258 సాష్టాంగ నమస్కారాల కన్నా జ్ఞాన జనిత వైరాగ్యం ముఖ్యం
చర్చనీయాంశాలు: గవర్నర్లు, వైరాగ్యం, పోతన, తిరుమల, భాగవతం, చంద్రబాబు
డెక్కన్ క్రానికల్ పత్రికవారి దయతో ఈక్రింది చిత్రాన్ని చూడండి.
బంగాల్ గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎంతటి భక్తవరేణ్యులోకదా. మన గవర్నర్లు నిరక్షరాస్యులు కాదు. విద్యాధికులు, మేధావులు, కానీ దురదృష్టవశాత్తు అప్లికేషన్ ఆఫ్ మైండ్ చేయలేని, అనిర్వచనీయ కారణాల వల్ల స్థగ్ధులు.
మీడియాలో వచ్చిన, నాచేత సుందరీకరణ చేయబడిన, ఈచిత్రాన్ని చూడండి!!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఎంత చక్కగా సాష్టాంగ పడుతున్నారో. ఇది మొదటి సారీ అవదు, చివరిసారీ అవదు. తన పదవీకాలంలో శ్రీగవర్నర్ గారు ఎన్నిసార్లు తిరుమల సందర్శించారో, ఎన్నిసార్లు అధికారికమో, ఎన్నిసార్లు అనధికారికమో, ఎన్నిసార్లు హెలికాప్టర్లను | కిరాయి విమానాలను | అరువుతీసుకున్న ప్రైవేటు హెలికాప్టర్లు, బదులు తీసుకున్న ప్రైవేటు విమానాలను వాడారో, ఎన్నిసార్లు ఎయిర్ ఇండియా విమానాలను | రైళ్ళను | బస్సులను (ఏమో!!) వినియోగించారో లెక్కలు లేవు.
ఏ మతానికి చెందిన వాళ్ళైనా- సరే దేవుళ్ళు ఉన్నట్లు ఋజువులు లేవు.
సూపర్ హ్యూమన్ పవర్సు అంటే మానవాతీత శక్తులు ప్రకృతిలో ఉంటే ఉండ వచ్చు. వాటిని మనం దేవుడు(త) అని పేరు పెట్టి ప్రార్ధనలు చేసినా, సాష్టాంగపడినా, అవి మనలని దయతలుస్తాయనటానికి అసలు ఆధారాలే లేవు.
దేవుడు ఉన్నాడు అని తాత్కాలికంగా అనుకున్నా, అతడు సగుణుడా (ఆకారం కలవాడా), నిర్గుణుడా (ఆకారం లేని వాడా) స్పష్టం కాలేదు.
యోగులు, జ్ఞానులు దేవుడు నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మం అంటే పూజారులు, స్వాములవార్లు, విగ్రహాల్లో దేవుడు ఉండటమే కాక, ఆయనను ప్రతిష్ఠించేటపుడు మేము చదివే మంత్రాల వల్ల, చేసే హోమాలు, పూర్ణాహుతులు, కలశాభిషేకాలు, ప్రోక్షణాల వల్లనే, విగ్రహాలకు శక్తి వస్తుంది అని ప్రచారం చేసుకుంటున్నారు.
స్టేజీల మీద పురాణాలు చెప్పే వాళ్ళు బయలుదేరి, మేము సమన్వయ పరుస్తున్నాం, అడిగిన వాళ్ళకి దేవుడు సగుణంగా (రూపంతో) విగ్రహంగా కనిపించి మన పూజలు అందుకుంటాడు. నిర్గుణంగా కావలసిన వాళ్ళకి కేవలం బ్రహ్మానందానుభవం రూపంలో వ్యక్తం అవుతున్నాడు. ఎవరికి కావలసినట్లు వాళ్ళకి దొరుకుతాడు , అని చెప్పి తమ ఉపన్యాసాలకు తమ దక్షిణలను తాము పోగుచేసుకుంటున్నారు.
కొందరు యోగులు, జ్ఞానుల ప్రకారం, విగ్రహారాధన అనేది దైవం మనసును నిలుపుకోటానికి మొదటి మెట్టే, ప్రతి వ్యక్తీ సగుణంలోనుండి నిర్గుణంలోకి మనసు నిలపటం అలవాటు చేసుకోక పోతే వాడికి మోక్షం ఉండదు, అంటూ బోధిస్తూ ఉంటారు.
ఇపుడు మన రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు ధ్వజస్థంభాల ముందు సాష్టాంగ పడుతున్నారు కాబట్టి మొదటి మెట్టులో ఉన్నట్లా , చివరి మెట్టులో ఉన్నట్లా? ఎన్నో ఏళ్ళబట్టి విగ్రహారాధన చేస్తున్న గవర్నర్ వారికి, నిర్గుణోపాసనపై ఎందుకు మనసు పోవటంలేదు?
గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు నిర్గుణోపాసనపై ఎందుకు మనసు పోవాలి?
గవర్నర్ల వలెనే, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, స్వాములవార్లు, వీళ్ళంతా జాతికి మార్గ దర్శకుల క్రింద లెక్క. మరి వీళ్ళే విగ్రహారాధనలో కూరుకుపోయి, విఐపి దర్శనాలు మరల మరల పొందుతూ, సామాన్యులను ఇక్కట్ల పాలు చేస్తున్నారంటే, లోపం ఎక్కడున్నట్లు? ఎనిమిదిన్నర కోట్లమంది తెలుగు ప్రజలలో, ఎనిమిదింపాతిక కోట్లమంది అజ్ఞానులు, పాతిక లక్షల మంది జ్ఞానులు అనుకోటం కుదరదు. ఎందుకంటే, జ్ఞాని అయిన వాడు జ్ఞాని లాగా కనపడడు.
వైబీరావు గాడిద సూచన
దీనికి ఒక పరిష్కారం ఉంది. ప్రతి వ్యక్తీ ఆత్మ పరీక్ష చేసుకోటం. అసలు దేవుడు(త) ఉన్నాడా(ఉన్నదా). ఉండెను పో, సగుణుడా, నిర్గుణుడా, రెండునా, రెండూ కాదా?
నేను జ్ఞాన సముపార్జనలో ఏదశలో ఉన్నాను? నేను దేవుడు ఉన్నాడని నమ్మితే, అతడు నిర్గుణుడైన సచ్చిదానంద బ్రహ్మం, అని గ్రహించటానికి ఏమిటి అడ్డంకి? దేవుడు సచ్చిదానంద బ్రహ్మం, బ్రహ్మానందానుభవం ద్వారా మాత్రమే గ్రహించవలసిన, నాలోనూ, నా బయటా ఉన్న ఒక దివ్య శక్తి, అని గ్రహించినపుడు, దేవుడు(త) సర్వాంతర్యామి అని అర్ధం చేసుకున్నప్పుడు, నేను తిరుమల వెళ్ళటం అనవసరం, అనే జ్ఞానం మన వీవీఐపీలకు, వీఐపీలకు ఎందుకు కలుగదు? వారికి ఆజ్ఞానం కలిగినపుడు, కమ్మి ఉన్న అజ్ఞానం తొలగినపుడు, వారు తిరుమల వెళ్ళరు. సాష్టాంగ పడరు. దివ్యానుభవాన్ని (అది ఉంటే) ఇంట్లోనే పొందుతారు.
ఇది జరిగినపుడు, తిరుమలలో సామాన్యుడికి సగుణ విగ్రహారాధాన , దర్శనం తేలికవుతుంది. రకరకాల దర్శనాల టిక్కెట్లు పెట్టి, సామాన్య జనాన్ని తాము చూడాలనుకుంటున్న విగ్రహాన్నైనా సరిగా చూడనివ్వకుండా, విఐపీల సేవలో తరించే దేవాలయ పాలకాధికార గణానికి కనువిప్పుకావాలి. వారు టిటిడీ భక్తి ఛానెల్ లో, నిర్గుణోపాసన అనే పైమెట్టుకు, సగుణ భక్తులను ఎక్కించటానికి, అవసరమైన ఉపన్యాసాలను, నాటక నాటికలను, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
ఈలోపల, లడ్డూ ప్యాకెట్ల సంచి భుజానికి తగిలించుకొని తిరుమల అర్చక దళాల వారు ముఖ్యమంత్రుల చుట్టూ, రాష్ట్రమంత్రుల చుట్టూ, ప్రధానమంత్రి- రాష్ట్రపతి చుట్టూ , కేంద్రమంత్రుల చుట్టూ తిరిగి వారిని తిరుమల దర్శించమని అర్ధించటం మానేయటం అవసరం. అర్చకుల ప్రధాన విధి వివిఐపీలను,వీఐపీలను కాకా పట్టటం కాదు. దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచటం, దేవాలయాదాయాన్ని పెంచటం, ప్రసాదాల్లో వాటాలను పంచుకోటం, ఇవి వారి విధులు కానే కావు. ప్రతి అర్చకుడు, విఐపీలకు రెండు ముక్కలు చెప్పే అవకాశం వస్తే, దానిని నిర్గుణోపాసన యొక్క ప్రాముఖ్యతను వారి దృష్టికి తీసుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. తిరుమల దర్శనాల సమయాలను, పూర్తిగా సామాన్యుల కొరకు కేటాయించాలి.
ఈనాటి పద్యం
మహాకవి బమ్మెర పోతనా మాత్యుడు. భాగవతం లోది. సీస పద్యం.
Kamaniiya bhuumi bhaagamulu leekunnavee ,
కమనీయ భూమి భాగములు లేకున్నవే
pad`i yund`ut`aku duudi parupuleela?
పడియుండుటకు దూది పరుపులేల?
Sahajambulagu karaanjalulu leekunnavee ,
సహజంబులగు కరాంజలులు లేకున్నవే,
bhoojana bhaajana punjameela?
భోజన భాజన పుంజమేల?
Valkalaajinakus`aaval`ulu leekunnavee,
వల్కలాజిన కుశావళులు లేకున్నవే,
kat`t`a dukuula sanghambu leela?
కట్ట దుకూల సంఘంబు లేల?
Konakoni vasiyimpa guhalu leekunnavee,
కొనకొని వసియింప గుహలు లేకున్నవే,
praasaada saudhaadi pat`ala meela?
ప్రాసాద సౌధాది పటలమేల?
తేటగీతి.
phala rasAdulu kuriyavE pAdapamulu?
ఫల రసాదులు కురియవే పాదపములు ?
Svaadu jalamula nund`avee sakala nadulu ?
స్వాదు జలముల నుండవే సకల నదులు?
Posaga bhikshamu vet`t`aree pun`ya satulu ?
పొసగ భిక్షము వెట్టరే పుణ్య సతులు?
Dhana madaandhula koluveela , taapasulaku ?
ధన మదాంధుల కొలువేల తాపసులకు?
This comment has been removed by a blog administrator.
ReplyDeleteపై వ్యాఖ్యను తీసివేయుటకు కారణం. స్పామ్. తీవ్ర విమర్శలకు కూడ స్వాగతమే. కానీ స్పామ్ కు కాదు. నా బ్లాగ్ ను ఎక్కడా ప్రమోట్ చేయవలసిన పని లేదు. నా కా ఉద్దేశ్యం కూడ లేదు. నా బ్లాగ్ ను ఎవరూ చదవకపోయినా నాకు దిగులు లేదు. చదవకపోతే భారతీయులకు తెలుగు వాళ్ళకు స్వల్పనష్టం ఉంటే ఉండ వచ్చేమో కానీ నా కేమీ నష్టం ఉండదు. కారణం, ఇప్పుడు నేను ఇక్కడ వ్రాస్తున్న విషయాలను నోటితో చెప్తే వినే వాళ్ళు నన్ను పిచ్చి వాడి క్రింద భ్రమ పడే అవకాశం ఉంది. ఇతరులకు నోటితో చెప్పి పిచ్చివాడిక్రింద జమకట్టపడే కన్నా, నా ఆలోచనలను గ్రంధస్థం చేస్తే భారతీయులకు తమ చరిత్ర రికార్డులను వ్రాసుకునే సంస్కృతి లేదు అని వచ్చిన అపప్రథను ఆవగింజంత తగ్గించిన వాడినవుతాను. ఇది చదివేవారికి కనీసం ౨౦౧౪ ఆంధ్రప్రదేశ్ లో, భారత్ లో ఏమి జరిగింది నివ్వరి గింజ పరిమాణంలో నయినా తెలిసే అవకాశం ఉంది. ఏనీ వే థ్యాంక్యూ ఫర్ ఇవర్ స్పామ్, శ్రీవిజేందర్ రెడ్డిగారూ.
ReplyDelete