బలవంతంగా రుద్దబడుతున్న ఈ తొందరపాటు ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపండి. స్నేహ పూర్వకమైన ఎంపికలను తయారుచేసి ప్రజల్లోకి పంపి, వాటిలోనుండి సీమాంధ్ర మరియు తెలంగాణా ప్రజలను ఎంచుకోనివ్వండి.
సీమాంధ్రకు క్రొత్త రాజధాని ఎంపిక ఒక తీవ్ర సమస్య గా మారబోతున్నది. గుంటూరు కర్నూలు రహదారి లోని నల్లమల కొండల పర్వత మార్గాలు , శిథిలావస్థలో ఉన్న కల్వర్టులతో , దోపిడి దొంగలతో , క్రూర మృగాలతో నిండి ఉండి , రాయలసీమ, మరియు కోస్తాంధ్ర , ఉభయ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయి.
సీమాంధ్రకు కనీసం మూడు రాష్ట్రాలు అవసరం. 1. ఉత్తరాంధ్ర (విశాఖ ప్రాంతం) 2. దక్షిణాంధ్ర (విజయవాడ, గుంటూరు ప్రాంతం) 3. రాయలసీమ.
తెలంగాణకు రెండు రాష్ట్రాలు అవసరం. 1. ఉత్తర తెలంగాణ 2. దక్షిణ తెలంగాణ.
ప్రతిపాదింప బడుతున్న క్రొత్త రాష్ట్రాల వైశాల్యం మరియు జనాభా కేరళ మరియు హిమాచల్ రాష్ట్రాలతో తూగుతాయి.
ఈ రాష్ట్రాలు ఏడు ఈశాన్య రాష్ట్రాల కన్నా పెద్దవి గానే ఉంటాయి.
వీటిని నిర్ణయించ వలసినది, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. మీరూ కాదు, నేనూ కాదు.
3 లేక 5 ఎంచుకోటానికి వీలైన విభజన పథకాలను తయారు చేసి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు వారి ఎంపికకై పంపండి. వాటిని సవరించి ఇతిర ఎంపిక పథకాలను పంపే స్వేఛ్ఛను వారికి ఇవ్వండి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నిర్ణయించాలి. మీరు కాదు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల భావాలకన్నా, మీ నియంతృత్వమే చెల్లుబడి కావాలని , మీరు ఇంకా అనుకుంటూ ఉంటే, రాబోయే 50 ఏళ్ళలో భారత దేశంలోని ఈ ప్రాంతం దృశ్యం , ఎలా ఉండబోతుందో , ఊహించండి.
వరుస సమ్మెలు, బందులు, ఆందోళనలు, ఆత్మహత్యలు, రాబోయే 50 యేళ్ళలో ఎన్ని జరుగుతాయో.
ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించ వచ్చు. పన్నులు, ముఖ్యంగా కేంద్ర పన్నులు చెల్లించటానికి నిరాకరించ వచ్చు.
ప్రజలు న్యాయం కొరకై అంతర్జాతీయ వేదికల కు ఉరకవచ్చు.
ప్రజలు కోర్టులను రిట్లతో నింపుతారు. మరియు మీరు న్యాయస్థానాలనుండి చివాట్లు తిన వలసి రావచ్చు.
జాతీయ సమైక్యత , మరియు ఐక్య భారతదేశం సూత్రానికి తీవ్ర ప్రమాదం వాటిల్ల వచ్చు.
నేను 100% శాతం ఊహించ లేను. మీవి వివేకవంతమైన తలకాయలు కదా. మీరే ఊహించాలి.
కనుక , దయతో, రాజనీతి వేత్తల్లాగా ఆలోచించండి. మైత్రీ పూర్వక పరిష్కారాల కొరకు క ష్టపడి పని చేయండి. దయతో మీరు Ms. సోనియా గాంధీ , రాజీవ్ గాంధీ బానిసలం అనే విషయాన్ని మర్చిపోండి.
ఎలాగైతే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కాంగ్రెస్ అధ్యక్షురాలి బానిసలు కాలేరో, అలాగే, మంత్రివర్గాలు, మంత్రి వర్గ బృందాలు, ప్రధానమంత్రి బానిసల _ బానిసలు కాలేరు.
తెలంగాణకు మీరు న్యాయం చేయటం అంటే సీమాంధ్రకు అన్యాయం చేయటం గా దారి తీయకూడదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.