Saturday, November 2, 2013

03౫ భాగం 1, తెలుగు సినిమాల్లో హాస్య పద్య కవిత్వం Poetry of Comedy and Farce in Telugu films तॆलुगु फिल्मों मे हास्य पद्य कवित्व।

మహాకవి శ్రీశ్రీ సినీరంగంలోకి ప్రవేశించి మార్క్సిజానికి తిలోదకాలిచ్చారంటారు. పెట్టుబడిదారీ సమాజంలో ఏవ్యక్తికీ స్వాతంత్ర్యం ఉండదు. బ్రతుకు తెరువు కోసం కవైనా, గాయకుడైనా, నటైనా, ఎవరైనా, బానిసత్వం చేయాల్సిందే. ఎదురు తిరిగితే ఉపవాసాలే గతి.
అయితే అన్నం కొరకు కాక మందు సీసాల కొరకు ఊడిగం చేసే కవులు, రచయితలు ఉన్నారంటారు. కొందరి విషయంలో, కొన్ని చోట్ల, కొన్ని సమయాల్లో , మందు కూడా నిత్యావసర వస్తువుగా మారే అవకాశం ఉంది.
ఏది ఏమయితేనేం, మనం ప్రస్తుత వెబ్ పేజీ విషయంలో, కవిత్వాన్ని కవిత్వ కోణంలోంచి మాత్రమే చూసి రసానందాన్ని పొందుదాము.
సందర్భం: మామగారికి షష్టి పూర్తి. అల్లుళ్ళు ఆయనను ఆనందింప చేస్తున్నారు. చిత్రం కులగోత్రాలు. పద్యాల రచయిత శ్రీశ్రీ. గాయకులు. మొదటి పద్యం పిఠాపురం అనుకుంటాను. రెండవది మా. రచనను గానాలు మించి పద్యాల అందాలను ఇనుమడింప చేశాయి.


సంభాషణ:--
అత్తయ్యనీ మామయ్యనీ చూస్తుంటే అచ్చం పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉన్నారు.

లాగా ఏంటి బ్రదర్! సాక్షాత్తూ ఆ పార్వతీ పరమేశ్వరులే వచ్చి కూర్చున్నారు.
కానీ, బ్రదర్ కరక్ట్.
ఈశుభ సమయంలో నాదొక చిన్న కానుక.
ఏది బ్రదర్ , ఎక్కడ బ్రదర్.
కూర్చో బ్రదర్ .
ఓహో సీక్రెట్టా!
పద్యం: --

మామా, (ఆఆఆఆ) శత్రుభయంకర
నామా (ఆఆఆఆ) అందానికి చందమామా
(మామామ ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ)
బలమున గామా నీవేకద మాభీమా (ధీమా)
కులధామా విశ్వదాభిరామా మామా . ఆఆ ఆఆ .
సదానందం! శభాష్, మామకు తగ్గ అల్లుడవనిపించావ్.
బ్రదర్ కందం అందంగా చదివావ్. కానీ యతి లేదు.
నీకు మతిలేదు బ్రదర్.
ఆషామాషీ కాదు, పెద్ద కవి చేత వ్రాయించాను.
లేడీస్ అండ్ జెంటిల్ మెన్. ఏదో చిన్నవాడిని. ఈశుభసమయంలో మామామ గారికి నాదీ ఒక చిన్న కానుక.
ఏమీ లేదు, మామ గారి మీసంపై సీసం.
సూర్యకాంతం: అదేంటబ్బాయ్ బంగారంలాటి మామగారి మీసంపై సీసం పోస్తానంటావ్?
వదినెగారూ, సీసం అంటే ఆ సీసం కాదు.సీసపద్యం.

కారు మబ్బుల బారు సౌరు నే లెడితీరు
కోర మీసము పొందు కోరుకొందు

మృగరాజు జూలునే తెగనాడ జాలు
(మామా) నీ ఘన మీసము పసందు కనుల విందు

గండు చీమల దండు కదలాడి నటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు

మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
తేటగీతి.
ఎవరు మోయుచున్నారు ఈ అవని బరువు
ఆదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
(యా, అయితే మరి ఏదయ్యా!)
మామ మీసాలె భువికి శ్రీ రామ రక్ష
ఆఆఁ ఆఆఁ .
షేరింగ్ ఎలా?

ఎందుకో నాకు తెలియదు, పైపద్యాల mp3 లకొరకు వేటాడటం చాల క ష్టమై పోయింది. చివరికి telugump3.org అనే సైట్ లో దొరికింది. కావలసిన వారు స్వంత బాధ్యతపై డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈసైట్ కొంత సౌలభ్యంగానే ఉన్నది.


Added on 27.6.2015.
I have today visited the above site to download a Telugu MP3 song. I am sad to find that the quantity and quality of the site changed. There are a number of forced advertisements of Adult category. Now, it is extremely difficult to do download Telugu songs at the above site. I apologise to my readers.

ఈ రోజు నేను పై సైట్ ను ఒక తెలుగు ఎమ్ పీ ౩ పాట డౌన్ లోడ్ చేయటానికి విజిట్ చేయటం జరిగింది. బహుశా యాజమాన్యం మారి ఉండచ్చు. లేక యాజమాన్యం యొక్క స్వభావం మారి ఉండచ్చు. ఇప్పుడు అక్కడ తెలుగు పాటలను డౌన్ లోడ్ చేయటం చాల కష్టంగా మారింది. ఫోర్స్డ్ యాడ్స్ ప్రకటనలకు బలవంతపు క్లక్ లు, చాటుమాటున చిరుతపులలుల వలె పొంచి ఉండే క్లిక్ లు ఉన్నాయి. ఈనాటినుండి నేను పై సైట్ ను నా పాఠకులకు సూచించలేక పోతున్నాను. నా పాఠకులకు నేను చేసిన పొరపాటుకు నా క్షమాపణలు.
దీన్లో కొన్ని తప్పులు దొర్లాయి. సరిదిద్దటానికి ప్రయత్నించ గలను.

1 comment:

  1. చాలా చక్కని పద్యం గురించిన వివరాలిచ్చారు. ధన్యవాదాలు, అభినందనలు. మొదటి పద్యం పాడినది మాధవపెద్ది, రెండవది పాడినది పిబి శ్రీనివాస్ అని గొంతును బట్టి ఊహిస్తున్నాను.
    వసుంధర

    ReplyDelete

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.