Saturday, June 7, 2014

250 What for is this wasteful oath-taking ceremony of Chandra Babu Naidu?


250 ఈ వృధా పట్టాభిషేక జాతర ఎందుకు?

చర్చనీయాంశాలు: చంద్రబాబు, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, కరుణామయులు, శ్రామికవర్గం, భూస్వామ్యవర్గం, వ్యాపారవర్గం


ఈయన మేకపిల్లను భుజం మీద పెట్టుకున్నాడు కాబట్టి, ఈ వెన్నుపోటు సార్వభౌముడికి మేకపిల్లపై ప్రేమ కారిపోతుందని మనం భావించకూడదు. ఆమేక బాగా కండ, మాంసం పట్టగానే, దానిని కసాయి వాడికి అమ్మేయక తప్పదు. ఇది పెట్టుబడిదారీ రీతి. మేక మాంసం తినటానికి పనికిరాకపోతే మేకలను ఎవరూ పెంచరు.

మనము కరుణామయుడు అని భావించే వారందరి చేతులలో, మత ప్రవక్తలతో సహా, మేక పిల్లలను పెట్టి ఎంతటి కరుణా మయులో అని మురిసి పోతూ ఉంటాము. ఆ మరుసటి వారం లోనే ఆమేక కాస్తా ఖైమానో కబాబో అయి వాళ్ళ నోళ్ళలోనే కరకరలాడిపోతుంది.

వెన్నుపోటు సార్వభౌముడి పదవీకాలం, తనను ఎవరూ వెన్నుపోటు పొడవకపోతే 1826 రోజులే. ఈ మాత్రం దానికి ఒక పదికోట్లు ఖర్చుచేసి పట్టాభిషేకం చేసుకోవాలా? ఈ ప్రమాణ స్వీకారం అనేది రాజ భవన్ లో చేసుకుంటే, గవర్నర్ గారి రాజభవన్ ఖర్చులలో కలిసిపోయి ప్రజలు చవకగా బయటపడే వాళ్ళు. శేషాంధ్రకు సచివాలయం లో సెక్షన్ల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి నిలపటం కుదిరేది. ఇపుడు ప్రముఖులను తీసుకురావటానికి, విడిది చూపటానికి, అద్దె విమానాలు, అద్దె హెలికాప్టర్లు, అద్దె కార్లు, అద్దె గదులు, పన్నీరు బుడ్లు, మందుబుడ్లు, మెమెంటోల కొరకు ప్రజల వీపు విమానంమోత మోగి పోతుంది.

ఈ ఆర్భాటానికి మురిసిపోయి, కేంద్రం నుండి లక్షలకోట్ల నిధులు, విదేశీ స్వదేశీ పెట్టుబడులు , పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం వర్షంలాగా కురుస్తుందనుకుంటే అంతకన్నా భ్రమ ఉండదు. కేంద్రం నుండి నిధులు రావటం అనేది ఎన్నో అంశాలమీద ఆధారపడిఉంటుంది కాని జాతరల మీద ఆధార పడి ఉండదు. బిజెపికి, నరేంద్రమోడీకి సంపూర్ణ మెజారిటీ రాకుండా ఉంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదో గానీ, ఇపుడు శ్రీ వెన్నుపోటు సార్వభౌమ 1 గారి అవసరం శ్రీవెన్నుపోటు సార్వభౌమ 2 గారికి ఏమాత్రం ఉండదు.

శ్రీచంద్రబాబు జూన్ 8 పట్టాభిషేకానికి చేస్తున్న జాతర వల్ల చిలకలూరిపేట నుండి ఏలూరు వరకు, కోదాడ నుండి ఉయ్యూరు వరకు జాతీయ రవాణా మొత్తం కకావికలు అయ్యే అవకాశం ఉంది. శిక్ష ఎవరికి పడుతుంది? లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు, అభం శుభం తెలియని ప్రయాణీకులకు.

డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్ పీలు, ఏ ఎస్పీలు, కలెక్టర్లు, ఆర్ డీవోలు, ఏసీ కార్లలో తిరుగుతారేమో కానీ, ---- తహసీల్ దార్లు, ఎస్ ఐలు, ఏ ఎస్ ఐలు, కాన్ స్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ల బ్రతుకు వడగాడ్పుల పాలైపోయింది.

పటాటోపం అనేది భూకులాలకు, వ్యాపార కులాలకు ఉన్న మాయ రోగం

శ్రామిక వర్గ పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు మాత్రమే మనం ఈ పటాటోపాలనుండి బయట పడ గలం.

పట్టాభిషేకం సందర్భంగా, వినుకొండ అడవుల్లోని గ్రామాల్లో సైతం భూములు సెంటు రెండు లక్షలు దాకా పెరిగి పోయాయి. తరువాత దిగిరావచ్చు.

గతంలో, హైటెక్ సిటీ నిర్మాణం జరుగకముందు మాదాపూర్ లోని రాళ్ళూరప్పలు భూములను శ్రీ వెన్నుపోటు సార్వభౌమ గారు బినామీ పేర్లతో కొనేసి , పెరిగిన ధరలతో లాభపడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీకెసిఆర్ గారు, తాను ముఖ్యమంత్రికాగానే తన గురువు శ్రీ చంద్రబాబునాయుడి గారి బినామీ ఆస్తులను బయట పెడతానన్నారు. ఇపుడు ఆపని చేస్తారా, లేక రహస్య ఒప్పందాలు ఏమైనా చేసుకుంటారా?

అభివృధ్దికి ముందు భూములను కొనేయటం , లాభపడటం వంటి ఆరోపణలు, శ్రీమతి సోనియా గాంధీ అల్లుడు శ్రీ రాబర్ట్ వాద్రా పైకూడ వచ్చాయి. ఆమె ఈవిషయంపై పిత్తిన ముత్తైదువులాగా కూర్చుంటుంది, వేరే సంగతి.

విగుంతే లో రాజధాని రాబోతున్నది అనే సంకేతాన్ని తరచుగా ఇవ్వటం ద్వారా ఏలూరు నుండి చిలకలూరిపేట వరకు ఉన్న భూములన్ని భూ స్పెక్యులేటర్ల గుప్పిట్లోకి చేరాయి. ఈ భూములను కొనటానికి, అడ్వాన్సులు ఇవ్వటానికి, ఎగుమతి వ్యాపారాలకు, పరిశ్రమలకు బ్యాంకులు ఇచ్చిన అప్పులను దారి మళ్ళించి ఉండ వచ్చు. ఎంత తెలివి తక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా స్వంత డబ్బుతో వ్యాపారం చేయడు. నిస్సందేహంగా బ్యాంకు ఋణాల దుర్వినియోగం జరిగి ఉండాలి. దీనిని నిరోధించటానికి బ్యాంకులకు సిబ్బంది, సరియైన మెకానిజం లేవు.

ప్రస్తుతానికి ప్రజలకు తెలుగు దేశం పార్టీ నిజంగా చిత్తశుధ్ధి ఉంటే, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ప్రాంతాలలో ఉన్న 500 గజాలకన్నా ఎక్కువ ఉన్న స్థలాల, వ్యవసాయభూముల యజమానుల పేర్లను, చిరునామాలను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.