Topics for discussion: bjp, congress, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, 2014 ఎన్నికలు, టిడిపి, కుటుంబ నియంత్రణ
నేటి రాజకీయాలలో అమాయకులు ఉండరు కాబట్టి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి దగా పడ్డ తమ్ముడయ్యాడని, ఆయన ఆశాసౌధాలన్ని కూలిపోయాయని, మనం చింతించ నవసరం లేదు.
అఖిలభారత పార్టీల నియంతృత్వాలే కాదు, ప్రాంతీయ పార్టీల నియంతృత్వాలలో కూడ ప్రత్యేకత ఏమిటంటే, తమ మరియు తమకుటుంబం యొక్క స్వార్ధమే తప్ప మిగిలిన వాళ్ళు ఏమవుతారు అనే ఆలోచన అసలు ఉండనే ఉండదు. మోడీకి కిషన్ రెడ్డిని గురించిన చింత లేనట్లుగానే, శ్రీ చంద్రబాబుకు శ్రీమోదుగల వేణుగోపాల రెడ్డి (లోక్ సభలో దెబ్బలు తిన్న నరసరావుపేట టిడిపి ఎంపి), డా. కోడెల శివప్రసాదరావు, మాజీ హోమ్ మంత్రి, నరసరావుపేట టిడిపికి మూలస్థంభం ఏమవుతారు అనే పట్టింపు లేనే లేదు. చివరికా డా. కోడెల శివప్రసాదరావు నరసరావుపేట నుండి ఇండిపెండెంటు గానైనా పోటీకి సిధ్ధ పడాల్సి వచ్చింది.

ఇంకా దుఃఖకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ మైనారిటి మత తత్వాన్ని పెంచి పోషిస్తుండగా,బిజెపి మెజారిటి మతతత్వాన్ని పోషించటం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలి యైన మహిళగా కొనియాడబడిన సోనియా గాంధీ ఏమిటి, ఒక సాధారణ మసీదు లోని మతబోధకుడిని తమకు వోట్లు వేయించమని ఆశ్రయించటం ఏమిటి?
పౌరుష జ్ఞాన కీర్తుల బరగెనేని
వాని జీవన మొక్కపూట యైన చాలు
ఉదర పోషణ మాత్రకై ఉర్వి మీద
కాకి చిరకాల మున్ననే కార్య మగును?
ఇరవయి నాలుగు గంటలూ మతం గోలేనా?
మనకి సవాలక్ష రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీయైనా ''మీ కులం, మీ మతం మాకు సంబంధం లేదు. మీ కుటుంబాన్ని ఇద్దరికి పరిమితం చేసుకోండి. మీపిల్లలు మరణించినా, వారు మిమ్మల్ని నిరాదరించినా, మీ భద్రతకు మా పూచీ,'' అని మానిఫెస్టోలో పెట్టుతుందేమో అని చూస్తున్నాను. ఉహూ. అలాంటి ధైర్యం, తెగువ మన పార్టీలకు ఉండదు కదా.కాంగ్రెస్ చేస్తున్న ఇటువంటి పనుల వల్ల , బిజెపి మతతత్వాన్ని తప్పు పట్టటం కష్టమవుతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.