Saturday, December 12, 2015

629 Will the Singapore Contractors and the Andhra Pradesh Government collide to cause loss to the people of Andhra Pradesh? सिंगपूर के गुत्तेदार, और आंध्र प्रदेश सरकार मिलाखत होकर, आंध्र प्रदेश के जनता को डुबाते. సింగపూర్ కంట్రాక్కర్లు, ఆంధ్ర ప్దదేస్ ప్రభుత్వం కలిసి ఆంధ్ర ప్దదేశ్ ప్రజలను ముంచేస్తారా?
World Language: English

Global Multi National Corporates are like Shylocks. They will demand their pounds of flesh. Mr. Nara Chandra Babu Naidu, the Chief Minister of Andhra Pradesh is not Shakespeare's Antonio who innocently fell in the trap of Shylock in Merchant of Venice. Antonio was an innocent, noble and open hearted person. But Shri Chandra Babu Naidu is not. We should not forget how he pounced upon his own father-in-law and the then Chief Minister of Andhra Pradesh, like a leopard, to capture power. Normally, this type of things used to happen during Moghul period, in the succession struggles of Jahangir Brothers, Shah Jahan brothers and Aurangzeb Brothers.

CPM Party, CRDA Unit Secretary Shri Ch. Babu Rao made some pertinent Statements in this respect.
Andhra Pradesh State Govt. should issue a white paper on what Singapore companies had sought and what the state had offered them for construction of the state capital Amaravati on the banks of Krishna River.

"...Worst fears of the people have come true with the Singapore companies making it clear that unless the state gives them power of attorney for 3,000 acres of land it can’t go ahead with construction of the capital and that its investment would be limited to just `300 crore. ..."

"...It was also outrageous for the Singapore companies to say that the plots to farmers, who have given their lands under land pooling scheme, should be outside the seed capital,...”

"...It will be in fitness of things if the state government invited national and international bids and entrusted the construction work to them. “It is now the duty of the chief minister to bring pressure on the Centre to allot more funds for the construction of the capital,”

"...Whether the conditions set by the Singapore companies are a part of a game plan of Singapore and AP government - to force people to settle for most of their demands."

“...It is quite possible that Naidu, would at first say the demands were outrageous and then after ‘holding talks with them’ would say he had made them to give some concession to the state government which may not be much but would give him some kind of an authority to go ahead with inviting the Singapore companies to begin work without much flak...”

India's National Language: Hindi

अंतर्जातीय बहळ जाती कार्पोरेट्स, षैलाक के जैसे अधिकार चलाना उनक स्वभाव है। वे अपने पौंड आफ् फ्लॆष को डिमांड कर्ते ही हैं। मगर, श्री नारा चंद्रबाबु नायुडु, आंध्र प्रदेश के मुख्य मंत्री महोदय, षेक्स्पियर ड्रामा मर्चॆंट आफ वॆनिस में आंटोनियो से संपूर्ण विरुध्ध स्वभावी व्यक्ती है। मर्चॆंट आफ वॆनीस में आंटोनियो बहुत निर्दोषी और भोला भालू हीरो था। परन्तू हमारे चंद्र बाबु नायुडु को हम निर्दोषी या भोला भालू महीं कह सकते। हम कभी भी नहीं भूल सकते, इस संघटना को कि : श्री नायुडू अपने ससूर स्वर्गीय ऎन् टी रामाराव पर, उन के पीछे से चीता के जैसा लंघन किया, और उनसे मुख्यमंत्री कुर्सी को खींच लिया। साधारणतः, उस रीती के अंतःपुर षड्यंत्र, मुघल जमाने में जहंगीर और उनके भाइयों, षा जहान और उनके भायियों, औरंगजेब और उनके भायियो के मध्य होते थे। स्वयं ही घिनौने को शुरू करने में और चलाने में वे निपुण है। इसी तरह, वे अन्य लोगों से उठायी गयी घिनौनों को निर्वीर्य करने में भी वे निपुण है।

Mother Tongue: Telugu spoken by 100 million people.

అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు షైలాక్ లు అనే విషయం మన పాఠకులందరికీ తెలుసు. షేక్స్పియర్ డ్రామా మర్చెంట్ ఆఫ్ వెనిస్ లో షైలాక్ అనే వడ్డీ వ్యాపారి ఏవిధంగా నేతే తన పవుండ్ ఆఫ్ ఫ్లెష్ ను , ఆంటోనియో దగ్గర గుంజాలని ప్రయత్నించాడో, అలాగే బహుళ జాతీ కంపెనీలు ఇతర , ముఖ్యంగా పేద దేశాలను దోపిడీ చేయటంలో షైలాక్ గారికి ఏవిధంగా నూ తీసిపోడు. బుధ్ధిమంతుడైన వాడెవడూ, బహుళ జాతి కంపెనీలతో వొళ్ళు రుద్దుకోడు, వాటితో స్నేహం చేయడు, శతృత్వం కూడ తెచ్చు కోడు.

అయితే శ్రీ చంద్రబాబునాయుడు గారు , నోట్లో వేలు పెట్టలేనంతటి అమాయకుడు కాడు. మర్చెంట్ ఆఫ్ వెనిస్ లో నాయకుడు ఆంటోనియో చాల ఉదార స్వభావుడు,కుట్రలు తెలియని వాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోద్దిగానైనా షైలాక్ లక్షణాలు ఉంటే ఉండ వచ్చేమో కానీ, ఆంటోనియో లక్షణాలు ఉండటం అసాధ్యం. శ్రీ చంద్ర బాబు నాయుడు గారు తనకు పిల్లనిచ్చిన మామగారిపైననే (స్వర్గీయ ఎన్ టీ రామారావు, ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి), వెనుకనుండి చిరుత పులిలాగా విరుచుకపడ్డారు . మామూలుగా అంతఃపుర కుట్రలు అనేవి, మొఘల్ సామ్రాజ్య కాలంలో, జహంగీ ర్ సోదరుల మధ్యనో, షా జహాన్ సోదరుల మధ్యనో, ఔరంగజేబు సోదరుల మధ్యనో జరుగుతాయి. శ్రీచంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు లను లేవదీయటంలోనూ, ఇతరులు లేవదీసిన తిరుగు బాట్లను క్యాంపులను నిర్వహించి నిర్వీర్యం చేయటంలో నిపుణులు.

కాబట్టి రాజధాని నిర్మాణానికి సింగపూరు కంపెనీలు పెట్టిన షరతులను ఎలా ఎదుర్కుంటారా లేక వారితో నే కుమ్మక్కయ్యి, బయటకు ఆంధ్రప్రదేశ్ తరఫున బేరం చేస్తున్నట్లు గా నటిస్తూ, వారిచేత కొన్ని కన్సెషన్లను ఇప్పించి, కంపెనీల నుండి తమకు రావలసిన బక్కులను రాబట్టుకుంటారా, అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ సందర్భంగా శ్రీ బాబూరావు గారు వెలిబచ్చిన అభిప్రాయంతో మనం ఏకీభవించటం సమంజసమే.

కేంద్రం మీద నిథులకోసం శ్రీనాయుడుగారు వత్తిడి తేవాలని, శ్రీ బాబూరావు గారు అన్నారు కానీ, ఇపుడు కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ ఎమ్ పీ ల మద్ధతు అవసరం లేదు. మనం ప్రాధేయ పడ్డా, బెదిరించినా, నిజంగానే ఎన్ డీ ఏ నుండి బయటకు వచ్చి మద్దతును ఉపహరించినా , జండాలు ప్రదర్శించటం, దిష్టిబొమ్మలను కాల్చటం, వంటి ఉద్యమాలను నిర్వహించినా కలుగుబోయే ప్రయోజనం సున్నా అనే చెప్పాలి. ప్యాకేజీలు, ప్రత్యేక హోదా వంటి విషయాలలోనూ, మైనారిటీల సంక్షేమం పేరుతో ఇన్ టాలరెన్స్ పేరుతో మైనారిటీ అపీజ్ మెంటుపై వామ పక్షాలు మితి మీరిన ఆసక్తిని ప్రదర్శించటం ప్రాంతీయ ఉద్యమాలకు, మత తత్వ ఉద్యమాలకు దారితీస్తుంది. బీహారుకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని ఇపుడు మిగిలిన 28 రాష్ట్రాలూ ప్రత్యేక ప్యాకేజీలను డిమాండు చేస్తున్నాయి. ఇవన్నీ మేనమామ చెవుల్లో వెంట్రుకలు మొలవాలని కోరుకోటం వంటివి. అంటే ఈ కోరికలన్నీ తీరినా, ఎక్కడి సమస్యలు అంటే ఆదాయంలో అసమానతలు, సంపదలలో అసమానతలు, ధనిక వర్గాల దోపిడీ కార్యక్రమాలు, కూలీల వెట్టిచాకిరీ, ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలే తప్ప తక్కువ వాటికి ఆశపడకూడదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.