి శ్రీవెంకయ్యాది నేతలు చేస్తున్నట్లుగా చాయ్ ఇచ్చి రాజకీయ కబుర్లు చెప్పటం కుదరదు. ఓనర్ కి తెలిస్తే గాలియా తినాల్సి వస్తుంది.

హైదరాబాదులోనే కాదు, భారత్ లోని పలు హోటళ్ళలో చాయ్ వాలాలు (సర్వర్లు, క్లీనర్లు అందరిని కలిపి ఈ టరమ్ ని వాడుతున్నాను) ఇంట్లో చెప్పకుండా వచ్చిన వాళ్ళు, రోజు గడవక తప్పని సరి పరిస్థితుల్లో ఆవృత్తిని చేపట్టిన వాళ్ళు అతి స్వల్ప జీతాలకు పనిచేయటం కనిపిస్తుంది. చాలామంది, ఆహోటళ్ళలో వెనుకవైపునో, లేక పై అంతస్థులోనో రాత్రిళ్ళు ఈతాకుల చాపలమీద నడుం వాల్చటం తెల్లారగానే డ్యూటీకి దిగటం రివాజు. వీరికి స్నానాలకు, బట్టలు ఉతుక్కోటానికి , నీళ్ళు దొరకటం అనేది ఆయా హోటళ్ళ స్థితి గతులను బట్టి ఉంటుంది. బట్టలను ఉతుక్కోటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పెద్ద హోటళ్ళలో లాగా యూనిఫారాలూ, టిప్పులూ ఉండవు.

ఇంతవరకు చాయ్ వాలాల జీవితాలపై జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, నగరాల స్థాయిలో, హైవేల స్థాయిలో, సరియైన అధ్యయనాలు చేసినట్లు కనపడదు. గుజరాత్ లో నరేంద్రమోడీ గారు ఇప్పటికి 12 ఏండ్ల బట్టి పాలిస్తున్నారు. చాయ్ వాలాల జీవితాలపై అధ్యయనాలు చేయించి, యజమానుల చేత వారికి యూనిఫారాలు, సబ్బులు, ఇప్పించటం, వెనకాల షెడ్లలో, గదుల్లో, పైగదుల్లో నీళ్ళు దొరుకుతున్నాయో లేదో చెకింగ్ చేయించటం, వైద్య పరీక్షలు చేయించటం, మొ|| పనులను నరేంద్ర మోడీగారు చేయిస్తే చూసి విని ఆనందించాలని మనమందరం కోరుకుందాం.

రోజుకో డ్రెస్
నరేంద్రమోడీ గారు రోజుకో డ్రెస్ మారుస్తారు. జయలలిత గారికి ఎన్ని జతల చెప్పులు, నగలు, ఉన్నాయో ఎలా లెక్కించలేమో, నరేంద్రమోడీగారి డ్రెస్ ల సంఖ్యను లెక్కించలేము అని నానమ్మకం. అహమ్మదాబాద్ లో పత్రికా రచయితగా పనిచేసి మోడీగారితో పరిచయం ఉందని చెప్పే శ్రీఆకార్ పటేల్ గారు హిందూస్థాన్ టైమ్స్ అనే పత్రికలో వ్రాసిన దాన్ని బట్టి చూస్తే అహమ్మదాబాద్ లోని అత్యంత ఖరీదైన టైలర్లవద్ద మోడీగారి డ్రెస్ లు తయారవుతాయి. http://www.hindustantimes.com/india-news/allaboutnarendramodi/the-narendra-modi-you-didn-t-know/article1-945276.aspx హిందూస్థాన్ టైమ్స్ లో ఆకార్ పటేల్ గారి వ్యాసానికి వెళ్ళటానికి క్లిక్ చేయండి. అందులోంచి ఒక కోట్.
His clothes, especially the iconic half-sleeved kurtas, might seem like khadi and often they are, but they are not inexpensive. His designer used to be the Ahmedabad store Jade Blue, the most expensive couture store in the city. I also frequented the store when I worked in Gujarat as a newspaper editor. The perfect fit over his shoulders suggests a few hours spent on trials.

తెలుగు సారం
... ఆయన బట్టలు, ప్రత్యేక చిహ్నాల్లాంటి పొట్టిచేతుల చొక్కాలు, ఖాదీవి లాగా కనిపించవచ్చు, తరచుగా అవే. కానీ అవి తక్కువధరవి కావు. ఆయన డిజైనర్ (వైబీరావు గాడిద: శ్రీ నరేంద్ర వివేకానంద చాయ్ వాలా గారి డిజైనర్ అంటే బాగుంటుంది) జేడ్ బ్లూ, నగరంలో అతి ఎక్కువ ఖరీదైన couture =high fashion designing and dressmaking స్టోర్. గుజరాత్ లో నేను ఒక పత్రికా సంపాదకుడిగా పని చేసినపుడు ఈస్టోర్ కు తరచుగా వెళ్ళే వాడిని. ఆయన భుజాలపై డ్రెస్ లు పర్ఫెక్ట్ గా ఫిట్ అవటం, ట్రయల్స్ పై కొద్ది గంటలు ఖర్చయ్యాయని సూచిస్తుంది.

ఈ జేడ్ బ్లూ దుకాణం వారి వెబ్ సైట్ చూస్తారా. ఇదిగో లింక్. http://www.jadeblue.com/products కి వెళ్ళటానికి క్లిక్.

వీరి వెబ్ సైట్లో మోడీ కుర్తా లకి ప్రత్యేక ట్యాబ్ ఉంది. http://www.jadeblue.com/sub_categories/modi_kurta మోడీ కుర్తాకి వెళ్ళటానికి క్లిక్

వీరు నరేంద్రమోడీ గారికి గత 20 ఏళ్ళుగా కుర్తాలు తయారు చేస్తున్నారట. ఇది రూ. 150 కోట్ల సామ్రాజ్యంట. ఇద్దరు సోదరులు బిపిన్ చౌహాన్, జితేంద్ర చౌహాన్. మోడీ కుర్తా అనే పేరుపై వీరికి ట్రేడ్ మార్కు హక్కులున్నాయిట. వీరు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోనే కాక ఆంధ్రప్రదేశ్ లో కూడ ఈ మోడీ కుర్తాలను అమ్ముతున్నారట. లినెన్ పోలిస్టర్. లినెన్ కాటన్. ఈపేరుని వాడుకోటానికి నరేంద్రమోడీగారు కూడా ఆసంస్థవారికి అనుమతించారట (వైబీరావుగాడిద వ్యాఖ్య: అనుమతి అవసరమా?). శ్రీచౌహాన్ గారు భారత ప్రధాని గారికి కూడ కుర్తాలను తయారుచేసే స్వప్నం నిజం కావాలని చూస్తున్నారట. సోనియాగాంధీ గారి సలహాదారు శ్రీ అహ్మద్ పటేల్ గారు కూడ మోడీ కుర్తా అభిమానిట. కొందరు కాంగ్రెస్ వారు మోడీ కుర్తాలను కొంటున్నప్పటికీ కాలర్లపై లేబుల్ కుట్టబడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారట. ఈ జేడ్ బ్లూ

కౌచూర్ స్టోర్ వారి స్లోగన్
WHAT YOU WEAR MATTERS. తెలుంగు సారంబు: మీరు ఏమి ధరిస్తారో అనేది చాల ముఖ్యమైనది. నేనేమి ధరిస్తే జనానికెందుకులే అని అనుకోకండి, దాని ప్రాధాన్యతను గుర్తించి నడుచుకోండి అని ఉద్ బోధ. యథా ప్రభూ తథా కౌచూర్!!!!!

రంగులుLavendar సంపంగి పూవు రంగు ఒకరకం లేతాకు పచ్చ్.
Orange నారింజ
Maroon ముదురు కుంకుమ రంగు
Brown బ్రౌన్ గోధుమ రంగు
beige బీజ్ బూడిద రంగుకి బ్రౌన్ రంగుకి మధ్య
white తెలుపు
black నలుపు
yellow పసుపు
green ఆకుపచ్చ
pink గులాబీ
silver వెండి రంగు
purple ఊదా రంగు
Golden బంగారు రంగు
Violet వయోలేట్ ముదురు ఊదా, వంకాయ రంగు
Multi-Color వర్ణ రంజితం అంటే పలురంగుల మిశ్రమం
crimson రక్తం, చెర్రీపండ్లు, టొమాటో ల, కెంపుల ఎరుపు.
Blue నీలం
Red ఎరుపు
Khakhi ఖాకీ
Grey బూడిద రంగు

ధరలుRs 900 - rs 1599
Rs 1600 - rs 2299
Rs 2300 - rs 2999
Rs 3000 - rs 3499
ఇవి వి.ఐ.పీ. లధరలు కావు. వి.ఐ.పీ. ల ధరలు, ముఖ్యమంత్రుల ధరలు ఎక్కువుంటాయో, తక్కువుంటాయో తెలియదు.

ఉపసంహారం


భారత్ లోని చాయ్ వాలాలకి మోడీగారు పై ధరలతో - పైనాణ్యతలతో, మోడీ కుర్తాలు తయారు చేయించి, ఉచితంబుగా నిప్పిస్తే మనందరి మనంబులు సంతోషపు తూగుటూయలలు ఊగుతాయి.

వైబీరావు గాడిద వ్యక్తిగత అనుభవంబులు


బ్లాగుల్లో వ్యక్తిగత అనుభవాలు ఎంతవరకు వ్రాయచ్చో నాకు తెలియదు. బ్లాగులు మొదట పుట్టినప్పుడు వెబ్ లాగ్ లు అన్నారు. అంటే ఒక రకమైన బహిరంగ డయిరీల్లాంటివి. వ్యక్తిగత విషయాలకి ఉద్దేశించినవి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం వంటివి వచ్చాక బ్లాగుల వాడకం కొంత తగ్గింది. వ్యక్తిగత విషయాలు అన్నప్పుడు కొంత స్వంత డబ్బా ఉంటుంది. ఆత్మస్తుతి, పరనింద ఎరుగని నావంటి ఉత్తముడికి, ఆనీచుడికి కలిసి సన్మానమా వంటి విషయాలు ఉంటాయి. కొంత రాంటింగ్ లు (డంబంతో కూడిన కోతలు, ఉద్వేగాలతో కూడిన ఉపన్యాసాలు ఉంటాయి. అర్ధ అనే నిఘంటువు ప్రకారం:

1. a loud bombastic declamation expressed with strong emotion

2. pompous or pretentious talk or writing.

ఈ artha అర్ధ ను మీరు నెట్ లో ఉచితంగా దిగుమతి చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాల చక్కటి డిక్షనరీ. పదాల నాణ్యతలో అనితర సాధ్యం.

ఇప్పుడు నా రాంటింగ్


నేను బ్యాంకు అధికారిగా రిటైర్ అయి పది ఏళ్ళు పైన అయింది. WHAT YOU WEAR MATTERS మన నెత్తికి ఎక్కలేదు. అసభ్య పదగుఛ్చం వాడినందుకు క్షమించాలి. మనం కౌన్ కిస్కా గొట్టం గాళ్ళం మనం ఏడ్రెస్ వేసుకుంటే జనానికెందుకు అనే దృష్టితో గత పదేళ్ళుగా బట్టలు కుట్టించలేదు. ఈమధ్య ఒక ఖాదీ భాండారులో రూ. 150 చొ|| రెండు కుర్తాలు కొన్నాను. ఉతుక్కోటంలో సమస్యలు వచ్చాయి. మళ్ళీ బజారులో దొరికే పాలిస్టర్ గోధుమ రంగు చొక్కాగుడ్డ ఒకటి రూ. 150 కి కొని టైలర్ కి ఇస్తే అతగాడు షర్ట్ కుట్టటానికి రూ. 150 ఛార్జి చేశాడు. కళ్ళు తిరిగిపోయాయి. కానీ నేను టెయిలర్లను తప్పుపట్టను. వారిలో కొందరి పరిస్థితి దయనీయంగా మారింది. షాపుల అద్దెలు పెరిగి పోయాయి. మురిక్కాలవమీద బంకు పెట్టుకున్నా మునిసిపాలిటీ వాళ్ళు వదలటం లేదు. విజయవాడ నగరంలో (ప్రధానమంత్రిగారు కేంద్ర క్యాబినేట్ వారు వి-గుం-తె కి మెట్రో ఇస్తామన్నారు) కొందరు టైయిలర్లకు దిక్కు తోచక మూడు చక్రాల రిక్షాలపై, తోపుడు బండ్లపై కుట్టు మిషన్ లను పెట్టుకొని రెడీమేడ్ డ్రెస్ లను రీసైజ్ చేస్తూ, రిపెయిర్ చేస్తూ, స్కూల్ బ్యాగ్ లు కుట్టుతూ తిరగటం ప్రారంభమయ్యింది.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదే. దరిద్రాన్ని మించిన భూతంలేదు. అందుకే భర్తృహరి అన్నాడు:
దీనా దీన ముఖైః సదైవ శిశుకైరాకృష్ట జీర్ణాంబరా
క్రోశద్భిః క్షుధితైర్నిరన్న విధురా దృశ్యా న చేద్గేహినీ ।
యాచ్ఞాభంగ భయేన గద్గద గళ త్రుట్యద్విలీనాక్షరం
కో దేహీతి వదేత్స్వ దగ్ధ జఠరస్యార్థే మనస్వీ పుమాన్‌ ॥

ఈ శ్లోకార్ధం ఇంకో రోజు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.