చర్చనీయాంశాలు: bifurcation, రాష్ట్రస్థాయి అవినీతి, ముఖ్యమంత్రి
సమైక్యాంధ్ర కొరకు తన పదవిని త్యజించటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిధ్ధపడటం ఓకే. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను దెబ్బ కొట్టటానికి ఇష్టపడక పోవటం కూడ ఓకే. జేజేలు.
తమ్ముడిపై ఆరోపణలు
తమ్ముడి భూసెటిల్ మెంట్ల వ్యవహారంలో చూసి చూడనట్లుగా వ్యవహరించమని కిరణ్ తనపై వత్తిడి తెచ్చారని విశ్రాంత డీజీపీ దినేష్ రెడ్డి గారు ఆరోపించారు. ఆ ఆరోపణను తుంగలో తొక్కారు.
7% కమీషన్ ఆరోపణ


జంటనగరాలకు మంచినీటి సమస్యను తీర్చే కృష్ణా జలాల తరలింపు మూడవ దశ పనులకు ముఖ్యమంత్రి సోదరుడు సంతోష్ రెడ్డి జోక్యంతో ఎక్కువ అంచనా వ్యయంతో కట్టపెట్టారని విమర్శించారు. మొదటి దశను రూ. 100 కోట్లతో పూర్తి చేయగా, మూడవదశకు ఏకంగా రూ.1600కోట్లకు పెంచారని విమర్శించారు. ... ఏకంగా ఏడు శాతం కమీషన్ ముఖ్యమంత్రి సోదరుడికి చేరుతోందని తెలిపారు. పనులను చేజిక్కించుకున్న సంస్థ కాంగ్రెస్ ఎంపీ శ్రీ కెవిపి రామచంద్రరావు అల్లుడికి చెందినదని పేర్కొన్నారు .. ఇలాగ ఈనాడు పత్రిక వివరాలనిచ్చింది.
ఈ ఆరోపణలు చాల తీవ్రమైనవి. తాను సమైక్యాంధ్ర కొరకు పోరాడుతున్నాను అనే నెపంతోనో , ఆరోపణలు చేయటం ప్రతి పక్షాలకు అలవాటే అనే నెపంతోనో పారి పోయే కన్నా న్యాయ విచారణను కానీ, సీబీఐ విచారణను కానీ ఎదుర్కొని ముఖ్యమంత్రి వీటినుండి పరిశుధ్ధుడుగా బయట పడటం అవసరం.
పోతూ పోతూ కేంద్రానికి, గవర్నర్ కు, సీబీఐ దర్యాప్తు చేయించమని సీ.ఎం. లేఖలు వ్రాయాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.