1. The speech of India’s Home Minister Rajnath Singh in Lower House of Indian Parliament, about Secularism and Socialism, is ambiguous. |
लोक सभा में, दिनांक २६.११.१५, श्री राजनाथ सिंग, गृह मंत्री से, सॆक्युलरिजम और सोषलिजम के बारे में दिया हुआ भाषण कई संदेहों को, और प्रश्नोंं को उठाता है। |
హోమ్ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారు లోక్ సభలో , 26.11.2015 నాడు చేసిన ప్రసంగం పలు ప్రశ్నలకు, సందేహాలకు దారితీసేదిగా ఉంది. |
2. It will be better for him, and his party BJP to make out clearly what they want to clarify, instead of confusing people. |
उनको और उन के दल बीजेपी को यह उचित होगा, कि वे स्पष्ट करना वे क्या चाहते। जनता को संभ्रमित करने से उनको कुछ फाइदा नहीं मिलेगा। |
తామేది చెప్పదలుచుకున్నారో, చేయదలుచుకున్నారో, స్పష్టంగా చెప్పటం శ్రీ సింగు గారికీ వారి పార్టీకి, బహుశా దేశానికి కూడా మేలు చేస్తుంది. జనాన్ని అయోమయంలో పడేయటం వల్ల ఏమి ప్రయోజనం? |
3. Educated and Intelligent people clearly know that Congrss, the Left, the Hindi belt Regional Parties like Samajwadi, JDU, RJD of Lalu Yadav, sing the song of Secularism and Socialism as a part of their minority appeasement vote bank politics. This Advani called Pseudo Scularism. Now people, understand. |
विद्यावान और मेथोवान भरतीयों को यह पत है कि, कांग्रॆस, समाजवादी, जॆडीयु, आरजॆडी लालू यादव, वामपक्षीय दल सॆक्युलरिजम के गाना गाते है, उन के वोट ब्यांक पालिटिक्स, और मैनारिटी तुष्टीकरण केलिये वे निबध्ध है। इसको ही अदवाणी जी सूडो सॆक्युलरिजम साफ कह दिया। |
విద్యావంతులు, ఎంతో కొంత తెలివితేటల గల భారతీయులకు ఇది తెలుసు, కాంగ్రెస్, సమాజవాదీ, జెడీయు, ఆర్ జెడీ లలూ యాదవ్, సీపీఐ సీపీఎమ్ మొ. వామ పక్ష పార్టీలు తమ వోట్ బ్యాంకులన కాపాడుకోటం కోసం, మైనారిటీలను తృప్తిపరచి తమ గుప్పిటలో ఉంచుకోటం కోసం, సెక్యులరిజం పాటను పాడుతూ ఉంటాయని. దీనినే మాన్యశ్రీ లాల్ కృష్ణ అద్ వాణీ గారు సూడో సెక్యులరిజం అని చక్కగానే నిర్వచించారు. |
4. Then what is the intention of Mr. Rajnath Singh, when he says that Let bygone is bygone? Doesn’t he want Secularism at all? Or doesn’t he want Secularism in the meaning of ‘ignoring religion in governance and confining religion to the private walls of home, friends and relatives. |
अभी, श्री राजनाथ सिंग के इछ्छा क्या है? वे क्या चाहते है. सॆक्युलरिजम को संपूर्ण रूप से निकाल देना, क्या. नहीं तो, सॆक्युलरिजम को, कांगरॆस से दिया हुआ सर्व धर्म समभावना अर्ध में, रद करना, क्या? रॆलिजियन को घरों को, बंधु मित्रों को परिमित करना श्री सिंग और बीजेपी को पसंद नहीं है तो, वह ही वे स्ष्ट करना होगा। |
శ్రీ రాజనాథ్ సింగ్ గారు, బీజేపీ తమ అసలు అభిమతమేమిటో స్పష్టం చేయాలి. వారికి సెక్యులరిజం అసలే వద్దా. లేక సెక్యులరిజం, కాంగ్రెస్ ఆదుల చేత ఇవ్వబడిన దొంగ నిర్వచనం సర్వ మత సమభావం, అనే అర్ధం లో వద్దా. లేక మతాన్ని గృహానికి, కొద్దిమంది బంధుమిత్రులు అనే వలయానికి పరిమితం చేసి, మతాలను జన జీవితాలతో ఆడుకోనివ్వకుండా చేయటం అనే లౌకికవాద నిర్వచనాన్ని వ్యతిరేకిస్తారా. ఏదో ఒకటి తేల్చి చెప్తే బాగుంటుంది. |
5. It will be extremely dangerous to play with Religion. Religion is like fire. Once ignited, instead of getting itself extinguished, it will enflame both the target and the igniter. |
धर्म (इस शब्द को हिंदी और संस्कृत मे कई अर्ध हैं), इसीलिये, रॆलिजियन शब्द उपयोग करना उचित. रॆलिजियन और अग्नी दोनों, एक बार जलाने के बाद हमेशा सिर्फ लक्ष्य वस्तुओं को नहीं जलाते, बारंबार जलाने वाले को भी भस्म कर देते हैं। |
మతం, అగ్ని వీటికి ఒక సమాన ధర్మం ఉంది. అది ఏమంటే, అవి తరచుగా కేవలంగా ఎవరిని కాల్చాలని ఉద్దేశించారో వారిని మాత్రమే కాల్చి ఊరుకోవు. కొన్నిసార్లు అంటించిన వాళ్ళని కూడ కాలుస్తాయి. కాబట్టి మతం, అగ్నిలతో ఆటలాడుకోటం మంచిది కాదు. అంతే కాదు, టపాకాయలలాగే, మతం ప్రజల జేబులను ఖాళీ చేసి వాళ్ళను బికారి వెధవలుగా చేస్తుంది. |
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.