Sunday, June 8, 2014

251 Will the astrologers and vastu persons decide the future of Andhra Pradesh?

251 Will the astrologers and vastu persons decide the future of Andhra Pradesh?
251 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రభవిష్యత్ ను జ్యోతిష్కులు మరియు వాస్తయ్యలు నిర్ణయిస్తారా?

చర్చనీయాంశాలు: 251, జ్యోతిష్యం, వాస్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, వేణుగానం, ఈశాన్యం, గడియారాలు, దైనిక్ భాస్కర్ఆంధ్రప్రదేశ్ 2014 సంవత్సర, 1826 రోజుల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేలికగా పూర్తిచేసుకోవాల్సిన ప్రమాణ స్వీకారోత్సవం ఒక జాతరగా చేయబూనటం, నిధులను వృధా చేయటం అందరికీ తెలిసినదే.

ప్రమాణ స్వీకారం చేయాల్సిన జూన్ 8వతేదీనే కాక, సమయం రాత్రి 7.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయాలని జ్యోతిష్కులు నిర్ణయించారట. ఈనాటి హిందూ పత్రిక, ఈముహూర్తాన్ని ఎంతో గొప్ప ముహూర్తంగా ప్రస్తుతించింది. కప్పగంతుల సుబ్బరామశర్మ అనే సిధ్ధాంతిగారు ఈ ముహూర్తాన్ని, శ్రీమోడీగారి ప్రమాణ స్వీకార ముహుర్తం కన్నా మెరుగైనది అన్నారట. కనకదుర్గా దేవాలయ స్థానాచార్యులు శ్రీ శివప్రసాద శర్మగారి ప్రకారం, రాజు పట్టాభిషేకంలో అతి ముఖ్యమైన విషయం మంచి ముహూర్తాన్ని ఎంచుకోటమేనుట.

వైబీరావు గాడిద వ్యాఖ్యలుఇంత గొప్పవిషయాన్ని గుడ్డిగా నమ్మిన క్రీ.పూ. 326 క్రీ.శ. 1858 మధ్యకాలపు భారతీయరాజులు ఎంత మంది జ్యోతిష్కులకు రత్న కంకణాలను తొడిగారో? వాళ్ళు తుమ్మినా, దగ్గినా జ్యోతిష్కులను సంప్రదించేవారని ప్రతీతి. మరి రెండవ ప్రతాప రుద్రుడు ఏ జ్యోతిష్కుడిని నమ్ముకున్నాడో, తన రాజ్యాన్ని కోల్పోటమే కాకుండా, ఢిల్లీ సుల్తాన్ సైన్యం చేత బందీగా తీసుకెళ్ళ బడుతూ నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అళియ రామరాజు, సదాశివరాయలు, అచ్యుతరాయలు, వీళ్ళంతా జ్యోతిష్యం మీద, వాస్తుమీద నమ్మకాలు ఉన్నవాళ్ళే. మరి హంపీకి ఆగతి ఎందుకు పట్టిందో!!

దేవగిరి రాజ్యాన్ని శంకర మహాదేవుడు అనే గొప్ప దేశభక్తుడు , పరాక్రమశాలి అయిన యాదవరాజు పాలించే వాడు. దేవగిరి జ్యోతిష్కులు అసమర్ధులో ఏమో, వారు నిర్ణయించిన ముహూర్తానికే యుధ్ధం చేసినా, శంకరమహాదేవుడిని ఢిల్లీ సుల్తానులు తోలు ఒలిపించి, గడ్డితో నింపిన తిత్తిని హోయసల రాజ్యంలో తిప్పినట్లుగా చారిత్రిక కథనాలు ఉన్నాయి.

మే జూన్ నెలలలో ఆంధ్రప్రదేశ్ లో వహన వర్షాలు ఎక్కువ, సాయంకాలం పూట పడుతూ ఉంటాయి. వేడెక్కిన భూమిపైకి సముద్రంనుండి చల్లని గాలులు వీయటం, ఆవిరి అయిన సముద్రజలాలు ఘనీభవించి వడగళ్ళవానలు వంటివి పడుతూ ఉండటం పరిపాటి. అదిన్నీకాక ఋతుపవనాలు కూడ సమీపంలో ఉంటాయి. కరక్ట్ గా రాత్రి 7.27 నిమిషాలకే సుడిగాలి వచ్చి పెద్దవాన పడితే దానిని శుభశకునంగా మనపండితులు వర్ణించటం ఖాయం. కానీ ఇంటికి తిరిగి వెళ్ళె ప్రజలు అట్టై బుట్టై అన్నట్లుగా అయిపోతారు. సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, నరేంద్రమోడీలు, సీమాంధ్ర ప్రజలపై రుద్దిన ఈ విభజనకు ఆమాత్రం కష్టాలు పడకపోతే ఎలా. విగుంతే సింగపూర్ కావద్దూ.ఈనాటి హిందీ అభ్యాసం

దైనిక్ భాస్కర్దైనిక్ భాస్కర్ ఒక అగ్రశ్రేణి హిందీ దిన పత్రిక. నవభారత్ టైమ్స్ మరియు దైనిక భాస్కర్ నుండి మనం రోజుకి రెండు మూడు వార్తలను చదివి ఆకళింపు చేసుకున్నా హిందీలో ఎంతో ప్రగతి సాధిస్తాము. ఉత్తరాది వారితో సంభాషించటంలోనూ, వారితో వ్యాపార లేఖలను, సందేశాలను మార్చుకోటంలో ఎంతో నైపుణ్యం వస్తుంది.

దైనిక్ భాస్కర్ చదవటానికి లింక్: http://m.bhaskar.com/regular/index.php కి వెళ్లటానికి క్లిక్ ఈరోజు దైనిక్ భాస్కర్ లో ఒక ఆసక్తి కరమైన అంశం కనపడింది, తెలుగు వాళ్ళ బెనిఫిట్ కొరకు అనువదించి, నా గాడిద బుధ్ధిలో భాగంగా వ్యాఖ్యానిస్తున్నాను.


1- घर में जो घडिय़ां बंद पड़ी हों, उन्हें या तो घर से हटा दें या चालू करें। बंद घडिय़ां हानिकारक होती हैं। इनसे नकारात्मक ऊर्जा निकलती है। घर के पूर्वोत्तर कोण में तालाब या फव्वारा शुभ होता है। इसके पानी का बहाव घर की ओर होना चाहिए न कि बाहर की ओर।

తెలుగు సారం: ఇంటిలో ఆగిపోయిన గడియారాలేమయినా పడి ఉంటే, వాటిని తిరిగి నడిచేలాగానన్నా చేయండి, లేదా ఇంట్లోంచి నెట్టేయండి. వీటినుండి నకారాత్మక శక్తి బయటకి వస్తుంది. ఇంటికి ఈశాన్యంలో నీటికొలను కాని, ఫౌంటేయిన్ కానీ ఉంటే శుభం. వీటినుండి ప్రవహించే నీళ్ళు ఇంటిలోపలికి ప్రవహించాలి. ఇంటి బయటకు ప్రవహించకూడదు.

2- वास्तु के अनुसार घर में बांसुरी रखना बहुत शुभ माना गया है। कृष्ण की बांसुरी सम्मोहन, खुशी और आकर्षण का प्रतीक मानी गई है। मान्यता है कि बांसुरी में से गुजर कर नकारात्मक ऊर्जा शुभ ऊर्जा में बदल जाती है। साथ ही बांसुरी शांति व समृद्धि का प्रतीक है। घर के मुख्य द्वार के समीप बांसुरी अवश्य लटकाएं।

2. వాస్తు ప్రకారం, ఇంటిలో వేణువులు ఉంచుకోటం ఎంతో శుభంగా భావించ బడుతుంది. శ్రీకృష్ణుడి వేణువు సమ్మోహనకరం, ఆనందం మరియు ఆకర్షణకు ప్రతీక గా గుర్తించబడింది. గుర్తింపు ఏమిటంటే, మురళి నుండి నకారాత్మక శక్తి శుభ శక్తిగా మారి బయటకి వస్తుంది. అంతే కాక పిల్లనగ్రోవి శాంతి, సమృధ్ధి కి ప్రతీక. ఇంటి ముఖ ద్వారం నుండి ఫ్లూట్ ను తప్పనిసరిగా పక్కకి నెట్టేయండి. (ముఖ ద్వారం సమీపంలో వేణువులు ఉండకూడదని భావం కావచ్చు).


వైబీరావు గాడిద వ్యాఖ్యలుమా ఇంట్లో ఈశాన్యంలో ఉండిన మునిసిపల్ పంపు నీటి గుంటను నేను 1992 లో నీళ్ళురాకపోటంతో, ఎవరైనా పిల్లలు పడిపోయి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటారేమోనని పూడ్పించాను. ఆప్రదేశం సమీపంలో నే, వాన నీళ్ళు బయటకు పోటానికి ఈశాన్యం ప్రహరీగోడకు తూము పెట్టించాను. ఇంత రివర్సు వాస్తుచేసినా , నాగాడిద బుధ్ధి మనిషి బుధ్ధి కావటానికి జరగవలసిన చెడు జరగలేదు. తత్ ఫలితంగా మనకు మేలు గానీ, కీడు గానీ, జరిగిన సూచనలు ఏనాడూ కనపడలేదు. నాగాడిద బుధ్ధి అలానే స్థిరంగానే ఉన్నది.

మాఇంట్లో 1993 నుండి పది దాకా వేణువులు ఉండేవి. నాకు కోరిక, తీరిక, ఓపిక ఉన్న ప్పుడు సాధన చేస్తూ ఉండే వాడిని. పిల్లులకు వేణునాదానికి కొన్నిసార్లు ఏదైనా సంబంధం ఉండేదేమో, అప్పుడప్పుడు పిల్లులు వేణువు శబ్దం వినగానే దూరంనుండి కూడ వస్తూఉండేవి. అయితే వేణువు శబ్దాలకు, పిల్లుల రాకపోకలకు కార్యకారణ సంబంధం ఎస్టాబ్లిష్ కాలేదు. దానికి చేయవలసిన డబుల్ బ్లైండెడ్ అన్ బయాస్ డ్ స్టడీ పరిశోథనలను చేయవలసిన తీరిక మనకి లేదు.

నిశ్చయం: గడియారాలకు, వేణువులకు, నీటిగుంటలకు మనకు మంచి జరగటానికీ, చెడు జరగటానికీ సంబంధం లేదు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.