Thursday, July 3, 2014

285 Centenaries and commemorations only when there are acres behind!

285 Centenaries and commemorations only when there are acres behind!
285 వెనకాల ఎకరాలు ఉంటేనే శతజయంతులు, సంస్మరణలు
చర్చనీయాంశాలు: 285, శతజయంతులు, సంస్మరణలు, సంజీవ్ దేవ్, చిత్రకళ


స్వర్గీయ శ్రీసూర్యదేవర సంజీవ్ దేవ్ మంచి రచయిత, చిత్రకారుడు, ప్రకృత్యారాధకుడు. సంజీవ్ దేవ్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కాంతిమయి, తెగిన జ్ఞాపకాలు, రసరేఖలు మొ|| 1960 ప్రాంతాలలో వెలువడి మేథోజీవులకు ఉత్తేజం కలిగించాయి.

డాక్టర్ సంజీవ్ దేవ్ చిత్రాలు కాలువలు, చెట్లు, పక్షులు, పూలు, సూర్యోదయ సూర్యాస్తమయాలు, సర్వవిధమైన ప్రకృతి సంపదతో కనువిందులు చేసేవి. గంటల తరబడి బకింగ్ హామ్ కెనాల్ వంక చూస్తూ ఆయన తన్మయులయ్యే వారట.

తెనాలిలో జరిగిన డాక్టర్ సంజీవ్ దేవ్ శతజయంతి ఉత్సవాలకు శ్రీ నాదెండ్ల భాస్కరరావు (భూతపూర్వ ముఖ్యమంత్రి) సారధ్యం వహించారు. డాక్టర్ సంజీవ్ దేవ్ శ్రీమతి సులోచనాదేవిగారిని సన్మానాల సింహాసనంపై కూర్చోపెట్టి సన్మానించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ్ భూత్ పూర్వ రిజిస్ట్రార్ శ్రీ రావెల సాంబశివరావు రచించిన, సీనియర్ జర్నలిస్టు శ్రీ బి.ఎల్. నారాయణ ఎడిటింగ్ చేసిన, డాక్టర్ సంజీవ్ దేవ్ జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎన్జీవో కల్యాణ మంటపంలో జరిగిన సభలో శ్రీ నాదెండ్ల భాస్కర రావు, డాక్టర్ సంజీవ్ దేవ్ ను బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ప్రకృతి ప్రేమికుడిగా, ఈగడ్డ కు పుట్టిన ముద్దుబిడ్డగా వర్ణించారు.



వైబీరావు గాడిద వ్యాఖ్యలు



రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, లోకే ష్, కెసిఆర్, హరీష్ రావు, కెటిఆర్, రాయపాటి, కోడెల, జగన్, వంటి వారికి జన్మదినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పెయింటర్లకు, రచయితలకు వారెంతటి బహుముఖ ప్రజ్ఞా శాలురైనా జన్మదినోత్సవాలు, శతజయంతులు అరుదు. పెయింటర్, రచయిత, డాక్టర్ సంజీవ్ దేవ్ కు జరిగిన శతజయంతి ఉత్సవం ఎంతైనా ముదావహం, రాజకీయ డంబాచారానికి కాక మేథస్సుకు జరిగిన సన్మానమే.

అదే సమయంలో, ఒక విషయాన్ని నిర్మొహమాటంగా వ్రాయక తప్పదు.

జన్మదినోత్సవాలు, శతజయంతులు ఘనంగా జరగాలంటే, వెనకాల భూములూ భవనాలు వ్యాపారాలు, లేక మంచి కల్పవృక్షాల్లాంటి ఆదాయవనరులు కలిగిన డాక్టర్లు, స్టార్లు, వంటి వారసులైనా ఉండాలి. వారికి తమ తండ్రి తాతలయందు మంచి గురి, జన్మదినోత్సవాలు, శతజయంతులు ఘనంగా డబ్బు ఖర్చు పెట్టిచేయించాలనే కోరిక ఉండాలి. భూకులానికి చెందిన వారైతే ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతాయి.

నాకు అందిన సమాచారాన్ని బట్టి, డాక్టర్ సంజీవ్ దేవ్ గారికి ఒక ప్రాంతంలో 150 ఎకరాల దాకా, మరో ప్రాంతంలో 2౦౦ ఎకరాల దాకా భూములు ఉన్నాయి. ఇది తప్పయితే పాఠకులు నన్ను దిద్దవచ్చును.

ఆంధ్రభూమి 31.03.2012 దినపత్రికలో, తొవ్వముచ్చట్లు, అనే శీర్షికతో, శ్రీజయధీర్ తిరుమలరావు , వ్రాసిన ఈ వ్యాసభాగం చూడండి.(ఆంధ్ర భూమి మరియు శ్రీ తిరుమలరావు గారికి నాకృతజ్ఞతలు).
పోరు ప్రవాహంలో నిలిచిన కవి సుంకర. ఇలాంటి కవులు చాలా తక్కువ. గట్టు మీద కేకలు వేసే ‘మహాకవులు’ చాలామంది. వీళ్ళకే అవార్డులూ, రివార్డులూ. శత జయంతులూ... అన్నీ! వాస్తవాల కప్పదాట్లతో మహాకవిని నిర్మించిన ప్రగతిశీల భూస్వామ్యం మనది. అర్థవలస, అర్ధ భూస్వామ్యం అనే కమ్యూనిస్టుల నిర్వచనం సరైనదే. ప్రగతిశీల, విప్లవ సాంస్కృతిక రంగాలు కూడా అర్థ్భూస్వామ్య భావజాలంనుండి బయటపడలేకపోవడం అనేది వాస్తవం. అంటే- సమాజం ప్రభావం నుండి బయటపడలేకపోవడాన్ని గుర్తించాలి. మహాకవినని, యుగ కవినని తనకుతాను చెప్పుకొనే అహంభావులను మోసే వామపక్ష తెలుగు పల్లకీలు చాలానే ఉన్నాయి.

త్యాగంలో, ఆచరణలో, ప్రజలతో కలవడంలో, సాహిత్యాన్ని ప్రజాపరం చేయడంలో అగ్రగాములను పక్కనపెట్టిన దాఖలాలే ఎక్కువ.

ప్రజాకవుల పరంపరలోనే ధిక్కారం ఉంటుంది. ఈ ధిక్కారాన్ని ఆయా పార్టీలు సహించవు. వారిని సహించకపోవడం బూర్జువా ఆధిపత్య మానసిక తత్వం. భూస్వామ్య అహంభావం కారణం. స్వాతంత్య్రోద్యమాన్ని కదంతొక్కించిన ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ ఆకలికి చచ్చాడు. చివరిరోజుల్లో బిచ్చమెత్తుకున్నాడు. జైలుకెళ్ళాడు. తాను రాసిన వేలాది ప్రతులు తన కళ్ళముందే పోలీసులు దగ్ధం చేస్తే తిరిగి ఆగ్రహించిన కవి గరిమెళ్ళ. ఆయన రాసిన మూడు పుస్తకాలను ఆంగ్లేయ ప్రభుత్వం నిషేధించింది.

‘‘గోలకొండ ఖిల్లా కింద గోరీ కడ్తాం కొడకో నైజాము సర్కరోడా’’ పాట రాసిన యాదగిరి కాల్పులో చనిపోయాడు. సుద్దాల, తిరునగరి వంటివారు అనారోగ్యంతో చావుకి గురయ్యారు. సుబ్బారావు పాణిగ్రాహి కాల్పులకి గురయ్యాడు. ఈ ప్రజాకవులు మన ఆదర్శం కాకుండా పోవడం తెలుగు జాతి దౌర్భాగ్యం.

గరిమెళ్ళ జన్మించిన ప్రాంతానికి చెందిన గురజాడ జమీందారుల వద్ద దివాను. హాయిగా జీవితకాలమంతా ఉద్యోగం చేసుకున్నాడు. ఆయనకి హరిజనులే కాదు, గిరిజనులు కూడా ఎక్కడా కనుపించలేదు. ఆయన సాహిత్యంలో స్థానం లేదు. సామాజిక అనిర్దిష్టత అతని లోకం. ఊహాత్మక సన్నివేశాలు, కథ అతని పరిమితులు. నిర్దుష్టతా రాహిత్యం అతని కవిత్వం. ఐనా మహాకవే.

గరిమెళ్ళ అలా కాదు. ఆంగ్లేయ కోర్టుల స్వభావాన్ని విప్పి చెప్పాడు. ప్రజలు కల్లు తాగొద్దని వివరించి రాశాడు. హరిజనుల సమస్యను అర్థవంతంగా చిత్రించాడు. స్వేచ్ఛకోసం నినదించాడు. అందుకే ప్రభుత్వానికి ఆగ్రహం కలిగింది. నిషేధాలు, జైళ్ళూ, పేదరికం, ఆకలి దప్పుల ఆక్రోషం... అందుకే ఆ తరువాత తరానికి అతను గుర్తించుకోదగిన కవి కాలేదు. ఇటీవలి ప్రగతిశీల కవులకు కనుపించకుండా పోయాడు. ఆకలి కేకలు వేస్తూ ఆత్మత్యాగం చేసినవాడు అనామకుడు. అదేసమయంలో ఒళ్ళు బలిసిన సినిమా రంగపు క్రౌర్యంతో హాయిగా చెట్టాపట్టాలు వేసుకున్న మహాకవి మాత్రం విచిత్రంగా నిత్యస్మరణీయుడయ్యాడు.

గరిమెళ్ళే కాదు. సుంకర సత్యనారాయణ కూడా విస్మృతుడే. గరిమెళ్ళ సత్యనారాయణ ప్రజోద్యమంలో అనేక కష్టాలు అనుభవించాడు. దున్నిన పొలం, కాడెద్దుల్ని కూడా త్యాగం చేశాడు. మంచి విలువలకోసం నానా అగచాట్లు పడ్డాడు. వాసిరెడ్డితో కలిసి ముందడుగు (1945), అపనింద (1946), మా భూమి (1947) వంటి నాటకాలు రాసి నాటక ప్రక్రియ స్థాయిని పెంచాడు. ప్రజల చైతన్య స్థాయిని అనూహ్యంగానే హెచ్చింపచేశాడు. ఉద్యమాల అనంతరం కూడా భూమికోసం, కోతలరాయుడు, గెరిల్లా వంటి అనేక నాటకాలు రాశాడు. ఆయన రాసిన నాటకం కేవలం కాగితాల్లో లేదు. అది దృశ్య కావ్యంగా అవతారమెత్తి ప్రజలకు కనువిందు చేసింది.


అర్ధమయ్యింది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.