349 కెసీఆర్ ప్రసంగం అత్యంత జుగుప్సాకరమైనది మరియు మరపురానిది
३४९ कॆसीआर के भाषण अत्यंत घृणास्पद
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 349, కెసిఆర్, Regionalism, Freedom of Press, Media, Freedom of Media, Ghalib
तॆलंगाणा में रहना चाहे तो हमारे को सलाम करना । To live in Telangana, Should salute to us. తెలంగాణలో ఉండదలుచుకుంటే మాకు శాల్యూట్ చేయాలె.
"స్వేఛ్ఛ కొరకు కాళోజీ చాల పెద్ద పోరాటం చేసిండు. ఇయాల కూడ వరంగల్ లో పత్రికా స్వేఛ్ఛ హరిస్తుండ్రు మాకు" అని ప్లకార్డులు పట్టుకొని కొంతమంది మిత్రులు పాపం గరీపగాళ్ళు నినాదం చేస్తుడ్రు. సంతోషం. పత్రికలు స్వేఛ్ఛ . స్వేఛ్ఛ ఉండవలసిందే. ఎట్లా ఉండాలె స్వేఛ్ఛ? నువ్వు డెమోక్రట్ గా ఉంటే , నీకు సంస్కారం ఉంటే , నువు నిజంగా పత్రిక అనే సోయిలో ఉంటే, నేనొక మీడియా హౌస్ అనే సోయిలో ఉంటే, నీకా మర్యాద దొరుకుతుంది. తెలంగాణ మల్లా ఇయాల తప్పు చేసిండ్రు. వాళ్ళిద్దరు ఆరెండు ఛానెలోళ్ళు. మల్లా స్పీకర్ గారి కెదురుగా నల్ల జెండాలు చూపిత్తిరి. ఇయాల నేను ముఖ్యమంత్రి గని, ఆయన శాసనసభ స్పీకర్. వారు కూడ ఉన్నారు. కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ్యులు మొదటిరోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటే, ఆ ఛానెళ్ళు ఏమి ప్రచారం చేశాయో మీరు చూసిన్రు. ఈరోజుకు కూడ నేను చెబుతూ ఉన్నా. సింగరేణిలో అద్భుతంగా పని చేయండని నేను అధికారులకు చెప్తే, తెల్లారి పేపర్లలో వస్తే, "ఇది కాదు , సాధ్యం కాదు" అని రాస్తరు రాష్ట్ర వ్యతిరేక వార్తలు. కెసీఆర్ వ్యతిరేకమయితే డోన్ట్ కేర్. నన్ను చాలమంది తిట్టిండ్రు. నేనెవరికీ భయపడ. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వ్యతిరేకంగా, రాష్ట్రశాసనసభ్యులను పాచికల్లు తాగే ముఖాలంటే వాళ్ళను క్షమించాలా. ఈగడ్డమీద దేనికోసం క్షమంచలా? ఇది పత్రికా స్వేఛ్ఛ అయితదా? తెలంగాణ శాసన సభ్యులు టూరింగు టాకీసు లో సినిమా చూసేటోళ్ళను తీసుకొచ్చి మల్టీప్లెక్సులో కూర్చుండ బెట్టిండట్రా. తెలంగాణ బిడ్డలు గెలిచి అసెంబ్లీకొస్తే, వాళ్ళను టూరింగు టాకీసులో సినిమాలు చూసేటోళ్ళను మల్టీప్లెక్సులో కూర్చుండ బెట్టిన పని చేసిండ్రని చెప్పిన్రు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేఛ్ఛనా? మీడియా సంస్కారమా ఇది? నేను అడుగుతా ఉన్నా ఎవరు చెప్పారు? ఏమీడియా చెప్తది కమాన్. మాకు కూడ తెలంగాణ మేధావులున్నారు. ఏం ఘోరం కథ అసలు. అసలు వాళ్ళకు ల్యాప్ టాప్ లు ఇయ్యలె. ల్యాప్ టాప్ లు ఇచ్చినట్లు కథలు సృష్టించి ఎవరికో ఏదో ఇస్తే ఏడనో పెట్టుకున్నారన్నట్లు. తెలంగాణ ఎంఎల్ ఏలకు ల్యాప్ టాప్ లు ఇస్తే ఏడ మడిచి పెట్టుకుంటరు? ఇది టీవీయా? ఏది మొట్టమొదటిరోజు? తెలంగాణ రాష్ట్రం సిధ్ధించి , అనేక మంది త్యాగాల మీద, బలిదానాలమీద శాసన సభ్యులు గెలిచి తొలిరోజు శాసనసభ సమావేశమయి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ టెలికాస్ట్ చేసే ఛానెల్ ఒక ఛానెలా మాకూ? పాతర. పాతరేస్తాం జాగర్త అని చెబుతా ఉన్నాం. పది కిలోమీటర్లలోపల పాతరేస్తాం. తెలంగాణా. కెసిఆర్ ను తిడితే బాధలేదు. కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ ఉనికిని తెలంగాణ గౌరవాన్ని అగౌరవ పరిచే విధంగా, కించ పరిచే విధంగా ఎవరు వ్యవహరించినా మెడలు విరిచి అవతల పారేస్తాం జాగర్త. నువు మీడియా ముసుగులో చేస్తామంటే, నీ ఇడియట్ ఆటలు సాగనీయమని చెబుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా మేం చేయలే. బ్యాన్ చేయలే. గౌరవనీయులైన శాసనసభా పతి విచారణలో ఉందది. మొత్తం యావత్తూ శాసన సభ తీర్మానం చేసి స్పీకర్ గారికి అప్పగించిన్రు. "అయ్యా తమరు ఏనిర్ణయం చేసినా శిరో ధార్యమే అని. అది వారి విచారణలో ఉంది. మంచినో చెడ్డనో వారు తీర్పు వెలువరించాల్సి ఉంది. పెద్దలు రెడ్యానాయక్ గారు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. రెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డిగారు. అందరం కలసి ఎనానమస్ తీర్మానం చేసినం. ఏ ఒక్కరో చేయలె. శాసన సభ సభ్యులమంతాతెలంగాణ శాసన సభంతా సమావేశమయి చోట తీర్మానం చేసి ఇస్తే దానికి స్పందించిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్ వాళ్ళకు నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఈ ప్రజా వ్యతిరేక ఛానెళ్ళు ప్రచారం చేయమని చెప్పి బంద్ చేసిన్రు. దాన్ని తీస్కోయి ఢిల్లీలా, ఇక్కడా అక్కడా డ్రామాడి ఆంధ్రావాళ్ళు చేసేది ఇదే ఎంతకీ. ఇంతకు ముందు లక్ష్మీకాంతారావుగారు విడ్రాయల్ సింప్టమ్స్ అంటార వీటిని. దయ్యం వదిలేముందు వట్టిగా వదులుతాది? కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులుచేసి తేపకొకమాలి దెబ్బతిని వదులుతాది. ఉంటాం. దీని గురించి మనం బాధ పడాల్సింది ఏమీలేదు. దీటుగా ఎదుర్కోవాలి. ధీరత్వంతో నె ఎదుర్కోవాలి. ఈ చిల్లర మల్లర ప్రయత్నాలకు కల్లిబిల్లి గాము. ఎందుకంటే ధర్మం మాట్లాడితే మాట్లాడుదాం. సత్యం మాట్లాడితే మాట్లాడదాం. మంచి పని చేద్దామంటే చేద్దాం. కానీ స్వేఛ్ఛ ముసుగులో మేం మీ అందరినీ కించపరుస్తాం. మీతెలంగాణ వాళ్ళకు చేతకాదంటం. మీకు ల్యాప్ టాప్ చూడరాదనటం. ల్యాప్ టాప్ ఇస్తే ఏడ మడిచి పెట్టుకుంటారో అనటం అయినా మాకు స్వేఛ్ఛ కావాలంటే ఉండది. ఉండదు గాక ఉండదు. ఇంకా ఏమి చేస్తే ఇంకా ఏమేమి కావాలో అది ఉంటది జాగ్రత్త. ఈవిధంగా ఇక్కడున్న తెలంగాణ జర్నలిస్టులకు నేను చెబుతా ఉన్నా. మీరు కూడ తెలంగాణ బిడ్డలు. మీరు కూడ సంస్కారంతో ఆలోచన చేయండి. ఇక్కడ హెలికాప్టర్ దిగినపుడు నాకు మెమోరాండం ఇచ్చినపుడు గీ చానెళ్ళండి. మీశాసన సభ్యులను పట్టుకొని పాచికల్లు తాగే ముకాలన్న ఛానెళ్ళు మీకు గావల్నా? అని ఎవలు ప్రజలు ఎవలేమీ బాధ పడతల్లేదే? ఎవరూ అడుగుతాలేదే? డిమాండు కూడ లేదే? ఎందుకు అనవసరంగా ఈ రాధ్ధాంతం చేస్తున్నరు? ఇక్కడ ఉండదలుచుకుంటే, ఈగడ్డపై ఉండదలుచుకుంటే బతకదలుచుకుంటే మాకు శాల్యూట్ కొట్టి ఉండాలె. తెలంగాణ సమాజంలో కలిసిపోయి బతకాలి. అందుకే ఏమన్నడు. "ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలిదాక తరిమి కొడతాం. ప్రాంతం వారే ద్రోహం చేస్తే ప్రాంతం లోనే పాతరపెడతాం." అని కాళోజీ అన్నడు. కాళోజీ చెప్పిన నీతేంది? వాడు ప్రాంతం వాడైనా, ప్రాంతేతరుడైనా, వాడు ఎవడైనా మాజాతికి ద్రోహం చేస్తే క్షమించమని వెలుగెత్తి గొంతెత్తి చెప్పిన బిడ్డ గౌరవనీయులు మహనీయులు కాళోజీ నారాయణ రావుగారు. వారిబాటలోనే నేను నడుస్తున్నా కాబట్టి దయచేసి వరంగల్ లోని జర్నలిస్టు మిత్రులను నేను కోరతా ఉన్నా. మీకేమైనా ఉంటే నాకు చెప్పండి. షేర్ చేసుకుందాం. నేనున్నకాడికి రండి. కానీ అనవసరంగా ఆంధ్రా వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకొని తెలంగాణను కించపరచిన వాళ్ళతరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటే మీకు శ్రేయస్కరం కాదని మనవి చేస్తున్నా. ----కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి.
పై ప్రసంగ పాఠం ఆంధ్రజ్యోతి దినపత్రిక లో ప్రచురించబడింది. తేదీ సుమారు 10.9.2014. ఇందులో వారేమయినా మార్పులు చేశారేమో తెలియదు. ఈ ప్రసంగ పాఠం పయిన, 5 వపేజీలో, "కేసీఆర్ క్యాంపస్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన మహిళా పాత్రికేయులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు" ఫొటో ఉంది.
ఈ ప్రసంగ పాఠం ఎందుకో, ఆంధ్రజ్యోతి వారి వెబ్ సైట్ లో ఎందుకో ఎంత వెదికినా దొరకలేదు. పేపర్ కటింగు లోంచి తిరిగి టైపు చేయవలసి వచ్చింది.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
ఇందులో 50 పైగా అంశాలు ఇమిడి ఉన్నాయి. మూడుముక్కల్లో చెప్పాల్సిన విషయం కాదు. రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు కావు అన్నట్లుగా టీవీఛానెళ్ళవి కొన్ని లోపాలు ఉంటాయి. ముఖ్యమంత్రివి కొన్ని తప్పులు ఉంటాయి. అయితే పత్రికలు, ఛానెళ్ళు అనే వాళ్ళని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం బాధ్యతల విషయంలో ఒకే గాటన కట్టేయలేం. ఎందుకంటే పత్రికలకు, ఛానెళ్ళకి నోరు ఉంటుందే తప్ప అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రులకు, స్పీకర్లకు, పోలీసు అధికారులకు, ఐఎఎస్ లకు వీళ్ళందరికి అధికారాలు ఉంటాయి. చట్టబధ్ధమైన పాలనలో భాగంగా వారు తమ అధికారాలను వినియోగించు కోవచ్చు. టీవీ 9 వాళ్ళు క్షమాపణలు పలుసార్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. మరల అటువంటి వ్యాఖ్యలు చేయమని వారి వద్ద ఒక లిఖిత హామీనీ తీసుకుని, తమని తాము సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది. వారు మరల తమ తప్పును రిపీట్ చేసినపుడు, ఇంకా తీవ్రమైన చర్య తీసుకోవచ్చు.
టీవీ9 గానీ, ఆంధ్రజ్యోతి గానీ ఐపీసీ (భారతీయ శిక్షా స్మృతిని) గానీ, ఇతర చట్టాలను గానీ ఉల్లంఘించి ఉంటే వారిపై సంబంధించిన పోలీసు అధికారులు సు మోటుగా చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే డీజీపీలు, హోం మంత్రి ఆదేశాలను జారీచేసి, పోలీసులు తమ విధులను నిర్వహించేలా చేయచ్చు. వారికి పడాల్సిన జరీమానాలను, జైలుశిక్షలను, మూసివేతలను, కోర్టులు నిర్ణయించేవి. పోలీసులచేత ఆపని చేయించకుండా కెసీఆర్ స్టేజీ మీద తన విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నాడో అర్ధం కావటం లేదు. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు కూడ సుమోటుగా ఆచానెల్ళపై చర్య తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాయి. వారా పని చేయలేకపోటానికి కోర్టులపై ఉన్న అధిక పనిభారం కారణం కావచ్చు.
కెసీఆర్ ప్రసంగం కూడ భారతీయ శిక్షా స్మృతిని ఉల్లంఘించేది గా ఉంది. దీనిపై వరంగల్ పోలీసు అధికారులు ఏమి చర్యతీసుకున్నారు? సుమోటు చర్య తీసుకునే అధికారం రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడ సుమోటుగా ఆచానెల్ళపై చర్య తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాయి. వారా పని చేయలేకపోటానికి కోర్టులపై ఉన్న అధిక పనిభారం కారణం కావచ్చు.
నేషనల్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ మార్కండే కట్జూగారు, ఆలస్యంగా నైనా ప్రతిస్పందించటం హర్షణీయం. అయితే అచ్చు ప్రెస్ పైనే తప్ప చానెళ్ళపై చర్యతీసుకునే అధికారం తమకు లేదని కట్జూగారనటం గమనార్హం.
హోం మంత్రి శ్రీరాజనాథ్ సింగు గారు కెసీఆర్ తో చానెళ్ళగురించి మాట్లాడానన్నారు. ఆయన మాట్లాడిన మర్నాడే కెసీఆర్ గారు పై ప్రసంగాన్ని చేశారు. అంటే శ్రీరాజనాథ్ సింగు గారి మాటలను శ్రీ కేసీఆర్ గారు కచ్ రా కుండీలోకి విసిరేసారని అర్ధం అవుతుంది.
ఇంక, శ్రీ రాజ్ నాథ్ సింగు గారికి, ఆయన సమస్యలు ఆయనకున్నాయి. శ్రీ నరేంద్రమోడీ, శ్రీ అమీత్ షా లను తట్టుకొని ఎలా నిలదొక్కుకోవాలో ఆయనకు అర్ధం కావటం లేదు. ఈవిషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి. పాపం, హోం మంత్రిది ఏమీ లేదు, ఆయన నిమిత్త మాత్రుడు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలకు, కుల-మత-ద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలకూ, ప్రాధమికంగా భేదం లేదని మనం గుర్తించటం అవసరం. కుల, ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి అధికారాన్నిసాధించుకోటం, నిలబెట్టుకోటం చేస్తే, అఖిల భారత పార్టీలు మెజారిటీ మైనారిటీ మత తత్వాన్ని ప్రోత్సహిస్తూ తమ అధికారాన్ని సాధించుకోటం నిలుపుకోటం చేస్తున్నాయి. కోడలుకు నీతి చెప్పిన అత్త తెడ్డు నాకటం అంటే అదే.
కుల, మత , ప్రాంతీయ, భాషా విద్వేషాలు పెట్టుబడిదారీ విధానం యొక్క వికారాలు. పెట్టుబడి దారీ విధానాన్ని తీసేసి మార్క్సిజాన్ని ప్రవేశపెడ్తే కానీ ఈ జబ్బులు నయం కావు.
आज के कोट् ఈరోజు సూక్తి Today's quote
Hum hain mushtaq aur woh bezaar,
Ya ilahi ye majra kya hai.
अंग्रेजी जिस्ट: I am eager and anxious. He is cold and unhappy. What is this mystery?
తెలుగు సారం Telugu gist : నేను ఆదుర్దాగా ఉన్నాను. వాడు దిగులు-గుబులుగా ఉన్నాడు. ఓ అల్లా, ఏమిటీ ఈ మిస్టరీ?
हिंदी संग्रह: मै हूँ आतुरित । वह है आंदोळित। या अल्ला, यह मिस्टरी क्या है ?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.