హింసలు పలు రకాలు. సమీక్షలు కూడ హింసలే.
చర్చనీయాంశాలు-- హింసలు, సమీక్షలు, మంత్రివర్గసమావేశాలు, ఆంధ్రప్రదేశ్
శేషాంధ్ర ప్రదేశ్ ప్రధమ మంత్రివర్గ సమావేశం, విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి సభామందిరంలో , 12.6.2014 నాడు ఘనంగా జరిగినట్లు మీడియా చెప్తున్నది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
మంత్రివర్గ సమావేశాలకు, 16 వ నంబరు జాతీయ రహదారిని దిగ్భంధం చేయవలసిన అవసరం ఏమిటి?శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏడు గంటలపాటు మంత్రి వర్గం సమావేశం నిర్వహించారట. మన మంత్రి వర్గ సమావేశాలలో మంత్రులు మాట్లాడేది చాలా తక్కువ. ముఖ్యమంత్రి మాట్లాడేది చాలా ఎక్కువ. ఈ ఆచారానికి అనుగుణంగా, శ్రీచంద్రబాబు నాయుడు గారు, ఏడు గంటలూ తనదైన శైలిలో, వేగంతో, మంత్రులను, అధికారులను ఉద్ బోధించి ఉంటారని (శ్రీబాబుకి శ్రీమోడీ గురువా, లేక శ్రీ మోడీకి శ్రీబాబు గురువా కాలమే నిర్ణయిస్తుంది), వేరే చెప్పనక్కరలేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.