Tuesday, November 12, 2013

054 Part 1 of Sharing Life's Parners with other males & females is a hell भाग १ अपने जीवित भागस्वामियों को दूसरों से मिलकर भाग लेना नरक है। జీవిత భాగస్వాములను ఇతరులతో పంచుకోవాల్సి వచ్చినపుడు నరకమే.
054 జీవిత భాగస్వాములను ఇతరులతో పంచుకోవాల్సి వచ్చినపుడు నరకమే.
మహాభారతం, పద్యకవిత్వం, ఎర్రన, ద్రౌపది, సినిమాలు, సహజీవనం, సంసారాలు ఆంధ్రమహాభారతం. ఆరణ్యపర్వం. పంచమాశ్వాసం. ఎర్రన (ఎర్రాప్రెగ్గడ) పూరించాడు. 291వ పద్యం నుండి.

సీసపద్యం.2 9 1.

నీప్రియభర్తల నిర్మల చరితులఁ
బ్రకట తేజుల లోకపాల నిభులఁ

పార్ధుల నీవొక భంగిన వదలక
చెలువ యెభ్భంగి భజింతుదగిలి

యొక్క రొక్కని కంటె నువిద నీ
కేవురు అనురక్తులగుట యత్యద్భుతంబు

నగుమొగంబులకాని నలినాక్షి
నీదెసఁ బతులకు గింకిరిపాటు లేదు,

తేటగీతి
వ్రతము పెంపొ మంత్రౌషథ వైభవంబొ,
సరస నైపథ్య కర్మ కౌశలమొ చతుర
విభ్రమోల్లాస రేఖయొ వెలఁది నీవి
(వి)శేష సౌభాగ్య హేతువు చెపుమ నాకు.
ఏనును నీవలన నిజము
గా నిది యంతయు నెరిగి కమలదళాక్షుం
బూని వశగతునిఁ జేసి య
నూన స్నేహాను భోగయుక్తి తలిర్తున్.
కందం.
అని యడిగిన మది నించుక
కినుక వొడమ నడఁచు కొనుచుఁ గృష్ణ మృదులహా
సిని యగుచు కృష్ణభామిని
కనుగొని యిట్లనియె నిర్వికారాకృతియై.

కృష్ణ = ద్రౌపది అసలు పేరు. కృష్ణభామిని = కృష్ణుడి యొక్క భామిని అనగా సత్యభామ. కినుక వొడమ అంటే కోపం పుట్టగా. అడఁచుకొనుచు= అణచుకొనుచు. మృదులహాసిని, నిర్వికారాకృతి సుందరమైన పదగుఛ్ఛాలు. ఎర్రన సామాన్య కవి కాదని మనం అర్థం చేసుకోవాలి.
కందం.
ననునిట్లు దుష్టవనితా
జనము నటులుగాఁ దలంపజనునే నీకున్
మనసొప్పదు పురుషోత్తము
వనితవు కాఁ దగవు నీవు వనరుహ నయనా.

నన్ను నీవు ఇలాగా మంత్రాలు, తంత్రాలు, ప్రయోగించే చెడ్డ స్త్రీ గా భావించవచ్చా? నా మనస్సు ఒప్పుకోటం లేదు. నీవు ఆపురుషోత్తముడైన శ్రీకృష్ణుడి వనితగా ఉండటానికి అర్హురాలివి కావు.

వనరుహనయనా, ఒక అందమైన ప్రయోగం. భారతీయులలో , తెలుగు వాళ్ళలో పలువురు పోర్నో సైట్లకు అలవాటు పడిపోయి స్త్రీపురుషులంటే కేవలం రెండు లేక మూడు అంగాలనే పరిమిత ఆలోచనా ధోరణి మొదలయ్యింది. అట్టి వారికి, నయనాల సౌందర్యం అర్ధంకాదు.
వచనం.
అని మేలంపు చందంబున దాని వివేక హీనత యెఱుక పడ నాడి పాంచాలి మఱియు నిట్లనియె.

ఇక్కడ మేలము అంటే , వదినా మరదళ్ళ మధ్య సరసము. చందం అంటే విధం. సరసమాడి నట్లే ఆడి, పాంచాలి, సత్యభామ యొక్క అవివేకాన్ని గుర్తు చేసింది.
౨౯౬, ౨౯౭ పద్యాలు, ఎంతో సుందరమైనవి.

చంపకమాల పద్యం.
అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగుల జేసి యెంతయున్
వలతురు నాథు లంట మగువా , కడు బేలతనంబు, దాన మున్
కలిగిన ప్రేమయున్ పొలియు గాని యొకండును సిధ్ధంబొందర 
ప్పొలతుక తోడి మన్కి యహిపొత్తుగఁ జూచు విభుండెరిగినన్.

English gist: Believing that, husbands will love wives immensely, if the husbands are given some magic chants, some ritual tantras, is naive and simpleton-istic.    Husbands can be won over only by love and giving (implied sweatmeats, kisses or some remember-able things).   On the other hand, if a husband knows that he was being subjected to some chants, rituals, (and drugs, medicines and potions), he may abandon such irate wife.

ఇంకో చంపకమాల.
మగువ యొనర్చు నశ్యవిధి మందులు మాకులు వొండు చందమై
మగనికి తెచ్చు రోగములు మానక మూఢజనాది రోగముల్
మొగి నొనరించు నద్దురితముల్ తన చేసిన చేతలై తుదిన్
జగమున కెక్కి నిందయును సద్గతి హానియు వచ్చు నింతికిన్.

Gist: If a woman uses herbs and other drugs to keep her husband under her control, they may bring him diseases.  Such woman will get a bad name and will suffer more because, she too will suffer owing to a sick husband.


నన్నయ వలె ఎఱ్ఱన సంస్కృత సమాసాలను ఒక విధిగా వాడలేదు. కడు బేలతనంబులో ఉన్న నుడికారాన్ని చూడండి. మందులు, మాకులు చూడండి. పొలతుక అంటే నారి,కాంత, మగువ, స్త్రీ. చంపకమాలా వృత్తంలో ఎంత చక్కగా ఇమిడి పోయిందో. అహిపొత్తు అద్భుతమైన సమాసం. అహి= నాగుపాము . పొత్తు= స్నేహం, సహజీవనం,సంసారం. అహి, సంస్కృతం. పొత్తు తెలుగు. దుష్ట సమాసం లాగా కనిపిస్తుంది. కానీ, ఎంత సుందరంగా ఈ చంపకంలో అతికిపోయిందో.

నశ్యవిధి, ఒక విధమైన ఆయుర్వేద చికిత్సా ఔషధ సేవన పధ్ధతి. ద్రౌపది చెప్తున్నది, మందులు, మాకులు, చివరికి మగడికి రోగాలు తెచ్చి పెట్టుతాయి. ఆఖరికి పరువు పోతుంది. నింద, సద్గతిహాని కలుగుతుంది, అని హెచ్చరిస్తున్నది. ఇంతి= స్త్రీ, ఇల్లాలు.

ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కాని, ఒక వృధ్ధముఖ్యమంత్రి గారికి , ఆయన ద్వితీయ కళత్రానికి సంతానోత్పత్తి కాంక్ష కలిగి మందులను, మాకులను సేవించగా, అవి ఆయనకు అదనపు రోగాలను తేగా, ఇతర మానసిక ఒత్తిడులు శరీరారోగ్యం పై ప్రభావాన్ని చూపగా, ఆయన త్వరగా స్వర్గస్థు డయ్యాడని ఆకాలంలో వదంతులు వచ్చాయి. నింద అయితే వచ్చింది కదా.

ఇక్కడి నుండి పది పద్యాలు ద్రౌపది సత్యకు చేసిన బోధలో భాగం. వ్యాసుడు మూలంలో ఇంకా ఎక్కువ వ్రాశాడు. ఈపది పద్యాల్లో, ద్రౌపది బోధించిన అన్ని విషయాలతో మనం ఏకీభవించక పోయినా, చదివి అవగాహన చేసుకోవలసినవే. ఇంకోసారి వాటిని వివరిస్తాను.

ఇప్పుడు ౩౦౯, ౩౧౦ వ పద్యాలకు వద్దాము.
ఆటవెలది పద్యం.
ఇట్టి వర్త నముల నెపుడు పాండవు లకు
తగిలి ప్రియము సేయ తగితి కాని
మగువ నీవు సెప్పు మందులు మాకులు
ఇంద్రజాల ములును నేనె రుంగ.

వచనం.
అనిన విని లజ్జాకలిత చిత్త యగుచు సత్యభామ పాండవ భామిని కిట్లనియె.

కందం.
ఏ నెరుగమి ఇట్లడిగితి
నానేరమి సైప వలయు నగవుగ కొనుమీ
మానిని నాపలుకులు స-
న్మానితము భనచ్చరిత్ర మహిమ ధరిత్రికిన్.

ఏదో నవ్వులాటకన్నాలే అని సత్య ద్రౌపదిని క్షమాపణ కోరింది.


లజ్జాకలితచిత్త,ఎంతో సుందరమైన ప్రయోగం. మన పత్రికల్లో వాడే భాష, చాలా LIMITED VOCABULARY పరిమిత పద జాలానికి చెందినది. ఫలితంగా, తెలుగు పాఠకులకు, భాష యొక్క సౌందర్య విస్తృతి అర్ధం చేసుకునే శక్తి పోయి, యూట్యూబ్ ఆడియో, వీడియో లకు, ప్రైవేటు బ్రౌజింగులకు ఎగబడుతున్నారు.
౩౧౩ నుండి ౩౨౩ వరకు మరల ఒక పది పద్యాల నీతి బోధ. వీటిని ఇంకొక సారి పరిశీలిద్దాం.

శ్రీకృష్ణతులాభారం, వంటివి నాలుగైదు సినిమాలు వచ్చాయి. వీటిల్లో, శ్రీకృష్ణుడిని తన వశవర్తిగా చేసుకోటానికి సత్య, ఆమె సపత్నులు (సవతులు) పడిన బాధలు చూపించబడ్డాయి. వ్రతం చెప్పమని నారదుడిని అడుక్కోటం, ఆయన సత్య చేత పతి దాన వ్రతం చేయించ ఆమెకు గర్వ భంగం చేయించటం, విదితం.

ఈ సందర్భంగా, మీరజాల గలడా నాయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి అనే సత్య పాట, భలే మంచి చౌకబేరము మించినన్ దొరకదు త్వరన్ గొనుడు సుజను లార, అనే నారదుడు పాడిన వేలంపాట చిరస్మరణీయాలు.

ఈ రెండు పాటలు, మనకి నెట్లో కొంత క ష్టం మీద దొరుకుతున్నాయి.

(౦౪ ౧౨ ౨౦౧౪ నాడు జోడించింది)
When compared to Indian women, Indian men in practice have a slightly different behavior.  This seems to be probably because Indian men have greater access to tools like axes, sickles, even guns.  The moment an Indian male finds his dharma patni (or even adharma patni) with another male in bed, he seems to use whatever axe, sickle or gun or else is in his hand he may use it against his wife or the other fellow copulating with her.  In this context, we can on some other occasion, examine the famous legal case of one Indian Navy Officer Nanavati.


भारतीय महिलाओं से तुलन किये तो, भारतीय पुरुषों के प्रवर्तना शैली थोडा भिन्न, मेरे ख्याल में दिख रहा है। यह है कि, महिलाओं से मर्दों को ज्यादा कुल्हाई कुठार, दरांती हँसियाँ , शायद बंदूके वगैरे के लभ्यता ज्यादा है।  इसीलिये जब एक आद्मी अपने धर्म पत्नी (या अधर्म पत्नी भी हो सकते) कों दूसरे मर्द के साथ बिस्तर पर देखे, तो उसी मिनिट, वह अपने कुठार या हँसिया या बंदूक प्रयोग करेगा.  इस में पढ (विद्यावान) या अनपढ (निरक्षर) फरक नहीं रहेगा।  उदाहरण के लिये हम एक भारतीय नेवी आफीसर नानावती के केस को विश्लेषण कर सकते हैं।  इस विषय पर हम दूसरे मौके में परिशीलन करेंगे।

ఈసందర్భంగా పురుషులకు స్త్రీలకు మధ్య కొంత వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తున్నది.  దీనికి బహుశా కారణం, భారతీయ పురుషులకు (బహుశా ప్రపంచ ఇతర దేశాల పురుషులకు కూడ) , గొడ్డళ్ళు, కొడవళ్ళు, తుపాకులు వంటి సాధనాలు అందుబాటులో ఉండటం కావచ్చు.  తన ధర్మపత్నిని (లేక అధర్మ పత్నిని కూడానేమో), మూడవ వ్యక్తితో పక్కపై చూడగానే, ధర్మ పతి (బహుశా అధర్మపతి కూడానేమో) వెంటనే తన చేతిలోని గొడ్ఞలిని, కొడవలిని, తుపాకిని ప్రయోగించి తన ఆక్రోశాన్ని వెంటనే శాంతింప చేసుకుంటాడేమో.  ఈసందర్భంగా, ఇంకో బ్లాగ్ పోస్టులో ముంబాయికి చెందిన భారతీయ నేవీ అధికారి నానావతి గారి కేసును పరిశీలిద్దాము.

ఈసందర్భంగా మనం చదవాల్సింది, సుభద్రను అర్జునుడు రైవత పర్వతం నుండి ఎత్తుకుని వచ్చి ద్రౌపదికి సవతిగా ప్రవేశ పెట్టిన దృశ్యం, మహాభారతం లోది.  In this regard, it will be worthwhile for us to remember the Mahabharata part in which, its protagonist Arjuna brought Subhadra from Rivata Hill and inserted her into his gynaesium as an additional dharma patni (legally married wife).  Draupadi's reaction?  = She wept.

Nannaya's Sri mad Andhra Mahabharatam, Adi parvam, 8th Chapter, 211st prose.  इस संदर्भ में हम महाभारत के आदि पर्व, में उस ग्रंध के महापुरुष अर्जुन क्या किया सोचना पडेगा।  भगवान श्रीकृष्ण के प्रेरण के अनुसार, अरजुन श्रीकृष्ण के सहोदरी सुभद्रा को रैवत पर्वत से हस्तिनापूर लाया और उस के पत्नी द्रौपदी की पदों पर गिरवाया।  क्यों कि, सुभद्रा अभी द्रौपदी की सपत्नी बन गयी थी।  प्रथम दशा में द्रौपदी, नये सपत्नी को देख कर रोती रह गई।  सुभद्रा द्रौपदी की पाँव पर गिर कर उसकी क्षमा प्रार्धना की।  द्रौपदी सुभद्रा को क्षमा दृष्टी से देख कर, कृपा वीक्षणों से उसको उठाई।

నన్నయ శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసం, 211వ వచనం. సందర్భం: అర్జునుడు శ్రీకృష్ణ ప్రోద్బలంతో, దేవేంద్ర సమక్షంలో సుభద్రను వివాహమాడి, ఆమెను అపహరించుకొని ద్వారకనుండి ముకుంద ప్రేరితులైన దాశార్హవీరులతో, ఇంద్రప్రస్థానికి చేరుకొని, ఒకచెట్టునీడలో విశ్రమించి, సుభద్రతో ఇలా అంటున్నాడు.

మన మివ్విధంబనఁ జనునప్పుడు నిన్నుఁ జూచి ద్రుపదరాజపుత్రి యప్రియంబులు పలుకునో యప్పరమ పతివ్రత పలుకు నిక్కువంబగుం గావున నీవేకతంబ గోపాలబాలికలతో ముందఱ నరిగి యక్కోమలిం గనుమని పనిచిన సుభద్రయు నిజేశ్వరు పంచిన మార్గంబున నింద్రప్రస్థపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మ్రొక్కిన :

తేటగీతి పద్యం, ఇది చాల సుందరమైన పద్యం.
పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర,
విజయుఁ డయ్యెడు నీవును వీరపుత్ర
జనని వగుమని దీవించె సంతసంబు
తోడ వసుదేవ పుత్రి నాద్రుపదపుత్రి.


ఇక్కడ పాఠకులు గమనించవచ్చు. నన్నయ ద్రౌపదిని ఎంతో ఔదార్యవంతురాలిగా చిత్రించాడు. భర్త సవతిని తెచ్చాడు. తెలివిగా ముందామెను తనవద్దకు పంపి కాళ్ళమీద పడేశాడు. ఆమె దీవించమంది. ద్రౌపది కూడ హృదయపూర్వకంగానే దీవించింది. ఓ పంకజాక్షీ (సుభద్రా) నీ వతి ప్రతిపక్షవీర విజయుడౌతాడు. అర్జునుడు అయ్యాడు కదా!
నీవును వీరపుత్ర జనని వగుము. అభిమన్యుడి తల్లి అయ్యింది కదా!

వ్యాస మహర్షి తన సంస్కృత మహాభారతంలో ఈ దృశ్యాన్ని ఎలా చిత్రించాడు  HOW DID Sage Vyasa depict this episode in his Sanskrit VyAsa Mahabharata , Adi Parva Book 1, 246 Adhyaya 246 Chapter, Verses - 0 to 22.  These verses (my Sanskrit knowledge is limited, I apologise) do not seem to indicate that Draupadi wept.  Instead, she (Krishna, original name of Draupadi) gave her blessings to Subhadra.

1-246-0  వైశంపాయన ఉవాచ। 1-246-0x (1312) క్రోశణాత్రే పురస్యాసీద్గోష్ఠం పార్థస్య శోభనం। తత్రాపి యాత్వా బీభత్సుర్నివిష్టో యదుకన్యయా॥
1-246-1  తతః సుభద్రాం సత్కృత్య పార్థో వచనమబ్రవీత్। గోపికానాం తు వేషేణ గచ్ఛ త్వం వృజినం పురం॥
1-246-2  కామవ్యాహారిణీ కృష్ణా రోచతాం తే వచో మమ। దృష్ట్వా తు పరుషం బ్రూయాత్సహ తత్ర మయాగతాం॥
1-246-3  అన్యవేషేణ తు గతాం దృష్ట్వా సా త్వాం ప్రియం వదేత్। యత్తు సా ప్రథమం బ్రూయాన్న తస్యాస్తి నివర్తనం॥
1-246-4  తస్మాన్మానం చ దర్పం చ వ్యపనీయ స్వయం వ్రజ। తస్య తద్వచనం శ్రుత్వా సుభద్రా ప్రత్యభాషత॥
1-246-5 (10659) ఏవమేతత్కరిష్యామి యథా త్వం పార్థ భాషసే। సుభద్రావచనం శ్రుత్వా సుప్రీతః పాకశాసనిః॥
1-246-6 (10660) గోపాలాన్స సమానీయ త్వరితో వాక్యమబ్రవీత్। తరుంయః సంతి యావంత్యస్తాః సర్వా వ్రజయోషితః॥
1-246-7  ఆగచ్ఛంతు గమిష్యంత్యా భద్రయా సహ సంగతాః। ఇంద్రప్రస్థం పురవరం కృష్ణాం ద్రష్టుం యశస్వినీం॥
1-246-8  ఏతచ్ఛ్రుత్వా తు గోపాలైరానీతా వ్రజయోషితః। తతస్తాభిః పరివృతాం వ్రజస్త్రీభిః సమంతతః॥
1-246-9  సుభద్రాం త్వరమాణశ్చ రక్తకౌశేయవాసినీం। పార్థః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికావపుః॥
1-246-10  సాఽధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ। `గోపాలికామధ్యగతా ప్రయయౌ వృజినం పురం॥
1-246-11  త్వరితా ఖాండవప్రస్థమాససాద వివేశ చ।' భవనం శ్రేష్ఠమాసాద్య వీరపత్నీ వరాంగనా॥
1-246-12 వవందే పృథుతాంరాక్షీ పృథాం భద్రా పితృష్వసాం। తాం కుంతీ చారుసర్వాంగీముపాజిఘ్రత మూర్ధని॥
1-246-13  ప్రీత్యా పరమయా యుక్తా ఆశీర్భిర్యుంజతాఽతులాం। తతోఽభిగంయ త్వరితా పూర్ణేందుసదృశాననా॥
1-246-14  వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాఽహమితి చాబ్రవీత్। ప్రత్యుత్థాయ తదా కృష్ణా స్వసారం మాధవస్య చ॥
1-246-15  పరిష్వజ్యావదత్ప్రీత్యా నిఃసపత్నోస్తు తే పతిః। `వీరసూర్భవ భద్రే త్వం భవ భర్తృప్రియా తథా॥
1-246-16  ఓజసా నిర్మితా బహ్వీరువాచ పరమాశిషః।' తథైవ ముదితా భద్రా తామువాచ తథాస్త్వితి॥
1-246-17 `తతః సుభద్రాం వార్ష్ణేయీ పరిష్వజ్య శుభాననాం। అంకే నివేశ్య ముదితా వసుదేవం ప్రశస్య చ॥
1-246-18  తతః కిలకిలాశబ్దః క్షణేన సమపద్యత। హర్షాదానర్తయోధానామాసాద్య వృజినం పురం॥
1-246-19  దేవపుత్రప్రకాశాస్తే జాంబూనదమయధ్వజాః। పృష్ఠతోఽనుయయుః పార్థం పురుహూతమివామరాః॥
1-246-20 గోభిరుష్ట్రైః సదశ్వైశ్చ యుక్తాని బహులా జనాః। దదృశుర్యానముఖ్యాని దాశార్హపురవాసినాం॥
1-246-21  తతః పురవరే యూనాం పుంసాం వాచ ఉదీరితాః। అర్జునే ప్రతియాతి స్మ అశ్రూయంత సమంతతః॥
1-246-22  ప్రవాసాదాగతం పార్థం దృష్ట్వా స్వమివ బాంధవం। సోఽభిగంయ నరశ్రేష్ఠో దాశార్హశతసంవృతః।

Here we have to write about 21st Century scenario:

About French President Hollande.
About American former President Bill Clinton and Hillary Clinton.
About Sunanda and Shashi Tharoor Episode.

In Hollywood, the norm and standard is, once a spouse comes to know that his-her partner is cheating, they will calculate amounts to be legally claimed from the other party as separation costs, and go for settled or adjudicated compensation, then divorce with mutual consent or through a court decree.   हालीवुड में यह है परिपाटी और रिवाज कि,जब एक पती-पतनी-प्रेमिक को पता चलता है कि अपने भागस्वामी वंचन कर रहा (रही) है, वे तलाक या विवाह विछ्छेद के बारे में सोचते हैं, और भागस्वामियों से कितने लाख या करोड रूपये परिहार माँगना, हिसाब लगाना शुरू कर्ते हैं।

ఈరోజు ౦౪ ౧౨ ౨౦౧౪ నాడు జోడించిన వీడియోThis composition is based on North Indian Hindusthani tune rAg yaman (kalyANi rAgam in South Indian Music).  The sthAyi and antra (refrain and sub-refrain, the supporting note cycles used are all composed by ybrao a donkey.  The western notes for this composition can be seen at http://museyb.blogspot.com .  उपरोक्त आडियो वीडीयो , उत्तर भारत के हिंदूस्थानी संगीत राग यमन पर आधारित है, (जिस के दक्ष्षिण भारतीय करनाटक संगीत समान राग कल्याणी है).  इस रचना में उपयोगित स्थाई, अंतरा, स्वर तोडे, सब वैबीराव एक गधे के कल्पनाऎँ हैं।  इन के पाश्चात्य स्वर लिपि को आप म्यूजवैबी.ब्लागस्पाट.काम पर देख सकते हैं।  పై వీడియో ఆడియో ఉత్తర భారతీయ హిందూస్థానీ సంగీత శైలిలో, యమన్ రాగంలో కంపోజ్ చేయబడింది.  దీనీ సమాన దక్షిణ భారతీయ కర్నాటక సంగీత రాగం కల్యాణి.  దీనిలో వాడబడిన స్థాయి, అంతరా, స్వర చిత్తస్వరాలు ఇవి అన్ని వైబీరావు గాడిద స్వకపోల కల్పితాలు.  దీని పాశ్చాత్య స్వర లిపిని మీరు మ్యూజ్ వైబీ.బ్లాగ్ స్పాట్ . కామ్ లో చూడచ్చు. 


ఇంకా ఉంది.To continue. 

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.