ఇది ద్రవ్యోల్బణ కాలం. ముడి సరుకులు , రవాణా ఖర్చులు పెరిగినపుడు పత్రికలు మాత్రమే ధరలు పెంచకూడదు, అని మనం అనలేం. కాకపోతే ఒకేసారి ౨౦% పెంచాలా ?
ప్రభుత్వం ఏ వస్తువు / సేవకైనా 1% ధర పెంచినా పత్రికలు "బాదుడు" అని విరుచుకు పడుతూ ఉంటాయి. ఆత్మవత్ సర్వభూతాని అని మర్చి పోతూ ఉంటాయి. మరి తాము ఒకే సారి 20% పెంచాలా ?
పత్రికలు ఇతరులకు నీతి బోధ చేయటంలో అగ్రస్థానంలో ఉండద్దూ మరి.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వెబ్ సైట్ పేరు క్లి క్ . ఈ వెబ్ సైట్లో 24-10-2013 నాటికి ఉన్న తాజా వార్త ఏమిటి .
Sri E.S.L. Narasimhan Assumed the Charge of Office of the Governor of Andhra Pradesh on 28th December, 2009.
ఆ తరువాత ఏమీ జరగలేదా . కనీసం ఢిల్లీ యాత్రల గురించో, తిరుమల యాత్రల గురించో పెట్టచ్చు కదా.
అక్కడ ఉన్న చిత్రం ఎందుకు పని చేయదు? http://governor.ap.nic.in/pics%5Cmainhouse.gif
ఈ చిత్రాన్ని క్లిక్ చేస్తే వచ్చే జవాబు.
The Page you are looking for is not found. Please report missing link to administrator.
ఇందులో చెప్పబడ్డ ఎడ్ మినిస్ట్రేటర్ (పరిపాలకుడు) ఎవరు . 2009 నుండి ఈ వెబ్ సైట్ ఎందుకు ఇలా కుమిలి పోతున్నది?
అంతేకాదు. ఈ వెబ్ సైట్ లో ఒక్క పేజీ కూడా పని చేయదు. ఎందుకని ?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.