Wednesday, February 26, 2014

159 Elite Schools

159. Difference between elite schools and Municipal Schools ఘరానా స్కూళ్ళకి, మునిసిపల్ స్కూళ్ళకి భేదం.
చర్చనీయాంశాలు: విద్య, ఘరానా స్కూళ్ళు, మునిసిపల్ పాఠశాలలు, వెంకటేష్, తెలుగు సినిమాలు
ఫొటో వికీపీడియా వారి దయతో.

ముందుగా మనం హాన్స్ ఇండియా వారికి, వారి జర్నలిస్ట్ మంజులతా కళానిథి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు సారం పాఠకుల సౌకర్యార్ధం ఈ వైబీరావు గాడిద జోడిస్తున్నాడు. అనువాద లోపాలు గాడిదవే. హాన్స్ ఇండియాలో ప్రచురణ తేదీ 19.02.2014. ఒరిజినల్ చూడాలంటే లింకు:-- http://www.thehansindia.com/posts/index/2014-02-19/I-punctured-my-teachers%E2%80%99-scooter-tyres--86591 కి వెళ్ళటానికి క్లిక్

యాజ్ టోల్డ్ టు మంజులతా కళానిథి అని చివరలో ఉంది. దీని అర్ధం శ్రీవెంకటేష్ గారు చెప్తూ ఉంటే Ms. Kalanithi గారు వ్రాసుకొని పత్రికలోకి ఎక్కించారు. సంభాషణ ను టేప్ చేశారో లేదో తెలియదు. సాధారణంగా హీరోలు తమకు తీరికలేదు అంటూ ఉంటారు. జర్నలిస్టులు బ్రతిమిలాడి, మీరు ఊరికే మాట్లాడండి, మేము వ్రాసుకొని మా పత్రికలో వేసుకుంటాం అని ఎడిటర్ జీ తమకు అప్పగించిన పనులు పూర్తిచేసుకొని వస్తూ ఉంటారు.

ముందుగా స్పష్టీకరణలు, వివరణలునాకు గౌ శ్రీ వెంకటేష్ యందు గానీ మరి ఏ ఇతర హీరో హీరోయిన్లయందు గాని రాగ ద్వేషాలులేవు. ఈమధ్య సర్వశ్రీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ, సుబ్రహ్మణ్యస్వామి, మణిశంకర్ అయ్యర్ ల విద్యాభ్యాస చరిత్రను అధ్యయనం చేసి ఇక్కడ ప్రచురించే భాగ్యం కలిగింది. రాహుల్, మోడీలు ప్రధాని అభ్యర్ధులు కాబట్టి అధ్యయనం చేసే అవసరం కలిగింది. అదే సందర్భంలో హాన్స్ ఇండియా పత్రికను తిరగేస్తున్నపుడు, కాకతాళీయకంగా ఈవార్త నాకళ్ళ బడింది. యాదృఛ్ఛికంగా నేను థియేటర్ లో చూచిన ఆఖరు సినిమా ధృవ నక్షత్రం నాకు గుర్తుకు వచ్చింది. అది శ్రీ వెంకటేష్ ది కావటంతో ఆసక్తితో ఈ ఇంటర్వ్యూను చదివాను.

ఏవో బాల్య శ్రీకృష్ణలీలలు. ఎందుకింత ఫస్ చేస్తున్నారు?


సాధారణ వ్యక్తి చేయటానికి సెలబ్రిటీ చేయటానికీ హస్తి మశకాంతరం (ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా) ఉంది. మనకి గీతావచనం ఏమిటంటే
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
  స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 0321

శ్రేష్ఠులైన వాళ్ళు ఏమి చేస్తే సాధారణ ప్రజలు అది చేస్తారు. సినీనటులు ఏది చేస్తే యువతీయువకులు అది చేస్తారు. మన శ్రేష్ఠులు ఇలైట్ స్కూల్ లో చదువుతూ ఏమి చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?

I was born in Chennai and my first childhood memories are definitely dominated by the beach city. Although my father Dr Daggubati Ramanaidu was (and is) a prolific producer, movies were not really discussed at home. We were a family of five including my parents, my elder brother Suresh Babu and my younger sister Lakshmi.
తెలుగుసారం:--నేను చెన్నైలో పుట్టాను. నాప్రథమబాల్య స్మృతులు బీచ్ నగరం (చెన్నై) చేత డామినేట్ చేయబడి ఉంటాయి. మాతండ్రి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ధారాళమైన నిర్మాతే అయినప్పటికి ఇంటిలో సినిమాలు నిజంగా చర్చించబడలేదు. మేము తల్లిదండ్రులతో సహా ఐదుగురికుటుంబం. మా పెద్దన్న సురేష్ బాబు. చిన్నచెల్లెలు లక్ష్మి.

I did my schooling at Don Bosco, Egmore, Chennai. My parents were happy to get me admission in that elite school and I also felt I was lucky to study there. I was a hyper-energetic kid who you could term as a mischief maker.

నేను డాన్ బాస్కో,ఎగ్మూరు, చెన్నై స్కూల్లో చదివాను. ఆ ఇలైట్ స్కూల్ లో ప్రవేశం పొందినందుకు నాతల్లిదండ్రులు సంతోషించారు. అక్కడ చదవటాన్ని నేను కూడ అదృష్టం గానే భావించాను. నేను అతి శక్తివంతుడైన బాలుడిని. నన్ను మీరు మిస్ఛీఫ్ మేకర్ గా అనచ్చు.

I was a sort of rebel who never used to like the system, especially where teachers were partial to some students because they scored better marks. I always believed that teachers should be like parents who shower the same love and affection on all kids regardless of their accomplishments.

నేను వ్యవస్థను ఇష్టపడని ఒక తరహా తిరుగుబాటు దారుడిని. ముఖ్యంగా టీచర్లు ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్ధుల ఎడల పక్షపాత ధోరణి చూపినపుడు ఈతిరుగుబాటు తనం ఎక్కువగా ఉండేది. విద్యార్ధుల ఎకాంప్లిష్ మెంట్లు (మార్కులు మొ||) గురించి పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పిల్లల యెడల ఎలాంటి ప్రేమ చూపుతారో టీచర్లుకూడ పిల్లలను సమానంగా చూడాలని నేను ఎల్లప్పుడూ నమ్మాను.

So naturally I used to do crazy things like puncturing scooter tyres of teachers who’ve been nasty to me in class.

కాబట్టి సహజంగా నేను, నాయెడల నేస్టీగా ఉన్న టీచర్ల స్కూటర్ల టైర్లను పంచర్ చేయటం వంటి క్రేజీ పనులు చేస్తూ ఉండే వాడిని.

I was also instinctively protective of my friends (giving them proxy attendance etc) and therefore my entire class adored me and my teachers hated me.

నేను నా ప్రకృతి కనుగుణంగా నా సహవిద్యార్ధుల రక్షణ చేపట్టే వాడిని. వారు లేనపుడు వారి తరఫున నేను అటెండెన్స్ పలికేవాడిని. కాబట్టి మా క్లాస్ మొత్తం నన్ను ఆరాధించేది. నాటీచర్లు నన్ను ద్వేషించే వాళ్ళు.

During class elections, the students would elect me but within weeks, my teachers would throw me out of the post and the class. Eventually they relented and I was elected as house caption in my Class X.

క్లాస్ లో ఎన్నికలు జరిగినపుడు విద్యార్ధులు నన్ను నాయకుడిగా ఎన్నుకునేవాళ్ళు. కాని కొద్దివారాలలోనే మాటీచర్లు నన్ను ఆపోస్టు లోంచి ఊడ బీకేవాళ్ళు. క్లాసులోంచి కూడ పంపించేసే వాళ్లు. చివరికి వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకున్నారు. నేను పదవ తరగతిలో హౌస్ కెప్టెన్ గా ఎన్నుకోబడ్డాను.

Although I was an average student academically, I was active in sports and co-curricular activities.

నేను తరగతిలో విద్యా కోణంలో సరాసరి విద్యార్ధినే అయినప్పటికీ క్రీడల్లో మరియు ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో చురుకుగా ఉండేవాడిని.

I had my own gang and I used to play every game – hockey, volley ball, basketball, poker, cricket, marbles, kites basketball… Surprisingly, the only activity I wasn’t interested in those days was dramatics!

నా గ్యాంగ్ నాకుండేది. హాకీ, వాలీబాల్, బేస్కెట్ బాల్, పోకర్, క్రికెట్, మార్బుల్స్, గాలిపటాలు, ప్రతి ఆటను ఆడుతూ ఉండేవాడిని.

I was not somebody who enjoyed being confined to some indoor spaces. Instead, it was the big, spacious playground where I could shriek with joy that appealed to me.

నేను గదులలోపల స్థల పరిమితులకు లోబడి ఉండేవాడిని కాదు. దానికి బదులుగా పెద్ద విశాలమైన ఆటమైదానం నన్ను ఆనందంతో తబ్బిబ్బయ్యేలాగా చేసేది. నాకు బాగా నచ్చేది.

I did my graduation in Commerce at Loyola College in Chennai. My best memories are of my transition from riding a bicycle to a two-wheeler and then a car.

నేను నాగ్రాడ్యుయేషన్ కామర్స్ (బి.కాం) చెన్నై లయోలా కాలేజీ లో చేశాను. నాకు అత్యుత్తమమైన జ్ఞాపకం ఏమిటంటే సైకిల్ నుండి బైక్ కి, దానినుండి కారుకి మారటం.

I used to enjoy vrooming on bikes but after I injured myself while riding on a bike, my dad ordered me to stop riding a bike only to gift me a car to drive to college.

నేను బైక్ మీద వేగంగా శబ్దం చేసుకుంటూ (vroom) తిరిగి ఆనందించే వాడిని. కాని నేను బండి నడుపుతూ గాయ పడ్డాక మానాన్న గారు బైక్ నడపటం మానేయమని ఆజ్ఞాపించి కాలేజీకి వెళ్ళటానికి, నాకు కారును బహుమతిగా ఇచ్చారు.

Although I was given many comforts, I was never arrogant of our status or wasteful with money.

నేను ఎన్నో సౌకర్యాలు ఇవ్వబడ్డప్పటికీ, నా స్టేటస్ గురించి నేను గర్వంతో ఉండేవాడిని కాదు. డబ్బును వేస్ట్ చేసేవాడిని కాదు.

Loyola days were filled with college fests, student rock shows, seminars etc. My friends had a music band.

లయోలా కాలేజీ రోజులు కాలేజీ పండుగలు, విద్యార్ధి రాక్ షోలు, సెమినార్లు మొ|| నిండి ఉండేవి. నాస్నేహితులకి మ్యూజిక్ బ్యాండ్ ఉండేది.

I never really had the urge to be part of the band but I used to enjoy acting like a manager – making promos for the shows, selling tickets etc. I guess the producer’s gene often resurfaced in me on occasions.

నాకు ఆబ్యాండ్ లో పాలు పంచుకోవాలనే కోరిక నిజంగా ఉండేది కాదు కానీ నేను ఆబ్యాండ్ కి మేనేజర్ వలె పనిచేయటాన్ని ఎంజాయ్ చేసేవాడిని. షోస్ ని ప్రమోట్ చేయటం, టికెట్లు అమ్మటం మొ|| చేసేవాడిని. నాలో ఉన్న (సినీ)నిర్మాత జీన్లు సందర్భాలను బట్టి నా ఉపరితలంపై వచ్చేవి.

I was basically a listless guy and loved taking one day at a time with no big dreams.

ప్రాధమికంగా నేను ఒక లిస్ట్ లెస్ గయ్. పెద్దగా కలలు కలకుండా ఒకరోజును ఒకసారి తీసుకోటాన్ని ఇష్టపడేవాడిని.

The only dream, or rather wish, I had was to go to the US to study.

నాకు ఉండిన ఒకే కల, రాదర్ కోరిక ఏమిటంటే చదువుకోటానికి అమెరికాకు వెళ్ళటం.

Even the idea of living away in a different country away from family and all on my own gave me a heady feeling, as though it was an adventure I wanted to try.

వేరే దేశంలో కుటుంబానికి దూరంగా ఉండటం అనే భావం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. అది ఒక గొప్ప సాహసకృత్యం లాగా కనిపించి నేను ప్రయత్నించాలని కోరుకునే వాడిని.

So when I suggested that I wanted to go to the US, dad gave me the go ahead.

కనుక, నేను అమెరికాకు చదువుకోటానికి వెళ్తాననగానే మానాన్నగారు ముందుకు వెళ్ళమని సిగ్నల్ ఇచ్చారు.

I studied at Monterey Institute of International Studies in California.

మాంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, క్యాలిఫోర్నియాలో నేను చదివాను.

After I finished my MBA, I was keen on coming back to India and turning into a producer or do something behind the screens but I guess destiny had something else in store for me. A few years after I returned to India, I was launched as an actor and the rest is history.

నా ఎంబిఎ పూర్తి చేసుకున్నాక, నేను వెనక్కిరావాలని, నిర్మాతగా మారాలని, లేక తెర వెనుక ఏదైనా చేయాలని అసక్తితో ఉండే వాడిని. కాని నాకు విధి వేరే విధంగా స్టోర్ చేసింది. కొద్ది సంవత్సరాల తరువాత నేను భారత్ కి తిరిగి వచ్చాను. ఒక నటుడిగా లాంచ్ చేయబడ్డాను. మిగిలినది చరిత్ర.

(As told to Manju Latha Kalanidhi) మంజులతా కళానిథికి చెప్పిన విధంగా.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


డాన్ బాస్కో, చెన్నై, డూన్ స్కూల్ డెహ్రాడూన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, హైదరాబాదు వంటి ఇలైట్ స్కూల్ లో చదివిన వాళ్ళకి, ధనవంతుల పిల్లలు కనుక టీచర్ల స్కూటర్ల టైర్లు పంక్చర్ చేయటం వంటి టాంట్రంస్ చేసే ఛాన్స్ ఉంటుంది. మునిసిపల్ స్కూళ్ళలో చదివే పేదపిల్లలకి ఉండదు.

అయితే మునిసిపల్ స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడ మంచి జ్ఞాపకాలే పోగవుతాయి. నేనూ, మాతమ్ముడూ కూడ 1960-62 ప్రాంతంలో బాపట్లలో మునిసిపల్ పాఠశాలల్లో చదివాము. నా కన్నా మాతమ్ముడికి ఎక్కువ ఆనందకరమైన అనుభవాలు వచ్చాయి. నాకు కూడ కొన్ని సంతోషకరమైన అనుభవాలు వచ్చాయి. వీటిని గురించి స్వంత డబ్బా అని పాఠకులు అనుకుంటే అనుకోవచ్చు కాక. కాని బాపట్ల చరిత్ర, మునిసిపల్ స్కూళ్ళచరిత్ర వ్రాసేటపుడు, సీరియస్ చరిత్ర రచయితలకి, చిన్న చిన్న ఫ్యాక్ట్స్ కూడ ఉపకరించవచ్చు. అలా కాకపోయినా మునిసిపల్ స్కూళ్ళ విద్యను ఇలైట్ స్కూళ్ళ విద్యను (ఆనాటి 1961 + ఈనాటి 2011) పోల్చి చూసుకోటానికి పనికి వస్తుంది. కొన్ని ఉదాహరణలు
౧. బాపట్ల మునిసిపల్ హైస్కూల్ లో ఆరవ తరగతిలో చేరటానికి నేను 1960 ఎండా కాలంలో ఎంట్రెన్స్ పరీక్ష వ్రాశాను. అప్పటిలో మునిసిపల్ స్కూళ్ళలో చేరటానికి విపరీతమైన డిమాండు ఉండేది. అందుకని ఎంట్రెన్స్. ఆ ఎంట్రెన్స్ లో నా రోల్ నంబర్ 139. ఎంట్రెన్స్ ఫలితాలను చెప్పటానికి స్కూల్ పాత ఆఫీస్ బిల్డింగులో మైకు పెట్టి నంబర్లు చదివారు. ఈఎంట్రెన్స్ వ్రాయటానికి నేటి ఈమ్ సెట్ కు ఉన్నట్లుగా గైడ్లు ఉండేవి. ఒక గైడ్ పేరు మూర్తి గైడ్. ఇంకొక గైడ్ పేరు విజయసాధని. ఆగైడ్ లో ముఖ్యాంశాలో జి.కె. ఒకటి. ఒకగైడ్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు భీమసేన్ సచార్ అని ఉండగా రెండవ దానిలో శ్రీనగేష్ అని ఉన్నది. అప్పటి కొత్తాంధ్ర ప్రదేశ్ కి భీమ్ సేన్ సచార్ ప్రధమ గవర్నర్. శ్రీనగేష్ రెండవ గవర్నర్. గైడ్ల ప్రింటింగ్ సమయంలో గవర్నర్ మారినట్లున్నాడు. ఒకగైడ్ వాడు సకాలంలో update చేశాడు. రెండోవాడు పాతపేరే ఉంచాడు.

క్రీడలకి ప్రాముఖ్యత
౨. బాపట్ల మునిసిపల్ హైస్కూల్ ఆవరణలో చక్కటి బేస్ బాల్ గ్రౌండు ఉండేది. ఖాదర్ వలీ అనే సీనియర్ విద్యార్ధి క్రీడలలో మేటిగా ఉండి స్కూల్ విద్యార్ధులకు నేతగా ఉండేవాడు. గ్రెగ్ మెడల్ అని జిల్లాస్థాయి క్రీడా మెడల్ సాధించి తెచ్చినట్లు నాకు గుర్తు. మాచేత కూడ మంచి మంచి ఆటలు ఆడించి చిన్నచిన్న ప్రైజులు (దువ్వెనలు వంటివి) ఇచ్చినట్లు గుర్తు.

హెడ్ మాస్టర్ పై ప్రేమ, ఉద్యమాలు
౩. ఆహైస్కూల్ హెడ్ మాస్టర్ పాపం చాల మంచి పేరు కలిగి ఉండే వాడు. ఆయనను ఎందుకో తొలగించి కొత్తవాడిని వేరెవడినో అనర్హుడిని పెట్టారు. విద్యార్ధులు ఊరేగింపులు సమ్మెలు జరిపి మరల పాత హెడ్ మాస్టర్ ను తెచ్చుకున్నారు. ఆఊరేగింపుల్లో పాల్గొనే భాగ్యం నాకు కూడ కలిగింది. ఇక్కడ సారం ఏమిటంటే టీచర్లకి విద్యార్ధులకి మధ్య ప్రేమానుబంధాలు స్కూటర్ల టైర్లకు పంచర్లు వేసేదాకా వెళ్ళకూడదు, అని నా విజ్ఞప్తి.

ఏనుగు లవడా కాయలు, నీలం సంజీవ రెడ్డి
౪. ఆస్కూల్ ఆటస్థలం ప్రక్కనే ఒకపెంకుటిల్లు ఎత్తైన అరుగులపై ఉండేది. ముందువైపున పెద్దపెద్ద చెట్లు పెద్దపెద్ద కాయలతో ఉండేది. ఆకాయలని ఏనుగులవడా కాయలు అనేవాళ్ళు. ఆచెట్లపై ఉన్నవేదికపై 1962 ఫిబ్రవరి 19 నాడు పోలింగ్ జరిగిన సార్వత్రిక ఎన్నికల కొరకు అప్పటి కొత్తాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీనీలం సంజీవరెడ్డి బహిరంగసభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఇప్పటిలాగే ఆరోజలలో కూడ భారీ ఏర్పాట్లు ఉండేవి.

చేనేత పని
౫. ఆస్కూల్ లో నేత పని నేర్పటానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అంకితభావం కలిగిన ఒక క్రాఫ్ట్ టీచరు ఉండేవాడు. నేను అక్కడ చదివిన మూడేళ్ళలో నాకు నేతనేయటం రాకపోయినా తకిలీతో దూదినుండి దారం తీయటం, అంగుళం గ్రాఫ్ కాగితం మీద వన్-అప్-వన్ వన్-డౌన్, టూ అప్ టూ డౌన్ వంటివి డిజైన్ ప్లాట్ చేయటం నేర్పారు. అది చేనేతలో పడుగు, పేకకు సంకేతం కావచ్చు.

హిందీ నేర్చుకోటం
౬. చక్కటి బోధనా సామర్ధ్యం కలిగిన హిందీ టీచర్ ఒకరు ఉండేవాడు. వచ్చిన రోజు పాఠాలు బాగా చెప్పేవాడు కానీ, పాపం ఆయనకు ఏమి సమస్యలు ఉండేవో కానీ స్కూలుకి అప్పుడప్పుడు మాత్రమే వస్తుండే వాడు. కానీ ఆయన బోధనా ప్రభావం వల్లనే కాబోలు, నాకు హిందీ మీద అభిరుచి ఏర్పడింది. ఆపట్టణంలో ఒక హిందీ ప్రేమీ మండలి ఉండేది. వాళ్ళు హిందీ పరిచయ్ (ప్రాథమికకి ముందు) అని ఒక పరీక్ష కూడ ఏదో వ్రాయించారు.

ఇండ్ల దగ్గర ప్రైవేట్లు


ఇళ్ళ దగ్గర ప్రైవేట్ల వ్యామోహం ఆరోజుల్లో కూడ ఉండేది. ఒక టీచర్ గారింట్లో కరెంటు ఉండేది కాదు. అందులో రాత్రిపూట చదువుకోటానికి పిల్లలు పుస్తకాలతో పాటు లాంతర్లు కూడ తీసుకొని గురువుగారంటికి వెళ్ళి అక్కడ రాత్రిపూట చదువుకొని కొందరు రాత్రిపూట అక్కడే పండుకునే వాళ్ళు. అయితే ర్యాంకుల పధ్ధతి లేదు.

మీ వ్యాఖ్యలకి స్వాగతం. ఘాటుగా విమర్శించినా, తిట్టినా ఫరవాలేదు. కానీ బూతులు వ్రాయకండి. మహిళలు చదవలేరు.

త్వరలో కొన్ని అనుభవాలను ఇక్కడేవ్రాస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.