278 స్వసంపర్కం యొక్క అధ్యయనం, 4వ భాగం.
చర్చనీయాంశాలు: 278, స్వసంపర్కం, స్వలింగ సంపర్కం, మాస్టర్బేషన్ మంత్, బ్రెండన్ ఓనిలీ, ముక్కుతిమ్మన, వాల్మీకి రామాయణం
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 1వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/275 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 2వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/276 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 3వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/277 క్లిక్
ముందుగా పాఠకులకు క్షమాపణలు, స్పష్టీకరణలు
ఈ వ్యాసంలో సెక్సును ఉత్తేజ పరిచే (sexitement) కలిగించే అంశాలు ఏమీ ఉండవు. వాటికి వేరే వెబ్ సైట్లు, బ్లాగులు ఉంటాయి. ఇది కేవలం పరిశోథనాత్మక, సత్య శోథక పరిశీలన మాత్రమే. కనుక అట్టివి ఆశించి ఈ బ్లాగును చదువుతున్న పాఠకులకు నా క్షమాపణలు. వారు విండో పైన ఉండే X ను క్లిక్ చేసుకొని వేరొకబ్లాగ్ కు వెళ్ళవచ్చును.
ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశ్యం లేదు. అభ్యంతరాలుంటే కామెంట్లలోతెలియచేయ వచ్చు. వీలైనంతవరకు మనోభావాలను సంరక్షించటానికి ప్రయత్నిస్తాను.
స్వసంపర్కాన్ని సమర్ధించటం కానీ, వ్యతిరేకించటంగానీ, తదనుగుణంగా ఉద్యమాలను చేపట్టటం, నా లక్ష్యం కాదు. నా ప్రాథమిక లక్ష్యాలయిన నాస్తికత్వం, మార్క్సిజం, హేతువాద సైంటిఫిక్ అప్రోచ్ లకు అనుగుణంగానే ఈ పరిశీలన ఉంటుంది.
ఇపుడు మనం శ్రీబ్రెండన్ ఓనిలీ గారి వ్యాసం ది ఏజ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ యొక్క తరువాతి రెండు పేరాలను పరిశీలిద్దాము.
మొత్తం వ్యాసం చదువదలచిన వారికి లింకు; http://www.spectator.co.uk/features/9247341/the-age-of-self-love/ స్పెక్టేటర్ ఆంగ్ల పత్రిక కి వెళ్ళటానికి క్లిక్
మొత్తం వ్యాసం చదువదలచిన వారికి లింకు; http://www.spectator.co.uk/features/9247341/the-age-of-self-love/ స్పెక్టేటర్ ఆంగ్ల పత్రిక కి వెళ్ళటానికి క్లిక్
If you’re too bashful to be a charity onanist, you can always sneak on to Amazon and buy any number of books dedicated to celebrating the subject. Recent titles include: The Joy of Self-Pleasuring: Why Feel Guilty About Feeling Good?; Sex for One: The Joy of Self-Loving; Masturbation as a Means of Achieving Sexual Health; and The Big Book of Masturbation: From Angst to Zeal.
తెలుగు సారం; మీరు ఛారిటీ కొరకు మాస్టర్బేటర్ గా (ఓననిస్ట్ అంటే స్వసంపర్కం లేక హస్త మైధునాన్ని ఆచరించేవాడిగా) బయట పడటానికి బిడియపడే వారయితే, అమెజాన్ వారి వెబ్ సైట్ లోకి దూరి (స్నీక్ ఇన్) అక్కడ ఈ విషయాన్ని పండుగ చేసుకోటానికి అంకితమయ్యే పుస్తకాలను ఎన్నిటినైనా కొనుగోలు చేయవచ్చు. ఈమధ్య విడుదల అయిన కొన్ని పుస్తకాల పేర్లు:
జాయ్ ఆఫ్ సెల్ఫ్ ప్లెజరింగ్ (తనను తాను సంతోషింప చేసుకోటంలో ఆనందం).
వై ఫీల్ గిల్టీ ఎబవుట్ ఫీలింగ్ గుడ్? (మంచిగా ఫీల్ అవటానికి గిల్టీగా ఫీల్ అవటం ఎందుకు?)
సెక్స్ ఫర్ వన్: ది జాయ్ ఆఫ్ సెల్ఫ్ లవింగ్. (ఒక వ్యక్తి కొరకు సెక్సు: తనను తాను ప్రేమించటంలో ఆనందం.)
మాస్టర్బేషన్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎఛీవింగ్ సెక్స్యుయల్ హెల్త్ (లైంగిక ఆరోగ్యాన్ని ఎఛీవ్ చేయటానికి ఒక సాధనంగా స్వసంపర్కం ).
ది బిగ్ బుక్ ఆఫ్ మాస్టర్బేషన్: ఫ్రం యాంగ్స్ట్ టూ జీల్. (స్వసంపర్కం యొక్క పెద్ద గ్రంధం: ఆదుర్దా మరియు బెంగ నుండి ఉత్సాహపూరితమైన ఆసక్తి వరకు).
All these tomes are devoted to stripping away the awkwardness and redefining the act as a legit form of sex, even an act of love. It speaks to the narcissism of our times that it’s considered good to have a sexual relationship with oneself. Narcissus fell in love with his reflection; today young people are urged to fall for their own genitals.
తెలుగు సారం; ఈ ఉద్ గ్రంధాలన్నీ (టోమ్= పాండిత్యంతో కూడిన పెద్ద పుస్తకం. ఇది మంచి పదం) స్వసంపర్కాన్ని ఆవరించిన, -- నలుగురిలో నవ్వులపాలు చేసే ఇబ్బందికరమైన పరిస్థితిని-- వదలగొట్టటానికి అంకితమైనవే. స్వసంపర్క చర్యను ఆమోదయోగ్యమైన సెక్స్ రూపం గాను, ,ప్రేమయొక్క క్రియ గానూ పునర్ నిర్వచించటానికి అంకితమైనవే. అది మనకాలం నాటి , ఆత్మ ప్రేమ (తనను తానుప్రేమించుకోటం నార్సిసిజం) కు చెప్తుంది: తనతో తానే లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం మంచిదే అని భావించటాన్ని చెప్తుంది. నార్సిసస్ (నార్సిసిజమ్ అనే పదం పుట్టటానికి మూల పురుషుడు) తన ప్రతిబింబంతో తానే ప్రేమలో పడ్డాడు. ఈకాలపు యువతీయువకులు తమ జననాంగాలతో (జెనిటల్స్) తో ప్రేమలో పడవలసిందిగా నొక్కి చెప్ప బడుతున్నారు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
పాశ్చాత్య రచయితలకు, భారతీయ రచయితలకన్నా ఇన్ హి బిషన్స్ (ముందరి కాళ్ళకు బంధాలు) తక్కువ. భారతీయ రచయితలకు తల్లిదండ్రులు, గురువులు, బంధువులు, సమాజం నుండి సంక్రమించిన , తరువాత తమవిగా మారిన, ఇన్ హి బిషన్స్ ఉంటాయి. ఇవిగాక వివిధ కులాల వారు, మతాలవారు, రకరకాల వర్గాలవారు, భారతీయ రచయితలకు అలిఖిత పరిమితులను విధించారు. చిన్నచిన్న వాటికి కూడ మనో భావాలను దెబ్బతిన్నాయని పుస్తకాలను కాల్చేయటం, నిషేధించమని ఉద్యమాలు చేయటం, దేశ వ్యాప్తంగా కోర్టులకు వెళ్ళటం, దేశ వ్యాప్తంగా పోలీసు కేసులు పెట్టటం, ప్రతి దానిని అసభ్యం అనటం, మన సంస్కృతికి విరుధ్ధం ఒక కొత్త ఆచారంగా తయారయింది.
స్వసంపర్కంతో ఎక్కువగా లాభాలు, కొంత తక్కువగా నష్టాలూ ఉన్నప్పటికీ, సమాజంలో అధిక సంఖ్యాకులు స్వ సంపర్కానికి పాల్పడుతున్నప్పటికీ, దానిపై బహిరంగంగా సానుభూతి చూపేవారు, దానిని బిడియం లేకుండా చర్చించేవారూ తక్కువ. మనకంతా రహస్యమే. ఎందుకంటే, పరువు పోతుందనే భయం. తమ దగ్గర పనిచేసే క్రింది ఉద్యోగులను లైంగికంగా లొంగతీసుకోటానికీ, లొంగకపోతే, వేధించటానికీ, మన ఉన్నతాధికారులు, నేతలు, న్యాయవేత్తలు, వైద్యులు, పారిశ్రామిక వేత్తలు, నిర్మాత-దర్శక-హీరో ఆదిగా గల సినీ జమీన్ దారులు, నానా విధ మేథావులు వెనుకాడరు. ఇళ్ళల్లోనూ సమీప బంధువులే స్త్రీలను, పిల్లలను లైంగికంగా లొంగతీసుకోటం కూడ ఎక్కువే, కాకపోతే రహస్యం; ఎప్పుడోకానీ బయటపడవు.
స్వసంపర్కంలో సుగుణం ఏమిటి అంటే, ఎవరు ఏమి చేసుకున్నా తమకు తామే చేసుకుంటారు, ఇతరులను ఇబ్బంది పెట్టరు. వ్యాధులను వ్యాపింప చేయరు. స్వసంపర్కీయులు ఐపీసీ భారతీయ శిక్షా స్మృతి పరిధిలోకి వెళ్ళే నేరాలు చేయరు. వారు సహజపధ్ధతిలోనే సంబంధాలను నెరపుకుంటూ ఉంటూనే, ముందు జాగ్రత్తగా భాగస్వామిపై అతిగా ఆధారపడటం మానేస్తారు. స్వసంపర్కాలు భార్యా భర్తల లైంగిక, లైంగికేతర సంబంధాలకు ఆటంకం కావు. స్వసంపర్కీయులు, భార్యలు | భర్తలు లైంగికంగా ముందుకు వచ్చి సహకరించక పోతే, వారిని తిట్టరు, కొట్టరు, మానభంగం చేయరు, వారి పాదాలపై పడి ఈఒక్కసారి, అని వేడుకోరు. ఒకటి రెండుసార్లు శృంగార సరసంలో భాగంగా వేడుకున్నా, అదేపనిగా దాసులు కారు. ఎందుకంటే వారు ఇతరుల పాదాలపై పడి వేడుకునే కన్నాతమ బాధలు తాము పడటం నేర్చుకున్నారేమో.
ఇంకా ఉంది. త్వరలో.
ఈనాటి పద్యం
మహాకవి ముక్కు తిమ్మన. గ్రంధం: పారిజాతాపహరణం, ప్రథమాశ్వాసం.
వృత్తం: మత్తేభం.
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
తొలగం ద్రోచె లతాంగి ! యట్ల యగు నాథుల్ నేరముల్ సేయ పే
రలుకన్ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే?
తెలుగు సారం: జలజాతాసనుడంటే బ్రహ్మ. వాసవుడంటే ఇంద్రుడు. బ్రహ్మ, ఇంద్రుడు, మొదలగు దేవతలచేత పూజించ పడే
లతాంతాయుధుడు అంటే మన్మథుడు. మన్మధుడిని కన్న తండ్రి శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు సత్యాదేవి పాదాలమీద పడ్డాడు. ఆ బ్రహ్మాది దేవతలచేత పూజించబడే తలకాయను,
తన వామ పాదం అంటే ఎడమ కాలితో తొలగం ద్రోచె అంటే తన్నింది.
అట్లయగు, అంటే అలానే అవుతుంది. భర్తలు నేరాలు చేస్తే, బాగా అలుక చెందిన ఇది ఉచితము , ఇది అనుచితము అని ఆలోచించరు అని భావం.
చంపకమాల
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా!
తలను తన్నించుకున్న శ్రీకృష్ణుడు, నీపాదాలకు నొప్పిపుట్టిందేమోనని సత్యాదేవిని బ్రతిమాలుకున్నాడు.
వాల్మీకి రామాయణంలో దశరధుడి పరిస్థితి మరీ దీనంగా ఉంటుంది. అయోధ్యాకాండ. 10 వసర్గ. 32,33 శ్లోకాలు.
maa rodiirmaa cha kaarshhistvaM devi saMparisoshhaNam
మా రోదీర్మా చ కార్షిస్త్వం దేవీ సంపరిశోషణం
avadhyo vadhyataaM ko vaa ko vaa vadhyo vimuchyataam
అవధ్యో వధ్యతామ్ కో వా , కో వా వధ్యో విముచ్యతామ్
daridraH ko bhavedaaDhyo dravyavaan vaapyakiJNchanaH ||
దరిద్రః కొ భవేదాధ్యో ద్రవ్యవాన్ వాప్య కించనః.
దశరధుడు అలిగిన కైకను వేడుకుంటున్నాడు. ఓకైకేయీ ఏడవకు. నిన్ను నీవు శుష్కింపచేసుకోకు. నీవు కోరితే చంపటానికి వీలు పడని వాడిని కూడ చంపేస్తాను (చంపకూడని వాడిని కూడ చంపేస్తానని భావం. ఆధునికకాలంలో అయితే ఎన్ కౌంటర్ చేయిస్తాను అనేవాడు.). నీవు కోరితే మృత్యుముఖంలో ఉన్నవాడిని కూడ విడుదలచేయిస్తాను. దరిద్రుడిని ధనవంతుడిగా చేస్తాను. ధనవంతుడిని బికారిగా మారుస్తాను.
కేవలం లైంగిక సుఖం కొరకు దశరధుడు ఎలా దిగజారాడో చూడండి. ఆధునిక కాలంలో బిల్ క్లింటన్, వంటి వాళ్ళకి బహుశా దశరధుడు స్ఫూర్తి అయి ఉంటాడు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.