Saturday, February 8, 2014

132Modi Nomination

132 Could not fill election nomination form properly ఎన్నికల నామినేషన్ ఫారాన్నే సరిగా పూర్తి చేయలేక పోటం
చర్చనీయాంశాలు: Narendra Modi, నరేంద్రమోడీ, ఆస్తులు అప్పుల పట్టిక, Assets and Liabilities Statement


ఎన్నికలలో పోటీచేసే వారు తమ భార్యపేరును, ఆమె పేరుతో ఉన్న ఆస్తుల వివరాలను, నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేయాలి. నరేంద్రమోడీ గారు 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినపుడు తన నామినేషన్ పత్రికలో తన భార్య పేరును వ్రాయలేదు. ఆమెకు గల ఆస్తుల, అప్పుల వివరాలను వ్రాయలేదు. ఆ కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు.

English gist: Those who contest elections, have to furnish in the nomination forms, the names of their spouses, details of properties standing in their names etc. Shri Narendra Modi, while contesting the 2012 Gujarat Assembly Elections has left the spouse (=wife/husband) and assets columns blank.

ఈ విషయం సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టువారు నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల ప్రధాన అధికారి అని బంతిని ఎన్నికల అధికారి కోర్టులోకి నెట్టేశారు.

Approximate English gist: This issue has gone to Supreme Court level. Supreme Court decided that it was the CEO (Chief Election Officer) who had to decide in the matter, and refused to intervene.

ఎన్నికల అధికారి న్యాయం చేయలేదని కదా సుప్రీం కోర్టుకి వెళ్ళింది? మరల ఆయనే నిర్ణయించాలంటే?

Approximate English gist: The purpose of going to Supreme Court was to get justice, because CEO failed to do justice. What is the use, if it is said that CEO was the deciding authority?

నరేంద్ర మోడీ యందు మనకు ద్వేషం లేదు. మనకు సత్యానురక్తి, సత్యశోధనాసక్తే తప్ప రాజకీయాలతో ప్రమేయం లేదు. మనం ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

Approximate English gist: We have no dislike/hatred towards Mr. Narendra Modi. Our love is towards truth. Our interest is to explore truth. We have no link with politics. We are not contesting in elections.

వైబీరావు గాడిద పరిశీలన ybrao a donkey's comments


శ్రీ నరేంద్ర మోడీ గారు నామినేషన్ లో తాను అవివాహితుడనని వ్రాయలేకపోవచ్చు. ఎందుకంటే తనకి వివాహం అయి ఉండవచ్చు కాబట్టి.

Mr. Narendra Modi may not be able to mention in the nomination forms that he was unmarried. Because, he might have been married.

వివాహితుడనని వ్రాస్తే ఆమె పేరు (జశోదా బెన్) బహిర్గతం చేయాలి. ఆమెకు గల ఆస్తుల వివరాలు వ్రాయాలి. ఇది ఎందుకు కుదరదంటే, వారిద్దరు కలిసి సంసారం చేస్తున్నట్లు కనపడదు. ఆమెకు ఏమైనా ఆస్తులు ఉంటే అవి ఆమె స్వార్జితం అయినా అయి ఉండవచ్చు, లేక ఆమె పుట్టింటి వారు ఇచ్చినవి అయి ఉండవచ్చు. ఆమె ఆస్తులతో తనకు సంబంధం లేదనే విషయం మోడీగారు తన దృష్టిలో ఉంచుకొని ఆమె ఆస్తులను ప్రకటించవలసిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అందుకే వివాహం కాలంని ఖాళీగా వదిలేసి ఉండవచ్చు.

ENGLISH GIST: If he writes that he was married, then he would have had to mention wife's name (Ms. Jasoda Ben). He has to write details of her property. This is not possible because they do not seem to be living together (cohabiting). If she has some properties, they may be her own self-acquired or gifted by her parents. Taking these facts into account, Mr. Modi might have come to a decision that it was not necessary to disclose her assets.

ఇక్కడ మనం రెండు న్యాయ సూత్రాలను గమనించవచ్చు. Here, we can see two Latin legal terms:

డీ జ్యూరీ De Jurie


అంటే చట్టం దృష్టిలో ఏమిటి అని. Indicates the position as per law.

డీ ఫ్యాక్టో De facto


వాస్తవం ఏమిటి అని. Indicates factual position.

ఒక ఉదాహరణ ఇస్తే అర్ధం అవుతుంది. చట్టం దృష్టిలో ఈదేశానికి మన్మోహన్ సింగ్ డీ జ్యూరీ ప్రధాని. సోనియా గాంధి వాస్తవంగా డీ ఫ్యాక్టో ప్రధాని.

English: An example can clarify. In the eyes of law, Mr. Manmohan Singh is our de jurie Prime Minister. Ms. Sonia Gandhi is our de facto Prime Minister.

ఇదే ఎనాలజీలో Applying the same analogy
మోడీ దంపతులు డీ జ్యూరీ భార్యా భర్తలు. డీ ఫ్యాక్టోగా విడిపోయిన దంపతులు. Modis are de jurie couple.
చట్టప్రకారం విడాకులు పొందలేదు కాబట్టి చట్టప్రకారం విడిపోని దంపతులు. As they are not legally separated, they are "married, but not legally separated couples".
Really separated, but not legally separated అన్నమాట.

నైతికంగా మోడీగారు ఆ ఫారాలను పూర్తి చేసి ఉండవలసిన పధ్ధతి Ethically proper manner of filling up those forms


నేను వివాహితుడననే. చట్టప్రకారం నాభార్యపేరు ఫలానా. నేను, ఆమె వాస్తవానికి విడివిడిగా ఉంటున్నాము. ఆమె ఆస్తులకు నా ఆస్తులకు సంబంధం లేదు. ఆమె, నేను చట్టప్రకారం విడాకులు పొందే విషయాన్ని తగిన సమయంలో తగిన విధంగా పరిష్కరించుకుంటాము. ఈలోగా దయయుంచి నా నామినేషన్ ను ఆమోదించ వలసినది.

I am married. My spouse's name is so and so. But factually, we are living separately. There is no connection between her assets and liabilities, and my assets and liabilities. We shall take up the question of legal separation, an an appropriate time. In the meantime, kindly accept my nomination.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ప్రధానాధికారి, ఈవివరణను పరిగణనలోకి తీసుకొని, మోడీ గారి నామినేషన్ ను ఆమోదించటం న్యాయమే అవుతుంది.

English Gist: The Returning Officer of the Constituency, and the CEO of the State, had they followed this method of obtaining factual explanation from Mr. Modi and accepted his nomination, they would have done justice.

2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి, ప్రధానాధికారి, ఈవిధానాన్ని గానీ, పధ్ధతినిగానీ పాటించినట్లు కనిపించదు. The Returning Officer and the CEO didn't apparently follow this method or procedure.

2014 లోక్ సభ ఎన్నికలు 2014 Lok Sabha Elections


2014 లోక్ సభ ఎన్నికలలో శ్రీ నరేంద్ర మోడీ నామినేషన్లు వేసేటపుడు ఈపధ్ధతిని పాటిస్తే బాగుంటుంది. కేటాయించిన గళ్ళను ఖాళీగా ఉంచటం, గీటు కొట్టి వదలి వేయటం సబబు కాదు. శ్రీమతి జశోదాబెన్ గారికి ఇంకా శ్రీ నరేంద్రమోడీ గారిపై ఆరాధనా భావం పోయినట్లుగా కనిపించదు. (ఆమె ఆశతోనో, భయంతోనో, విరక్తితోనో, వృధ్దాప్యంతోనో ఆరాధనా భావాన్ని చూపితే అది వేరే విషయం.). శ్రీమోడీగారికి ఆమె యందు దయఉంటే, ఆమెను సంప్రదించి ఆమె అనుమతితో, ఆమె పేరును నామినేషన్ ఫారాల్లో చూపించి, ఆమె ఆస్తులను కూడ ప్రకటిస్తే భారతీయ సంస్కృతిని శ్రీమోడీ పునః పట్టం కట్టినట్లవుతుంది. ఒక పొరపాటును దిద్దుకున్నట్లవుతుంది. శ్రీమోడి, శ్రీరామ దుష్యంతాదుల సరసన చేరవచ్చు.

Approximate English gist: Iit will be appropriate if Shri Narendra Modi can follow this method/procedure while filing the nominations for the 2014 Lok Sabha elections. It will not be proper to leave the spouse name and her assets columns blank. Ms. Jasoda Ben seems to be continuing to adore her husband. (It will be a different thing, if she is showing that adoration towards her husband out of some expectations, apprehensions, frustrations, or oldage etc.). If Shri Modi still have some love and sympathies left and continuing withing himself, towards his seemingly estranged wife, he can probably contact her, take her consent and show her as his spouse and declare her assets and liabilities in the nomination form. This will be reinstating our ancient bhAratIya culture. It will also correct past errors and clear past misunderstandings, if any. Shri Modi can then join our greats like Sri Rama, Dushyanta et al.

శ్రీమోడీ గారికి అసలు వివాహమే కాక పోతే, శ్రీమతి జశోదా బెన్, మరియు మీడియా అనవసరంగా హడావుడి చేస్తున్నట్లయితే, ఆయన నిర్ద్వంద్వంగా తాను అవివాహితుడనని ప్రకటించుకోవచ్చు. అపుడు బంతిని శ్రీమతి జశోదా బెన్ ఎలా బ్యాటింగ్ చేయాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈదేశంలో పృధివ్యాపస్తేజో వాయురాకాశాల వంటి పంచభూతాల సాక్షులుగానే కాక, బంధుమిత్రుల సమక్షంలో వివాహాలు జరుగుతాయి కాబట్టి, సత్యా సత్యాలు తరువాత తేలుతాయి.

Approximate English gist: If Shri Modi was not married, and if Ms. Jasoda Ben and media are unnecessarily making noise, he can categorically declare that he was unmarried. Then Ms. Jasoda Ben will have to decide how to bat the ball. In this country, marriages take place not only in the presence of the five elements earth, water, fire, wind and sky as witnesses, but also in the presence of relatives and friends. Truths and untruths will come out later.

ఇంకా ఉంది. పోస్ట్ నంబర్ ౧౩౩ చూడండి. Incomplete. To contnue in post No. 134, which pl. see.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.