Monday, June 29, 2015

537 Cities exceeding 2 million population should be made Union Territories and accessible to all. बीस लाख से ज्यादा जनाभावाले शहरों को केंद्र पालित प्रांत बनाना चाहिए. 20 లక్షల జనాభా దాటిన ప్రతినగరాన్నీ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి

Even now why there is no repentence? क्यों अभी भी पश्चात्ताप नही है। ఈరోజుకు కూడ ఎందుకు పశ్చాత్తాపం లేదు

Mother tongue Telugu language మాతృభాష తెలుగులో:

ఆంధ్ర జ్యోతి దినపత్రిక పై నాకు అపారమైన గౌరవం ఉంది. అదే సమయంలో , నా దృష్టిలో , అది లోపభూయిష్ఠమైన దృష్టే కావచ్చు, వారు తమ 28.06.2015 నాటి పత్రిక సంపాదకీయంలో వ్రాసిన విషయాలు కొన్ని ఆలోచనలు రేకెత్తెంచేవిగా కనిపించాయి. కాబట్టి ఇక్కడ వ్రాస్తున్నాను. నాతో ఏకీభవించనివారు తమ అభిప్రాయాలను కామెంట్లలో స్వేఛ్ఛగా వ్రాయవచ్చు. వాటిని నేను తొలగించను. అదే సమయంలో, నా భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోటాన్ని తప్పు పట్ట వద్దని ప్రార్ధిస్తున్నాను.

"...పుష్కర కాలం క్రితం తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్‌కు సొంత మీడియా లేదు కదా! ఇప్పుడు వారు ఆంధ్రా మీడియాగా నిందిస్తున్న పత్రికలు, చానెళ్లు ఉద్యమ వార్తలను ప్రచురించి, ప్రసారం చేశాయి. ఈ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ మిగతావారి కంటే ముందుండేది. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్న కేసీఆర్‌, ఒకప్పుడు ఉద్యమానికి దన్నుగా నిలిచిన ‘ఆంధ్రజ్యోతి’ని అభినందించారు. అంతెందుకు, ‘తెలంగాణ ఉద్యమాన్ని మోస్తున్నది ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఒక్కటే! ఆ పత్రికను మేనేజ్‌ చేస్తే ఉద్యమానికి ఊతం ఉండదు’ అని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం వాస్తవం కాదా? అనుమానం ఉన్నవాళ్లు ఆ నివేదికను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాగానే నాయకుల స్వభావాలు మారిపోతాయి. ఉద్యమ సమయంలో ఇంపుగా అనిపించినవి, ఇప్పుడు కంపుగా అనిపిస్తాయి. ఆనాడు తనకు సొంత మీడియా లేదు కనుక ఆంధ్రా మీడియానే ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు సొంత మీడియా ఉంది కనుక ఇతర మీడియా సంస్థలు ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇందులో వ్యాపార ప్రయోజనం మినహా తెలంగాణ ప్రయోజనం ఎక్కడ ఉంది? రాష్ట్ర విభజనను సమర్థిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న రోజే దాన్ని స్వాగతించిన ‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణకు వ్యతిరేకం ఎట్లా అవుతుంది? రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన జగన్మోహన్‌ రెడ్డి మీడియా తెలంగాణ చుట్టం ఎలా అవుతుంది?..."ybrao-a-donkey's humble view वैबीराव गधे के विनम्र राय వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య


గతంలో ప్రెస్ కౌన్సిల్ సూచించినట్లుగా పత్రికలు, టీవీ ఛానెళ్ళు వార్తలను యథాతథంగా ప్రచురించి, ఆ వార్తలపై తమ వ్యాఖ్యలను విడిగా బాక్స్ కట్టి ప్రచురించటమో, ఒక అడ్డగీత గీసిన తరువాత విడిగా ఇంకో రంగు సిరాతో లేక ఇటాలిక్స్ లో లేక చిన్న ఫాంట్ లేక భిన్నమైన ఫాంట్ లో ప్రచురిస్తే , ప్రజలకు వాస్తవాలు ఏవో, పత్రికాధిపతుల స్వంత అభిప్రాయాలు ఏవో స్పష్టంగా అర్ధం అయ్యేది. హైదరాబాద్ నుండి వచ్చే రెండు అగ్ర దినపత్రికలు అక్కడ స్థిర పడ్డ ఆంధ్ర యజమానుల చేతిలో ఉండటంతో వారు తమ కార్యాలయాలను, ఇతర వ్యాపారాలను, ఆస్తులను, కెసీ ఆర్ చేత రెచ్చగొట్ట బడ్డ గుంపులనుండి రక్షించుకోటానికి, తాము నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా నిరూపించుకోటానికి , ఆ రెండు పత్రికలో తమ పల్లకిలో ఒక పక్క కెసీఆర్ ను, ఇంకో పక్క కోదండరాం నూ కూర్చో పెట్టుకుని, పెళ్ళికొడుకునూ, పెళ్ళికూతురునూ, పల్లకీలో కూర్చోపెట్టి ఊరేగించినట్లుగా, తాము బోయీలుగా మారి మోసాయి. పత్రికలు ఉచితంగా మోస్తామంటే వారెందుకు కాదంటారు ?

కెసీఆర్ & కో, కోదండ రాంలు, గద్దర్, కేశవరావు మొ|| నేతలు తెలంగాణ ప్రజలను వివిధ పధ్ధతులలో రెచ్చకొడుతున్నప్పుడు, వారు చేస్తున్నది తప్పని ఆరెండు పత్రికలు ఎందుకు వారికి చెప్పలేకపోయాయి. వాళ్ళ మెహర్బానీల కోసం తెలంగాణ ఉద్యమంలో జరిగిన అక్రమాలను, తప్పుడు వ్యాఖ్యలను, దాడులను, హింసలను అన్నిటినీ యథాతథంగా రిపోర్టు చేసి, తమ అభిప్రాయమేదో విడిగా ప్రత్యేక కాలంలలో లేక ప్రత్యేక పేజీలలో, పత్రికలు తెలంగాణ ప్రజలకు తెలియ చెప్పకుండా, కెసీఆర్ తమని ఆలింగనం చేసుకోగానే ముఖాన్ని చేటంత చేసుకోటం, కెసీఆర్ చెప్పేవాటిని ప్రజలు నమ్మేలాగా చేయటంలో తాము కూడ భాగస్వాములు కావటం, నాటి పత్రికల స్వార్ధ పూరిత వైఖరికి నిదర్శనం. తమ వ్యాపార ప్రయోజనాలు పత్రికాధిపతులు చూసుకుంటే, తమ అధికార ప్రయోజనాలు తెలంగాణ రాజకీయ నేతలు చూసుకున్నారు. అయితే ఈ విషయంలో నేను వారిని తప్పు పట్ట తలుచుకోలేదు. తమ మనుగడ కోసం వారీ పని చేయటం అనివార్యం.

ఫలితంగా నష్టపోయింది ఎవరంటే, సీమాంధ్ర ప్రజలు. హైదరాబాదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, పెట్టిన పెట్టుబడులను అన్నిటినీ తెలంగాణ నేతలు తమ హస్తగతం చేసుకోటానికి ఆరెండు పత్రికలు తోడ్పడినట్లయింది. దుర్యోధనుడికి కర్ణుడు చూపిన స్వామి భక్తినే ఆరెండు పత్రికలూ చూపాయి, చూపిస్తున్నాయి, ఇంక ముందు కూడ చూపించబోతున్నాయి. కెసీఆర్ అనుగ్రహం కోసం ఆ పత్రికాధిపతులు పరితపించి పోతున్నారు. ఈసందర్భంగా పరస్పర కుచమర్దనాలు జరిగాయి కానీ, అప్పుడప్పుడైనా జరగాల్సిన సంభోగాలే జరగటం లేదు. అవి జరిగితే కొంత కాలమైనా వారికి సంభోగానంతర సుఖ సంతోషాలు లభిస్తాయి. అదే జరగటం లేదు.

పెట్టుబడిదారీ విధానంలో, తమకు ఏది లాభసాటిగా కనిపించి, ఏది తమ ఆస్తుల విధ్వంసానికి దారితీయదో దానిని పెట్టుబడిదారులు చేయటం అది ఒక పెట్టుబడిదారీ మీడియా వికారం. పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మూలించినప్పుడు పెట్టుబడిదారీ పత్రికలను తీసివేయటం జరిగేదాకా మనకి పెట్టుబడిదారీ పత్రికల బెడద తప్పదు.

తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నాటి పత్రికలు , టీవీలు ప్రచారం చేసి ఉండాలని నేను వ్రాయటం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధిస్తూ, విడిగా ప్రత్యేక వ్యాసాలు | సంపాదకీయాల్లో సక్రమ మార్గంలో తెలంగాణ ఉద్యమం నడవటానికి పత్రికలు, టీవీలు తగిన సలహాలు ఇచ్చి ఉంటే, రాష్ట్ర విభజన మెరుగైన పధ్ధతులలో జరిగి ఉండేది. అపుడు సెక్షన్ 8 యొక్క అవసరమే ఉండేది కాదు. హైదరాబాదులోని సంస్థల విభజనపై ఇంత ఘోరమైన కుమ్ములాటలు జరిగేవి కావు. ఆ రెండు పత్రికలు, పనిగట్టుకొని కెసీఆర్ ను అతిగా సమర్ధించినందు వల్ల, తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీ నేతలు, తాము అసమర్ధులైన మితవాదులులాగా, వాజమ్మలలాగా కనపడకూడదనుకొని, వారు కెసీఆర్ తో సమానంగా సీమాంధ్ర ప్రజలను తిట్టటం ద్వారా తాము తెలంగాణ ప్రజల మెప్పును కెసీఆర్ కన్నా అధికంగా పొందవచ్చనుకుని అందరూ వోవర్ యాక్షన్ లోకి దిగారు.

ఫలితంగా కేంద్రంలోని అఖిల భారత నేతలకు కూడ దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు కూడ అత్యుత్సాహం చూపించి, తమ రాజకీయ స్వార్ధాలకు అనుగుణంగా, లోక్ సభలో దౌర్జన్యకర పధ్ధతుల ద్వారా విభజన బిల్లుకి ఆమోదం పొందారు. రాజ్యసభలో తప్పుడు హామీలను గుప్పించారు. దురదృష్ట వశాత్తు సీమాంధ్ర నేతల అనైక్యత వల్ల, సీమాంధ్ర ప్రజలు అత్యధికంగా నష్టపోయారు.

ఆరెండు తెలుగు పత్రికల మెయిన్ పేజీలు, ఇతర ముఖ్య తెలుగు, ఇంగ్లీషు అన్ని పత్రికల మెయిన్ పేజీలు, హైదరాబాదులో కంపోజ్ అవుతూ ఉండటంతో, సీమాంధ్ర ప్రజల తరఫున వాదించే మీడియానే లేకపోయింది. 1966 కు ముందు ఉన్నట్లుగా , తెలుగు దిన పత్రికల ప్రధాన కార్యాలయాలు, మెయిన్ పేజీలు విజయవాడలో కంపోజ్ అయి ఉంటే, తెలంగాణ ఉద్యమాన్ని వీపున పెట్టుకుని మోసేవాళ్ళా. పత్రికలు, ప్రధాన కార్యాలయాలు హైదరాబాదుకు తరలి వెళ్ళటం, టీవీ ఛానెళ్ళన్నీ హైదరాబాద్ లోనే ప్రారంభం అయ్యి అక్కడే కేంద్రీకృతమై ఉండటం, వాళ్ళ ఆస్తులు, పెట్టుబడులు అన్నీ హైదరాబాదులో ఉండటం, ఇవి అన్నీ సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యానికి కారణం.

అదే సంపాదకీయం, తరువాత లైన్లలో.
"...నిజానికి ఏ మీడియా కూడా ఒక ప్రాంత ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. వ్యవహరిస్తే మనుగడ సాగించలేదు..."

ybrao-a-donkey's humble view वैबीराव गधे के विनम्र राय వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య

తాము తెలంగాణ ఉద్యమాన్ని కెసీఆర్ ను, కోదండ రామ్ ను, గద్దర్ ను వీపు మీద పెట్టుకుని మోస్తున్నప్పడు, తాము తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగానూ, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు విరుధ్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఈ పత్రికలు, ఛానెళ్ళు ఎందుకు గ్రహించలేదు ?

తెలంగాణ ఉద్యమం యొక్క మూలాలు హైదరాబాదులో ఖాళీ స్థలాలకోసం, విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులకొరకు, తెలంగాణ పెట్టుబడిదారులకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు, ఇతరరాష్ట్రాల పెట్టుబడిదారులకు, ప్రవాస ఎన్ ఆర్ అయి పీఐఓ పెట్టుబడిదారులకు, మరియు విదేశీ పెట్టుబడిదారులకు జరిగిన కుమ్ములాట అని పత్రికలు, మీడియాకు తెలిసి కూడ, తెలంగాణ ప్రజలకు, సీమాంధ్ర ప్రజలకు, సత్యాన్ని ఎందుకు చెప్పలేదు ? ఎందుకంటే, తాము కూడ తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఆ పాప ఫలాలను తింటున్నారు కనుక.

ఇలాంటి పరిస్థితులు కేవలం హైదరాబాదులోనే కాదు దేశంలో పెద్దనగరాలన్నిటిలో రాబోతున్నాయి. నగరాలకు అతిప్రధాన్యం ఇచ్చి, స్మార్ట్ సిటీలు, మెగా సిటీలు మొ|| పేర్లు పెట్టి వాటిని అతిగా అభివృధ్ధి చేస్తున్నంత కాలం నిరుద్యోగులు అక్కడికి వలసపోక తప్పదు. వారు ఏదో ఒక బ్రతుకు తెరువును సంపాదించుకున్నాక చిన్న చిన్న ఇళ్ళను , అపార్టుమెంట్లను కొనటానికి ప్రయత్నించక తప్పదు. ఇది ఒక మానవ హక్కు. దీనిని శివసేన వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు గానీ , ఇంకోళ్ళు గానీ, ఇంకోళ్ళుగానీ ఆపటానికి ప్రయత్నిస్తే దేశ విభజనకే దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి.

మేము నగరాలను అభివృధ్ధి చేయటం మానం, గ్రామాలను, చిన్న పట్టణాలను పాడు పెట్టటం మానం, అని బూర్జువా పార్టీలు అనుకుంటే, కేంద్ర పాలకులైన బూర్జువా పార్టీలు 20 లక్షలు దాటిన ప్రతి నగరాన్నీ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటమే, వెర్రితలలు వేస్తున్న ప్రాంతీయవాదానికి విరుగుడు.

(To continue सशेष ఇంకా ఉంది.).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.