t95kg. భారతీయ హిందూత్వ హృదయ సామ్రాట్ ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోడీ గారికి ఊరేగింపులు రోడ్ షోలు అంటే మహాప్రీతిలాగా కనిపిస్తుంది. అందులోనూ సూరత్ నగరంలో రోడ్ షోలు అంటే ఇంకా మక్కువ కావచ్చు. https://www.youtube.com/watch?v=TqipaMdpR7A ఈలింకులో ఒక రెండు గంటల వీడియో ఉన్నది. చూడాలనుకుంటే క్లిక్. ౨౦౧౯ లోక్ సభ ఎన్నికలలో విజయం తరువాత, శ్రీవారు సూరత్ నగరంలో ఒక ఊరేగింపులో పాల్గొన వలసినది, కానీ దురదృష్ట వశాత్తు, సూరత్ లోని సర్దానా ఏరియాలోని ఒక భవనం తక్షశిల కాంప్లెక్సు లోని పై అంతస్తులలో మంటలు చెలరేగి, అక్కడి కోచింగ్ సెంటర్ లోని విద్యార్ధులు 22 మంది ప్రాణాలు కోల్పోటంతో దానిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరి శ్రీవారి వెన్నంటి సూరత్ డైమండ్ వర్తకులు ఉంటారు కాబట్టి వారి బంగారం దిగుమతులు, ఎగుమతులపై ఎన్ ఫర్స్ మెంట్ డైరక్టరేట్ వంటి వారు లెక్కలు అడగకూడదు కాబట్టి, గుజరాత్ లో నగరోత్సవాలకు ఎలాటి లోటు ఉండదని మనం ఆశించవచ్చు.
దాదాపు ఎనిమిది వేల మంది ప్రత్యేకాహ్వానితులతో శ్రీమోడీ గారు తమ 2019 ప్రమాణస్వీకారోత్సవాన్ని ఆకాశమంత పందిరితో, భూదేవంత ముగ్గులతో జరిపించుకున్నారు. కేవలం ఐదు సంవత్సరాల పాలనకు ఇంత సమయ వ్యయం, ధన వ్యయం అవసరమా అని నా మనసు వ్యాకుల పడుతుంది. ఎందుకంటే మన అతిథులలో అధికులు పారిశ్రామికులు, ఫిల్మ్ స్టార్లు, క్రికెటర్లు, స్వంత డబ్బుతోనో, జనాల డబ్బుతోనో ప్రత్యేక విమానాల్లో ఎగిరే వాళ్ళు. వీళ్ళలోఅందరినీ దేశభక్తులనే అనుకుందాం, ఎవరూ దేశద్రోహులు కాదనే అనుకుందాం. కానీ వీళ్లెవరు మన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలను ఉపయోగించుకోరు. అలా వినియోగించుకుంటే, అది అమ్మకానికి పెట్టాల్సిన అవసరం రాదు కదా.
మనం ఒకరోజు జాతరను నిర్వహించుకోవాలంటే, ప్రభుత్వాధికారులు టాప్ టూ బాటమ్, తమ నార్మల్ విధులను మానేసి పందిర్లు, ముగ్గులు వేసుకుంటూ, ఏఏ వంటకాలు వండించాలా అని దిక్కుమాలిన పనులన్నీ చేసుకుంటూ , మరల తమకు ఎక్కడి చెడ్డపేరు వస్తుందో, చివాట్లు పడతాయో, నౌకరీ ఊడి డీజీపీ ఉద్యోగంలో నుండి స్టేషనరీ డైరక్టర్ గా మారాల్సి వస్తుందేమో అని వణుకుతూ , సంసారం ధర్మాలయిన పెళ్ళాం పిల్లలను వదిలి ఎండలో చావాల్సి రావచ్చు.
ప్రమాణ స్వీకారోత్సవంలోని ముఖ్యాంశం రహస్యగోపనం చేస్తానని ప్రమాణం చేయటం. సాధారణంగా ఇలాటి ప్రమాణాలను ప్రభుత్వోద్యోగులందరూ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలలో చేరేటపుడు బోలెడు ప్రింటెడ్ ఫారాలలో సంతకాలు చేయించుకుంటారు. వాటిలో రకరకాల ప్రమాణాలు ఉంటాయి. కొన్ని సార్లు ప్రైవేటు కంపెనీల్లో కూడ ఇలాంటి రహస్యగోపన ప్రమాణాలుంటాయి. ఇవన్నీ ఎలాటి ఆర్భాటాలు, ఖర్చులూ లేకుండా జరిగిపోతున్నపుడు, ఐదేళ్ళకోసారి తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పదవులకు ఈ జాతరలు ఎందుకు? ఇదీ నా మన్ కీ బాత్. ఈసారి మోడీగారి మన్ కీ బాత్ లలో ఏమి ఉద్ బోధనలు ఉంటాయో అరవయి నెలలు భరిద్దాము.
జై శ్రీరామ్, వాల్మీకి రామాయణాన్ని ఒకసారి సందర్శించుకుందాం. యుధ్ధకాండ. Book of War. ౧౨౮ వ సర్గ. Chapter 128. శ్లోకం 6.128.103. raamo raamo raama iti రామో రామో రామా ఇతి
prajaanaamabhavan kathaaH ప్రజానాం భవాన్ కథహ
raamabhuutaM jagaabhuud రామ భూతమ్ జగా భూత్
raame raajyaM prashaasati రామే రాజ్యమ్ ప్రశాసతి.
Link for those who wish to read about Shri Rama's Coronation Ceremony, instead of Shri Modi's Coronation Ceremony: Click here to go to http://www.valmikiramayan.net/yuddha/sarga128/yuddha_128_frame.htm
పై శ్లోకానికి ఆంగ్లం, పై లింకు వారి సౌజన్యం: While Rama ruled the kingdom, the talks of the people centered round Rama, Rama and Rama. The world became Rama's world.
తెలుగు-- శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా, ప్రజలందరి సంభాషణలు శ్రీరాముడి చుట్టూ రామా, రామా, మరియు రామా అని పరిభ్రమించాయి. ప్రపంచమే రామ మయం అయింది.
ఈ శ్లోకాన్ని శ్రీ మోడీ గారికి అన్వయిస్తే-- ప్రముఖ అంతర్జాతీయాంగ్ల పత్రిక టైమ్స్ వారే అంతకు ముందు శ్రీమోడీని జాతిని విభజించిన వాడు, అన్నవారు, నాలుక తిప్పేసి , జాతిని ఏకం చేసిన వాడు అని కీర్తించినారు కదా. అహో అధికార మహిమ.
107వ శ్లోకం ప్రకారం ప్రపంచం అంతా మోడీ మోడీ మోడీ అని పరిభ్రమించాల్సిందేకదా. సర్వం మోడీ మయం అవ్వాల్సిందే కదా.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
ybrao a donkey's note about St. Tyagaraja, mentioned in question No.4
in the Test below:As a musician with some skills both in Carnatic and Hindusthani Music my view: Tyagaraja made very few compositions in praise of Lord Krishna, Lord Shiva and Lord Venkateswara. His compositions mainly praise Lord Rama. He composed in several ragas. But, new ragas were very few. He had also composed in Hindusthani Ragas like Kapi, like ni valla guNa dOsha mEmi (khanda chapu tALam), and Enta saukhyamO (Adi tALam). He had also composed in many rare rAgas like Bindu mAlini. But, creation of new rAgas, I am unable to trace. Annamacharya belonged to approx. Vijayanagara period. Tyagaraja lived in 18th-19th Centuries of Tanjavur Maratha Rule.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 953145
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. These questions can be answered online, and score can be checked by clicking `progress` button below each question . There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no minus marks. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline. IMPORTANT: Exam. Questions have been here abridged/modified to maximise brevity, and to facilitate Machine-learning. Actual Exam. Questions are circumlocutive.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.