h963ia. కేంద్ర ఎన్నికల కమీషనర్ గారు వోట్లు దయ్యాలు వేయలేదు, మనుషులే వేశారు అన్నారు. లెక్కలలో అంచనాలు, కొత్త అంకెలు వచ్చినపుడు సరిదిద్దబడ్డాయి, బడతాయి, అన్నారు. సంతోషమే, సమ్మతమే. అదే విధంగా తమ నిష్పక్షవాతం విషయంలోను, తమ రాష్ట్రాల ఎన్నికల అధికారుల నిష్పక్షపాతత విషయంలోనూ వారికి అమితమైన ఆత్మ విశ్వాసం. ఇంక, తమ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల విషయంలో వారికి అపరిమితమైన విశ్వాసం. దీనిని పలుసార్లు ప్రకటించుకున్నారు. ఇదియు సమ్మతమే.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడూ, ఇపుడు శేషాంధ్ర ప్రదేశ్ అయ్యాక కూడ ఎపీఎస్ ఆర్ టీ సీ లో ఒక ఆచారం ఉంది. శాస్త్రాల ప్రకారం కాలం చెల్లిన వాహనాలను , అవి సరియైన స్థితిలో ఉన్నా వాటిని వేలంవేసి రవాణా సంస్థలు డబ్బు సంపాదించుకుంటూ ఉంటాయి. వాటిని ప్రైవేటు రవాణా సంస్థల వారు కొని, రంగులేసి, కొత్తనంబర్ తీసుకుని, వాటిని ఎక్కడ వీలు దొరికితే అక్కడ తిప్పుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రభుత్వ ఎపీ ఎస్ ఆర్ టీసీ కన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అదే పద్ధతిలో ఎన్నికల కమీషన్ వారి వద్ద కూడ కాలం చెల్లిన , కానీ పని చేసే స్థితిలో ఉన్న, కొన్నిసార్లు పనిచేయని స్థితిలో ఉన్న ఈవీ ఎమ్ యంత్రాలు పోగవుతూ ఉంటాయి. అవి దౌలతాబాద్ (దేవగిరి) కోటలాగా నిర్భేద్యం కనుక, వాటిని వేలం వేస్తే ఔత్సాహికులైన లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కొని, వాటిని అధ్యయనం చేసి, కంపెనీలకు, కార్పోరేషన్లకు, ట్రేడ్ యూనియన్లకు, కోఆపరేటివ్ సొసైటీలకు, మార్కెటింగ్ సర్వేల వారికీ, వారి రకరకాల వోటింగు అవసరాలకు, ప్రాడక్ట్ సర్వే అవసరాలకూ అద్దెల కిచ్చుకొని తమకొక బ్రతుకు తెరువును సంపాదించుకుంటారు. అదే సమయంలో ఈవీఎమ్ లు ఎంతమేరకు భద్రం, టాంపరబుల్ కాదు అనే విషయం పారదర్శకంగా బహిర్గతం అవుతుంది. మా ఈవీఎమ్ లు ఇం పెనిట్రబుల్ (చొరబడటానికి వీలుకానివి) అని ప్రజలకు నచ్చ చెప్పటం ఎన్నికలకు తేలికవుతుంది.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. qui96332
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.