257 ఈ దేశం యొక్క ఆర్ధిక ఆరోగ్యాన్ని మెరుగు పరచటానికి శ్రీమోడీ గారు కఠిన నిర్ణయాలు తీసుకుంటారట!!
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, ఆర్ధికం, బిజెపి
భారత ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచటానికి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీగారుకఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి మాటలలోనే చదవండి.
I have taken over the reins of this country in circumstances when there is nothing left behind by the previous Government. They left everything empty. The country's financial health has hit the bottom.
తెలుగు సారం: నేను ఈ దేశం యొక్క పగ్గాలను, పాత ప్రభుత్వం ఏమీ మిగల్చకుండా వదిలేసినపరిస్థితులలో స్వీకరించాను. వాళ్లు ప్రతిదానిని ఖాళీగా వదిలేశారు. దేశం యొక్క అర్ధిక ఆరోగ్యం పాతాళాన్ని తాకింది.
Taking tough decisions and strong measures in the coming one or two years are needed to bring financial discipline which will restore and boost the country's self-confidence.
దేశం యొక్క ఆత్మ విశ్వాసాన్ని పునరుధ్ధరించి, వృధ్ధి చేసేఆర్ధిక క్రమశిక్షణను తీసుకు రావటానికి , రాబోయే ఒకటి రెండేళ్ళలో, కఠిన నిర్ణయాలను మరియు బలమైన చర్యలను తీసుకోటం అవసరం.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీవారు తన కఠిన చర్యలను ఎవరిపై తీసుకుంటారో తెలియదు. తనకు విరాళాలిచ్చిన పెద్ద పారిశ్రామిక వేత్తలపై తీసుకోగలరా? తీసుకోలేరు.
తన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే, దేశానికి కూడ వెన్ను దన్నుగా నిలిచే చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తల విషయంలో ఆయన ఏమైనా కఠిన నిర్ణయాలను తీసుకుంటారా? దాని వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది.
మధ్యతరగతి వారిని గిల్లితే, వారు ట్విట్టర్ లో తిట్టిపోస్తారు.
నిరుపేదల పై తీసుకుంటారా? మూలిగే నక్కలపై తాటిపండ్లు పడ్డట్లుగా అవుతుంది.
భారత ఆర్ధిక సమస్యలకు అత్యంత ప్రధాన కారణాలు, ఈగాడిద దృష్టిలో:
౧. అదుపులేని జనాభా. చైనాను దాటి వెళ్ళిపోతున్నాం. భారతీయుల పునరుత్పత్తి శక్తి ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేస్తుంది. కఠిన నిర్ణయం తీసుకోవాలంటే, నిరోధ్ లను, వాసెక్టమీలను, ట్యూబెక్టమీలను, ఇతర కుటుంబ నియంత్రణ పధ్ధతులను , మోడీ గారు తన ఎన్నికల ప్రచారాన్ని ఎంత అంకిత భావంతో చేసుకున్నారో, అంతే అంకిత భావంతో చేపట్టాలి.
౨. సూర్యశక్తిని, కెరటాల శక్తిని వాడకుండా, దిగుమతి చేసుకున్న క్రూడ్ పై , గ్యాస్ పై ఆధారపడటం. ఇంటింటికీ, సూర్యశక్తి దీపాలను, స్టవ్ లను, పంకాలను, ఉచితంగా ఇస్తారా?
౩. ప్రైవేటు వాడకానికి కార్ల ఉత్పత్తిని నిషేధిస్తారా? ఆడి, మెర్సిడెజ్, బిఎండబ్ల్యూ, స్కోడా, చెవర్లెట్, రోల్సరాయిస్ వంటి కార్ల తయారీని నిషేధిస్తారా?
౪. వైద్యశాలలు మొ|| అత్యవసర వాడకాలకు తప్ప ఇంటింటిలో వాడబడుతున్న ఏసీ లను నిషేధిస్తారా?
౫. టీవీల ద్వారా జరిగే విద్యుత్ ఖర్చును తగ్గించాలంటే, ఫుట్ బాల్, క్రికెట్ మొ|| కామెంటరీలను నిషేధించాల్సి వస్తుంది. నిషేధించ గలరా?
౬. విదేశీ టూరిస్టులకు తప్ప, మిగిలిన అనవసర ఖరీదైన హోటళ్ళను మూసేయ గలరా?
౭. భారతీయులు 90% మంది మూర్ఖులు అని ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగారు అని తరువాత విరమించుకున్నారు కానీ, భారతీయులు నిజంగానే బుధ్ధిహీనులు అనటంలో సందేహం లేదు. ఎలాగంటే, చైనా 36౦౦౦ చదరపు మైళ్ళ భారత భూభాగాన్ని 1962 లో ఆక్రమించుకున్నది. పరమాణు శక్తి కల దేశమైన, చైనాతో సాయుధ యుధ్ధం చేయటం కుదరదు అనే మాటనిజమే. భారతీయులు బుధ్ధిహీనులు ఎందుకంటే, అదే చైనానుండి ఏడాదికి 5౦బిలియన్ డాలర్లదాకా గుండుసూదినుండి సెల్ ఫోన్ ల వరకు కొంటూ, వారి ఆర్ధిక వ్యవస్థకు మూల స్థంభాల్లాగా, మహారాజ పోషకులు లాగా మారామంటే, మనం బుధ్ధిహీనులమా, బుధ్ధిమంతులమా? ఈ దురాక్రమణదారు అయిన చైనా దేశాన్ని, నరేంద్రమోడీగారు నాలుగు సార్లు సందర్శించి, వారిని ఏమి అడుక్కొని వచ్చారో మనకి తెలియదు. కఠిన నిర్ణయాలను తీసుకుంటానన్న శ్రీ నరేంద్రమోడీగారికి, చైనానుండి చేసుకునేదిగుమతులను, ఆదేశానికి చేసే ఎగుమతులను దాటకుండా (అంటే షుమారు 20 బిలియన్ డాలర్లుకు) అదుపుచేయగల ధైర్యం శ్రీమోడీగారికి ఉన్నదా?
౮. దేశంలో ప్రతిపట్టణంలోనూ, నగరంలోనూ, ఎందరో లంచావతార ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, భూస్వాములు, సినీతారలు, క్రికెటర్లు, విచ్చలవిడిగా భూములను, ఒక్కోళ్ళు పదేసి ప్లాట్లను కొని పారేశారు. కొందరికి వేలాది ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఆ భూములను దున్నరు. ఇళ్ళు కట్టరు. అవి పడావ్ గా పడి ఉంటాయి. దీని వల్ల సాగుభూమికి కరువు ఏర్పడి వ్యవసాయ వృధ్ధిరేటు ఘోరంగా దెబ్బతిన్నది. శ్రీనరేంద్రమోడీ గారు, ఆ ప్లాట్లన్నిటినీ, పరిమితిని మించి పోగేసుకున్నవాటిని, ఏపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకోగలరా? అలా స్వాధీనం చేసుకున్న సాగుకు అనుకూల భూములలో, ప్రభుత్వ స్వంత వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పి ఉపాధి చూపగలరా?
౯. బ్యాంకులనుండి అప్పులు తీసుకున్న బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, నిధులను దారిమళ్ళించి రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులు పెట్టారు. స్పెక్యులేషన్ లాభాలతో పోలిస్తే బ్యాంకు వడ్డీ చవుక, కిస్తులు తేలికగా ఉంటాయి కాబట్టి, వారు ఆ ఋణాలను కావాలనే కట్టక పోటమే కాక, కొన్ని విదేశాల్లో ఉన్న మాంద్యాన్ని ఒకకారణంగా చూపించి కొత్త ఋణాలు అడుగుతున్నారు. వడ్డీలు తగ్గించమని అడుగుతున్నారు. శ్రీమోడీకి ధైర్యం ఉంటే, ప్రతి బ్యాంకు (ప్రైవేటు మరియు ప్రభుత్వ తేడా లేకుండా) ఇచ్చిన పెద్ద ఋణాలను లోతుగా ఆడిట్ చేయించి, దారి మళ్ళించిన ఋణాలను వసూలు చేయగలరా?
౧౦. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, ఇలా రకరకాల పేర్లతో పిలువ బడుతున్న భారతీయ సినిమా రంగంలో కొన్ని వేలకోట్ల నల్ల డబ్బు, నేరగ్రస్త డబ్బు, చలామణీ అవుతున్నది. మాఫియా డాన్ లు ఋణదాతలుగా, చలామణీ అవుతున్నారు. సినిమారంగంలోకి కుప్పలుగా వచ్చి పడుతున్న నేరగ్రస్త డబ్బును, శ్రీమోడీ ఏవిధంగా స్వాధీనం చేసుకుంటారు, అనేదానిని వెండి తెరపై చూడాలి.
౧౧. కాదేదీ కవిత కనర్హం అని స్వర్గీయ శ్రీశ్రీ అన్నారు కానీ, కాదేదీ జూదాని కనర్హం అని ఆయన అని ఉండాల్సింది. ఎందుకంటే, ఈదేశంలో, క్రికెట్, ఫుట్ బాల్, ఐపీఎల్, మొ|| నానావిధ క్రీడలలోకి, ఎన్నికలు, కోడిపందాలు, వానలు, స్టాక్ మార్కెట్ లు, ప్రతిదానిలోకీ జూదం చొరబడింది. వీటిల్లో ఏజూదాన్ని శ్రీనరేంద్రమోడీగారు ఆపించగలరు?
మోడీగారి మాటలను బట్టి చూస్తుంటే, వారు పాశ్చాత్య రేటింగు సంస్థల తృప్తి కొరకు, భారత ప్రజలను పన్నులతో బాదుతారా, అనే అనుమానం కలుగుతుంది!!
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.