t95to. దక్కన్ క్రానికల్.కామ్ గారు ఈరోజు ౨౯.౨.౨౦౧౯ పతాక శీర్షిక ప్రకారం శేషాంధ్ర ప్రదేశ్ పీకల్లోతు దాకా అప్పుల్లో ఉన్నది, కాబట్టి ఖర్చుల్లో సంయమనాన్ని పాటించటమే ఏకైక మార్గం, అని చెప్పబడింది. మన కొత్త ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు, తన ౩౦వ తేదీనాడు ప్రమాణ స్వీకారోత్సవం కోసమే షుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కేవలం ఒక అరగంట లేక గంటకాలం జరిగే ఈకార్యక్రమానికి అంత ఖర్చు అవసరమా? ఉష్ణోగ్రతలు ౪౮ డిగ్రీలు దాకా చేరతాయని వాతావరణశాఖ వారు చెప్తున్నారు. ఈమండుటెండలో అధికారులను మసాలా వంకాయల్లాగా వేగించటం ఎంతవరకు సమంజసం? రెవిన్యూ పోలీసు అధికారుల పరిస్థితి వర్ణనాతీతం. రెండు లక్షలమంది దాకా జనం హాజరవుతారట. వాళ్ళను బస్సుల్లో తీసుకువచ్చినా, వాళ్ళు కూడ మిరపకాయ బజ్జీల్లాగా వేగి పోవాల్సిందే. ఇది చాలనట్లు రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో తెలియదు. కేవలం ఐదు సంవత్సరాలపాటు చేయాల్సిన పాలనకోసం ఎందుకీ ఆర్భాటం? ఇంకో సంగతి, పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా జాతీయ రహదారులపై లారీల ట్రాఫిక్ పై నిషేధాలు విధించారుట. అంటే, జాతీయ స్థాయి లారీ రవాణా విజయవాడ వద్ద స్థంభించిపోయి లారీ డ్రైవర్లు , క్లీనర్లు రోడ్డుమీద దొరికే గడ్డీ గాదం తినాల్సిందే. తరువాత రోడ్ల మీద నిషేధాలు అమలు జరిగే సమయంలో, ఒకవేళ అంబులెన్సులకు దారి వదలుతారనుకున్నా, మిగిలిన వాహనాలలో అత్యవసర సమస్యలతో ప్రయాణంచేసే వారి గతి ఏమిటి? ఈ ప్రజాస్వామ్యం ఏమిటో కానీ ప్రజాహింసగా పరిణమిస్తున్నట్లు తోస్తుంది. ముఖ్యమంత్రి పదవి స్వీకరించటానికి అసలు ప్రమాణ స్వీకారోత్సవం అవసరమా? ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ భవనంలోనే స్పీకర్ ఛాంబర్లో గవర్నర్ గారు ప్రమాణ స్వీకార పత్రాన్ని శ్రీ జగన్ చేతికి ఇచ్చి చదువుకుని సంతకం చేయమని కోరి, సంతకం చేయగానే వెనక్కు తీసుకుంటే ఈ పని తేలికగా అయిపోతుంది. తరువాత ఆవీడియోను టీవీ ఛానెల్స్ కు, పత్రికల వారికి విడుదల చేస్తే చాలు. జగన్ చెప్పబోయేదేమిటో ప్రజలందరికీ తెలుసు. ఇపుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పనివేళల గురించి ప్రవచనాలు చేసారు. ఉద్యోగులు ఎవరూ లేట్ కూర్చోవాల్సన అవసరాలు కలుగకుండా చూడమని ఉన్నతాధికారులను శ్రీవారు ఆదేశించారుట. ౨౮, ౨౯, ౩౦ తేదీలనాడు విజయవాడ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఉద్యోగులను అందరినీ ఉన్నతాధికారులు వేళకు ఇంటికి పంపినట్లేనా? మాటలు చూస్తే కోటలు దాటతాయి. చేతలు గడపలు దాటవు.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. trec1952942
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject.
These questions can be answered online, and score can be checked by clicking `progress` button below each question . There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no change in score. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline. IMPORTANT: Exam. Questions have been here abridged/modified to maximise brevity, and to facilitate Machine-learning. Actual Exam. Questions are circumlocutive.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.