Thursday, March 6, 2014

170 Conversions

170 Conversions 170 Why should India discourage conversions of illiterate innocent people? భారత్ నిరక్షరాస్య అమాయకుల మతమార్పిడులను ఎందుకు నిరుత్సాహ పరచాలి

చర్చనీయాంశాలు

మతమార్పిడులు, హిందూత్వ, భారతీయేతర మతాలు, గోవులు, గేదెలు

మత మార్పిడుల వల్ల నష్టాలు

పాతమతం యొక్క లోపాలు, కొత్తమతం యొక్క గొప్పగుణాలు (ఏవైనా ఉంటే) తెలుసుకున్న వాళ్ళు మతం మార్చుకుంటే, వాటిని నిరసించ వలసిన పని లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఏమీ తెలియని అమాయకులు మతమార్పిడులకు గురియౌతున్నారు. వారికి ధనం, ఇళ్ళు వాకిళ్ళు, పిల్లల చదువులు, రోగాలు తగ్గటం వంటివి ఆశ పెట్టటం వల్ల, అమాయకులు అనవసరంగా మతమార్పిడులకి గురి యౌతున్నారు. మతమార్పిడులు చేసేవారికి విదేశాలనుండి డబ్బులు రావటం వల్ల మతమార్పిడులు అనేది, మతసంస్థలను నిర్వహించటం అనేది వ్యాపారంగా మారింది.

భారత్ లోకి కొత్తగా ప్రవేశించిన భారతీయేతర మతాలు భారతీయ జీవిత విధానంతో పూర్తిగా ఇంటిగ్రేట్ కాలేక పోతున్నాయి. వారు గైడెన్స్ కొరకు విదేశాల వంక చూస్తున్నారు. భారతీయేతర మతాలలో స్వంత బుధ్ధిని ఉపయోగించ నివ్వటం నానాటికి తగ్గి పోతున్నది.

స్వంత బుధ్ధి యొక్క ప్రాధాన్యత

భారతీయ మతాలైనా, భారతీయేతర మతాలైనా, ప్రజల స్వంత బుధ్ధికి, ఆలోచనలకు భంగం కలిగించకూడదు. మతాలు ప్రజలకు మత సంబంధం అయిన సమాచారాన్ని అందించటంలో తప్పు లేదు. ఆ సమాచారాన్ని మాత్రమే నమ్మమని, నమ్మకపోతే దేవుడికి కోపం వస్తుందని, సంఘ బహిష్కారం చేస్తామని బెదిరించటం సరియైన పధ్ధతి కాదు.

మతమార్పిడులకు పరిష్కారం

ఇది వరకు ఒకసారి వ్రాశాను. అయినా మరొకసారి వ్రాయటంలో తప్పు లేదనుకుంటాను.

మతం మారాలనుకునే వ్యక్తి తన మతం లోని మత గ్రంధాలను క్షుణ్ణంగా చదవాలి . ఇతర మత గ్రంధాల్లోని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తనమతంలోని వ్యక్తులతో చర్చించాలి. ఇతరమతాల వ్యక్తులతోనూ చర్చించాలి. గుణదోషాలను బేరీజు వేసుకోవాలి. చాలాసార్లు ఒక జీవితకాలం సరిపోదు. ఆషామాషీగా , వ్యాపారులుగా మారిన మతప్రచారకులు చెప్పే కల్లబొల్లి విషయాలను నమ్మి, చడీచప్పుడు లేకుండా మతం మార్చుకోటం, కుటుంబ సభ్యులను కూడా మారమని బలవంతపెట్టటం , తాముకూడా అరకొర మత జ్ఞానంతో మతప్రచారాలకు దిగటం ఏమాత్రం సమంజసం కాదు. తాము ప్రచారం చేస్తున్న మతం యొక్క పవిత్ర గ్రంధాల్లోంచి గట్టిగా రెండు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేని ప్రచారకులు ఇతరులకు ఎలా దారి చూపగలుగుతారు? రాజ్యాంగంలో పొందు పరచిన మతప్రచార హక్కును వీరు దుర్వినియోగం చేస్తున్నారు.

నియంత్రణ కోర్టులు

ఇవి కోర్టుల్లాగా పనిచేయాల్సి ఉంటుంది. మతం మార్చుకో దలుచుకున్న వాడు, మతమార్పిడీ అనుమతి కోర్టుకు తన దరఖాస్తును ఇవ్వాలి. న్యాయమూర్తి ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియచేసి అభ్యంతరాలను ఆహ్వానించాలి. మార్పిడీ కోరుతున్న వ్యక్తి పూర్తిగా స్వంత బుధ్ధిని, వినియోగిస్తున్నాడా, అన్ని మతాల సారం తెలిసిన వాడేనా, అన్ని మతాల సారం ఒకటే నని తెలిసి కూడా మతం మారటానికి బలవత్తరమైన కారణమేమిటి, అనే విషయంపై దర్యాప్తు చేయాలి. అవసరమైతే దరఖాస్తుదారుకు, అతడిప్రోత్సాహకులకు, లిఖిత పరీక్షలు నిర్వహించాలి. అతడు తన స్వంత విజ్ఞానంతో, ఏ ప్రలోభాలు లేకుండా , నిర్హేతుక భయాందోళనలకు గురి కాకుండా, మతం మార్పిడీకి నిర్ణయించుకున్నాడని ధృవ పర్చుకున్నాకే, అనుమతి డిక్రీ ఇవ్వాలి.

మతమార్పిడీ 100% వ్యక్తిగత విషయం కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల మతాల్నీ, కులాల్నీ, ప్రభుత్వం, చట్టం, పిల్లలకు అంటగట్టుతున్నాయి. వీటినిబట్టి రిజర్వేషన్లు మొదలగునవి నిర్ణయం అవుతున్నాయి.

పుట్టుక అనేది యాదృఛ్ఛికం. ఏమతంలో , ఏకులంలో పుట్తారు అనేది ఇంకా యాదృఛ్చికం. నిజానికి 18 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు పిల్లలకు కులం, మతం ఉండకూడదు. తాము ఏకులం, ఏమతం అనేది మానసిక పరిపక్వత, మతాలకు సంబంధించిన సమాచారం సేకరణ, విశ్లేషణలు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులతో సమాలోచనలు, పూర్తి అయ్యాక, విచక్షణతో, యువతీ యువకులు, తమకు అసలు మతం అవసరమా, అవసరమైతే ఏ మతం, ఆమతంలో ఏవర్గం, అనేది నిర్ణయించుకోవాలి.

భారతీయ జీవన విధానం లోని వైవిధ్యం

భారతీయ జీవన విధానాన్నే హిందూత్వ అనాలి. దీనిలో బహుదేవతారాధన పోలీథీయిజం ఇన్ బిల్ట్ (అంతర్ నిర్మితంగా) ఉంటుంది. భారతీయేతర మతాలు దీనిని పాగనిజంగా నిరసిస్తాయి. తమకు నచ్చిన దేవుడిని తమకు నచ్చిన పేరుతో పూజించటం ప్యాగనిజం ఎందుకు అవుతుంది? భారతీయ జీవన విధానంలో, వ్యక్తులు యెహోవాను, అల్లాను కూడ పూజించ వచ్చు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ పూజించను, అని నాస్తికుడిగా కూడ జీవించ వచ్చు. భారతీయేతర మతాల ప్రచారకులు తమ మతం స్వీకరించమని భారతీయులపై వత్తిడి తేవటం, ప్రలోభాలు చూపించటం, భారతీయ దేవతలను నిందించటం, బహు దేవతారాధనను విగ్రహారాధనను నిందించటం గర్హనీయం. వారు చేస్తున్న ఈపని వల్ల ప్రజలలో విద్వేషాలు ప్రబలుతున్నాయి. మతప్రచారకులు చేసే హేట్ స్పీచ్ లను ప్రభుత్వం, కోర్టులు సు మోటు గా (తమంత తామే) విచారణకు తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.

భారతీయేతర మతాలు బహుదేవతారాధనకు, విగ్రహారాధనకు సమ్మతించటంవల్ల వారు భారతీయ జీవన విధానంలో భాగం కాగలుగుతారు. అయితే వారు స్వయంగా బహుదేవతారాధనకి గానీ, విగ్రహారాధనకి గానీ పూనుకోవలసిన పనిలేదు. ఇది మనదేశమైన భారతీయతలో భాగం అని గుర్తిస్తే చాలు. ఎవరి ఇష్టానుసారం వారు చేసుకోవచ్చు. దేవుడనేవాడు ఉన్నాడు అని ఒప్పుకున్నాక, మాదేవుడు వేరు, మీదేవుడు వేరు అనే ప్రసక్తి ఎక్కడుంటుంది? ఎక్స్ అనే పేరుతో పిలిస్తేనే నేను పలుకుతాను, వై పేరుతో పిలిస్తే నేను పలకను అని దేవుడు(ళ్ళు) చెప్పటం కుదరని పని. అది మతప్రచారకుల కల్పన. అవిశ్వాసులను (ఇన్ ఫిడెల్స్) చంపేయమని ఏదేవుడూ చెప్పలేడు. అలా చెప్పాడంటే అతడు దేవుడు అవడు, సైతాన్ అవుతాడు. కాబట్టి భారతీయేతర మతాలవారు తమ ఇరుకు గదుల సిధ్ధాంతాలను మానుకొని వైవిధ్యం ఉన్న భారతీయ జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణించాలి. సిధ్ధాంతాల కొరకు విదేశీ హెడ్ క్వార్టర్ల వంక చూడరాదు.

ప్రతి వ్యక్తికీ కులం, మతం ఉండాలా

ప్రతి వ్యక్తికీ కులం, మతం ఉండాలా? అవసరం లేదు. కానీ ప్రభుత్వం భారత్ లో పౌరులను తమ కుల, మతవివరాలు అడుగుతూ పరోక్షంగా వారికి ఏదో ఒక కులం, మతాన్ని కలిగి ఉండటం నిర్బంధం చేస్తున్నది. ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలను కులం, మతం పేరుతో, చీల్చక పోతే నిద్ర పట్టదేమో. మైనారిటీ బెనిఫిట్ లను అంద చేయటానికి మతం గురించిన సమాచారం కోరక తప్పదని ప్రభుత్వం అనచ్చు. దీనికి జవాబులు: మెజారిటీలకు లేని బెనిఫిట్ లు మైనారిటీ లకు ఎందుకు? మైనారిటీ లకు లేని బెనిఫిట్ లు మెజారిటీలకు ఎందుకు? బెనిఫిట్ లు అనేవి ఇవ్వాలనుకుంటే కులాతీతంగా, మతాతీతంగా అందరికి ఇవ్వాల్సిందే. అత్యంత పేదలకు మాత్రమే ఇవ్వాలనుకుంటే పేదరికానికీ, నిరాదరణకు గురియౌతున్న వృత్తులను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. అర్హులైన వారిని ఏరటానికి రకరకాల అవినీతికి, అక్రమాలకు తావివ్వని జల్లెడలను (ఫిల్టర్లను) వాడచ్చు. కుల మతాలను అడగాల్సిన అవసరం లేదు.

ఉదాహరణలు: చమర్. అంటే చర్మకార వృత్తి. పెద్ద పెద్ద షూ మేకర్లు కాదు. చిన్న క్షురక వృత్తి (పెద్ద పెద్ ఘరానా ద హెయిర్ డ్రెసర్లు కాదు). బట్టలు ఉతకటం (పెద్ద డ్రైక్లీనర్లు కాదు). వీటిని జల్లెడలుగా వాడచ్చు.

భారతీయ జీవన విధానమే ఒక మతం

ప్రభుత్వం భారతీయ జీవన విధానాన్ని ఒక మతంగా గుర్తించాలి. హిందూత్వ అనే పదం కన్ ఫ్యూజన్ కి దారి తీస్తుంది అనుకుంటే, భారతీయ మతం అనచ్చు. ఈ భారతీయ మతంలో నాస్తికులు, మార్క్సిస్టులు కూడ చక్కగా ఇమిడి పోతారు.

భారతీయ జీవన విధానంలో ఆలోచనా విస్తృతికి ఒక ఉదాహరణ

ఈక్రింద వ్రాసిన విషయాలు స్తూల దృష్టికి సింగినాదం జీలకర్ర లాగా తోచవచ్చు. గోవులో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా లేరా అనే ప్రశ్న కన్నా, భారతీయులు ఇంత విశాలమైన దృష్టితో ఎలా ఊహించ గలిగారు, అనేది ఆలోచించాలి. సురభిగోశాల.కాం వెబ్ సైట్ వారు గోవులో ఉన్నారని చెప్పిన దేవతలు (వారితో మనం ఏకీభవించ వలసిన పనిలేదు):
రెండు కొమ్ముల మూలములో బ్రహ్మ మరియు విష్ణువు ఉన్నారు.
రెండు కొమ్ముల చివర సకల తీర్థాలు
లలాటం మధ్యలో శివుడు .
లలాటము అగ్ర భాగము లో పార్వతి దేవి .
నాసిక పై కార్తికేయుడు ,
నాసిక రంధ్రములలో కంబాల మరియు అశ్వనీ దేవతలు .
చెవుల పై అశ్విని కుమారులు.
కనులలో సూర్య చంద్రులు.
పలు వరుసలో వాయు దేవుడు
నాలుక పై వరుణ దేవుడు .
ఆవు యొక్క భుజముల పై సరస్వతీ దేవి
పెదవుల పై సంధ్యా దేవత.
మెడ పై ఇంద్రుడు.
గంగడోలు పై రాక్షసులు.
గుండెలో సంధ్యా దేవత.
తొడ పై ధర్మ రాజు
డెక్కల మధ్యలో గంధర్వులు.
డెక్కల చివర నాగ దేవతలు మరియు పక్కల అప్సరసలు
పుష్ఠ భాగమున పదకొండు రుద్రులు మరియ యముడు
అవయవ సంధులలో పితృదేవతలు ,
పొట్ట భాగములో ద్వాదశాదిత్యులు .
ఆవు యొక్క తోకలో సోమ దేవుడు
జుట్టులో సూర్య కిరణాలూ
,మూత్రములో గంగా నది
గోమయము(పేడ) లో లక్ష్మి
మరియు యమునా నదులు
పాలలో సరస్వతీ నది
పెరుగు లో నర్మదా నది
నెయ్యిలో అగ్ని
జుట్టులో మూడు కోట్ల దేవతలు
కడుపులో పృథ్వీ,
పొదుగులో సముద్రములు,
మొత్తం శరీరం లో కామధేనువు
కను బొమ్మల మొదట మూడు గుణాలు
కను రెప్పల లో ఋషులు
ఊపిరిలో పవిత్ర మైన అన్ని నదులు
పెదవులపై చంద్రిక
చర్మం పై బ్రహ్మ .
నాసికలలో పువ్వుల యొక్క సుగంధాలు .
తొడలలో సంధ్యా దేవత .
ముఖము లో వేదముల యొక్క ఆరు భాగములు ,
పాదాలలో వేదాల నాలుగు భాగములు
డెక్కల పై భాగములో యముడు
డెక్కల ఎడమ వైపు కుబేర,గరుడలు
డెక్కల కుడి వైపు యక్షులు,
డెక్కల లోపల గంధర్వులు
పాదాలలో ఖేచరులు
కడుపులో నారాయణుడు,
ఎముకలలో పర్వతాలు
పాదాలలో ధర్మార్ధ కామ మోక్షాలు
హుంకారంలో వేదములు ఉన్నాయి.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు

ఇవన్నీ నిజాలని మనం ఒప్పుకోవాల్సిన పనిలేదు. కానీ భారతీయుల ఊహా విస్తృతికి ఆశ్చర్యపోక తప్పదు. భగవద్గీతలోని విశ్వరూప సందర్శనలోని వర్ణనకు దీటుగా ఉంది కదా.

మరి ఎద్దులు, గేదెలు, దున్నపోతులు, ఒంటెలు, గాడిదలు, గుర్రాల సంగతి

పై దేవతలంతా, నిజంగా గోవుల్లో ఉంటే వారు గేదెలు, దున్నపోతులు, ఒంటెలు, గాడిదలు, మేకలు, గుర్రాల్లో కూడ ఉంటారు.

ఇంకా ఉంది. పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.