277 స్వసంపర్కం యొక్క అధ్యయనం, ౩వ భాగం.
చర్చనీయాంశాలు: 277, స్వసంపర్కం, స్వలింగ సంపర్కం, మాస్టర్బేషన్ మంత్, బ్రెండన్ ఓనిలీ
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 1వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/275 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 2వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/276 క్లిక్
ముందుగా పాఠకులకు క్షమాపణలు, స్పష్టీకరణలు
ఈ వ్యాసంలో సెక్సును ఉత్తేజ పరిచే (sexitement) కలిగించే అంశాలు ఏమీ ఉండవు. వాటికి వేరే వెబ్ సైట్లు, బ్లాగులు ఉంటాయి. ఇది కేవలం పరిశోథనాత్మక, సత్య శోథక పరిశీలన మాత్రమే. కనుక అట్టివి ఆశించి ఈ బ్లాగును చదువుతున్న పాఠకులకు నా క్షమాపణలు. వారు విండో పైన ఉండే X ను క్లిక్ చేసుకొని వేరొకబ్లాగ్ కు వెళ్ళవచ్చును.
ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశ్యం లేదు. అభ్యంతరాలుంటే కామెంట్లలోతెలియచేయ వచ్చు. వీలైనంతవరకు మనోభావాలను సంరక్షించటానికి ప్రయత్నిస్తాను.
స్వసంపర్కాన్ని సమర్ధించటం కానీ, వ్యతిరేకించటంగానీ, తదనుగుణంగా ఉద్యమాలను చేపట్టటం, నా లక్ష్యం కాదు. నా ప్రాథమిక లక్ష్యాలయిన నాస్తికత్వం, మార్క్సిజం, హేతువాద సైంటిఫిక్ అప్రోచ్ లకు అనుగుణంగానే ఈ పరిశీలన ఉంటుంది.
ఇపుడు మనం శ్రీబ్రెండన్ ఓనిలీ గారి వ్యాసం ది ఏజ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ యొక్క 3, 4 పేరాలను పరిశీలిద్దాము.
మొత్తం వ్యాసం చదువదలచిన వారికి లింకు; http://www.spectator.co.uk/features/9247341/the-age-of-self-love/ స్పెక్టేటర్ ఆంగ్ల పత్రిక కి వెళ్ళటానికి క్లిక్
Last month was International Masturbation Month, the brainchild of Good Vibrations, a purveyor of sex toys for singletons. Its aim? To spread the message that ‘self-satisfaction is a healthy, accessible form of pleasure’. ‘It’s Masturbation Month! Give yourself a hand!’ say the organisers. According to the Good Vibrations brigade, masturbation is just as good as having sex with someone else, and in some ways better. It is ‘the safest form of sex a person can have’. Your hand is unlikely to give you an STD or break your heart, so it’s preferable to intercourse with another living, breathing, unpredictable human being.
తెలుగు సారం: పోయిన నెల అంతర్జాతీయ స్వసంపర్క మాసం (మాస్టర్బేషన్ నెల) జరిగింది. ఈ స్వతృప్తి నెలను జరపాలనే ఐడియా, ఏకాకులు (సింగిల్ టన్స్ ) కొరకు సెక్స్ టాయ్స్ వ్యాపింపచేసే గుడ్ వైబ్రేషన్స్ అనే సంస్థ వారి మేథోశిశువు (బ్రెయిన్ ఛైల్డ్). దాని లక్ష్యం? 'స్వతృప్తి ఒక ఆరోగ్యకరమైన తేలికగా అందుబాటులో ఉండే ఆనంద స్వరూపం' , ''ఇది స్వసంపర్కమాసం, మీరు మీకే ఒక చేతిని ఇచ్చుకోండి'', అని నిర్వాహకులు అంటున్నారు. గుడ్ వైబ్రేషన్స్ బ్రిగేడ్ వారి ప్రకారం, స్వసంపర్కం , భిన్న సంపర్కం ఎంత మంచిదో, అంత మంచిదే. ఇంకా కొన్ని విషయాలలో మెరుగైనది. ''ఒక వ్యక్తి పొంద తగిన సెక్సు లన్నిటిలోనూ, స్వసంపర్కమే, అత్యంత భద్రతా రూపమైనది. మీ హస్తమే మీకు లైంగిక వ్యాధులను (ఎస్ టీ డీ) ఇవ్వటం జరగక పోవచ్చు. మీ హృదయాన్ని పగుల కొట్టకపోవచ్చు (వైబీ గాడిద వివరణ: మోసగించి వేరొకరితో వెళ్ళిపోవటం, EX గా మారి విడాకులను అడగటం, ఆస్తులలో-ఆదాయాలలో వాటాలు అడగటం, మెమోయిర్స్ వ్రాసి పాత శృంగార రహస్యాలను బయటపెట్టటం--లేక బయటపెట్తానని బెదిరించటం, ట్వీట్లు చేయటం మొ|| కావచ్చు, భారత్ లో అయితే సె.498 క్రింద కుటుంబ హింస , డౌరీ డిమాండు మొ|| కేసులను పెట్టటం వంటివి). కనుక శ్వాసపీల్చే ఇతర జీవులతో, మనుష్యులతో సెక్సు తో పోలిస్తే, స్వసంపర్కం ఎంచుకోతగినది.
As part of International Masturbation Month, launched in 1995, there have been ‘masturbate-a-thons’ across the western world. Individuals are sponsored to get to it, alone or in groups, to raise money for charity and to raise awareness about sexual health. The aim is to ‘come for good causes’. Jesus wept.
తెలుగు సారం: 1995 లో లాంచి చేయబడిన అంతర్జాతీయ మాస్టర్బేషన్ నెలలో భాగంగా పాశ్చాత్య ప్రపంచవ్యాప్తంగా ''మాస్టర్ బే థాన్'' (మరాథాన్ రేసు ల్లాగా) పండుగను జరిపారు. వ్యక్తులు వ్యక్తిగతంగా ఒంటరిగా గానీ, బృందాలుగా గానీ, చారిటీ చందాలు పోగు చేయటానికీ, మరియు లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన చైతన్యాన్ని పెంపొందించటాని కీ, స్పాన్సర్ చేయబడ్డారు. ఉద్దేశ్యం, ''మంచి లక్ష్యం కొరకుముందుకు రావటం''. జీసస్ ఏడ్చాడు.* (*వైబీ గాడిద వివరణ: మత ప్రచారకులు బాధపడ్డారు అని అర్ధం కావచ్చు.)
Britain’s first such event took place in Clerkenwell in 2006, bringing together a bunch of pervs — sorry, awareness-raisers — who were sponsored for every minute they could pleasure themselves without… well, you know. It was supported by Marie Stopes International, Britain’s leading abortion provider, which said the event was about ‘dispelling the shame and taboos that persist around this most commonplace, natural and safe form of sexual activity’.
తెలుగు సారం: బ్రిటన్ యొక్క మొదటి అలాటి ఈవెంట్ క్లర్కెన్ వెల్ లో 2006లో జరిగింది. పెర్ వెర్ ట్స్ ను -- సారీ, చైతన్యోద్దీపకులను (ఏవేర్ నెస్ రెయిజర్స్) -- ఎవరైతే ప్రతి నిమిషాన్నీ తమసంతోషం కొరకు ... మీకు తెలుసు, లేకుండా గడపగలరో -- అలా స్పాన్సర్ చేయబడ్డ వాళ్ళని ఒకచోటికి తెచ్చింది.*
(*వైబీ గాడిద వివరణ; లేకుండా గడప గలరో అంటే వేరొక భాగస్వామి లేకుండా, తమను తాము ప్రేరేపించుకుంటూ ఆనందాన్ని పొందగలరో అని భావం).
ఈ సంసర్గాన్ని బ్రిటన్ యొక్క అగ్రశ్రేణి ఎబార్షన్ (గర్భస్రావం?) ప్రొవైడర్ మేరీ స్టాపెస్ ఇంటర్నేషనల్ సంస్థ బల పరిచింది. వాళ్ళేమన్నారంటే; ఈ ఉత్సవం ''అత్యంత సాధారణం, సహజం, మరియు భద్రమైన లైంగిక కార్యం'', అయిన స్వసంపర్కం చుట్టూ ఆవరించి ఉండే అవమాన భారం (షేమ్) మరియు నిషేధాల(టాబూస్) ని పోగొట్టటానికి దోహదం చేస్తుంది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
పాశ్చాత్యదేశాల్లో ఏ అంగాన్ని కదిలించి ఉద్దీపనం చేయాల్సినా, స్పాన్సర్లు కావాల్సిందే. సహజంగా ఇటువంటి లైంగికాంశాలకు స్పాన్సర్లుగా లైంగిక వస్తు, సేవల వ్యాపారులే డబ్బులిచ్చి ముందుకి వస్తారు. మనదేశంలో ఇలాంటి లైంగిక వస్తువులకు బహిరంగంగా పెద్దమార్కెట్లు లేవుకాబట్టి ఎవరూ ముందుకురారు. మత సంబంధమైన ఉత్సవాలకైతే, రియాల్టర్లు, పూజా సామగ్రి అమ్మెవాళ్ళు, రుద్రాక్షలు, తాయిత్తులు, రాగిరేకులు , దిష్టిబొమ్మలు అమ్మేవాళ్లూముందుకు వస్తారు.
Whenever, wherever, any festival, Meeting/Seminar/Conference/Congress is sponsored by vested interests (particularly those who financially benefit from such Festivals and Meetings), it is difficult to say that they will be run with honesty and integrity. Those who manufacture sex toys, NOT supporting solitary-lonely lives, and supporting paired lives, will never happen. It goes against the very objects of their businesses.
ఏ ఉత్సవాన్నైనా, సభనైనా, వెస్టెడ్ ఇంటరెస్ట్ లు (ఆసభల వల్ల ముఖ్యంగా ఆర్ధికంగా లాభపడే వాళ్ళు) స్పాన్సర్ చేసినపుడు ఆ సమావేశాలు 100% నిజాయితీతో పనిచేస్తాయని లేదు. సెక్స్ టాయస్ తయారు చేసి అమ్మే వాడు, ఒంటరి జీవితాలను సమర్ధించక, జంటరి జీవితాలను సమర్ధించటం ఎన్నటికీ జరగదు.
స్వసంపర్కం అనేది ప్రచారం చేసి అమ్ముకోతగిన సరుకా (ట్రెయిటా), లేక కొనుగోలు చేసి సర్వాంగాలకు అంటించుకోతగిన సాధనమా, అనేది ఒక బిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిగురించి చర్చించాలంటే వేయి పేజీలు చాలవు. ఇంత చిన్న వ్యాసంలో అసాధ్యం.
ఇంకా ఉంది. త్వరలో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.