చర్చాంశాలు: రాయలసీమ, విభజన, bifurcation

పత్రికల్లో వచ్చిన నేటి (2-12-2013) వార్తలబట్టి చూస్తుంటే, కొద్దిమంది రాయలసీమ నేతలు, తమ స్వంత ఎజెండాలో భాగంగా, రాయలసీమ లోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపించుకోటంలో కృతకృత్యులైనట్లు కనిపిస్తుంది. ఉపముఖ్యమంత్రి దామోదర్ తాను ఒప్పుకోలేదని స్పష్టంగా చెప్పగా, కొందరు తెలంగాణ నేతలకు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆంధ్రజ్యోతి వ్రాసిన ప్రకారం చూస్తుంటే, రాయలసీమ రెడ్డి సామాజిక వర్గ నేతలు, తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ నేతలు ఏకమై తమ అధికారాన్ని స్థిర పరుచుకోటానికి ప్రయత్నిస్తున్నట్లు తోస్తుంది.
తెరాస నేతలు, టీజాక్ నేతలు, హైదరాబాద్ పై తమ పెత్తనం కొరకు ఆవుర్ ఆవుర్ మంటుంటే, వార్ రాయలసీమ భూకులం నంబర్ 1 వారి పెత్తనాన్ని అంగీకరిస్తారని ఆశించటం వృధా. ఫలితంగా విభజన తరువాత కూడా, హైదరాబాదులో కుమ్ములాటలు తప్పవు. కెసీఆర్ కెటీఆర్ హరీష్ కవిత లు పెట్టే పొగకు తట్టుకోలేక, రాయలసీమ ప్రజలు తిరిగి బయట పడటానికి ప్రయత్నించ వలసి వస్తుంది. లేదా రాయలసీమ నేతలను బయటకి పంపటానికి కేసీఆర్ కొత్త వ్యూహాల వెతుక్కోవలసి వస్తుంది.
రాయలసీమ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించటమే మేలు. గుంతకల్లు - ద్రోణాచలం మధ్యప్రదేశాన్ని రాజధానిగ్ పెట్టుకొని, రాయలసీమ నాలుగు జిల్లాల సరిహద్దు ప్రదేశాలను పారిశ్రామికంగా వృధ్ధి చేసుకొని, ఉపాధి అవకాశాలను పెంచుకుంటే, రాయలసీమ ప్రజలు సుఖంగా జీవించ వచ్చు. బంగారు పంజరంలో బంధించబడిన చిలుకలాగా జీడి పప్పు కొరకు ఆశపడేకన్నా , స్వతంత్ర విహంగాల్లా రాగులు, సజ్జలపై బ్రతకటం మేలు. రాజధానిని షెడ్ లలో ఏర్పాటు చేసుకున్నా రోజులు గడిచి పోతాయి. అవి మనకొరకు ఆగవు.
కెసీఆర్ కృష్ణనీటిని రాయలసీమకు ధారా దత్తం చేస్తాడని రాయలసీమ నేతలు, ప్రజలు ఆశిస్తే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు. స్వతంత్ర రాష్ట్రంగా ఉంటే, కనీసం ట్రిబ్యునళ్ళను, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.