Wednesday, May 7, 2014

226 Will Congress look after Mother of Shri Narendra Modi?226 శ్రీనరేంద్రమోడీ గారి తల్లి పోషణ ను కాంగ్రెస్ చేపట్తుందా?

చర్చనీయాంశాలు: ప్రధాని, నరేంద్రమోడీ, కాంగ్రెస్, ఎన్నికలు, మాతాపితలురషీద్ ఆల్వీ గారు కాంగ్రెస్ స్పోక్స్ మాన్ గారు. శ్రీనరేంద్రమోడీ గారి తిట్లను తట్టుకోలేక కాంగ్రెస్ అధినేత్రి & కో వారు శ్రీ రషీద్ అల్వీగారిని ఫరమాయించినట్లున్నారు. వారు రంగంలోకి దిగి, కొన్ని విషయాలను బయటకి తెచ్చేరు.

శ్రీమోడీ గారి మాతృ మూర్తి 8 x 8 గదిలో కాలం గడుపుతున్నది. మొన్నటి ఎన్నికలలో వోటు వేయటానికి ఆటోలో పోలింగు స్టేషన్ కి వెళ్ళింది.

ఇపుడు శ్రీ రషీద్ ఆల్వీ గారు, శ్రీ నరేంద్రమోడీ గారికి ఒక లేఖ వ్రాసారుట. ఈలేఖ సారం ఏమిటంటే, మీ అమ్మగారి భారం మేము చూసుకుంటాము అని. మీకు 1.25 కోట్ల సంపద ఉన్నా, జెట్ విమానాల్లో తిరుగుతున్నా, డిజైనర్ గడియారాలు, కలాలూ వాడుతున్నా, మీ అమ్మగారికి అవసరమైన వస్తువులను సమకూర్చలేక పోతున్నారు. కాబట్టి మీ అమ్మగారి ఆలన పాలన మేము చూసుకుంటాము అని.

హిందీ పత్రికల్లో వచ్చిన కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను. నవభారత్ టైమ్స్ వారి కరుణతో.


'मोदीजी, हाल ही में आपने नॉमिनेशन में अपनी संपत्ति 1.25 करोड़ रुपए से ज्यादा बताई। मैं चकित हूं कि इतनी दौलत होते हुए भी आप अपनी मां को जरूरत की चीजें मुहैया नहीं करा पाए। हम लोग लगातार देख रहे हैं कि आप प्राइवेट जेट प्लेन्स हैं और कई लग्ज़री कारों के काफिले में यात्रा करते हैं। हम यह भी जानते हैं कि आपको डिज़ाइनर घड़ियों और मो ब्लां फाउंटेन पेन्स से बहुत प्यार है।'

తెలుగు సారం: అయ్యా మోడీగారూ, మీరేమో మీ నామినేషన్ లో, మీ సంపత్తిని 1.25 కోట్ల కన్నా ఎక్కువగానే చూపారు. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మీకింత సంపద ఉన్నా, మీ అమ్మగారికి అవసరమైన వస్తువులను సమకూర్చలేక పోతున్నారు. మేము చూస్తున్నది ఏమిటంటే, మీరు ప్రైవేటు జెట్ విమానాల్లో ఎగురుతున్నారు. లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. మీకు డిజైనర్ వాచీలు, మో బ్లా ఫావుంటేయిన్ కలాలు అంటే ఎంతో ప్రేమ అని తెలుస్తున్నది.


వైబీరావు గాడిద వ్యాఖ్యలు:శ్రీ నరేంద్ర మోడీగారు రోజుకొక కుర్తా మారుస్తారు. దీని ఖరీదే వేలల్లో ఉంటుంది. అహమ్మదాబాదులో టాప్ రెడీమేడ్ సంస్థవారు, వీటిని శ్రీ నరేంద్రమోడీగారి కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారుట. ఒక డ్రెస్ ఖరీదుపెట్టినా, తల్లిగారి అవసరాలు తీర్చవచ్చు.

శ్రీమోడీ గారిని రోజు ఇంటికి చేర్చటానికి ఒక జెట్ విమానం, రెండు హెలికాప్టర్లను కిరాయికి తీసుకున్నారుట.

అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. అవన్నీ నాస్వంతమా, అవి పార్టీవారివి అని శ్రీమోడీ గారు అనవచ్చు. నా తల్లిగారికీ, నా భార్య (జశోదా బెన్) గారికీ నేను చేయాల్సిన ఏర్పాట్లు నా జేబులోంచి చేయాలి, అనచ్చు. అయితే, శాసన సభ్యునిగా, ముఖ్యమంత్రిగా శ్రీ మోడీ గారికి వచ్చే జీతం, నాతం కూడ కొన్ని వేల రూపాయలు ఉండవచ్చు.

ఈతరహా సమస్యలు కాంగ్రెస్ అగ్రనేతలకు ఉండవా? కేవలం మోడీ గారి కొక్కరికే కాక, అన్ని పార్టీల అగ్రనేతల కందరికీ ఈ త్రవ్వకాలు చేయాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.