Added on 4th Jan. 2016: People of Residual Andhra Pradesh have not learnt any lessons from the forced unjust bifurcation of United Andhra Pradesh. The People of Residual A.P. deserve this treatment.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికార ప్రతినిధి, మాన్యశ్రీ సందీప్ దీక్షిత్ గారు , పత్రికల ప్రకారం ఒక ప్రకటన చేశారు. దాని సారం ఇది.
ముఖ్య మంత్రులు , పార్లమెంటు చేసే రాష్ట్రాల విభజనలను ఆపలేరు.
పరిశీలన.
________
ఇది దీక్షిత్ గారి వ్యక్తిగత అభిప్రాయమో లేక కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారిక అభిప్రాయమో తెలియదు. అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ అనుమతి తో ఇలా చెప్తున్నారో తెలియదు.
కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు, టీ నాయకులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఇలానే అంటున్న్రారు. అందరూ కలసి సీమాంధ్ర ప్రజలపై కక్షకట్టారా అనిపిస్తుంది. లేక సీమాంధ్ర ప్రజలు విధి వంచితులా అనిపిస్తుంది.
అలనాటి పాండవులు అడవులకు వెళ్ళారంటే, అందులో జూదమాడటం అనే స్వంత లోపం ఉంది. కానీ సీమాంధ్ర సామాన్య ప్రజలలో అటువంటి దోషాలేమీ లేవు. దేశంలో ఎక్కడైనా బ్రతుకుతెరువు సంపాదించుకోటం, చిన్నచిన్న ఆస్తులను సంపాదించుకోటం వారి ప్రాధమిక హక్కు. ఈ హక్కు ఒక మానవ హక్కు. దీనిని దేవుడే తొలగించలేడు. ఇంక పార్లమెంటేమి తొలగిస్తుంది ! కాంగ్రెస్ మరియు బిజెపి కుమ్మక్కై ఏక పక్షంగా రాష్ట్ర విభజనకు పూనుకోటం హృదయ విదారకం. సీమాంధ్ర ప్రజల శ్రామిక బ్రతుకు తెరువు హక్కులకు భంగకరం. కేవలం కొన్ని ఆత్మహత్యలు జరిగాయని (ఇవి కూడా ఎక్కువగా టీ లీడర్ల దుర్బోధల వల్ల జరిగినవే ), సీమాంధ్ర ఆమ్ ఆద్మీని సంప్రదించకుండా, తమకు ఇష్టం వచ్చిన రీతిలో విభజనకు పూనుకోటం ఘోరం, అమాయక తెలంగాణా_సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును తెరాస నేతల కబంధ హస్తాల్లో పెట్టటం దారుణం. తెరాసను కాంగ్రెస్ లో లీనం అవమని ప్రార్ధించటం , వారు మోసం చేయటానికి ప్రయత్నించటం , ఇంక ఏం జరుగుతుందో , మనం తెరపై చూడాలి.
ఇప్పుడు కేంద్రమంత్రుల బృందం MOG కి అప్పగించిన terms of reference లో కూడా కీలక విషయాలేమీ లేవు. సీమాంధ్ర ప్రజలు ఏ సూచనలను పంపినా కూడా అవి మా terms of reference లో లేవు అని తొక్కి పారేసే అవకాశం ఉంది. సూచనలను ఆహ్వానించటం అనేది ఒక కంటి తుడుపు చర్యగా మిగిలి పోయే అవకాశాలు బహుళం.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా అని కదా కేంద్ర ప్రభుత్వం న్యాయాన్యాయాలను పట్టించుకోకుండా అడ్డు దారులు, నియంతృత్వ దారులు వెతుక్కునే అవకాశాలున్నాయి. సందీప్ దీక్షిత్ ప్రకటన కూడా అందులో ఒక భాగమే.
ఇటువంటి దారుణ పరిస్ధితులు , కేవలం సీమాంధ్ర ప్రజలకే కాదు, దేశంలోని ఏ ప్రాంత ప్రజలకైనా రావచ్చు. ఇతర రాష్ట్రాల ప్రజలు కొందరు దీనిని వినోదంగా చూస్తుంటే, మరి కొన్ని ప్రాంతాలవారు , తమ భవిష్యత్ ఉద్యమాలకు ఒక case study గా తీసుకొని సీమాంధ్ర ప్రజలవలె నిద్దుర మత్తులో మునుగ కుండా జాగ్రత్తలు పడే అవకాశం ఉంది.
2014లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలకు పలు కఠిన పరీక్షలు రెడీగా ఉంటాయి. ఇల్లలుకగానే పండుగ అవదు అని సోనియా, రాహుల్, మోడీ, సుష్మా స్వరాజ్ ల వంటి అగ్రనేతలే కాక ఇతరులు కూడా గ్రహించటం మేలు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.