276 స్వయం సంపర్కం పై అధ్యయనం రెండవ భాగం
చర్చనీయాంశాలు: 276, స్వయంసంపర్కం, బ్రెండాన్ ఓనిల్, స్వప్రేమ, narcissism, హస్తమైథునము
ఇది పోస్టు నంబర్ 275 యొక్క కొనసాగింపు. 275 చదవాలనుకునే వారికి లింకు: http://problemsoftelugus.blogspot.in/search/label/275. 275కి వెళ్లటానికి క్లిక్.
ముందుగా పాఠకులకు క్షమాపణలు, స్పష్టీకరణలు
ఈ వ్యాసంలో సెక్సును ఉత్తేజ పరిచే (sexitement) కలిగించే అంశాలు ఏమీ ఉండవు. వాటికి వేరే వెబ్ సైట్లు, బ్లాగులు ఉంటాయి. ఇది కేవలం పరిశోథనాత్మక, సత్య శోథక పరిశీలన మాత్రమే. కనుక అట్టివి ఆశించి ఈ బ్లాగును చదువుతున్న పాఠకులకు నా క్షమాపణలు. వారు విండో పైన ఉండే X ను క్లిక్ చేసుకొని వేరొకబ్లాగ్ కు వెళ్ళవచ్చును.
స్వసంపర్కాన్ని సమర్ధించటం కానీ, వ్యతిరేకించటంగానీ, తదనుగుణంగా ఉద్యమాలను చేపట్టటం, నా లక్ష్యం కాదు. నా ప్రాథమిక లక్ష్యాలయిన నాస్తికత్వం, మార్క్సిజం, హేతువాద సైంటిఫిక్ అప్రోచ్ లకు అనుగుణంగానే ఈ పరిశీలన ఉంటుంది.
ముందుగా ఆంగ్లంలో లోతుగా అవగాహన లేని నా పాఠకుల కొరకు బ్రెండన్ ఓనిల్ గారి వ్యాసంలోని మొదటి రెండు పేరాలను కోట్ చేసి, తెలుగు సారాన్ని ఇస్తాను.
Remember when masturbation was something everybody did but no one talked about? It was not most people’s idea of a conversation starter. Certainly nobody boasted about being a self-abuser. It was seen as a sorry substitute for sex, a sad stand-in for intimacy.
తెలుగు సారం: ప్రతివారు చేసే స్వసంపర్కం, కాని ఎవరూ దాని గురించి మాట్లాడని స్వసంపర్కం పాత రోజులను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ప్రారంభించటానికి పనికి వచ్చే విషయం (కాన్ వర్ సేషన్ స్టార్టర్) గా అది ప్రజల ఐడియా కాదు. (వైబీగాడిద వ్యాఖ్య: బ్రెండన్ ఓనిల్ గారి వ్యాసం ఇంగ్లాండులో ఆరిజినేట్ అయింది. సాధారణంగా వాతావరణాన్ని ప్రస్తావిస్తు సంభాషణలను స్టార్ట్ చేయటం అక్కడి ఆచారం. ఉదా: చలి విపరీతంగా ఉంది. వర్షంకూడ తోడయింది, వంటివి. భారత్ లో కూడ మాస్టర్బేషన్, ఏరాష్ట్రం లోగానీ సంభాషణా స్టార్టర్ కాదు.). తాను సెల్ఫ్ ఎబ్యూజర్ నని (స్వయంతృప్తిపొందే మనిషినని) ఏవ్యక్తీ డబ్బా కొట్టుకునేవాడు కాదని నిశ్చయంగా చెప్పచ్చు. సెక్స్ కు, ఇంటిమసీకి (స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యానికి) అది ఒక సారీ సబ్ స్టిట్యూట్ (విచారించవలసిన మార్పిడీ. అంటే తప్పని సరియై బాధతోచేసేది అనే భావంలో)గా భావించ బడేది.
Not any more. Masturbation has been reinvented as ‘self-love’, a healthy and positive form of self-exploration. Where once schoolboys were told it was a sin, now they’re told it is essential to good health. An NHS leaflet distributed in schools advised teens to masturbate at least twice a week, because ‘an orgasm a day’ is good for cardiovascular health. The BBC is getting in on the act, too: its teen advice site insists masturbation is ‘good for you as it helps relieve stress’ and ‘can help you sleep, and it may even help your genitals keep in top working order. It also allows you to explore what you enjoy.’ And we wonder why so many teenage boys become addicted to internet porn.
ఇంక ఎంత మాత్రం కాదు. స్వయంప్రేరిత స్వయంతృప్తి , సెల్ఫ్-లవ్ (స్వప్రేమ) గా తిరిగి కనిపెట్టబడ్డాయి. ఒక ఆరోగ్యకరమైన, సకారాత్మకమైన సెల్ఫ్ ఎక్స్ ప్లొరేషన్ (వైబీగాడిద వివరణ: తనను తానే వెతుక్కోటం, కనుక్కోటం. దీనిని మనం స్వాన్వేషణ, స్వావిష్కరణ అనే పదాలుగా మనం కాయిన్ చేసుకోవచ్చు). పాఠశాల విద్యార్ధులు, స్వసంపర్కం పాపంగా చెప్పబడ్డ ప్రదేశంలోనే, ఇపుడు వారు మంచి ఆరోగ్యానికి అవసరంగా చెప్పబడుతున్నారు. పాఠశాలల్లో పంచబడిన ఒక జాతీయ ఆరోగ్య సేవ కరపత్రం (వైబీవివరణ: ఇంగ్లాండులో ఇది హెల్త్ డిపార్ట్ మెంట్ వారిచే నడిపే పథకం), టీన్స్ ను (యువతీయువకులను) వారానికి కనీసం రెండు సార్లు స్వసంపర్కం చేసుకోమని సలహా ఇచ్చింది; ఎందుకంటే, ''యాన్ ఆర్గాజం ఏ డే ''-- రోజుకి ఒక భావప్రాప్తి కార్డియో వాస్కులార్ హెల్త్ (హృదయ రక్తనాళాల ఆరోగ్యం)కి మంచిది.
బిబిసి కూడ రంగలోకి దిగుతున్నది; టీన్స్ కు వాళ్ళ సలహాల వెబ్ సైట్ నొక్కిచెప్తున్నది;
''స్వసంపర్కం మీకు మంచిదే. ఎందుకంటే, అది మీలో వత్తిడిని (స్ట్రెస్ ని) తగ్గిస్తుంది.'' మరియు ''అది మీకు నిద్రపోటానికి సహాయం చేయగలదు మరియు మీ జననాంగాలను (జెనిటల్స్ ను) మంచి పనిచేసే స్థితిలో (టాప్ వర్కింగ్ ఆర్డర్) ఉండటానికి కూడ సహాయం చేయ వచ్చు. అది మీరు దేనిని ఎంజాయ్ చేస్తారో , దానిని అన్వేషించుకోటాన్ని, కనుక్కోటాన్ని చేయనిస్తుంది.
మరియు భారీ సంఖ్యలో టీనేజి బాలురు ఇంటర్నెట్ పోర్న్ కు ఎందుకు అలవాటుపడి పోతున్నారో మనం ఆశ్చర్యపోతాం. (వైబీ గాడిద వివరణ; ఇక్కడ మనం ఒక పరోక్ష అర్ధాన్ని తీయచ్చు. జాతీయ ఆరోగ్య పథకం, బిబిసి మొ|| సంస్థలనుండి మాస్టర్బేషన్ కి లభిస్తున్న ప్రోత్సాహం వల్లనే, యువకులు పోర్న్ కి అలవాటుపడి స్వసంపర్కం చేసుకుంటున్నారేమో అనే భావం కనిపిస్తున్నది.)
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
అంతర్జాతీయం: ఇంటర్నెట్ లోపోర్న్ బ్రవుజ్ చేసే అంతర్జాతీయ టీన్స్ లో ఎంత భాగం ప్రభుత్వ ప్రైవేటు ప్రోత్సాహల వల్ల , బ్రౌజింగుతో పాటు, స్వసంపర్కం కూడ చేసుకుంటున్నారు ; ఎంతమంది స్వలింగ సంపర్కం, భిన్నలింగ సంపర్కం కొరకు ఆవురావురు మంటూ, స్వసంపర్కేతర దిశలలో (అంటే డేటింగులు, పెళ్ళిళ్లు, వ్యభిచారాలు, మానభంగాలు మొ||) అనేదానిపై యూరప్ లో,అమెరికాలో పెద్ద స్థాయిలో శాస్త్రీయమైన అధ్యయనాలు జరగాలి.
భారతీయం, తెలుగీయం; ఇంటర్నెట్ లోపోర్న్ బ్రవుజ్ చేసే భారతీయటీన్స్, మరియు తెలుగు టీన్స్ లో ఎంత భాగం ప్రభుత్వ ప్రైవేటు ప్రోత్సాహల వల్ల , బ్రౌజింగుతో పాటు, స్వసంపర్కం కూడ చేసుకుంటున్నారు ; ఎంతమంది స్వలింగ సంపర్కం, భిన్నలింగ సంపర్కం కొరకు ఆవురావురు మంటూ, స్వసంపర్కేతర దిశలలో (అంటే డేటింగులు, పెళ్ళిళ్లు, వ్యభిచారాలు, మానభంగాలు మొ||) అనేదానిపై యూరప్ లో,అమెరికాలో పెద్ద స్థాయిలో శాస్త్రీయమైన అధ్యయనాలు జరగాలి.
నానాటికి పెరుగుతున్న అక్రమ డేటింగులు (దీనికి సంఘ్ పరివార్లో కొంత వ్యతిరేకత ఉండి, కర్నాటకలోని మంగుళూరు వంటి చోట్ల సోషల్ పోలీసింగుకి దారి తీసిన సంఘటనలున్నాయి), మానభంగాలు, యాసిడ్ దాడులు, పెళ్ళిచేసుకుంటానని చెప్పి వాడేసుకొని వదిలేయటాలు మొ|| లైంగిక నేరాల నేపథ్యంలో, స్త్రీపురుషులపై ఇంటర్నెట్ బ్రౌజింగు ప్రభావం అనే అంశం పై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఇన్ కెమేరా విచారణ చేపట్టటం మేలేమో. (పోర్న్ ప్రభావంతో స్వసంపర్కానికి పాల్పడితే, నేరాలు జరిగే అవకాశాలు తక్కువ. అందుచేత స్వసంపర్కం నేరాలతో పోలిస్తే తక్కువ హానికరమైనదే. ప్రోత్సహించతగినదే. అయితే ఇది పెద్దల సమ్మతిచో జరగాలా, బహిరంగంగా అంటే దాపరికంలేకుండా భయభీతులు సిగ్గు బిడియాలు లేకుండా జరగాలా ఇవన్నీ లోతుగా అధ్యయనం చేయాల్సినవే.
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.