Thursday, April 24, 2014

209 సీత కోరికను తీర్చిన రాముడు, జశోదాబెన్ గారి కోరికను తీర్చినట్లుగా చెప్పబడుతున్న శ్రీ మోడీ

209 సీత కోరికను తీర్చిన రాముడు, జశోదాబెన్ గారి కోరికను తీర్చినట్లుగా చెప్పబడుతున్న శ్రీ మోడీ. topics for discussion, చర్చనీయాంశాలు: Narendra Modi, నరేంద్రమోడీ,
ఉత్తర రామాయణంలో, గర్భవతిగా ఉన్న సీత శ్రీరాముడిని, నాకు దండకారణ్యం చూసి రావాలని ముచ్చటగా ఉన్నదని కోరుకున్నది. ఆకోరికను శ్రీరాముడు, ఒక రజకుడు వెర్రిరాముడంటి వాడు ఏడాది లంకలో ఉన్న సీతను ఏలుకున్నాడు, నేనెందుకు ఏలుకుంటాను అన్నట్లుగా చారుడు చెప్పినపుడు , సీతను వాల్మీకి ఆశ్రమం పరిసరాలలో దించి రమ్మని లక్ష్మణుడికి ఆజ్ఞాపించాడు. ఆవిధంగా సీత ముచ్చట తీరింది.


తిక్కన ప్రణీత నిర్వచనోత్తర రామాయణం, ఎనిమిదవ ఆశ్వాసం, ౮౦వ పద్యం. శార్దూల వృత్తం.

సింగంబుల్ మునిబాలకుల్ దిరుగుచో
     జెయ్యేది మోమియ్య సా
రంగంబుల్ దిరుగం దపోధనసతుల్
     రాజీవముల్ గోయుటల్
రంగద్వీచులఁ బద్మముల్ మెరయ ధ
     ర్మప్రీతి మైఁ జూచుచున్
గంగా తీరము కాన లోనఁ దిరుగం
     గా కౌతుకంబ య్యెడిన్.

౧౨౫ పద్యం, కందం
ఇమ్ములఁ చని గంగా తీ
రమ్ము తపోవనములందు రమియింపగ నా
సమ్ముఖమునఁ కోరినయది,
యమ్ముద్దియ నచటి కనుప నగు సుకరముగాన్.

౧౨౬ పద్యం, కందం.
కొని చని వాల్మీకి తపో
వన పరిసర భూమిఁ ద్రోచి వచ్చెడి దయ్యం
గనకును నాకును నిదె విధి,
యనుమానింపకుడు నిశ్చయంబైన యెడన్.

జాగ్రత్త. దయ్యంగనకు అంటే దయ్యం కాదు. వచ్చెడిది. అయ్యంగన అంటే ఆ అంగన అనగా సీత.


ఇపుడు మన నరేంద్రమోడీ గారేమి చేశారో చూద్దాము.నరేంద్రమోడీ గారి సతీమణియైన, శ్రీమతి జశోదా బెన్ గారు చార్ ధామ్ యాత్ర చేయాలని కోరారుట. (చార్ ధాం: కేదారనాధ్, బదరీనాధ్, గంగోత్రి-=గంగానది పుట్టిన ప్రదేశం, యమునోత్రి-=యమునానది పుట్టిన ప్రదేశం ). దీ వీక్, దైనికసవేరా టైమ్స్ మొ|| పత్రికలవారు వ్రాసినదాని ప్రకారం:

రెండు తెల్ల సువ్ (sport utility vehicles)లో కొందరు హిందూ కార్యకర్తలు, భద్రతాధికారులు, తీర్ధయాత్రికుల వేషంలో, గుజరాత్ లోని బ్రాహ్మణవాడ గ్రామంలో ఉన్న శ్రీమతి జశోదాబెన్ గారి ఇంటికి వెళ్ళి, ఆమెను తీర్ధాటన కొరకు అహమ్మదాబాదు తీసుకు వచ్చారట.

అక్కడనుండి కిరాయి విమానంలో ఆమెను ఉత్తరాఖండ్ లోని ఒకానొక సురక్షిత ప్రదేశంలో దించారట. ఇప్పుడామె ఋషికేశ్ లోని రామ్ దేవ్ గారి ఆశ్రమంలో భద్రంగా, సురక్షితంగా ఉందిట. (పత్రికలు, టీవీ ఛానెళ్ళవాళ్ళనుండి రక్షించటానికి అని ఊహించవచ్చు.)


23.4.2014, శ్రీరాందేవ్ గారి పతంజలి యోగపీఠ్ మహామంత్రి శ్రీబాలకృష్ణగారు ఈవార్తను ఖండించారు. శ్రీమతి జశోదాబెన్ గారు తమ ఆశ్రమంలో లేదన్నారు. ఉంటే అది తమకు గౌరవప్రదమేనని , కాని తమకు సమాచారమేమీ రాలేదన్నారు.వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ప్రత్యేక అద్దెవిమానాలు అంటేనే గుండె గుభేలు మంటున్నాయి. బిల్లు ఎవరిస్తారు?

ఏది ఏమైతేనేం, భద్రంగా శ్రీమతి జశోదా బెన్ గారు తమ చార్ ధాం యాత్రను పూర్తి చేసుకుంటారని ప్రార్ధిద్దాం. పేపరాజ్జీ నుండి రక్షణ కూడ లభించింది. ఆమె వెనుకకు వచ్చాక ఆమె ఇంటర్వ్యూ కరుణను ప్రజలు పొందే అవకాశం కలుగుతుందో లేదో అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.