Tuesday, January 7, 2014

112 Who is Upper and who is lower?

112 Who is upper and who is lower? ఎవరు ఎగువ? ఎవరు దిగువ? कौन् ऊँचे कौन् नीचे?
చర్చనీయాంశాలు: సమాజం, ప్రకటనలు, మీడియా, బిజినెస్, వినియోగదారులు

ఈరెండు చిత్రాలు చూడండి:-


ఈరెండు చిత్రాలు, ఈనాటి ఒక ప్రముఖ ఆంగ్లదినపత్రిక నుండి సేకరించిన ఒక పాన్ మసాలా ప్రకటనలోంచి కత్తిరించి తీసినవి. ఈరెండు బొమ్మల మధ్యలో పాన్ మసాలా ప్యాకెట్ల బొమ్మలు ఉన్నాయి. వీటిపై మీరేమనుకుంటున్నారో, కింద వ్యాఖ్యలలో (కామెంట్లలో) వ్రాయచ్చు. నేనేమనుకుంటున్నానో వ్రాస్తాను.

వైబీరావు గాడిద స్పష్టీకరణ

ఈప్రకటనను విడుదల చేసిన పాన్ మసాలా కంపెనీ వారిపై కానీ, ప్రకటన కాపీని బొమ్మలను తయారుచేసిన ప్రకటన సంస్థ (యాడ్ ఏజెన్సీ) వారిపై గానీ, ప్రచురించిన పత్రికవారిపై గానీ నా కెట్టి ద్వేషమూ లేదు. ఎందుకంటే, వారు స్వతంత్రులు కాదు. పెట్టుబడి విధానపు బానిసలు.

ఊంచే లోగ్ ఊంచీ పసంద్

ఊంచే లోగ్ అంటే పైవారు, అంటే ఉన్నత వర్గాలవారు. ఊంచీ పసంద్ , అంటే ఎత్తైన, పైన ఉండే, ఉన్నతమైన ఇష్టం. పాన్ మసాలా ఎంచుకోటంలో, నా బొంద, ఊంచే ఏమిటి, నీచే ఏమిటి? ఊంచీ ఏమిటీ, నీచీ ఏమిటి?
ఈనినాదాన్ని రిజిష్టర్ చేసినట్లున్నారు. 'ఆర్' గుర్తు పెట్టారు. ఈదేశంలో 'స్వాతంత్ర్యం నాజన్మహక్కు' వంటి లోక్ మాన్య తిలక్ గారి నినాదాన్ని, 'జైజవాన్, జైకిసాన్, జైమజ్దూర్' వంటి లాల్ బహదూర్ శాస్త్రిగారి నినాదాన్నే జనం అటకెక్కించేశారు.

భగవద్గీతలో ఎంతో గొప్ప శ్లోకమున్నది.
యద్యద్ ఆచరతి శ్రేష్ఠస్ తత్తద్ దేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్ తదనువర్తతే ॥ 0321

సారం: శ్రేష్ఠులైన వారు ఏమి చేస్తే జనం అదే చేస్తారు.
అనగా సెలబ్రిటీలు ఏమి చేస్తే గిలబ్రిటీలు కూడ అదేచేస్తారు.

హమ్ సే హై జమానా hum sE hai ZamAnA हम् सै हैँ जमाना

ఫొటోలో ఉన్న వ్యక్తులను చూశారు కదా. వీరెవరో నాకు తెలియదు. అధికారం, రాజ్యం మాదే అనే ధ్వని , అహంకారం కనిపిస్తున్నది. ప్రకటనలోనే ఆరోగ్యానికి హానికరం అని ఉంది. పిల్లలకు అమ్మకూడదని కూడ ఉంది. అంటే సెలబ్రిటీలకు మాత్రమే అమ్మాలనా? 3.5 గ్రాములు 8రూపాయలుట. పాన్ డబ్బాల్లో జనం విరగబడి కొనటం నేను చూశాను.

జనం తమను తాము శ్రేష్ఠులు అనుకున్నా అనుకోకపోయినా, చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా తల తాకట్టు తెచ్చైనా క్యాష్ తెచ్చి కొంటున్నారంటే, మనం ఎంత బానిసలమైపోతున్నామో అర్ధం చేసుకోవాలి.

విశ్రాంత ఉచ్చ న్యాయమూర్తి శ్రీమార్కండేయ కట్జూగారు, కారణాలు ఏమైనప్పటికి, 90% భారతీయులను మూర్ఖులుగా గణించారు. తరువాత విమర్శలకు గురియయి, ఉపసంహరించుకున్నారు. 90% మూర్ఖులు కాకపోయినా, 45% వెర్రివాళ్ళు అనవచ్చేమో. శాతం కొంత అటూ ఇటూ మారవచ్చేమో.

ఏదైనా రాజకీయపార్టీ వాళ్ళు జనానికి పాన్ మసాలా ప్యాకెట్లు, పిల్లలకు పాన్ మసాలా కలిపిన చాక్లెట్లు, ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తే పోతుంది. రాలీలకు వచ్చే జనానికి నజరానాగా పాన్ మసాలా ప్యాకెట్లు ఇవ్వవచ్చు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.