Wednesday, May 14, 2014

235 What is the difference between a donkey, angel and a man?

235 What is the difference between a donkey, angel and a man?
235 గాడిదకు, దేవదూతకు, మనిషికి తేడా ఏమిటి?
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ,మమతాబెనర్జీ,బెంగాల్, మతతత్వం,బంగ్లాదేశ్,శ్రీలంక,తమిళనాడు,కవి చౌడప్ప


2014 ఏప్రిల్, మే ఎన్నికల ప్రచారంలో Ms. మమతా బెనర్జీ అన్నారని చెప్ప బడుతున్న కొన్ని మాటలు:--

“Is he bhonda (fool) or gadha (donkey)? Motuas already have voting rights. One of them is a minister of ours and another an MLA. He is saying nonsense like a mad person. A Haridas Pal (useless person), who does not have an MLA here, is promising all these,”

తెలుగు సారం: ఆయన మూర్ఖుడా లేక గాడిదయా? మోటువాలకు (బంగ్లా నుండి భారత్ కు వచ్చిన ఒక హిందూ తెగ) ఇప్పటికే వోటింగు హక్కులున్నాయి. వారిలో ఒకరు మా వద్ద మంత్రిగా ఉన్నారు. ఇంకొకరు ఎం.ఎల్.ఏ గా ఉన్నారు. ఒక పిచ్చివాని వలె ఆయన (మోడీ అని భావం) అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. ఒక హరిదాస్ పాల్ (మిస్టర్ నోబడీ అని భావంట), కనీసం ఇక్కడ ఒక ఎం.ఎల్.ఎ. కూడ లేని వాడు, ఈ వాగ్దానాలన్నీ చేస్తున్నాడు.

“It was our courtesy that we had allowed Modi here, otherwise we would not have allowed him to get down from the aircraft. He had said so many incriminating things here, it is so unfortunate,”

తెలుగు సారం: మేము మోడీని ఇక్కడ అనుమతిస్తున్నామంటే అది ఒక మర్యాదయే, లేకపోతే, మేము ఆయనను విమానం నుండి దిగనిచ్చే వాళ్ళము కాము. ఆయన చాల ఇక్కడ నేరపూరితమైన లేక నేరారోపణకి దారితీసే మాటలు అన్నారు, ఇది చాల దురదృష్టకరము.

"We are allowing Modi to campaign in Bengal is our courtesy, we could have sent him back packing from the airport,"

తెలుగు సారం: మేము మోడీని బెంగాల్ లో ప్రచారం చేయనిస్తున్నామంటే, అది మా మర్యాదయే, లేదంటే ఆయనను మేము విమానాశ్రయంనుండే ప్యాకింగు చేయించి వెనక్కి పంపే వాళ్ళం.

"People of Bengal were being dubbed as refugees and shamed. Some people were being called infiltrators. If they try to divide Bengal, if they try to evict anyone, I will guard you. I will not let anyone touch you. He said I respect refugees. Who is a refugee? Does he understand what it means?"

తెలుగు సారం: బెంగాల్ ప్రజలు శరణార్ధులుగా ముద్రించబడుతున్నారు, మరియు అవమానించబడుతున్నారు. వారిలో కొందరు చొరబాటుదారులుగా పేర్కొనబడుతున్నారు. వారు బెంగాల్ ను విభజించాలని ప్రయత్నిస్తే, వారు మిమ్మల్ని (బంగ్లాదేశ్ కి) గెంటి వేయాలని ప్రయత్నిస్తే, నేను మిమ్ములని రక్షిస్తాను. నేను ఎవరిని మిమ్మల్ని ముట్టుకోనివ్వను. ఆయన అన్నాడు, శరణార్ధులను గౌరవిస్తానని. ఎవరు శరణార్ధి? ఆయన ఏమంటున్నాడో ఆయనకు తెలుసా?

"I had raised the issue of bogus ration cards in Bengal."

తెలుగు సారం: నేను బెంగాల్ లోని బోగస్ రేషన్ కార్డుల విషయం లేవనెత్తాను. (శ్రీ మోడీ ఆరోపణ ప్రకారం, చొరబాటు దారుల విషయాన్ని, Ms. మమతా బెనర్జీగారు గతంలో లోక్ సభలో లేవనెత్తారు. ఇపుడు వోట్ల కొరకు ఎలా వెనక్కి వెళ్తారు? మమతా గారి ప్రకారం, ఆమె లోక్ సభలో లేవనెత్తింది బెంగాల్ లో బోగస్ రేషన్ కార్డుల గురించే).

వైబీరావు గాడిద వ్యాఖ్య లు Comments of ybrao a donkey वैबीराव एक गधे की टिप्पणियाँమమతా మరియు మోడీ ల మధ్య జరుగుతున్న వాగ్ యుధ్ధం వోటు బ్యాంకు రాజకీయమే. అయినా మూల వివాదాన్ని, దానిలోంచి పుట్టే ప్రశ్నలను, భారత కేంద్ర ప్రభుత్వం నిపుణుల చేత పరిశీలింప చేయవలసి ఉన్నది. అవి:

1. తూర్పు పాకిస్థాన్ (ఇపుడు బంగ్లాదేశ్) , పశ్చిమ పాకిస్థాన్ మరియు భారత్ ల మధ్య 1947లో జరిగిన విభజన మతపరమైనదా కాదా?

2. మత పరమైనదే అయితే జనాభాల మార్పిడి అప్పుడే పూర్తి స్థాయిలో జరిగి ఉండ వలసినది. జరగలేదు. కొందరు హిందువులు అక్కడ ఉండిపోయారు. కొందరు ముస్లిములు ఇక్కడ ఉండి పోయారు.

౩. వోట్ల కోసం గానీ, మరే కారణంచేతనైనా గానీ, మమతా బెనర్జీగారు పశ్చిమ బెంగాల్, మరియు బంగ్లాదేశ్ మొత్తాన్ని ఒక బెంగాల్ దేశం గా చూస్తున్నది. అది రాజ్యాంగ విరుధ్ధం. బంగ్లాదేశ్ పౌరులలో అధికులు బెంగాలీ భాష మాట్లాడినంత మాత్రాన, 1947 తరువాత నుండి పాకీస్థానీలు లేక బంగ్లా దేశీయులే అవుతారే తప్ప , భారతీయ బెంగాలీలు అవరు. ఇదే విషయాన్ని మనం శ్రీలంక తమిళుల విషయంలోనూ గమనించాలి. వోటు బ్యాంకు రాజకీయాల కొరకు తమిళ ప్రాంతీయ పార్టీలు శ్రీలంక తమిళులను భారతీయ తమిళులతో సమానంగా చూడటం, రాజ్యాంగ విరుధ్ధమే అవుతుంది.

4. తమిళం మాట్లాడినంత మాత్రాన శ్రీలంక తమిళులు భారతీయ తమిళులు కాలేరు. బెంగాలీ మాట్లాడినంత మాత్రాన బంగ్లా జాతీయులు భారతీయ బెంగాలీలు కాలేరు. వారు భారతదేశంలోకి అనుమతి పత్రాలు లేకుండా వచ్చారంటే చొరబాటు దారులే అవుతారు. వారిని చట్టప్రకారం గెంటి వేయాల్సి వస్తుంది. వారికి వోటింగు హక్కులు ఇవ్వటం కుదరదు. రేషన్ కార్డులు ఇవ్వటం కుదరదు.

మోడీ గారి మాటలను బట్టి చూస్తుంటే, ఆయన బెంగాల్ నుండి భారత్ లోకి పారిపోయి వచ్చిన, లేక చొరబడ్డ హిందువులకు పౌరసత్వం ఇవ్వటానికి, వారినుండి వోట్లు రాబట్టుకోటానికి సిధ్ధంగా ఉన్నారు. ఆయన దృష్టిలో ముస్లిములను మాత్రమే చొరబాటు దారులుగా పరిగణించాలి.

మమతా గారి మాటలని బట్టి చూస్తుంటే, తనకు వోటేసే వాళ్ళు, బెంగాలీలయి ఉంటే చాలు. హిందువులైనా , ముస్లిములైనా చొరబాటుదారులుగా పరిగణించబడరు.

శరణార్ధుల సమస్యశరణార్ధికి చొరబాటుదారుకి తేడా మనం గుర్తించటం అవసరం. శరణార్ధి కేవలం తన ప్రాణ రక్షణ కొరకు భారత్ లో కి ప్రవేశిస్తాడు. అతడు సాధారణ నేరగాడు గానీ, ఉపాధి వెతుక్కునే వాడు గానీ కాదు. అతడికి ప్రాణాపాయం లేకుంటే, అతడు భారత్ కి రాడు. వచ్చినా రెండు మూడు సంవత్సరాల కన్నా ఉండకూడదు. అతడికి మనం వోటింగ్ రైట్స్ ఎన్నటికీ ఇవ్వలేం. తాత్కాలికంగా వారిని గుడారాలలో ఉంచి వారికి తాత్కాలిక రేషన్ కార్డులను ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే, వారిని వారి మాతృదేశం ఎన్నటికీ వెనక్కి తీసుకోటానికి ఇష్టపడకపోతే వారిని ఏమి చేయాలి? వారికి భారత పౌరసత్వం ఇచ్చి 128 కోట్లమంది భారతీయులలో కలిపేసుకోవాలా? మనది ఇప్పటికే అధిక జనాభా గల దేశం. ఇంక అదనపు జనాభాను మోయలేం. అంతే కాకుండా, శరణార్ధులకు మనం ఉదారంగా పౌరసత్వం ఇస్తున్నామని తెలిస్తే, బంగ్లాదేశ్, పాకిస్థాన్ , శ్రీలంక, చైనా (టిబెట్, ఉలుఘూ ) దేశాలు మనకి శరణార్ధులని సరఫరా చేయటానికి సిధ్ధంగా ఉంటాయి.

మతం గానీ, కులం గానీ, భాష గానీ విఛ్ఛిన్నం అయ్యే స్వభావం కలవాళ్ళను (groups with fissiparous tendencies, separatist tendencies) ఎక్కువ కాలం కలిపి ఉంచలేవని బంగ్లాదేశ్ అవతరణ, తెలంగాణ అవతరణ ఋజువు చేశాయి. తెల్లవాళ్ళు (యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్) శ్వేత జాత్యహంకారంతో ఒకటిగా ఉన్నట్లు కనిపించినా , వారిలోనూ లుకలుకలు ఉన్నాయి. లేకపోతే రెండు ప్రపంచ యుధ్ధాలు ఎలా జరుగుతాయి. ఉక్రెయిన్ లో నేడు జరుగుతున్నది రష్యా యూరప్ ల మధ్య ప్రాక్సీ యుధ్ధమే కదా.

కాబట్టి వోట్లకొరకు గానీ, వోట్లేతరం కొరకు గానీ, చొరబాటుదారులను ప్రోత్సహించటం మంచిది కాదు. వారు హిందువులయితే నేను రెడీ అని మోడీ గారనటం, వారు బెంగాలీలయితే ముస్లిములయినా సరే నేను మీరక్షకురాలనని మమతాగారు పోజు కొట్టటం, దేశాన్ని చొరబాటుదారులతో నింపేస్తుంది. ఈ వ్యాఖ్య శ్రీలంక తమిళుల విషయంలో తమిళనాడు పార్టీలకు కూడ వర్తిస్తుంది.

ఈనాటి పద్యం.
కవి చౌడప్ప విరచితం. ఈయన తంజావూరు రఘునాధనాయకుని సమకాలికుడు. బహుశా కొంతకాలం ఆస్థాన కవి అయి యుండ వచ్చు.

ఆడిన మాటలు తప్పిన -
గాడిద కొడు కంచు తిట్టగా విని, మదిలో
వీడా నాకొడు కని ఏడ్చు
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా !

సారం: అబధ్ధాలు ఆడే ఒకడిని గాడిద కొడకా అని తిట్తే, గాడిద కూడ, వీడా నా కొడుకు అని ఏడ్చింది.

దీని రెండవ భాగం త్వరలో వ్రాస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.